టీమిండియా తాజా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కొడుకు సమిత్ ద్రవిడ్‌కు బంపరాఫర్ లభించింది. కర్ణాటక టీ20 లీగ్ (కేఎస్‌సీఏ టీ20 టోర్నీ) వేలంలో సుమిత్‌ను గత సీజన్ రన్నరప్ మైసూరు వారియర్స్ సొంతం చేసుకుంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన సమిత్‌ను రూ. 50000 సొంతం చేసుకున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది.
18 ఏళ్ల సమిత్ ఇప్పటివరకు సీనియర్ స్థాయి క్రికెట్ ఆడలేదు. సీనియర్లతో కలిసి ఆడేందుకు సమిత్‌కు ఇది మంచి అవకాశం. సమిత్‌ను కొనుగోలు చేసిన మైసూరు జట్టుకు టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్ కరుణ్ నాయర్ సారథ్యం వహించనున్నాడు. ఇదే జట్టులో టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ ఉన్నాడు. వీరి సహవాసంలో సమిత్ మరింత రాటుదేలే అవకాశం ఉంది.
ప్రస్తుత సీజన్ కూచ్ బెహర్ ట్రోఫీ గెలిచిన కర్ణాటక అండర్-19 జట్టులో సమిత్ సభ్యుడిగా ఉన్నాడు. మిడిలార్డర్‌లో ఉపయోకరమైన బ్యాటర్‌గా పేరున్న సమిత్ ఇటీవలి కాలంలో అద్బుతంగా ఆడుతూ తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్ కౌంటీ జట్టు లాంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సమిత్ పర్వాలేదనిపించాడు.
ఇదిలా ఉంటే, సమిత్ తండ్రి రాహుల్ ద్రవిడ్ ఇటీవలే టీమిండియాను టీ20 వరల్డ్‌కప్ గెలిపించి హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ద్రవిడ్ సుమారు రెండున్నర సంవత్సరాల పాటు భారత హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. గంభీర్ ఆథ్వర్యంలో టీమిండియా రేపటి నుంచి శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడనుంది.
మైసూర్ వారియర్స్ జట్టు:
కరుణ్ నాయర్, కార్తీక్ సీఏ, మనోజ్ భండగే, కార్తీక్ ఎస్‌యూ, సుచిత్ జే, గౌతమ్ కే, విద్యాధర్ పాటిల్, వెంకటేష్ ఎం, హర్షిల్ ధర్మాని, గౌతమ్ మిశ్రా, ధనుష్ గౌడ, సమిత్ ద్రవిడ్, దీపక్ దేవాడిగ, సుమిత్ కుమార్, స్మయన్ శ్రీవాస్తవ, జాస్పర్ ఈజే, ప్రసిద్ధ్ కృష్ణ , మహమ్మద్ సర్ఫరాజ్ అష్రఫ్.
Comments
Please login to add a commentAdd a comment