భారత జట్టులో జూనియర్‌ ద్రవిడ్‌ ఎంట్రీ! | Rahul Dravid Son Gets India Call Up For U19 Series Against Australia | Sakshi
Sakshi News home page

Ind Vs Aus: భారత జట్టులో జూనియర్‌ ద్రవిడ్‌ ఎంట్రీ!

Published Sat, Aug 31 2024 10:50 AM | Last Updated on Sat, Aug 31 2024 12:55 PM

Rahul Dravid Son Gets India Call Up For U19 Series Against Australia

టీమిండియా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కుమారుడు సమిత్‌ ద్రవిడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌వైపు తొలి అడుగువేశాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌ ఆడనున్న అండర్‌-19 భారత జట్టుకు ఎంపికయ్యాడు. కంగారూ జట్టుతో స్వదేశంలో జరుగనున్న వన్డే, ఫోర్‌-డే సిరీస్‌కు సమిత్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు.

కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, రెండు మ్యాచ్‌ల రెడ్‌బాల్‌ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టు భారత్‌కు రానుంది. పుదుచ్చేరి వేదికగా సెప్టెంబరు 21, 23, 26 తేదీల్లో వన్డేలు.. సెప్టెంబరు 30- అక్టోబరు 7 వరకు చెన్నై వేదికగా ఫోర్‌-డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌లలో భారత అండర్‌ 19 వన్డే జట్టుకు మహ్మద్‌ అమాన్‌, ఫోర్‌-డే జట్టుకు సోహం పట్వర్ధన్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌
కర్ణాటకకు చెందిన సమిత్‌ ద్రవిడ్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. ప్రస్తుతం అతడు కేఎస్‌సీఏ మహరాజా టీ20 ట్రోఫీ టోర్నీలో మైసూర్‌ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, ఈ టోర్నమెంట్లో సమిత్‌ ఇప్పటి వరకు తన మార్కు చూపించలేకపోయాడు. ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 82 పరుగులే చేయడంతో పాటు.. ఇంతవరకు ఒక్కసారి కూడా బౌలింగ్‌ చేసే అవకాశం దక్కించుకోలేకపోయాడు.

ఆ టోర్నీలో అదరగొట్టిన సమిత్‌ 
అయితే, అంతకుముందు కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో మాత్రం కర్ణాటక టైటిల్‌ గెలవడంలో సమిత్‌ ద్రవిడ్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ రెడ్‌బాల్‌ టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన 18 ఏళ్ల సమిత్‌.. 362 పరుగులు సాధించాడు. జమ్మూ కశ్మీర్‌పై చేసిన 98 పరుగులు అతడి అత్యధిక స్కోరు. ఇక ఈ టోర్నీలో సమిత్‌ 16 వికెట్లు కూడా పడగొట్టడం విశేషం. ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో పాటు.. ముంబైతో జరిగిన ఫైనల్లో రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకుని సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు సమిత్‌ ద్రవిడ్‌. కాగా అండర్‌-19 స్థాయిలో సత్తా చాటితే టీమిండియాలో ఎంట్రీకి మార్గం సుగమమవుతుందన్న విషయం తెలిసిందే. 

ఆస్ట్రేలియాతో అండర్‌ 19 జట్టుతో వన్డే సిరీస్‌కు భారత అండర్-19 జట్టు:
రుద్ర పటేల్ (వైస్‌ కెప్టెన్‌- గుజరాత్‌), సాహిల్ పరాఖ్ (మహారాష్ట్ర), కార్తికేయ కేపీ (కర్ణాటక), మహ్మద్ అమాన్ (కెప్టెన్‌) (ఉత్తరప్రదేశ్‌), కిరణ్ చోర్మాలే (మహారాష్ట్ర), అభిజ్ఞాన్ కుందు (ముంబై), హర్వంశ్ సింగ్ పంగలియా (వికెట్‌ కీపర్‌, సౌరాష్ట్ర), సమిత్ ద్రవిడ్ ( కర్ణాటక), యుధాజిత్ గుహ (బెంగాల్‌ ), సమర్థ్ ఎన్ (కర్ణాటక), నిఖిల్ కుమార్ (చండీగఢ్‌), చేతన్ శర్మ (రాజస్తాన్‌), హార్దిక్ రాజ్ (కర్ణాటక), రోహిత్‌ రజావత్‌(మధ్యప్రదేశ్‌), మహ్మద్‌ ఖాన్‌(కేరళ).

ఆస్ట్రేలియాతో అండర్‌ 19 జట్టుతో వన్డే సిరీస్‌కు భారత అండర్-19 జట్టు:
వైభవ్ సూర్యవంశీ (బీహార్), నిత్యా పాండ్యా (బీహార్‌), విహాన్ మల్హోత్రా (వైస్‌ కెప్టెన్‌- సంజాబ్‌), సోహమ్ పట్వర్ధన్ (కెప్టెన్‌) (మధ్యప్రదేశ్‌), కార్తికేయ కేపీ (కర్ణాటక), సమిత్ ద్రవిడ్ (కర్ణాటక), అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్- ముంబై), హర్వంశ్ సింగ్ పంగలియా (వికెట్ కీపర్- సౌరాష్ట్ర), చేతన్‌ శర్మ(రాజస్తాన్‌), సమర్థ్‌ ఎన్‌(కర్ణాటక), ఆదిత్య రావత్‌(ఉత్తరాఖండ్‌), అన్మోల్జీత్‌ సింగ్‌(పంజాబ్‌), ఆదిత్య సింగ్‌(ఉత్తరప్రదేశ్‌), మహ్మద్‌ ఎనాన్‌(కేరళ).

చదవండి: సూర్యకుమార్‌ ఆశలపై నీళ్లు.. ఊహించని షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement