u-19 cricket team
-
భారత జట్టులో జూనియర్ ద్రవిడ్ ఎంట్రీ!
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్‌వైపు తొలి అడుగువేశాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడనున్న అండర్-19 భారత జట్టుకు ఎంపికయ్యాడు. కంగారూ జట్టుతో స్వదేశంలో జరుగనున్న వన్డే, ఫోర్-డే సిరీస్‌కు సమిత్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు.కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల రెడ్‌బాల్ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా అండర్-19 జట్టు భారత్‌కు రానుంది. పుదుచ్చేరి వేదికగా సెప్టెంబరు 21, 23, 26 తేదీల్లో వన్డేలు.. సెప్టెంబరు 30- అక్టోబరు 7 వరకు చెన్నై వేదికగా ఫోర్-డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌లలో భారత అండర్ 19 వన్డే జట్టుకు మహ్మద్ అమాన్, ఫోర్-డే జట్టుకు సోహం పట్వర్ధన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.పేస్ బౌలింగ్ ఆల్రౌండర్కర్ణాటకకు చెందిన సమిత్ ద్రవిడ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ప్రస్తుతం అతడు కేఎస్‌సీఏ మహరాజా టీ20 ట్రోఫీ టోర్నీలో మైసూర్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, ఈ టోర్నమెంట్లో సమిత్ ఇప్పటి వరకు తన మార్కు చూపించలేకపోయాడు. ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 82 పరుగులే చేయడంతో పాటు.. ఇంతవరకు ఒక్కసారి కూడా బౌలింగ్ చేసే అవకాశం దక్కించుకోలేకపోయాడు.ఆ టోర్నీలో అదరగొట్టిన సమిత్ అయితే, అంతకుముందు కూచ్ బెహర్ ట్రోఫీలో మాత్రం కర్ణాటక టైటిల్ గెలవడంలో సమిత్ ద్రవిడ్ కీలక పాత్ర పోషించాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన 18 ఏళ్ల సమిత్.. 362 పరుగులు సాధించాడు. జమ్మూ కశ్మీర్‌పై చేసిన 98 పరుగులు అతడి అత్యధిక స్కోరు. ఇక ఈ టోర్నీలో సమిత్ 16 వికెట్లు కూడా పడగొట్టడం విశేషం. ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో పాటు.. ముంబైతో జరిగిన ఫైనల్లో రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకుని సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు సమిత్ ద్రవిడ్. కాగా అండర్-19 స్థాయిలో సత్తా చాటితే టీమిండియాలో ఎంట్రీకి మార్గం సుగమమవుతుందన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో అండర్ 19 జట్టుతో వన్డే సిరీస్‌కు భారత అండర్-19 జట్టు:రుద్ర పటేల్ (వైస్ కెప్టెన్- గుజరాత్), సాహిల్ పరాఖ్ (మహారాష్ట్ర), కార్తికేయ కేపీ (కర్ణాటక), మహ్మద్ అమాన్ (కెప్టెన్) (ఉత్తరప్రదేశ్), కిరణ్ చోర్మాలే (మహారాష్ట్ర), అభిజ్ఞాన్ కుందు (ముంబై), హర్వంశ్ సింగ్ పంగలియా (వికెట్ కీపర్, సౌరాష్ట్ర), సమిత్ ద్రవిడ్ ( కర్ణాటక), యుధాజిత్ గుహ (బెంగాల్ ), సమర్థ్ ఎన్ (కర్ణాటక), నిఖిల్ కుమార్ (చండీగఢ్), చేతన్ శర్మ (రాజస్తాన్), హార్దిక్ రాజ్ (కర్ణాటక), రోహిత్ రజావత్(మధ్యప్రదేశ్), మహ్మద్ ఖాన్(కేరళ).ఆస్ట్రేలియాతో అండర్ 19 జట్టుతో వన్డే సిరీస్‌కు భారత అండర్-19 జట్టు:వైభవ్ సూర్యవంశీ (బీహార్), నిత్యా పాండ్యా (బీహార్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్- సంజాబ్), సోహమ్ పట్వర్ధన్ (కెప్టెన్) (మధ్యప్రదేశ్), కార్తికేయ కేపీ (కర్ణాటక), సమిత్ ద్రవిడ్ (కర్ణాటక), అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్- ముంబై), హర్వంశ్ సింగ్ పంగలియా (వికెట్ కీపర్- సౌరాష్ట్ర), చేతన్ శర్మ(రాజస్తాన్), సమర్థ్ ఎన్(కర్ణాటక), ఆదిత్య రావత్(ఉత్తరాఖండ్), అన్మోల్జీత్ సింగ్(పంజాబ్), ఆదిత్య సింగ్(ఉత్తరప్రదేశ్), మహ్మద్ ఎనాన్(కేరళ).చదవండి: సూర్యకుమార్ ఆశలపై నీళ్లు.. ఊహించని షాక్! -
ఇల్లు కొనుక్కుంటా..!!
-
అర్జున్ ఎంపికపై సచిన్ ఏమన్నాడంటే ?
ముంబై : క్రికెట్లో రారాజుగా వెలిగిపోయిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇప్పుడు పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. తనయుడు అర్జున్ టెండూల్కర్ భారత అండర్-19 జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. కుమారుడి ఎంపిక పట్ల సచిన్ ఆనందం వ్యక్తం చేశాడు. మీడియాతో మాట్లాడుతూ.. ‘అర్జున్ అండర్-19 జట్టుకు ఎంపికవ్వడం మాకు సంతోషాన్నిచ్చింది. అతని క్రికెట్ జీవితంలో ఇదొక గొప్ప మైలురాయి. నేను, అంజలి ఎప్పుడు అర్జున్ను ప్రోత్సహిస్తాం. అతను బాగా రాణించాలని కోరుకుంటాం’ అని సచిన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సైతం అర్జున్ ఎంపిక పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ అతన్ని అభినందించారు. టోర్నీల్లో అద్భుతంగా రాణించాలని ఆకాక్షించారు. ఇక అర్జున్ కూడా సచిన్ పేరు నిలబెడుతాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. Feeling happy for the selection of Arjun Tendulkar in India U-19 squad. My Best Wishes are with him @BCCI @sachin_rt — Rajeev Shukla (@ShuklaRajiv) June 7, 2018 వివిధ వయోవిభాగాల్లో నిలకడగా రాణించిన అర్జున్ తొలిసారి టీమిండియా ‘బ్లూ’ జెర్సీలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంకలో పర్యటించే భారత అండర్–19 జట్టులోకి అతను ఎంపికయ్యాడు. వచ్చే నెల 11 నుంచి ఆగస్టు 11 వరకు ఈ జూనియర్ జట్టు లంకలో 2 నాలుగు రోజుల మ్యాచ్‌ల్ని, ఐదు వన్డే మ్యాచ్‌ల్ని ఆడనుంది. అయితే నాలుగు రోజుల టోర్నీకే ఎంపికైన అర్జున్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. ఈ లిటిల్ టెండూల్కర్ లెఫ్టార్మ్ పేస్ బౌలర్ జాతీయ అండర్–19 టోర్నీ కూచ్‌బెహర్ ట్రోఫీలో ముంబై తరఫున 18 వికెట్లతో రాణించిన అతని ప్రదర్శన భారత జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది. -
వచ్చాడు మరో టెండూల్కర్
ముంబై: సరిగ్గా 29 ఏళ్ల క్రితం... 16 ఏళ్ల ముంబై కుర్రాడు పాకిస్తాన్లో జేగంట మోగించాడు. పిన్న వయస్సులో అరంగేట్రం చేసిన ఈ ఆటగాడు తర్వాత భారత క్రికెట్ చరిత్రనే మార్చేశాడు. అతనెవరో ఈపాటికే అర్థమైవుంటుంది... సచిన్ టెండూల్కర్ అని! 24 ఏళ్లపాటు భారత క్రికెట్‌ను నడిపించి, ఒక తరాన్ని అతను ఊపేశాడు. మళ్లీ ఇప్పుడు అతని గారాల తనయుడు అర్జున్ టెండూల్కర్ వంతు వచ్చినట్లుంది. వివిధ వయోవిభాగాల్లో నిలకడగా రాణిస్తూ వచ్చిన అర్జున్ తొలిసారి టీమిండియా ‘బ్లూ’ జెర్సీలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంకలో పర్యటించే భారత అండర్–19 జట్టులోకి అతను ఎంపికయ్యాడు. వచ్చే నెల 11 నుంచి ఆగస్టు 11 వరకు ఈ జూనియర్ జట్టు లంకలో 2 నాలుగు రోజుల మ్యాచ్‌ల్ని, ఐదు వన్డే మ్యాచ్‌ల్ని ఆడనుంది. అయితే నాలుగు రోజుల టోర్నీకే ఎంపికైన అర్జున్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. ఈ లిటిల్ టెండూల్కర్ లెఫ్టార్మ్ పేస్ బౌలర్. జాతీయ అండర్–19 టోర్నీ కూచ్‌బెహర్ ట్రోఫీలో ముంబై తరఫున 18 వికెట్లతో రాణించిన అతని ప్రదర్శన భారత జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది. ఇందులో అతను ఐదేసి వికెట్లను ఒకసారి, నాలుగేసి వికెట్లను రెండుసార్లు పడగొట్టాడు. 2017–18 సీజన్లో అర్జున్కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు చాలా మంది ఉన్నా... వారంతా స్పిన్నర్లే కావడం, అర్జున్ అసలైన పేస్ బౌలర్ కావడమే అతనికి ఎంపికకు కారణమని జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడొకరు వెల్లడించారు. తండ్రి మార్గనిర్దేశనంలో అర్జున్ గత కొంత కాలంగా ఎంతో మెరుగయ్యాడు. లార్డ్స్ మైదానంలో అతను తరచుగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. గత ఏడాది ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు అతని బౌలింగ్ వేగానికి ప్రాక్టీస్ సెషన్లో బెయిర్‌స్టో గాయపడ్డాడు. అంతకు ముందు చాంపియన్స్ ట్రోఫీ నెట్స్‌కు హాజరైన అర్జున్... ఇటీవలే సిడ్నీలోని బ్రాడ్‌మన్ మైదానంలో టి20 లీగ్స్‌లో పాల్గొని బ్యాటింగ్‌లోనూ చెలరేగాడు. భారత్–న్యూజిలాండ్ సిరీస్ సమయంలోనూ భారత జట్టు సెషన్స్‌లో పాల్గొన్నాడు. ఏదేమైనా ఎన్నో అంచనాల మధ్య, సచిన్ అభిమానుల ఆశీస్సులతో అర్జున్ బంతితో రె‘ఢీ’ అంటున్నాడు. -
భోజనం కోసం క్రికెటర్ల తిప్పలు
రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో రాటు దేలుతున్న అండర్-19 ఆటగాళ్లు ఆకలితో అలమటించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. క్రికెటర్లకు చెల్లించాల్సిన డైలీ అలవెన్సు అందకపోవడంతో వారందరూ హోటల్ బయటకు వెళ్లి నాణ్యత లేని ఆహారం తీసుకున్నారు. బీసీసీఐ నుంచి సెక్రటరీ అజయ్ షిర్కే, అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ లు తప్పుకున్న తర్వాత క్రికెటర్లకు అందిచాల్సిన నిధుల పేపర్లపై సంతకాలు చేసేవారు కరువయ్యారు. సుప్రీంకోర్టు నియమించిన నలుగురు సభ్యుల ప్యానెల్ కు దగ్గరివాడైన ఓ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. విత్ డ్రా లిమిట్ అమలులో ఉండటం కూడా క్రికెటర్లకు నిధులు విడుదల చేయకపోవడానికి ఒక కారణమని చెప్పారు. అండర్-19 టీంలో ఎక్కువ మంది క్రికెటర్లు 18సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగివుండటంతో క్రెడిట్/డెబిట్ కార్డులను బీసీసీఐ ఇవ్వలేకపోయిందని తెలిపారు.