భారీ సిక్స‌ర్ బాదిన ద్ర‌విడ్ కొడుకు.. వీడియో వైర‌ల్‌ | Rahul Dravid's Son Samits Six-Hitting Video From Maharaja T20 KSCA Tournament Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

భారీ సిక్స‌ర్ బాదిన ద్ర‌విడ్ కొడుకు.. వీడియో వైర‌ల్‌

Published Sat, Aug 17 2024 2:17 PM | Last Updated on Sat, Aug 17 2024 7:21 PM

Rahul Dravid's Son Samits Six-Hitting Video From Maharaja Trophy

మహారాజా ట్రోఫీ-2024లో భార‌త మాజీ హెడ్‌కోచ్ త‌న‌యుడు సమిత్  మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. ఈ లీగ్‌లో మైసూరు వారియర్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సమిత్‌.. శుక్రవారం బెంగళూరు బ్లాస్టర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేవ‌లం 7 ప‌రుగులు మాత్రమే చేసి ఔట‌య్యాడు. 

అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం సుమిత్ అద్బుత‌మైన సిక్స్‌తో మెరిశాడు. అత‌డు కొట్టిన షాట్‌కు అంద‌రూ ఫిదా అయిపోయారు. మైసూర్ ఇన్నింగ్స్ 7వ ఓవ‌ర్ వేసిన జ్ఞానేశ్వర్ నవీన్.. నాలుగో బంతిని స‌మిత్‌కు ఔట్‌సైడ్ హాఫ్ స్టంప్ దిశ‌గా షార్ట్ పిచ్ డెలివ‌రీగా సంధించాడు.

 ఈ క్ర‌మంలో స‌మిత్ మిడాన్ దిశ‌గా భారీ సిక్స‌ర్ బాదాడు. ఆ త‌ర్వాతి బంతికే స‌మిత్ ఔట‌య్యాడు. ఇక‌ ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు రెండు మ్యాచ్‌లు ఆడిన స‌మిత్ కేవ‌లం 14 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మైసూరు వారియర్స్‌పై బెంగళూరు బ్లాస్టర్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మహారాజా ట్రోఫీ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement