భారత యువ క్రికెట్ జట్టు తరఫున అరంగేట్రం చేయాలన్న సమిత్ ద్రవిడ్‌కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. గాయం కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో యూత్ వన్డేలు మిస్సయిన ఈ కర్ణాటక ప్లేయర్.. రెడ్‌బాల్ మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నట్లు తాజా సమాచారం. టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కుమారుడే సమిత్ ద్రవిడ్.
వన్డేల్లో బెంచ్‌కు పరిమితం
కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల ఫోర్ డే సిరీస్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో తొలుత పుదుచ్చేరి వేదికగా సెప్టెంబరు 21, 23, 26 తేదీల్లో వన్డేలు ఆడింది. ఇందులో యువ భారత్ ఆసీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే, మోకాలి గాయం కారణంగా సమిత్ ద్రవిడ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. బెంచ్‌కే పరిమితమయ్యాడు.
రెడ్‌బాల్ మ్యాచ్‌లకూ దూరం
ప్రస్తుతం.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇంకా కోలుకోనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబరు 30- అక్టోబరు 7 వరకు చెన్నైలో ఆస్ట్రేలియాతో జరుగనున్న ఫోర్-డే మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నాడు. ఈ విషయం గురించి భారత యువ జట్టు హెడ్‌కోచ్ హృషికేశ్ కనిత్కర్ ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం అతడు ఇంకా ఎన్సీఏలోనే ఉన్నాడు.
ఇకపై ఆ జట్టుకు ఆడలేడు
మోకాలి గాయం పూర్తిగా నయం కాలేదు. కాబట్టి అతడు ఆసీస్‌తో మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు’’ అని తెలిపాడు. కాగా సమిత్ ద్రవిడ్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ ఏడాది అక్టోబరు 11న 19వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. దీనర్థం ఇక అతడికి అండర్-19 జట్టుకు, ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2026 ఆడే భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఛాన్స్ ఉండదు. ఇదిలా ఉంటే.. ద్రవిడ్ చిన్న కుమారుడు, సమిత్ తమ్ముడు అన్వయ్ కూడా కర్ణాటక తరఫున జూనియర్ లెవల్లో క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే.
చదవండి: WTC Updated Points Table: మూడో స్థానానికి ఎగబాకిన శ్రీలంక.. టాప్‌లోనే భారత్
Comments
Please login to add a commentAdd a comment