కరుణ్‌ నాయర్‌ మెరుపు అర్ద సెంచరీ.. రాణించిన ద్రవిడ్‌ కొడుకు | Maharaja KSCA T20 2024: Karun Nair, Samit Dravid Shines In A Match Vs Gulbarga Mystics | Sakshi
Sakshi News home page

కరుణ్‌ నాయర్‌ మెరుపు అర్ద సెంచరీ.. రాణించిన ద్రవిడ్‌ కొడుకు

Published Sun, Aug 18 2024 5:01 PM | Last Updated on Sun, Aug 18 2024 5:59 PM

Maharaja KSCA T20 2024: Karun Nair, Samit Dravid Shines In A Match Vs Gulbarga Mystics

మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో ఇవాళ (ఆగస్ట్‌ 18) జరుగుతున్న మ్యాచ్‌లో మైసూర్‌ వారియర్స్‌, గుల్బర్గా మిస్టిక్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మైసూర్‌ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. వారియర్స్‌ కెప్టెన్‌ కరుణ్‌ నాయర్‌ మెరుపు అర్ద సెంచరీతో (35 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా.. టీమిండియా తాజా మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కొడుకు సమిత్‌ ద్రవిడ్‌ ఓ మోస్తరు స్కోర్‌తో (24 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్‌) రాణించాడు. 

ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జగదీశ్‌ సుచిత్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (12 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకట్టుకోగా.. వారియర్స్‌ ఇన్నింగ్స్‌లో కార్తీక్‌ 5, అజిత్‌ కార్తీక్‌ 9, సుమిత్‌ కుమార్‌ 19, మనోజ్‌ భంగడే 0, కృష్ణప్ప గౌతమ్‌ 10 పరుగులు చేసి ఔటయ్యారు. మిస్టిక్‌ బౌలర్లలో మోనిశ్‌ రెడ్డి, పృథ్వీ రాజ్‌ షెకావత్‌, యశోవర్దన్‌ తలో రెండు వికెట్లు.. విజయ్‌కుమార్‌, శరణ్‌ గౌడ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement