మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో ఇవాళ (ఆగస్ట్ 18) జరిగిన మ్యాచ్‌లో మైసూర్ వారియర్స్, గుల్బర్గా మిస్టిక్స్ జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. సెంచరీ హీరో స్మరన్ (60 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చివరి బంతికి బౌండరీ బాది మిస్టిక్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.
వారియర్స్ తరఫున కెప్టెన్ కరుణ్ నాయర్ మెరుపు అర్ద సెంచరీతో (35 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా.. టీమిండియా తాజా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ ఓ మోస్తరు స్కోర్‌తో (24 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్) రాణించాడు.
ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జగదీశ్ సుచిత్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో (12 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. మిస్టిక్ బౌలర్లలో మోనిశ్ రెడ్డి, పృథ్వీ రాజ్ షెకావత్, యశోవర్దన్ తలో రెండు వికెట్లు.. విజయ్‌కుమార్, శరణ్ గౌడ్ చెరో వికెట్ పడగొట్టారు.
197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మిస్టిక్స్.. 7 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్మరన్.. అనీశ్ (24), ఫైజాన్ ఖాన్ (18), ప్రవీణ్ దూబే (37) సహకారంతో మిస్టిక్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.
Comments
Please login to add a commentAdd a comment