
టీమిండియాకు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన ఎంఎస్ ధోని ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు అందుకున్నాడు. కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అయిన ధోని టీమిండియాలో మంచి ఫినిషర్‌గానూ రాణించాడు. ధోని ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి రెండేళ్లు కావొస్తున్నా క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. టీమిండియా కెప్టెన్‌గా విజయాలు చవిచూసిన ధోని.. ఐపీఎల్‌లో సీఎస్‌కేను విజయపథంలో నడిపించాడు.. నడిపిస్తున్నాడు. అలాంటి ధోనికి దేశంలో ఎక్కడికెళ్లినా అభిమానులుంటారు.
తాజాగా ధోనికి సంబంధించిన మైనపు విగ్రహం అభిమానులను షాక్‌కు గురి చేసింది. కర్నాటకలోని మైసూరు మ్యూజియంలో ధోని మైనపు విగ్రహాaన్ని తయారు చేశారు. అయితే అది చూడడానికి కాస్త వింతగా ఉంది. ధోని ముఖకవళికలు తేడాతో ఉన్నాయి. దూరం నుంచి చూస్తే ధోనిలా కనిపించినప్పటికి దగ్గరకెళ్లి చూస్తే ధోని ఆకారాన్ని గుర్తుచేయడం లేదు.
ఈ విగ్రహంపై ఫ్యాన్స్ కూడా నిరాశ వ్యక్తం చేశారు.'' ఈ విగ్రహాన్ని ఎవరైతే తయారు చేశారో కానీ.. ఆదిపురుష్ వీఎఫ్‌ఎక్స్ కూడా అతనే చేసి ఉంటాడు.. ధోని భయ్యా ఎక్కడా.. అసలు ఈ విగ్రహం ఎవరిది.. ధోని విగ్రహం అని చెప్పి వేరేది తయారు చేశాడా ఏంటి?'' అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: దీపక్ చహర్‌కు గాయం..!
MS Dhoni wax statue in Mysore. pic.twitter.com/KdsKcPLsaM
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 7, 2022