ఇది కేసీఆర్‌కు బర్త్ డే గిఫ్ట్‌! | this is birth day gift for kcr | Sakshi
Sakshi News home page

ఇది కేసీఆర్‌కు బర్త్ డే గిఫ్ట్‌!

Published Tue, Feb 16 2016 12:18 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

ఇది కేసీఆర్‌కు బర్త్ డే గిఫ్ట్‌! - Sakshi

ఇది కేసీఆర్‌కు బర్త్ డే గిఫ్ట్‌!

హైదరాబాద్: నారాయణ్‌ ఖేడ్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయంతో కారు శ్రేణుల్లో ఆనందం పరవళ్లు తొక్కుతోంది. ఈ ఎన్నికలో 53వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందిన టీఆర్‌ఎస్ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఇది ప్రజల విజయమని పేర్కొన్నారు. ఈ ఘనవిజయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు జన్మదిన కానుకగా అందిస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ బుధవారం (ఫిబ్రవరి 17న) 63వ పడిలో అడుగుపెట్టనున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంలో నారాయణ్‌ఖేడ్‌ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ ఘనవిజయంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింతగా తొణికిసలాడుతోంది. టీఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌ వద్ద గుమిగూడి పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించుకున్నారు.

నారాయణ్‌ ఖేడ్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్లతో గెలుస్తామనుకున్నా కాంగ్రెస్ పార్టీకి నిరాశే మిగిలింది. సిట్టింగ్ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి సంజీవరెడ్డి రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఇక టీడీపీకైతే డిపాజిట్ కూడా దక్కలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement