samit dravid
-
Ind vs Aus: భారత బ్యాటర్ రికార్డు.. ప్రపంచంలోనే తొలిసారి
U19 Ind vs Aus Day 1 Final Update: ఆస్ట్రేలియా అండర్–19 జట్టుపై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత అండర్–19 జట్టు అనధికారిక టెస్టు సిరీస్‌ను కూడా మెరుగ్గా ఆరంభించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా సోమవారం తొలి అనధికారిక టెస్టు ప్రారంభమైంది. 293 పరుగులకు ఆసీస్ ఆలౌట్‌టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 71.4 ఓవర్లలో 293 పరుగులకు ఆలౌటైంది. రిలే కింగ్సెల్ (77 బంతుల్లో 53; 9 ఫోర్లు, ఒక సిక్సర్), ఎయిడెన్ ఓ కానర్ (70 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలు సాధించారు. భారత జట్టు బౌలర్లలో సమర్థ్ నాగరాజ్, మొహమ్మద్ ఇనాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 14 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 81 బ్యాటింగ్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), విహాన్ మల్హోత్రా (21 బ్యాటింగ్, 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న యువ భారత్... ప్రత్యర్థి స్కోరుకు 190 పరుగులు వెనుకబడి ఉంది. వైభవ్ రికార్డు అర్ధ శతకం అంతర్జాతీయ క్రికెట్లో హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా యువ భారత్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రికార్డుల్లోకెక్కాడు. వైభవ్ 13 సంవత్సరాల 187 రోజుల్లో ఈ ఘనత సాధించాడు. ఏ స్థాయి క్రికెట్లోనైనా ఇదే అతి పిన్న వయసులో అంతర్జాతీయ అర్ధసెంచరీ. అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ ప్లేయర్ నజ్ముల్ హసన్ షాంటో (14 సంవత్సరాల 231 రోజులు) పేరిట ఉంది. శ్రీలంకపై నజ్ముల్ ఈ రికార్డు నమోదు చేశాడు.సమిత్ ద్రవిడ్‌కు గాయం భారత అండర్–19 జట్టులో సభ్యుడైన క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ మోకాలి గాయం కారణంగా ఆ్రస్టేలియాతో అనధికారిక టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. రెండో మ్యాచ్ వరకూ అతడు కోలుకోవడం అనుమానమే. ప్రస్తుతం సమిత్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్నాడు. ఇటీవల యూత్ వన్డే సిరీస్‌కు కూడా గాయం కారణంగానే దూరమైన సమిత్... కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు భారత అండర్–19 జట్టు కోచ్ హృషికేశ్ కనిత్కర్ తెలిపాడు. అండర్–19 స్థాయిలో ఆడేందుకు సమిత్ ద్రవిడ్‌కు ఇదే చివరి అవకాశం కాగా... ఈ నెల 11న అతడు 19వ పడిలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో 2026లో జరగనున్న అండర్–19 ప్రపంచకప్‌లో ఆడే అర్హత కోల్పోయాడు. -
సమిత్ ద్రవిడ్ బ్యాడ్‌లక్.. ఇక ఆ జట్టుకు ఆడలేడు!
భారత యువ క్రికెట్ జట్టు తరఫున అరంగేట్రం చేయాలన్న సమిత్ ద్రవిడ్‌కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. గాయం కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో యూత్ వన్డేలు మిస్సయిన ఈ కర్ణాటక ప్లేయర్.. రెడ్‌బాల్ మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నట్లు తాజా సమాచారం. టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడే సమిత్ ద్రవిడ్.వన్డేల్లో బెంచ్‌కు పరిమితంకాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల ఫోర్ డే సిరీస్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో తొలుత పుదుచ్చేరి వేదికగా సెప్టెంబరు 21, 23, 26 తేదీల్లో వన్డేలు ఆడింది. ఇందులో యువ భారత్ ఆసీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే, మోకాలి గాయం కారణంగా సమిత్ ద్రవిడ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. బెంచ్‌కే పరిమితమయ్యాడు.రెడ్‌బాల్ మ్యాచ్‌లకూ దూరంప్రస్తుతం.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇంకా కోలుకోనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబరు 30- అక్టోబరు 7 వరకు చెన్నైలో ఆస్ట్రేలియాతో జరుగనున్న ఫోర్-డే మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నాడు. ఈ విషయం గురించి భారత యువ జట్టు హెడ్‌కోచ్ హృషికేశ్ కనిత్కర్ ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం అతడు ఇంకా ఎన్సీఏలోనే ఉన్నాడు.ఇకపై ఆ జట్టుకు ఆడలేడుమోకాలి గాయం పూర్తిగా నయం కాలేదు. కాబట్టి అతడు ఆసీస్‌తో మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు’’ అని తెలిపాడు. కాగా సమిత్ ద్రవిడ్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ ఏడాది అక్టోబరు 11న 19వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. దీనర్థం ఇక అతడికి అండర్-19 జట్టుకు, ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2026 ఆడే భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఛాన్స్ ఉండదు. ఇదిలా ఉంటే.. ద్రవిడ్ చిన్న కుమారుడు, సమిత్ తమ్ముడు అన్వయ్ కూడా కర్ణాటక తరఫున జూనియర్ లెవల్లో క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే.చదవండి: WTC Updated Points Table: మూడో స్థానానికి ఎగబాకిన శ్రీలంక.. టాప్‌లోనే భారత్ -
మెంటలోడు అనుకుంటారని భయపడ్డా: ద్రవిడ్
ఎన్నో కఠిన సవాళ్లు దాటిన తర్వాతే తాము ప్రపంచకప్‌ను కైవసం చేసుకోగలిగామని టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. భారత్ టీ20 వరల్డ్‌కప్-2024 చాంపియన్‌గా అవతరించగానే తమ సంబరాలు అంబరాన్నంటాయని.. తాను సైతం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యానని పేర్కొన్నాడు. ఆ సమయంలో భావోద్వేగాలు నియంత్రించుకోలేక ఆటగాళ్లతో కలిసి తాను చిన్నపిల్లాడిలా గంతులు వేశానని తెలిపాడు.అయితే, ఇందుకు సంబంధించిన దృశ్యాలు తన కుమారుల కంటపడకుండా ఉండేందుకు విఫలయత్నం చేశానంటూ ద్రవిడ్ నవ్వులు చిందించాడు. కాగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2024లో మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది టీమిండియా. అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్‌కప్ విజేతగా నిలిచి.. పదకొండేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. విమర్శించిన నోళ్లే ప్రశంసల వర్షం కురిపించాయి..ఫలితంగా కెప్టెన్‌గా రోహిత్ ఖాతాలో తొలి టైటిల్ చేరగా... హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ప్రయాణానికి విజయవంతమైన ముగింపు లభించింది. దీంతో... 2022లో జట్టు వైఫల్యానికి కారణమని వీళ్లిద్దరిని విమర్శించిన నోళ్లే ప్రశంసల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో.. జట్టు కప్ అందుకోగానే ద్రవిడ్ కూడా ఎన్నడూ లేని విధంగా ఉద్వేగానికి లోనవుతూ.. ఆటగాళ్లతో కలిసి సందడి చేశాడు. ఎప్పుడూ గంభీరంగా కనిపించే ఈ మాజీ కెప్టెన్‌ను అలా చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. నాకు పిచ్చిపట్టిందని సందేహ పడతారనుకున్నాఈ విషయం గురించి తాజాగా ప్రస్తావనకు రాగా రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ.. ‘‘మేమంతా ఎంతో కష్టపడిన తర్వాత దక్కిన ఫలితం అది. అలాంటపుడు మా సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకు నిదర్శనమే నాటి సెలబ్రేషన్స్. ఎంతో గొప్పగా సంబరాలు చేసుకున్నాం. అయితే, ఈ వీడియోను నా కుమారులు చూడకూడదని జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే.. నన్ను వాళ్లిలా చూశారంటే నాకు పిచ్చి పట్టిందేమోనని వాళ్లు సందేహపడతారేమోనన్న భయం వెంటాడింది(నవ్వుతూ). నిజానికి నేనెప్పుడూ మా వాళ్లకు కూల్‌గా ఉండాలని చెబుతాను.గెలుపైనా.. ఓటమైనా తొణకకుండా ఉంటూ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని వాళ్లకు హితబోధ చేస్తూ ఉంటాను. అలాంటిది నేనే అంతగా సెలబ్రేట్ చేసుకున్నానంటే ఆ విజయానికి ఉన్న విలువ అటువంటిది. కోచ్‌గా నా చివరి మ్యాచ్ అలా ముగిసిందుకు సంతోషంగా ఉన్నాను. అదే ఆఖరి మ్యాచ్ కావడం కూడా నయమైంది. లేదంటే.. మీరు చెప్పేదొకటి.. చేసేదొకటి(సెలబ్రేషన్స్ విషయంలో) అని మా జట్టు సభ్యులు నన్ను ఆటపట్టించేవారు’’ అంటూ చిరు నవ్వులు చిందించాడు. సియట్ అవార్డు వేడుక సందర్భంగా హిందుస్తాన్ టైమ్స్‌తో రాహుల్ ద్రవిడ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా ద్రవిడ్ కుమారులు కూడా క్రికెటర్లేనన్న విషయం తెలిసిందే. పెద్ద కొడుకు సమిత్ ఇటీవలే అండర్-19 భారత జట్టుకు ఎంపికయ్యాడు. చిన్న కొడుకు అన్వయ్ సైతం ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇక ద్రవిడ్ స్థానంలో ప్రస్తుతం గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: పతనం దిశగా పాక్.. అసలు ఈ జట్టుకు ఏమైంది?.. బంగ్లా రికార్డులివీ -
దంచికొట్టిన కరుణ్ నాయర్.. మహరాజా ట్రోఫీ మైసూర్దే!
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన మహరాజా ట్రోఫీ-2024లో మైసూర్ వారియర్స్ చాంపియన్‌గా నిలిచింది. బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన ఫైనల్లో 45 పరుగుల తేడాతో గెలుపొంది.. ట్రోఫీని ముద్దాడింది. ఈ టీ20 టోర్నీ ఆద్యంతం బ్యాటింగ్‌తో అదరగొట్టిన మైసూర్ వారియర్స్ కెప్టెన్ కరుణ్ నాయర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. 12 మ్యాచ్‌లలో కలిపి 560 పరుగులు సాధించి సూపర్ ఫామ్ కొనసాగించాడు.పోటీలో ఆరు జట్లుకాగా బెంగళూరు వేదికగా ఆగష్టు 15న మొదలైన మహరాజా ట్రోఫీ తాజా ఎడిషన్‌లో గుల్బర్గా మిస్టిక్స్, బెంగళూరు బ్లాస్టర్స్, మైసూర్ వారియర్స్, శివమొగ్గ లయన్స్, మంగళూరు డ్రాగన్స్, హుబ్లి టైగర్స్ జట్లు పాల్గొన్నాయి. వీటిలో గుల్బర్గ, బెంగళూరు, మైసూర్, హుబ్లి సెమీ ఫైనల్ చేరుకున్నాయి.ఫైనల్‌కు చేరుకున్న మైసూర్, బెంగళూరు జట్లుఅయితే, మొదటి సెమీస్ మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ గుల్బర్గాను 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ చేరగా.. రెండో సెమీ ఫైనల్లో హుబ్లి టైగర్స్‌పై తొమ్మిది పరుగుల తేడాతో గెలిచి మైసూర్ తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో బెంగళూరు- మైసూరు మధ్య ఆదివారం రాత్రి టైటిల్ కోసం పోటీ జరిగింది.మనోజ్ భండాగే పరుగుల విధ్వంసంబెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు బ్లాస్టర్స్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో ఓపెనర్ కార్తిక్ 71, కెప్టెన్ కరుణ్ నాయర్ 66 అర్ధ శతకాలతో మెరవగా.. మిడిలార్డర్ బ్యాటర్ మనోజ్ భండాగే 13 బంతుల్లోనే 44 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 2 ఫోర్లు ఉండగా.. స్ట్రైక్‌రేటు 338.46 కావడం గమనార్హం.ఫలితంగా మైసూర్ 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 207 పరుగులు స్కోరు చేసింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు బ్యాటర్లు.. మైసూర్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 162 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా 45 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించిన మైసూర్ వారియర్స్ ఈ ఏడాది టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ జట్టులో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్ కూడా ఉన్నాడు. అయితే, ఫైనల్లో అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. Mysuru hold out Bengaluru; clinch the TITLE!A Karun Nair-led #MysuruWarriors do it in style against #BengaluruBlasters in the Maharaja Trophy final 🏆🙌#MaharajaTrophy | #KarunNair | #MWvBB | #Final2024 pic.twitter.com/GbuDDJyHeV— Star Sports (@StarSportsIndia) September 1, 2024 -
భారత జట్టులో జూనియర్ ద్రవిడ్ ఎంట్రీ!
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్‌వైపు తొలి అడుగువేశాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడనున్న అండర్-19 భారత జట్టుకు ఎంపికయ్యాడు. కంగారూ జట్టుతో స్వదేశంలో జరుగనున్న వన్డే, ఫోర్-డే సిరీస్‌కు సమిత్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు.కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల రెడ్‌బాల్ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్‌కు రానుంది. పుదుచ్చేరి వేదికగా సెప్టెంబరు 21, 23, 26 తేదీల్లో వన్డేలు.. సెప్టెంబరు 30- అక్టోబరు 7 వరకు చెన్నై వేదికగా ఫోర్-డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌లలో భారత అండర్ 19 వన్డే జట్టుకు మహ్మద్ అమాన్, ఫోర్-డే జట్టుకు సోహం పట్వర్ధన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.పేస్ బౌలింగ్ ఆల్రౌండర్కర్ణాటకకు చెందిన సమిత్ ద్రవిడ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ప్రస్తుతం అతడు కేఎస్‌సీఏ మహరాజా టీ20 ట్రోఫీ టోర్నీలో మైసూర్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, ఈ టోర్నమెంట్లో సమిత్ ఇప్పటి వరకు తన మార్కు చూపించలేకపోయాడు. ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 82 పరుగులే చేయడంతో పాటు.. ఇంతవరకు ఒక్కసారి కూడా బౌలింగ్ చేసే అవకాశం దక్కించుకోలేకపోయాడు.ఆ టోర్నీలో అదరగొట్టిన సమిత్ అయితే, అంతకుముందు కూచ్ బెహర్ ట్రోఫీలో మాత్రం కర్ణాటక టైటిల్ గెలవడంలో సమిత్ ద్రవిడ్ కీలక పాత్ర పోషించాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన 18 ఏళ్ల సమిత్.. 362 పరుగులు సాధించాడు. జమ్మూ కశ్మీర్‌పై చేసిన 98 పరుగులు అతడి అత్యధిక స్కోరు. ఇక ఈ టోర్నీలో సమిత్ 16 వికెట్లు కూడా పడగొట్టడం విశేషం. ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో పాటు.. ముంబైతో జరిగిన ఫైనల్లో రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకుని సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు సమిత్ ద్రవిడ్. కాగా అండర్-19 స్థాయిలో సత్తా చాటితే టీమిండియాలో ఎంట్రీకి మార్గం సుగమమవుతుందన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో అండర్ 19 జట్టుతో వన్డే సిరీస్‌కు భారత అండర్-19 జట్టు:రుద్ర పటేల్ (వైస్ కెప్టెన్- గుజరాత్), సాహిల్ పరాఖ్ (మహారాష్ట్ర), కార్తికేయ కేపీ (కర్ణాటక), మహ్మద్ అమాన్ (కెప్టెన్) (ఉత్తరప్రదేశ్), కిరణ్ చోర్మాలే (మహారాష్ట్ర), అభిజ్ఞాన్ కుందు (ముంబై), హర్వంశ్ సింగ్ పంగలియా (వికెట్ కీపర్, సౌరాష్ట్ర), సమిత్ ద్రవిడ్ ( కర్ణాటక), యుధాజిత్ గుహ (బెంగాల్ ), సమర్థ్ ఎన్ (కర్ణాటక), నిఖిల్ కుమార్ (చండీగఢ్), చేతన్ శర్మ (రాజస్తాన్), హార్దిక్ రాజ్ (కర్ణాటక), రోహిత్ రజావత్(మధ్యప్రదేశ్), మహ్మద్ ఖాన్(కేరళ).ఆస్ట్రేలియాతో అండర్ 19 జట్టుతో వన్డే సిరీస్‌కు భారత అండర్-19 జట్టు:వైభవ్ సూర్యవంశీ (బీహార్), నిత్యా పాండ్యా (బీహార్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్- సంజాబ్), సోహమ్ పట్వర్ధన్ (కెప్టెన్) (మధ్యప్రదేశ్), కార్తికేయ కేపీ (కర్ణాటక), సమిత్ ద్రవిడ్ (కర్ణాటక), అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్- ముంబై), హర్వంశ్ సింగ్ పంగలియా (వికెట్ కీపర్- సౌరాష్ట్ర), చేతన్ శర్మ(రాజస్తాన్), సమర్థ్ ఎన్(కర్ణాటక), ఆదిత్య రావత్(ఉత్తరాఖండ్), అన్మోల్జీత్ సింగ్(పంజాబ్), ఆదిత్య సింగ్(ఉత్తరప్రదేశ్), మహ్మద్ ఎనాన్(కేరళ).చదవండి: సూర్యకుమార్ ఆశలపై నీళ్లు.. ఊహించని షాక్! -
స్మరన్ సూపర్ సెంచరీ
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో ఇవాళ (ఆగస్ట్ 18) జరిగిన మ్యాచ్‌లో మైసూర్ వారియర్స్, గుల్బర్గా మిస్టిక్స్ జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. సెంచరీ హీరో స్మరన్ (60 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చివరి బంతికి బౌండరీ బాది మిస్టిక్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.వారియర్స్ తరఫున కెప్టెన్ కరుణ్ నాయర్ మెరుపు అర్ద సెంచరీతో (35 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా.. టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ ఓ మోస్తరు స్కోర్‌తో (24 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్) రాణించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జగదీశ్ సుచిత్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (12 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. మిస్టిక్ బౌలర్లలో మోనిశ్ రెడ్డి, పృథ్వీ రాజ్ షెకావత్, యశోవర్దన్ తలో రెండు వికెట్లు.. విజయ్‌కుమార్, శరణ్ గౌడ్ చెరో వికెట్ పడగొట్టారు.197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మిస్టిక్స్.. 7 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్మరన్.. అనీశ్ (24), ఫైజాన్ ఖాన్ (18), ప్రవీణ్ దూబే (37) సహకారంతో మిస్టిక్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. -
కరుణ్ నాయర్ మెరుపు అర్ద సెంచరీ.. రాణించిన ద్రవిడ్ కొడుకు
మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో ఇవాళ (ఆగస్ట్ 18) జరుగుతున్న మ్యాచ్‌లో మైసూర్ వారియర్స్, గుల్బర్గా మిస్టిక్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. వారియర్స్ కెప్టెన్ కరుణ్ నాయర్ మెరుపు అర్ద సెంచరీతో (35 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా.. టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ ఓ మోస్తరు స్కోర్‌తో (24 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్) రాణించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జగదీశ్ సుచిత్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (12 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకట్టుకోగా.. వారియర్స్ ఇన్నింగ్స్‌లో కార్తీక్ 5, అజిత్ కార్తీక్ 9, సుమిత్ కుమార్ 19, మనోజ్ భంగడే 0, కృష్ణప్ప గౌతమ్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. మిస్టిక్ బౌలర్లలో మోనిశ్ రెడ్డి, పృథ్వీ రాజ్ షెకావత్, యశోవర్దన్ తలో రెండు వికెట్లు.. విజయ్‌కుమార్, శరణ్ గౌడ్ చెరో వికెట్ పడగొట్టారు. -
భారీ సిక్సర్ బాదిన ద్రవిడ్ కొడుకు.. వీడియో వైరల్
మహారాజా ట్రోఫీ-2024లో భారత మాజీ హెడ్‌కోచ్ తనయుడు సమిత్ మరోసారి నిరాశపరిచాడు. ఈ లీగ్‌లో మైసూరు వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సమిత్.. శుక్రవారం బెంగళూరు బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం సుమిత్ అద్బుతమైన సిక్స్‌తో మెరిశాడు. అతడు కొట్టిన షాట్‌కు అందరూ ఫిదా అయిపోయారు. మైసూర్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన జ్ఞానేశ్వర్ నవీన్.. నాలుగో బంతిని సమిత్‌కు ఔట్‌సైడ్ హాఫ్ స్టంప్ దిశగా షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో సమిత్ మిడాన్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతికే సమిత్ ఔటయ్యాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా టోర్నీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన సమిత్ కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మైసూరు వారియర్స్‌పై బెంగళూరు బ్లాస్టర్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మహారాజా ట్రోఫీ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ದ್ರಾವಿಡ್ ಸರ್ ಮಗ ಗುರು ಇವ್ರು..🤯🔥ಈ ಸಿಕ್ಸ್ ಗೆ ಒಂದು ಚಪ್ಪಾಳೆ ಬರ್ಲೇಬೇಕು..👏👌📺 ನೋಡಿರಿ Maharaja Trophy KSCA T20 | ಬೆಂಗಳೂರು vs ಮೈಸೂರು | LIVE NOW #StarSportsKannada ದಲ್ಲಿ#MaharajaTrophyOnStar@maharaja_t20 pic.twitter.com/ROsXMQhtwO— Star Sports Kannada (@StarSportsKan) August 16, 2024 -
ద్రవిడ్ కొడుకుకు సూపర్ ఆఫర్
టీమిండియా తాజా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కొడుకు సమిత్ ద్రవిడ్‌కు బంపరాఫర్ లభించింది. కర్ణాటక టీ20 లీగ్ (కేఎస్‌సీఏ టీ20 టోర్నీ) వేలంలో సుమిత్‌ను గత సీజన్ రన్నరప్ మైసూరు వారియర్స్ సొంతం చేసుకుంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన సమిత్‌ను రూ. 50000 సొంతం చేసుకున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది.18 ఏళ్ల సమిత్ ఇప్పటివరకు సీనియర్ స్థాయి క్రికెట్ ఆడలేదు. సీనియర్లతో కలిసి ఆడేందుకు సమిత్‌కు ఇది మంచి అవకాశం. సమిత్‌ను కొనుగోలు చేసిన మైసూరు జట్టుకు టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్ కరుణ్ నాయర్ సారథ్యం వహించనున్నాడు. ఇదే జట్టులో టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ ఉన్నాడు. వీరి సహవాసంలో సమిత్ మరింత రాటుదేలే అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్ కూచ్ బెహర్ ట్రోఫీ గెలిచిన కర్ణాటక అండర్-19 జట్టులో సమిత్ సభ్యుడిగా ఉన్నాడు. మిడిలార్డర్లో ఉపయోకరమైన బ్యాటర్‌గా పేరున్న సమిత్ ఇటీవలి కాలంలో అద్బుతంగా ఆడుతూ తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్ కౌంటీ జట్టు లాంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సమిత్ పర్వాలేదనిపించాడు.ఇదిలా ఉంటే, సమిత్ తండ్రి రాహుల్ ద్రవిడ్ ఇటీవలే టీమిండియాను టీ20 వరల్డ్‌కప్ గెలిపించి హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ద్రవిడ్ సుమారు రెండున్నర సంవత్సరాల పాటు భారత హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. గంభీర్ ఆథ్వర్యంలో టీమిండియా రేపటి నుంచి శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడనుంది.మైసూర్ వారియర్స్ జట్టు:కరుణ్ నాయర్, కార్తీక్ సీఏ, మనోజ్ భండగే, కార్తీక్ ఎస్‌యూ, సుచిత్ జే, గౌతమ్ కే, విద్యాధర్ పాటిల్, వెంకటేష్ ఎం, హర్షిల్ ధర్మాని, గౌతమ్ మిశ్రా, ధనుష్ గౌడ, సమిత్ ద్రవిడ్, దీపక్ దేవాడిగ, సుమిత్ కుమార్, స్మయన్ శ్రీవాస్తవ, జాస్పర్ ఈజే, ప్రసిద్ధ్ కృష్ణ , మహమ్మద్ సర్ఫరాజ్ అష్రఫ్. -
కర్ణాటక కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ కర్ణాటక క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఓ ఇంటర్ జోనల్ అండర్-14 టోర్నమెంట్లో అన్వయ్ కర్ణాటక టీమ్‌ను లీడ్ చేయనున్నాడు. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన అన్వయ్.. గతకొంతకాలంగా విశేషంగా రాణిస్తూ, తన స్వయం కృషితో సారధిగా నియమించబడ్డాడు. రాహుల్ ద్రవిడ్ పెద్ద కొడుకు, అన్వయ్ అన్న సమిత్ ద్రవిడ్ కూడా క్రికెటర్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. సమిత్.. 2019-20 సీజన్లో అండర్-14 క్రికెట్లో రెండు డబుల్ సెంచరీలు బాది వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు సమిత్ తమ్ముడు అన్వయ్ కూడా అన్న తరహాలోనే రాణించి, తండ్రికి తగ్గ తనయుడనిపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అన్వయ్ కూడా తండ్రి రాహుల్ ద్రవిడ్ లాగే వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ కావడంతో తండ్రిలాగే సక్సెస్ అవుతాడని అందరూ అనుకుంటున్నారు. ధోనికి ముందు టీమిండియాకు సమర్ధవంతుడైన రెగ్యులర్ వికెట్‌కీపర్ లేకపోవడంతో ద్రవిడ్ చాన్నాళ్ల పాటు వికెట్‌కీపింగ్ భారాన్ని మోసాడు. ధోని రాకతో ద్రవిడ్ బ్యాటింగ్‌పై మాత్రమే ప్రత్యేక దృష్టి సారించి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఇదిలా ఉంటే, టీమిండియా హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. ద్రవిడ్ కోచింగ్‌లో భారత్ ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా అతని ఆధ్వర్యంలో టీమిండియా.. న్యూజిలాండ్‌ను తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో ఓడించి, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జనవరి 21న రాయ్‌పూర్ వేదికగా టీమిండియా-కివీస్ జట్ల మధ్య రెండో వన్డే జరుగనుంది. -
26 ఫోర్లతో డబుల్ సెంచరీ
బెంగళూరు: టీమిండియా వాల్, దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ వారసుడు సమిత్ ద్రవిడ్ తండ్రిదగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. రెండు నెలల వ్యవధిలో రెండో డబుల్ సెంచరీ సాధించి సత్తా చాటాడు. తన స్కూల్ మాల్యా అదితి ఇంటర్నేషనల్(ఎంఏఐ) తరపున బరిలోకి బ్యాట్ ఝళిపించాడు. బీటీఆర్ షీల్డ్ అండర్-14 గ్రూప్ వన్ డివిజన్ 2 టోర్నమెంట్లో ద్విశతకంతో జూనియర్ ద్రవిడ్ చెలరేగాడు. కేవలం 144 బంతుల్లోనే 26 ఫోర్లు, సిక్సర్‌తో 211 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. సమిత్ విజృంభణతో ఎంఏఐ టీమ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 386 పరుగులు భారీ స్కోరు చేసింది. ఎంఏఐతో పోటీ పడిన బీజీఎస్ నేషనల్ పబ్లిక్ స్కూల్ జట్టు వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి 132 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. క్రికెట్లో సత్తా చాటడం సమిత్ ద్రవిడ్ కొత్త కాదు. అండర్-14 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో భాగంగా గతేడాది డిసెంబర్ 20న జరిగిన మ్యాచ్‌లో వైస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు తరపున బరిలోకి సమిత్ డబుల్ సెంచరీ(201)తో మోత మోగించాడు. అండర్-12 విభాగంలో 2015లో జరిగిన టోర్నమెంట్లో మూడు అర్ధసెంచరీలు బాదడంతో సమిత్ పతాక శీర్షికలకు ఎక్కాడు. అప్పటి నుంచి స్థిరంగా రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుంటున్నాడు. (చదవండి: సచిన్‌ను గంగూలీ వదలట్లేదుగా!) -
అదరగొట్టిన ‘వాల్’ వారసుడు!
బెంగళూరు : టీమిండియా వాల్, దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ వారసుడు సమిత్ ద్రవిడ్ అదరగొట్టాడు. ఇప్పటి వరకు క్రికెటర్ల తనయుల పేర్లలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పేరే వినిపించగా.. తాజాగా ద్రవిడ్ కొడుకు సైతం వార్తల్లో నిలిచాడు. బెంగళూరులో జరిగిన అండర్-14 టోర్నీలో ఈ 12 ఏళ్ల చిన్న ద్రవిడ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అధితి ఇంటర్నేషనల్ స్కూల్ తరపున బరిలోకి దిగిన సమిత్ అర్థ సెంచరీతో పాటు 4 వికెట్లు పడగొట్టి విజయం కీలక పాత్ర పోషించాడు. దీంతో కెంబ్రిడ్జి పబ్లిక్ స్కూల్‌పై సమిత్ జట్టు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ద్రవిడ్ అండర్-19 కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ అండర్ 19 కోచ్ పెద్దకొడుకైన సమిత్.. ఇలా ఆకట్టుకోవడం ఇదే తొలిసారేం కాదు. జనవరిలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ (కేఎస్‌సీఏ) నిర్వహించిన బీటీఆర్ కప్‌లో సమిత్ 150 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా అండర్-12 టోర్నీల్లో అత్యధిక పరుగుల సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు కూడా పొందాడు. 2015లో అండర్-12 గోపాలన్ క్రికెట్ చాలెంజ్ పోటీల్లో బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇక సచిన్ కుమారుడు అర్జున్ శ్రీలంక పర్యటనలోని భారత అండర్-19 జట్టు తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. చదవండి: ద్రవిడ్‌కు గొప్ప బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన కొడుకు -
ద్రావిడ్‌కు గొప్ప బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన కొడుకు
ముంబయి : భారత్ క్రికెట్‌కు వన్నె తెచ్చిన దిగ్గజాల్లో మిస్టర్ వాల్ (రాహుల్ ద్రావిడ్)ది ప్రత్యేక స్థానం. ఒదిగి ఉండే మనస్తత్వానికి, ఎలాంటి సమయంలోనూ చెక్కుచెదరని వ్యక్తిత్వానికి ఆయనే నిదర్శనం. ద్రావిడ్గా కంటే మిస్టర్వాల్గా, మిస్టర్ డిపెండబుల్గానే ఆయనను ఎక్కువగా పిలుచుకుంటారు. నేడు ఆయన జన్మదినం. ఈ నేపథ్యంలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 'నిబద్ధత, నిలకడ, క్లాస్'వంటి గొప్పలక్షణాలు గల వ్యక్తి రాహుల్ ద్రావిడ్ అని, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. పలువురు క్రికెటర్లు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కుమారుడి కానుక ఇండియా అండర్ 19 టీమ్ కోచ్ గా ఉన్న రాహుల్ ఐసీసీ వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్‌లో ఉన్నారు. వార్మప్ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా టీంపై 189పరుగుల తేడాతో ఇండియా అండర్ 19టీం విజయం సాధించింది. కొత్త ఏడాదిలో ద్రావిడ్‌కు ఇది తొలి విజయం కాగా, సరిగ్గా ఆయన పుట్టిన రోజుకు రెండు రోజులు ముందు కుమారుడు సమిత్ ద్రావిడ్ 150 పరుగులు చేశాడు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ (కేఎస్‌సీఏ) నిర్వహిస్తున్న బీటీఆర్ కప్‌లో మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ టీంలో ఆడుతున్న సమిత్ 150 పరుగులు చేసి తండ్రికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో సమిత్ టీం మొత్తం 50 ఓవర్లలో 500/5 పరుగులు చేసింది. Commitment, Consistency, Class. Here's wishing a very Happy Birthday to Former #TeamIndia Skipper Rahul Dravid #HappyBirthdayDravid pic.twitter.com/FTgk1SjdT9 — BCCI (@BCCI) 11 January 2018 -
జూనియర్ ద్రవిడ్ వచ్చేశాడు!
స్కూల్ క్రికెట్లో సెంచరీ చేసిన సమిత్ బెంగళూరు: భారత మాజీ ఆటగాడు, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ బాటలోనే అతని కొడుకు కూడా పోటీ క్రికెట్లోకి దూసుకొస్తున్నాడు. అండర్-14 స్థాయి క్రికెట్లో ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న 11 ఏళ్ల సమిత్ ద్రవిడ్ ఈ సీజన్లో సెంచరీతో సత్తా చాటాడు. ‘టైగర్ కప్’ టోర్నీలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు యునెటైడ్ క్రికెట్ క్లబ్ (బీయూసీసీ)కి ప్రాతినిధ్యం వహించాడు. ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో సమిత్ 125 పరుగులు సాధించాడు. సహచర ఆటగాడు ప్రత్యూష్ (143)తో కలిసి సమిత్ 213 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో బీయూసీసీ 246 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గత సంవత్సరం స్కూల్ క్రికెట్లో ఆకట్టుకున్న సమిత్, అండర్-12 విభాగం టోర్నీ గోపాలన్ క్రికెట్ చాలెంజ్‌లో ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. తనతో పోలిస్తే సమిత్ బాగా దూకుడుగా ఆడతాడని, ప్రతీ బంతిని బాదే ప్రయత్నం చేస్తాడని కొన్నాళ్ల క్రితం స్వయంగా ద్రవిడ్ చెప్పుకున్నాడు. సచిన్ కుమారుడు అర్జున్ తర్వాత ఇప్పుడు సమిత్ రాకతో మరో తరం వారసులు కూడా సిద్ధమైనట్లే. -
ద్రవిడ్ కొడుకు.. చితక్కొట్టాడు!
రాహుల్ ద్రవిడ్ అనగానే ద వాల్ అనే పేరు ఠక్కున గుర్తుకొస్తుంది. జట్టు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వికెట్ పడకుండా కాపాడుకోవడమే కాక.. అత్యంత క్లాసీ షాట్లు ఆడటంలో ద్రవిడ్‌ను మించినవాళ్లు లేరని అంతర్జాతీయ క్రికెట్ పరిశీలకులు, విమర్శకులు కూడా చెబుతారు. అలాంటి ద్రవిడ్ కొడుకు.. అచ్చంగా తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. గట్టిగా పదేళ్ల వయసు ఉందో లేదో.. అప్పుడే అండర్ -14 క్లబ్ క్రికెట్లో సెంచరీ బాదేశాడు. బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్ (బీయూసీసీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న సమిత్ ద్రవిడ్.. టైగర్ కప్ క్రికెట్ టోర్నమెంటులో ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూలు జట్టుపై 125 పరుగులు చేశాడు. అందులోనూ 12 బౌండరీలున్నాయి. బీయూసీసీ తరఫునే ఆడుతున్న మరో ఆటగాడు ప్రత్యూష్ 143 నాటౌట్‌గా నిలిచాడు. వీళ్లిద్దరూ చెలరేగడంతో బీయూసీసీ జట్టు 246 పరుగుల భారీ తేడాతో గెలిచింది. సమిత్ ద్రావిడ్ ఇలా చెలరేగి ఆడటం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో అండర్ -12 గోపాలన్ క్రికెట్ చాలెంజ్ టోర్నమెంటులో అతడు బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యాడు. అప్పుడు వరుసగా 77 నాటౌట్, 93, 77 చొప్పున పరుగులు చేసి, తన జట్టును గెలిపించాడు. తన కొడుకు బ్యాటింగ్ తీరు పట్ల ద్రావిడ్ కూడా పొంగిపోతున్నాడు. అతడి కళ్లకు, చేతులకు మధ్య మంచి సమన్వయం ఉందని, బాల్ రాగానే దాన్ని స్మాష్ చేసేస్తాడని.. అలాగే చేయమని తాను కూడా చెబుతున్నానని ద్రావిడ్ అన్నాడు. ఎంతైనా పుత్రోత్సాహం కదా..! -
ద్రవిడ్ 'మార్క్'
మాజీ క్రికెటర్లకు బీసీసీఐలో పదవి అంటే కామధేనువు లాంటిదే. హోదా, గుర్తింపుతో పాటు ఆర్థిక ప్రయోజనాలూ మామూలే. కానీ రాహుల్ ద్రవిడ్ అలాంటి పదవిని కాదన్నాడు. సలహా సంఘంలో ఉండటం కంటే కుర్రాళ్లను సానబెట్టడమే తనకు ఇష్టమన్నాడు. ప్రశాంతంగా సాగిపోయే పదవులకంటే... సవాల్ విసిరే కోచ్ పదవినే కోరుకున్నాడు. కొత్తతరాన్ని తయారు చేసే బాధ్యత తీసుకున్నాడు. శ్రీలంక సిరీస్ ద్వారా ఇప్పటికే ద్రవిడ్ ‘మార్క్’ కనబడింది కూడా. సాక్షి క్రీడా విభాగం : చదువులో ఫస్ట్ క్లాస్ విద్యార్థి ఎప్పుడైనా వెనుకబడితే తన లోపాలు సరిదిద్దుకునేందుకు, మళ్లీ టాప్‌లోకి వచ్చేందుకు తనకు ఇష్టమైన టీచర్ దగ్గరికి వెళ్లడం చూస్తుంటాం. ఇప్పుడు భారత క్రికెట్‌కు కూడా రాహుల్ ద్రవిడ్ అలాంటి గురువుగానే కనిపిస్తున్నాడు. పుజారా కావచ్చు లేదా రహానే కావచ్చు...కుర్రాడు లోకేశ్ రాహుల్ అయినా, ఇంకా టెస్టు ఆడని కరుణ్ నాయర్ అయినా కావచ్చు. ఇటీవల వీరందరి ఆటపై ద్రవిడ్ ప్రభావం ఉంది. వారంతా తమ ఆట ను మెరుగు పర్చుకునేందుకు ద్రవిడ్‌ను ఆశ్రయిం చారు. ఫలితం రాబట్టిన తర్వాత తమ వెనుక ‘వాల్’ ఉన్నాడంటూ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అతని సూచనలతోనే ఒకప్పుడు శైలిలోనూ, టెక్నిక్‌లోనూ ద్రవిడ్ వారసుడు అంటూ చతేశ్వర్ పుజారా టెస్టు జట్టులోకి వచ్చాడు. చాలా వరకు ఆ అంచనాలను నిలబెట్టుకున్నా కొన్ని ఇన్నింగ్స్‌ల వైఫల్యంతో తుది జట్టులో స్థానం లేకుండా పోయింది. కానీ ఇటీవల చెన్నైలో భారత్ ‘ఎ’ మ్యాచ్ సందర్భంగా ద్రవిడ్ అతని ఆటను ప్రత్యేకంగా పరీక్షించాడు. ‘పుజారా ఆటను బాగా దగ్గరినుంచి చూశాను. అతని ఆటలో, టెక్నిక్‌లో ఎలాంటి లోపం లేదు. రాబోయే సిరీస్‌లో ఒక్క అవకాశం దక్కినా భారీ ఇన్నింగ్స్ ఖాయం’ అని విశ్లేషించిన ద్రవిడ్... పుజారాను ప్రోత్సహించాడు. ద్రవిడ్ మాటలు తనలో ఉత్సాహం నింపాయని, ఆయన ఇచ్చిన సూచనలతో ఆత్మవిశ్వాసం పెరిగిందని కొలంబో సెంచరీ అనంతరం పుజారా వ్యాఖ్యానించాడు. నిజానికి పేరుకు బ్యాటింగ్ ప్రాక్టీస్ అన్నా... ఇండియా ‘ఎ’ మ్యాచ్ సందర్భంగా ద్రవిడ్నుంచి కోహ్లికి కూడా చక్కటి సలహాలు లభించాయి. ఇక రహానే అయితే రాజస్తాన్ రాయల్స్ జట్టులో కలిసి ఆడిన నాటినుంచి తన మంచి ప్రదర్శనకు కారణంగా ద్రవిడ్ పేరే చెబుతాడు. వెల్లింగ్టన్లో తన తొలి టెస్టు సెంచరీని రాహుల్‌కే అంకితమిచ్చిన అజింక్య... బ్యాటింగ్‌లో ఏ లోపం ఉన్నా ద్రవిడ్ దగ్గరికే పరిగెడతాడు. తన క్రికెట్ కెరీర్‌కు స్ఫూర్తిగా నిలిచిన ద్రవిడ్ వల్లే ఈ స్థాయికి చేరానని ప్రతీ సారి చెప్పే సహచర బెంగళూరు ఆటగాడు కేఎల్ రాహుల్... ఇటీవల ఇండియా ‘ఎ’ సిరీస్ సందర్భంగా ద్రవిడ్ మార్గదర్శనంలో తన బ్యాటింగ్‌ను మెరుగు పర్చుకున్నాడు. ఈ ముగ్గురి ఆటలో కచ్చితంగా ఎక్కడో ఒక చోట ద్రవిడ్ పోలికలు కనిపిస్తాయి. ఈ ముగ్గురూ శ్రీలంకలో ఆకట్టుకున్నారు. ఇంకా చాలా ఉంది ‘కోచ్‌గా ఇంకా నేను నేర్చుకునే దశలోనే ఉన్నాను. ఆటగాళ్లతో ఎలా ఉండాలి. ఏం మాట్లాడాలి. అసలు ఏ సమయంలో కల్పించుకోవాలి. ఏం చెబితే వారు ఇబ్బంది పడరో చూడాలి’ అంటూ ద్రవిడ్ తన శిక్షణపై స్వీయ అభిప్రాయం చెప్పాడు. అయితే అతని శిక్షణ ‘ఎ’ జట్టును రాటుదేలేలా చేసిందనడంలో సందేహం లేదు. తన తొలి అసైన్‌మెంట్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ చేతిలో టెస్టుల్లో ఓడిన భారత ‘ఎ’ జట్టు... ఆ తర్వాత ముక్కోణపు వన్డే సిరీస్‌లో, దక్షిణాఫ్రికా ‘ఎ’తో టెస్టు సిరీస్‌లో విజేతగా నిలిచింది. ఫలితాలకంటే యువ ఆటగాళ్లకు ఆడే అవకాశాలు రావడమే ఈ సిరీస్‌ల ముఖ్య ఉద్దేశమని చెప్పిన ద్రవిడ్ అందుకు తగినట్లుగా కుర్రాళ్లను గుర్తించి సానబెట్టే పనిలో పడ్డాడు. కరుణ్ నాయర్ భారత జట్టుకు ఎంపిక కావడం కుర్రాళ్ళలో స్ఫూర్తి నింపిందని రాహుల్ అభిప్రాయ పడ్డాడు. అసలు తొలి సిరీస్ కోసం ఫాస్ట్ పిచ్‌లు కావాలంటూ బోర్డును అడిగి మరీ తయారు చేయించుకోవడం ద్రవిడ్ భవిష్యత్ ఆలోచనలకు సూచన. విదేశాల్లో ఎదురయ్యే పరిస్థితులను ఆటగాళ్లు ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దాలని పట్టుదలగా ఉన్నాడనేది అర్థమవుతుంది. ఇక అండర్-19 జట్టుకు కూడా సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఉండాలని ద్రవిడ్ కోరుతున్నాడు. భవిష్యత్తులో భారత జట్టులోకి వచ్చే ఆటగాళ్లంతా ‘ఎ’ జట్టు, అండర్-19 టీమ్లనుంచే రావాలి. వీరంతా ఇకపై ద్రవిడ్ శిక్షణలోనే సిద్ధం కానున్నారు. అంటే ఎవరు జట్టులోకి వచ్చినా ద్రవిడ్ ముద్ర, మార్క్ స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. చెలరేగిన సమిత్ ద్రవిడ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ స్కూల్ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. బెంగళూరులో జరుగుతున్న గోపాలన్ క్రికెట్ చాలెంజ్ కప్ అండర్-12 టోర్నీలో అతను 93 పరుగులు చేసి తన జట్టు మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్‌ను గెలిపించాడు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సమిత్ ఇన్నింగ్స్ కారణంగా అదితి 63 పరుగులతో గెలిచింది. అంతకు ముందు హారిజన్ పబ్లిక్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సమిత్ 77 పరుగులు చేశాడు. ఈ అక్టోబర్‌తో సమిత్‌కు 10 ఏళ్లు నిండుతాయి. -
అచ్చం రాహుల్ ద్రవిడ్ లాగానే..
బెంగళూరు:టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని బ్యాటింగ్ తో టీమిండియాకు ఎన్నో ఘనవిజయాలు అందించాడు. ఇటీవల ఇండియా-ఏ టీమ్ కు కోచ్ గా నియమితుడైన ద్రవిడ్.. అతని కుమారులు సమిత్ ద్రవిడ్, అన్వయ్ ద్రవిడ్ లకు కూడా క్రికెట్ పాఠాలు నేర్పే పనిలో పడ్డాడు. వారు క్రికెట్ ఆడుతున్నప్పుడు మ్యాచ్ లను వీక్షిస్తున్న ద్రవిడ్ వారికి దగ్గరుండి మరీ సలహాలు ఇస్తున్నాడు. అండర్ -12 స్కూల్ క్రికెట్ లో భాగంగా గురువారం బెంగళూరులో జరిగిన మ్యాచ్ కు హాజరైన రాహుల్ ద్రవిడ్.. కుమారుడు సమిత్ బ్యాటింగ్ ను వీక్షించాడు. తండ్రి ఎదుట క్రికెట్ ఆడిన సమిత్ బ్యాటింగ్ లో మెరిశాడు. అచ్చం తండ్రి తరహాలోనే ఆడుతూ రాహుల్ ను మంత్ర ముగ్ధుడ్ని చేశాడు. మల్ల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ తరుపున ఆడిన సమిత్ 93 పరుగులు చేసి తృటిలో సెంచరీ కోల్పోయాడు. దీంతో సమిత్ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జట్టు 106 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఈ టోర్నీకి ముందు జరిగిన టోర్నమెంట్ లో సమిత్ 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. మరి జూనియర్ ద్రవిడా?మజాకా?