birth day gift
-
బర్త్‌డేకు ఇదే నా చిన్న గిఫ్ట్ అంటూ.. సెల్ఫీతో యువకుడి విషాదం!
కరీంనగర్: సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో మండలంలోని మల్లాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కోమటి శివసాయి(23) కరీంనగర్లో సెల్‌ఫోన్ రిపేర్ పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శివసాయి ఈనెల ఒకటిన ఎల్ఎండీ కట్టపై పురుగుల మందు తాగాడు. తర్వాత బావ అడిచర్ల నరేశ్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. వెంటనే నరేశ్ 108కు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందాడు. ఆత్మహత్యపై అనుమానాలు.. ఇదిలా ఉండగా శివసాయి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. ప్రేమ విఫలంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బర్త్‌డేకు చిన్న గిఫ్ట్ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో లవ్ ఫెయిల్యూర్ అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. పోలీసుల విచారణ.. ఇదిలా వుండగా కడుపునొప్పి భరించలేక తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు శివసాయి తండ్రి కోమటి కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: గ్యాంగ్‌స్టర్ గడోలీ ప్రియురాలు దివ్యా పహుజా హత్య -
మోదీకి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవి కావాలట!
న్యూఢిల్లీ: ప్రజలంతా మాస్కు ధరించడం.. భౌతిక దూరం పాటించడం.. ఆరోగ్యవంతమైన భూగోళం కోసం అందరూ కృషి చేయడం..ఇవే ప్రధాని మోదీ తన పుట్టిన రోజు కానుకలుగా కోరుకున్నవి. ప్రధాని మోదీ గురువారం 70వ జన్మదిన వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆయనకు దేశ, విదేశాల నుంచి ఎందరో శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్లో ప్రధాని వాటికి బదులిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్లో..‘పుట్టిన రోజు కానుకగా ఏం కావాలని ఎందరో నన్ను అడిగారు. ఇదే నా సమాధానం. మాస్కును సరైన రీతిలో ధరించడం కొనసాగించండి. రెండు గజాల భౌతిక దూరం పాటించండి. గుంపులుగా సంచరించకండి. రోగ నిరోధకత పెంచుకోండి. మన భూగ్రహాన్ని ఆరోగ్యవంతంగా చేద్దాం.. వీటినే పుట్టిన రోజు కానుకలుగా ఇవ్వండి’ అని ప్రజలను ఆయన కోరారు. ప్రధానికి ట్రంప్ బర్త్‌డే విషెస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత ప్రధాని నరేంద్ర మోదీకి 70వ జన్మదిన శుభాకాంక్షలు. గొప్పనేత, విశ్వాసపాత్రుడైన మోదీ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలి’అని ట్విట్టర్లో ట్రంప్ ఆకాంక్షించారు. -
వీనుల విందు!
మహేశ్‌బాబు పుట్టినరోజున (ఈ నెల 9) ఆయన అభిమానుల కోసం ఓ మ్యూజికల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారట ‘సర్కారువారి పాట’ చిత్రబృందం. సూపర్ స్టార్ కష్ణ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను (సర్కారువారి పాట), మహేశ్ ప్రీ–లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని ఓ వీనుల విందైన ట్యూన్‌ని ఆగస్ట్ 9న వినిపించబోతున్నారట. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు, కీర్తీ సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లల్స్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఓ హీరోయిన్గా బాలీవుడ్ భామ అనన్యా పాండే నటిస్తారని సమాచారం. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. -
సర్ప్రైజ్ సూపర్!.. ఆ అట్టపెట్టెలో ఏముందంటే..
తన పుట్టిన రోజు నాడు స్నేహితుడు ఇచ్చిన గిఫ్ట్ చూసి సర్ప్రైజ్ అవ్వటమే కాదు.. సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడతను. అతడి ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఎదుటి వ్యక్తి ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ అలాంటిది మరి. అంతలా సంతోష పెట్టే గిఫ్ట్ ఏమిచ్చాడా అని ఆలోచిస్తున్నారా. ఏం లేదు.. సంవత్సరం పాటు దూరంగా ఉన్న స్నేహితుడ్ని కానుక రూపంలో కలుసుకోవటమే. వీడియోలో.. ఓ వ్యక్తి అట్టపెట్టె పక్కన నిల్చుని ఉన్నాడు. అంత పెద్ద అట్టపెట్టలో తనకు వచ్చిన గిఫ్ట్ ఏంటా అని ఆలోచిస్తూనే దాన్ని తెరిచాడు. కానుక రూపంలో ఉన్న స్నేహితుడ్ని చూసే సరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ( మర్కజ్‌తో లింకైన కరోనా కేసులు ఎన్నో తెలుసా ) క్షణాల్లో తేరుకుని, సంవత్సరం పాటు స్నేహితుడికి దూరంగా ఉండి, పుట్టినరోజు నాడు అతడ్ని చూసిన సంతోషంలో బర్త్‌డే బాయ్ ఉక్కిరిబిక్కిరై.. ఎదుటి వ్యక్తిని బాహువులలో బంధించి ఉక్కిరి బిక్కిరి చేశాడు. 2019 నవంబర్‌లో విడుదలైన 20 సెకన్ల ఈ టిక్‌టాక్ వీడియోకు 48 మిలియన్ల వ్యూస్, 8.5మిలియన్ల లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియోను రెడ్డిట్‌లో మళ్లీ విడుదల చేయగా మరోసారి వైరల్‌గా మారింది. ( హ్యాట్యాఫ్ పోలీస్ సాబ్.. చేతుల్లేని కోతికి.. ) -
అల్లు పూల్
అల్లువారి ఇంట్లో బుధవారం ఆనందం అల్లరి చేసింది. అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగానే అల్లువారి ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహా. ఈ దంపతులకు అర్హా అనే కుమార్తె కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సంగతలా ఉంచితే మనవడి పుట్టినరోజుని అల్లు అరవింద్ ఓ స్విమింగ్‌పూల్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘నాకు ఎంతో అమూల్యమైనవాడు. ఐదేళ్ల స్వీట్నెస్, చిలిపితనం, క్యూట్‌నెస్... అంతులేని ప్రేమ.. అయాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అయాన్‌కు పుట్టినరోజు బహుమతిగా మా నాన్నగారు స్విమ్మింగ్‌పూల్‌ను బహుమతిగా ఇచ్చారు. నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. 45 రోజుల క్రితం ‘నీకు ఏం గిఫ్ట్ కావాలి? అని అయాన్‌ను నాన్న అడిగినప్పుడు స్మిమ్మింగ్‌పూల్ అని చెప్పాడు. నాన్న ఒప్పుకున్నారు. స్విమ్మింగ్‌ను బహుమతిగా ఇచ్చారు. అలాంటి తాతయ్య ఉండటం అయాన్ అదృష్టం. మా నాలుగో తరం పిల్లలని చూసి నాకు అసూయగా ఉంది. అన్నట్లు.. ఈ స్విమ్మింగ్ పూల్‌కు అయాన్పూల్ అని పేరు పెట్టాం’’ అని అల్లు అర్జున్ అన్నారు. ‘‘అయాన్‌కు ఐదోవ జన్మదిన శుభాకాంక్షలు’’ అన్నారు స్నేహా. -
అల్లు పూల్
అల్లువారి ఇంట్లో బుధవారం ఆనందం అల్లరి చేసింది. అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్భంగానే అల్లువారి ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహా. ఈ దంపతులకు అర్హా అనే కుమార్తె కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సంగతలా ఉంచితే మనవడి పుట్టినరోజుని అల్లు అరవింద్ ఓ స్విమింగ్‌పూల్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘నాకు ఎంతో అమూల్యమైనవాడు. ఐదేళ్ల స్వీట్నెస్, చిలిపితనం, క్యూట్‌నెస్... అంతులేని ప్రేమ.. అయాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అయాన్‌కు పుట్టినరోజు బహుమతిగా మా నాన్నగారు స్విమ్మింగ్‌పూల్‌ను బహుమతిగా ఇచ్చారు. నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. 45 రోజుల క్రితం ‘నీకు ఏం గిఫ్ట్ కావాలి? అని అయాన్‌ను నాన్న అడిగినప్పుడు స్మిమ్మింగ్‌పూల్ అని చెప్పాడు. నాన్న ఒప్పుకున్నారు. స్విమ్మింగ్‌ను బహుమతిగా ఇచ్చారు. అలాంటి తాతయ్య ఉండటం అయాన్ అదృష్టం. మా నాలుగో తరం పిల్లలని చూసి నాకు అసూయగా ఉంది. అన్నట్లు.. ఈ స్విమ్మింగ్ పూల్‌కు అయాన్పూల్ అని పేరు పెట్టాం’’ అని అల్లు అర్జున్ అన్నారు. ‘‘అయాన్‌కు ఐదోవ జన్మదిన శుభాకాంక్షలు’’ అన్నారు స్నేహా. -
బాబాయ్‌కి చెర్రీ గిఫ్ట్ ఇదే..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ రామ్ చరణ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు. చెర్రీ సాహసోపేతమైన పారాగ్లైడింగ్ చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన ఉపాసన చరణ్ తరుపున ఓ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. ‘ప్రియమైన బాబాయ్.. సినిమాల్లో.. జీవితంలో రిస్క్ చేసే ధైర్యాన్ని మీరు నాకిచ్చారు. అందుకే ఇది మీ కోసం. తొలిసారి పారాగ్లైడింగ్ చేస్తున్నా - రామ్ చరణ్’ అంటూ ట్వీట్ చేశారు. చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. జగపతి బాబు, ఆర్యన్ రాజేష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Dearest babai , U’ve always inspired me to do daring things in life & films, this is for u ❤️- did it with some help the first time 😁 - have a great birthday & keep inspiring us. #HappyBirthdaypowerstar #HBDPSPK #RamCharan pic.twitter.com/KsqsHmavWd — Upasana Kamineni (@upasanakonidela) 2 September 2018 -
తనయుడు దర్జీ.. తండ్రి దర్జా
సినిమాలోని పాత్రల కోసం రకరకాల వృత్తుల్లో ట్రైనింగ్ తీసుకుంటారు యాక్టర్స్. ఆ సినిమా పూర్తయ్యాక అది ఉపయోగపడొచ్చు, పడకపోవచ్చు. కానీ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నేర్చుకున్న కళతో తండ్రి డేవిడ్ ధావన్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడు. ‘సూయి ధాగా’లో వరుణ్ దర్జీగా కనిపించనున్నారాయన. దాని కొసం టైలర్‌గా ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. అప్పుడు తీసుకున్న ట్రైనింగ్‌తోనే తండ్రి కోసం షర్ట్ కుట్టిపెట్టారట. ఆగస్ట్ 16న డేవిడ్ ధావన్ బర్త్‌డే. ఈ సందర్భంగా స్పెషల్‌గా తనే ఓ చొక్కా కుట్టి గిఫ్ట్ చేసి, తండ్రిని సర్ప్రైజ్ చేశాడట వరుణ్. ‘‘నేను ఫుల్‌టైమ్ టైలరింగ్ నేర్చుకోలేదు. సినిమా కోసం కొని టెక్నిక్స్ తెలుసుకున్నాను. మా డాడ్ ఇప్పటికీ నన్ను ఏమీ తెలియని యాక్టర్ అనుకుంటుంటారు. ఈ సినిమాతో కొంచెం ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ అని ఒప్పుకుంటారని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు వరుణ్. సో.. కుమారుడు దర్జీగా బర్త్‌డే ప్రజెంట్ ఇస్తే డేవిడ్ ధవన్ దర్జాగా చొక్కా వేసుకొనుంటారని ఊహించవచ్చు. -
గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డే గిఫ్ట్ కోసం..
సాక్షి, న్యూఢిల్లీ: గర్ల్‌ఫ్రెండ్‌ను సర్ప్రైజ్ చేద్దామనుకున్న ఓ బీటెక్ యువకుడు జైలు పాలయ్యాడు. ఖరీదైన వాచ్‌ను ఆమెకు బహుమతిగా ఇద్దామని మోసానికి పాల్పడ్డాడు. ఆన్లైన్లో వాచ్‌ను ఆర్డర్ చేసి.. డెలివరీ బాయ్‌ని మోసం చేశాడు. పోలీసులు ఫోన్ నెంబర్‌ను ట్రేస్ చేయడంతో దొరికిపోయాడు. వివరాలు..ఢిల్లీ మోడల్ టౌన్లో నివాసముండే వైభవ్ ఖురాన (22) తన గర్ల్‌ఫ్రెండ్‌కు పుట్టిన రోజు కానుక ఇవ్వాలనుకున్నాడు. 90 వేల ఖరీదు గల రాడో చేతిగడియారాన్ని ఆన్లైన్లో జూలై 23న తప్పుడు అడ్రస్ పెట్టి ఆర్డర్ చేశాడు. వాచ్ పార్సిల్‌తో డెలివరీ బాయ్ (సాహు) రాగానే కాశ్మీరే గేట్ మెట్రో స్టేషన్ వద్ద కలుసుకున్నారు. సాహుని ఓ ఇంటికి తీసుకెళ్లి.. ‘నువ్ కాలింగ్ బెల్ కొట్టు. మా వాళ్లు డబ్బులు తెచ్చిస్తారు. నేను వెనకే వస్తున్నాన’ని చెప్పాడు. అప్పటికే ఆర్డర్ చేసిన వాచ్ ప్యాకెట్‌ను తీసుకున్న వైభవ్ అక్కడి నుంచి తన బైక్‌పై పరారయ్యాడని పోలీసులు తెలిపారు. డెలివరీ బాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కాల్‌డేటా ఆధారంగా నిందితున్ని పట్టుకున్నారు. నిందితుని వద్ద నుంచి వాచ్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, రూ. 90 వేల విలువగల రాడో రిస్ట్‌వాచ్ ఆన్లైన్లో రూ. 67 వేలకే అందుబాటులో ఉండటం విశేషం. -
జల్దీ షాదీ కరో బేటా
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఈనెల 26న బర్త్‌డే జరుపుకున్నారు. అదే రోజు కొన్ని బెదిరింపులు ఎదుర్కొన్నారట ఆయన. అయితే అవి వృత్తిపరమైనవి కాదండోయ్.. వ్యక్తిగతమైనవి. ముప్పై మూడేళ్లు వచ్చాయ్.. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? అని అర్జున్ కపూర్ వాళ్ల నానమ్మ (నిర్మలా కపూర్) ప్రేమగా బెదిరించారట. ఈ విషయాన్ని అర్జున్ పంచుకుంటూ–‘‘రిక్వెస్ట్, బెదిరింపు, కమాండ్... ఏదైనా అనుకో.. కానీ పెళ్లి మాత్రం ఎప్పుడు చేసుకుంటావు? అని ఇంట్లో ఒకటే పోరు పెడుతున్నారు. బర్త్ డే రోజు పంపిన గిఫ్ట్ కార్డ్ మీద కూడా ‘జల్దీ షాదీ కరో బేటా’ (త్వరగా పెళ్లి చేసుకో బాబు) అని రాసి పంపారు నానమ్మ’’ అన్నారు. -
చిట్టిబాబుకు ‘చిరు’ గిఫ్ట్
మెగా అభిమానులకు పండుగల పర్వం మొదలైంది. రామ్ చరణ్ రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆ తర్వాత చెర్రీ బర్త్‌డే, రంగస్థలం రిలీజ్ ఇలా వెంటవెంటనే సంబరాలు చేసుకోబోతున్నారు. కాగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే మంగళవారం(మార్చి 27) రోజున మెగా అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే పుట్టినరోజుకు ముందు రోజే చిరంజీవి ...చెర్రీకి గిఫ్ట్ ఇచ్చారు. ఓ వాచ్‌ను కుమారుడికి కానుకగా అందచేశారు. ‘ముందుగా టైమ్ లెస్ గిఫ్ట్ ఇచ్చిన అమ్మానాన్నలకు ధన్యవాదాలు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి అనే హ్యాష్ ట్యాగ్‌ను తగిలించిన పోస్టును చెర్రీ తన ఫేస్ బుక్ ఖాతాలో రామ్ చరణ్ పోస్టు చేశాడు. మరోవైపు చెర్రీ సతీమణి ఉపాసన కూడా చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ కలిసి దిగిన ఫోటోను తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఇక తల్లిదండ్రులతో కలిసి రామ్ చరణ్ దిగిన ఆ ఫోటోను మెగా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. Mr.C gets Timeless love for his birthday 😘❤️🕰#happybirthdayMrC #ramcharan #megastarchiranjeevi pic.twitter.com/Og58EWcmol — Upasana Kamineni (@upasanakonidela) 25 March 2018 ఒక పక్క రంగస్థలం ప్రమోషన్స్‌లో భాగంగా అటు చెర్రీ, ఇటు సుకుమార్ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. సినిమా దగ్గర పడుతుండటంతో మెగా అభిమానుల్లో ఉత్కంఠ ఎక్కువవుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో రంగస్థలం ఫస్ట్ డే కలెక్షన్లు, రికార్డులు అంటూ అభిమానుల్లో చర్చలు మొదలయ్యాయి. ఇదంతా ఎలా ఉన్నా...చెర్రీ బర్త్‌డేను అభిమానులు మాత్రం గ్రాండ్‌గా సెలబ్రేట్ చెయ్యాలనుకుంటున్నారు. -
ద్రావిడ్‌కు గొప్ప బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన కొడుకు
ముంబయి : భారత్ క్రికెట్‌కు వన్నె తెచ్చిన దిగ్గజాల్లో మిస్టర్ వాల్ (రాహుల్ ద్రావిడ్)ది ప్రత్యేక స్థానం. ఒదిగి ఉండే మనస్తత్వానికి, ఎలాంటి సమయంలోనూ చెక్కుచెదరని వ్యక్తిత్వానికి ఆయనే నిదర్శనం. ద్రావిడ్గా కంటే మిస్టర్వాల్గా, మిస్టర్ డిపెండబుల్గానే ఆయనను ఎక్కువగా పిలుచుకుంటారు. నేడు ఆయన జన్మదినం. ఈ నేపథ్యంలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 'నిబద్ధత, నిలకడ, క్లాస్'వంటి గొప్పలక్షణాలు గల వ్యక్తి రాహుల్ ద్రావిడ్ అని, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. పలువురు క్రికెటర్లు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కుమారుడి కానుక ఇండియా అండర్ 19 టీమ్ కోచ్ గా ఉన్న రాహుల్ ఐసీసీ వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్‌లో ఉన్నారు. వార్మప్ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా టీంపై 189పరుగుల తేడాతో ఇండియా అండర్ 19టీం విజయం సాధించింది. కొత్త ఏడాదిలో ద్రావిడ్‌కు ఇది తొలి విజయం కాగా, సరిగ్గా ఆయన పుట్టిన రోజుకు రెండు రోజులు ముందు కుమారుడు సమిత్ ద్రావిడ్ 150 పరుగులు చేశాడు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ (కేఎస్‌సీఏ) నిర్వహిస్తున్న బీటీఆర్ కప్‌లో మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ టీంలో ఆడుతున్న సమిత్ 150 పరుగులు చేసి తండ్రికి జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో సమిత్ టీం మొత్తం 50 ఓవర్లలో 500/5 పరుగులు చేసింది. Commitment, Consistency, Class. Here's wishing a very Happy Birthday to Former #TeamIndia Skipper Rahul Dravid #HappyBirthdayDravid pic.twitter.com/FTgk1SjdT9 — BCCI (@BCCI) 11 January 2018 -
ఇది కేసీఆర్‌కు బర్త్ డే గిఫ్ట్!
హైదరాబాద్: నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయంతో కారు శ్రేణుల్లో ఆనందం పరవళ్లు తొక్కుతోంది. ఈ ఎన్నికలో 53వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఇది ప్రజల విజయమని పేర్కొన్నారు. ఈ ఘనవిజయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు జన్మదిన కానుకగా అందిస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ బుధవారం (ఫిబ్రవరి 17న) 63వ పడిలో అడుగుపెట్టనున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంలో నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘనవిజయంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింతగా తొణికిసలాడుతోంది. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్ వద్ద గుమిగూడి పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించుకున్నారు. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్లతో గెలుస్తామనుకున్నా కాంగ్రెస్ పార్టీకి నిరాశే మిగిలింది. సిట్టింగ్ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి సంజీవరెడ్డి రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఇక టీడీపీకైతే డిపాజిట్ కూడా దక్కలేదు.