ముంబయి : భారత్ క్రికెట్‌కు వన్నె తెచ్చిన దిగ్గజాల్లో మిస్టర్ వాల్ (రాహుల్ ద్రావిడ్)ది ప్రత్యేక స్థానం. ఒదిగి ఉండే మనస్తత్వానికి, ఎలాంటి సమయంలోనూ చెక్కుచెదరని వ్యక్తిత్వానికి ఆయనే నిదర్శనం. ద్రావిడ్‌గా కంటే మిస్టర్‌వాల్‌గా, మిస్టర్ డిపెండబుల్‌గానే ఆయనను ఎక్కువగా పిలుచుకుంటారు. నేడు ఆయన జన్మదినం. ఈ నేపథ్యంలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 'నిబద్ధత, నిలకడ, క్లాస్'వంటి గొప్పలక్షణాలు గల వ్యక్తి రాహుల్ ద్రావిడ్ అని, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది.
పలువురు క్రికెటర్లు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కుమారుడి కానుక ఇండియా అండర్ 19 టీమ్ కోచ్ గా ఉన్న రాహుల్ ఐసీసీ వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్‌లో ఉన్నారు. వార్మప్ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా టీంపై 189పరుగుల తేడాతో ఇండియా అండర్ 19టీం విజయం సాధించింది. కొత్త ఏడాదిలో ద్రావిడ్‌కు ఇది తొలి విజయం కాగా, సరిగ్గా ఆయన పుట్టిన రోజుకు రెండు రోజులు ముందు కుమారుడు సమిత్ ద్రావిడ్ 150 పరుగులు చేశాడు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ (కేఎస్‌సీఏ) నిర్వహిస్తున్న బీటీఆర్ కప్‌లో మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ టీంలో ఆడుతున్న సమిత్ 150 పరుగులు చేసి తండ్రికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో సమిత్ టీం మొత్తం 50 ఓవర్లలో 500/5 పరుగులు చేసింది.
Commitment, Consistency, Class. Here's wishing a very Happy Birthday to Former #TeamIndia Skipper Rahul Dravid #HappyBirthdayDravid pic.twitter.com/FTgk1SjdT9
— BCCI (@BCCI) 11 January 2018
Comments
Please login to add a commentAdd a comment