జల్దీ షాదీ కరో బేటా | Arjun Kapoor gets a 'threat and request' from his grandmother | Sakshi
Sakshi News home page

జల్దీ షాదీ కరో బేటా

Published Sat, Jun 30 2018 12:20 AM | Last Updated on Sat, Jun 30 2018 12:20 AM

Arjun Kapoor gets a 'threat and request' from his grandmother - Sakshi

అర్జున్‌ కపూర్‌

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌ ఈనెల 26న బర్త్‌డే జరుపుకున్నారు. అదే రోజు కొన్ని బెదిరింపులు ఎదుర్కొన్నారట ఆయన. అయితే అవి వృత్తిపరమైనవి కాదండోయ్‌.. వ్యక్తిగతమైనవి. ముప్పై మూడేళ్లు వచ్చాయ్‌.. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? అని అర్జున్‌ కపూర్‌ వాళ్ల నానమ్మ (నిర్మలా కపూర్‌) ప్రేమగా బెదిరించారట. ఈ విషయాన్ని అర్జున్‌  పంచుకుంటూ–‘‘రిక్వెస్ట్, బెదిరింపు, కమాండ్‌... ఏదైనా అనుకో.. కానీ పెళ్లి మాత్రం ఎప్పుడు చేసుకుంటావు? అని ఇంట్లో ఒకటే పోరు పెడుతున్నారు. బర్త్‌ డే రోజు పంపిన గిఫ్ట్‌ కార్డ్‌ మీద కూడా ‘జల్దీ షాదీ కరో బేటా’ (త్వరగా పెళ్లి చేసుకో బాబు) అని రాసి పంపారు నానమ్మ’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement