
మెగా అభిమానులకు పండుగల పర్వం మొదలైంది. రామ్ చరణ్ రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆ తర్వాత చెర్రీ బర్త్‌డే, రంగస్థలం రిలీజ్ ఇలా వెంటవెంటనే సంబరాలు చేసుకోబోతున్నారు. కాగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే మంగళవారం(మార్చి 27) రోజున మెగా అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే పుట్టినరోజుకు ముందు రోజే చిరంజీవి ...చెర్రీకి గిఫ్ట్ ఇచ్చారు. ఓ వాచ్‌ను కుమారుడికి కానుకగా అందచేశారు. ‘ముందుగా టైమ్ లెస్ గిఫ్ట్ ఇచ్చిన అమ్మానాన్నలకు ధన్యవాదాలు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి అనే హ్యాష్ ట్యాగ్ను తగిలించిన పోస్టును చెర్రీ తన ఫేస్ బుక్ ఖాతాలో రామ్ చరణ్ పోస్టు చేశాడు. మరోవైపు చెర్రీ సతీమణి ఉపాసన కూడా చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ కలిసి దిగిన ఫోటోను తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఇక తల్లిదండ్రులతో కలిసి రామ్ చరణ్ దిగిన ఆ ఫోటోను మెగా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.
Mr.C gets Timeless love for his birthday 😘❤️🕰#happybirthdayMrC #ramcharan #megastarchiranjeevi pic.twitter.com/Og58EWcmol
— Upasana Kamineni (@upasanakonidela) 25 March 2018
ఒక పక్క రంగస్థలం ప్రమోషన్స్‌లో భాగంగా అటు చెర్రీ, ఇటు సుకుమార్ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. సినిమా దగ్గర పడుతుండటంతో మెగా అభిమానుల్లో ఉత్కంఠ ఎక్కువవుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో రంగస్థలం ఫస్ట్ డే కలెక్షన్లు, రికార్డులు అంటూ అభిమానుల్లో చర్చలు మొదలయ్యాయి. ఇదంతా ఎలా ఉన్నా...చెర్రీ బర్త్‌డేను అభిమానులు మాత్రం గ్రాండ్‌గా సెలబ్రేట్ చెయ్యాలనుకుంటున్నారు.