grandmother
-
బామ్మకు స్వీట్ సర్ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్
జైనబ్ రోష్నా దుబాయిలో ఉంటుందన్న మాటేగానీ కేరళలోని బామ్మ జ్ఞాపకాలు ఎప్పుడూ తనతోనే ఉంటాయి. ఆ జ్ఞాపకాలు హాయిగా ఉంటాయి, నవ్విస్తాయి. కొన్నిసార్లు భావోద్వేగానికి గురి చేస్తాయి. తనకు తీరిక దొరికినప్పుడల్లా బామ్మతో ఫోన్లో మాట్లాడుతుంది జైనబ్.‘ఇలా ఫోన్లో మాట్లాడుకోవడమేనా! నన్ను చూడడానికి ఎప్పుడు వస్తావు?’ అని అడుగుతుంది బామ్మ.‘నువ్వు దూరంగా ఉంటే కదా రావడానికి. నువ్వు ఎప్పుడూ నా కళ్ల ముందే ఉంటావు’ అని నవ్వుతుంది జైనబ్.‘నీ మాటలకేంగానీ... నువ్వు నన్ను చూడడానికి రావాల్సిందే’ అన్నది బామ్మ. అటు నుంచి నవ్వు మాత్రమే వినిపించింది! కట్ చేస్తే...ఆ రోజు బామ్మగారి బర్త్‌డే. తన ఊళ్లో ఆ రోజు కూడా బామ్మ అన్ని రోజులలాగే ఎప్పటిలాగే ఉంది. ‘నా బర్త్‌డేను జైనబ్ ఎంత ఘనంగా చేసేదో’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి వినిపించింది.ఎవరా అని చూస్తే... ఊహించని వ్యక్తి. నిజమా? భ్రమా!’ అనుకుంటుండగానే సంతోషంగా అరిచింది జైనబ్. స్వీట్ షాక్ నుంచి తేరుకున్న తరువాత... View this post on Instagram A post shared by ZAINAB ROSHNA | ZR✌🏻 (@zainabroshna) ‘నన్ను చూడడానికి వచ్చావా తల్లీ... ఒక్క మాటైనా చెప్పలేదు...’ అంటూ సంతోషంతో కళ్ల నీళ్ల పెట్టుకుంది బామ్మ. ‘ముందే చెబితే ఏం మజా ఉంటుంది! ఇలా వస్తేనే సర్ప్రైజింగ్గా ఉంటుంది’ అన్నది జైనబ్. ఆ రోజు వంద పండగలు ఒకేసారి వచ్చినంత సంతోషంగా ఫీల్ అయింది బామ్మ. ప్రేమగా, గారాబంగా మనవరాలిని ముద్దు పెట్టుకుంది. ‘గత ఏడాది మా అమ్మమ్మ పుట్టిన రోజున నా ఎమిరేట్స్ యూనిఫాం ధరించి వీడియో కాల్ చేశాను. నన్ను యూనిఫాంలో చూసి అమ్మమ్మ ఆశ్చర్యపడింది. కొత్త అమ్మాయిని చూసినట్లుగా ఉంది అని నవ్వింది. ఈ పుట్టిన రోజుకు మరింత సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. అందుకే చెప్పకుండా వచ్చాను’ అని ఇన్‌స్టా పోస్ట్‌లో రాసింది జైనబ్.ఒక్క మాటలో చెప్పాలంటే... ఇది మామూలు సంఘటన. అయితే సోషల్ మీడియా లో బామ్మ, మనవరాళ్ల వీడియో ఎంతో సందడి చేస్తోంది. దుబాయి నుంచి వచ్చిన జైనబ్ బామ్మ గదిలోకి సంతోషంగా పరుగెత్తుతున్న దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి.జైనబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ 2.3 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియో క్లిప్ నేపథ్యంలో అమ్మమ్మ, నానమ్మలతో తమకు ఉన్న విలువైన జ్ఞాపకాలు పంచుకున్నారు నెటిజనులు.‘అమ్మ దగ్గర కంటే అమ్మమ్మ దగ్గరే నాకు చనువు ఎక్కువ. ఈ వీడియో క్లిప్ చూసినప్పుడు మా అమ్మమ్మ గుర్తుకు వచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. పెద్దవాళ్లు మన నుంచి ఏమీ కోరుకోరు. మనం వారికి ఒకసారి కనిపించినా పెద్ద బహుమతిగా ఫీలవుతారు’ అని స్నేహ అనే నెటిజన్ తన కామెంట్ పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ బామ్మ, మనవరాళ్ల వీడియో ఎంతో సందడి చేస్తోంది. దుబాయి నుంచి వచ్చిన జైనబ్ బామ్మ గదిలోకి సంతోషంగా పరుగెత్తుతున్న దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. జైనబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ 2.3 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. చదవండి: Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలిఅత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
మిలియనీర్లకు మించి అదిరిపోయే విందు : సోషల్‌మీడియాలో సందడే సందడి!
ప్రతిరోజూ ఇంటర్నెట్లో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వింతగా, మరికొన్నిఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా పాకిస్తాన్‌లోని ఒక బిచ్చగాడి కుటుంబం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ భారీ విందు ఇవ్వడం సోషల్ మీడియాలో విశేషంగా మారింది. స్టోరీ ఏంటంటే..దేవాలయాల వద్ద, వివిధ కూడళ్ల వద్ద బిచ్చమెత్తుకునే బిచ్చగాళ్లకు సంబంధించిన కథనాలు గతంలో చాలానే విన్నాం. చేసే వృత్తి భిక్షాటన అయినా, ఖరీదైన ఆస్తులు, ఇల్లు కలిగి ఉండటం తెలుసు. కానీ స్వయంగా బిచ్చమెత్తుకుని జీవనం సాగించే ఒక కుటుంబం దాదాపు 20 వేలమందికి పసందైన విందు ఇవ్వడం లేటెస్ట్ సెన్సేషన్‌గా మారింది. అది కూడా ఇంట్లోని పెద్దావిడ చనిపోయి, 40వ రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం విశేషంBeggars in Gujranwala reportedly spent Rs. 1 crore and 25 lacs on the post funeral ceremony of their grand mother 🤯🤯Thousands of people attended the ceremony. They also made arrangement of all kinds of meal including beef, chicken, matranjan, fruits, sweet dishes 😳😳 pic.twitter.com/Jl59Yzra56— Ali (@PhupoO_kA_betA) November 17, 202420వేల మంది అతిథులు, 2 వేల వాహనాలు గుజ్రాన్వాలాలోని రహ్వాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. అతిథులను వేదిక వద్దకు తరలించడానికి సుమారు 2,000 వాహనాలను కూడా ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది హాజరయ్యారు. మధ్యాహ్న భోజనం కోసం, సిరి పాయె, మురబ్బా వంటి సాంప్రదాయ వంటకాలతోపాటు పలు మాంసాహార వంటకాలను వడ్డించారు. ఇందుకోసం 250 మేకలను వినియోగించినట్టు సమచారం. వీటితోపాటు మటర్ గంజ్ (స్వీట్ రైస్), అనేక తీపి వంటకాలతో అతిథుల నోరు తీపి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచారు. దీనిపై నెటిజన్లు, అటు సానుకూలంగా,ఇటూ ప్రతికూలంగానూ కామెంట్స్ చేశారు. -
ఫ్యాషన్‌కి వయసు అడ్డంకి కాదంటే ఇదే..! లెజండరీ గ్రానీ స్టిల్స్ అదుర్స్..
ఇటీవల విశ్వ సుందరి పోటీల్లో అందానికి అర్థం మారుతుందన్నట్లుగా విజేతలను నిర్ణయించారు నిర్వాహకులు. అందులో పాల్లొన్న అందాల బామ్మలు కూడా మచ్చలేని శరీరమే సౌందర్యం కాదని ఆత్మవిశ్వాసమే అసలైన అందమని చాటిచెప్పేలా పాల్గొని అందర్ని ఆశ్చర్యపరిచారు. అలానే ప్రస్తుతం ఫ్యాషన్ అంటే కాలేజ్ యువత మాత్రమే ట్రెండ్ సెంట్ చేస్తారనుకుంటే పొరపాటే. క్రియేటివిటీ, అభిరుచి ఉంటే వయసు పెద్ద అడ్డంకి కాదని ప్రూవ్ చేసింది ఎనిమిపదుల గ్రానీ. రెస్ట్ తీసుకునే వయసులో సరికొత్త ట్రెండ్ సృష్టించి ఔరా..! అని ప్రశంలందుకుంటోంది ఈ బామ్మ. ఇంతకీ ఎవరామె అంటే..జాంబియాలోని ఓ గ్రామానికి చెందిన 85 ఏళ్ల మార్గరెట్ చోలా అనే బామ్మకు ఫ్యాషన్ ఐకానిక్‌గా స్టార్డమ్ తెచ్చుకుంది. అందుకు సోషల్ మీడియానే కారణం. సరదాగా గ్రానీ సిరీస్ 'లెజండరీ గ్లామా'లో నటించింది. అందులో ఆమె వివిధ రకాల ఫ్యాషన్ గెటప్‌లతో ప్రేక్షకులను అలరించింది. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు ప్రపంచమంతటా మారు మ్రేగిపోయింది. పైగా ఇన్‌స్టాగ్రామ్‌లో విపరితీమైన ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. ఆమె మనవరాలు డయానా కౌంబానే దీనంతటికీ కారణం. ఈ బామ్మ తన హై ఫ్యాషన్ వార్డ్ రోబ్‌తో సోషల్ మీడియాలో దాదాపు లక్షకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. మొదట్లో ఇబ్బంది పడ్డ ఆ తర్వాత ఆ ఆధుని ఫ్యాషన్ డ్రెస్‌లకు అలవాటు పడిపోయింది బామ్మ చోలా. డ్రెస్సింగ్ నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రతిదాంట్లోనూ ప్రత్యేక కేర్ తీసుకుంటుంది మనవరాలు కౌంబా. ఆమె కారణంగానే ఇంత అందంగా కెమెరాకు ఫోజులిస్తోంది ఈ ఎనభై ఐదేళ్ల బామ్మ. అంతేకాదండోయ్..టీ షర్ట్స్, జీన్స్ వేసినప్పుడు చక్కటి లుక్ కోసం చేతి గోర్లు కూడా పెంచుతోందట. ఇంతకముందు తన జీవితం ఎలా సాగిందనేది అంత గుర్తు లేదు. కానీ ఇప్పుడు తన మనవరాలి పుణ్యమా అని.. సరొకొత్త రూపంతో మీ ముందుకు వస్తుంటే అసలు జీవితం అంటే ఇది కదా..! అనిపిస్తోంది. కొత్తదనంతో అందంగా మలుచుకోవడమే లైఫ్ అని అంటోంది ఈ బామ్మ. అంతేగాదు ఆమె నటించిన సిరీస్ కూడా.. "మాకు కూడా కొన్ని కోర్కెలు ఉంటాయి..మేము కూడా ప్యాషన్‌కి తీసిపోం అనిపించేలా సీనియర్ సిటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేగాదు ఆ సిరీస్‌లో.. నలుగురు మనవరాళ్లు తమ గ్రానీలను అందంగా తీర్చిదిద్దే పనిని ఈ స్టైలిష్ బామ్మకు అప్పగించితే.. ఆమె ఎలా ట్రెండ్ సెట్ చేస్తుందనేది ప్రధాన ఇతివృత్తం. ఏదీఏమైన ఈ ఏజ్‌లో ఇలా ఫ్యాషన్‌గా తయారవ్వడం అంటే మాటలు కాదు. పైగా తన సరికొత్త రూపంతో అందరికీ ప్రేరణ కలిగించి, ఆదర్శంగా నిలిచింది బామ్మ చోలా. View this post on Instagram A post shared by Dee (@thevintagepoint_) (చదవండి: వర్క్ లైఫ్ బ్యాలెన్స్: ఏ సంస్థ లేదా కార్యాలయం అలాంటి ఆఫర్ ఇవ్వదు..!) -
తియ్యగా మాట్లాడి, దుమ్ము దులిపే ‘బామ్మ: స్కామర్లకు దబిడి దిబిడే
అదిగో గిప్ట్, ఇదిగో లక్షల రూపాయలు అంటూ ఫేక్ కాల్స్‌తో జరుగుతున్న సైబర్‌నేరాలు అన్నీ ఇన్నీ కాదు. ఇది చాలదన్నట్టు, డ్రగ్స్, టాక్స్ అంటూ డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో ఆన్లైన్ ద్వారా సెలబ్రిటీలను కూడా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి కేటుగాళ్ల దుమ్ము దులిపేందుకు ఏఐ బామ్మ వచ్చేసింది. యూకే టెలికం కంపెనీ ‘ఓ2’ డైసీ అనే ఏఐ బామ్మను సృష్టించింది. డైసీ అనేది సాధారణ చాట్‌బాట్ కాదు, లైఫ్‌లైక్, మనుషుల తరహా సంభాషణలను నిర్వహించడానికి రూపొందించబడిన అత్యంత అధునాతన ఏఐ అని కంపెనీ ప్రకటించింది.బ్రిటన్‌లోనూ ఇలాంటి మోసాలు, ఆన్లైన్ స్కామర్ల స్కాంలు తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో డైసీ సృష్టి ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడ 10 మందిలో 7 మంది సైబర్ కేటుగాళ్ల మోసాలకు బలవుతున్నారట. వారి ఆటకట్టించి వినియోగదారులను రక్షించాలన్న ఉద్దేశంతోనే త్యాధునిక సాంకేతికతతో దీన్ని తీసుకొచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బామ్మ ఆన్లైన్ స్కామర్ల భరతం పడుతుందని కంపెనీ వెల్లడించింది. స్కామర్లతో తియ్యగా మాట్లాడుతూ వారిని మాటల్లో పెడుతుంది. వారిని సమయాన్ని వృథా చేస్తూ అసహనానికి గురిచేస్తుంది. దాదాపు 40 నిమిషాల పాటు ఎడతెగకుండా మాట్లాడి, అవతలి వారికి పిచెక్కిస్తుంది. దెబ్బకి ఆన్లైన్ నేరగాళ్లు చివరికి ఫోన్ పెట్టేస్తారనీ, దీంతో వారి మోసానికి చెక్ పడుతుందని కంపెనీ తెలిపింది. తద్వారా బాధితుల సంఖ్య తగ్గుతుందని భావిస్తోంది.మరో విధంగా చెప్పాలంటే మోసంతో ఫోన్ చేసేవారికి ఏఐ గ్రాండ్‌మదర్ డైసీ చుక్కలు చూపిస్తుంది. తాము ఎవరితో మాట్లాడుతున్నామో తెలియనంత తీయగా మాట్లాడుతూ వారి అసలు సంగతిని తెలుసుకుంటుంది. అంతేకాదు డైసీ కేవలం స్కామర్ల సమయాన్ని వృధా చేయడం మాత్రమే కాదు, ప్రజలకు అవగాహన కల్పించడంలో కూడా ఆమె సహాయపడుతుంది. ఇందుకోసం స్కామ్‌లో 5వేల పౌండ్లను కోల్పోయిన రియాలిటీ టీవీ స్టార్ అమీ హార్ట్ డైసీతో జతకట్టడం విశేషం.మరోవైపు ఓ2 కంపెనీ ప్రతి నెల మిలియన్ల కొద్దీ స్కామర్ల కాల్స్‌ను, టెక్స్ట్ మెసేజ్‌లను బ్లాక్ చేస్తోంది. అలాగే ఉచిత సేవ అయిన 7726కి సందేశాలను ఫార్వార్డ్ చేయడం ద్వారా అనుమానాస్పద కేసులను తమకు నివేదించమని ప్రజలను కోరుతుంది. స్కామ్‌లను అడ్డుకునేందుకు జాతీయ టాస్క్‌ఫోర్స్ , ప్రత్యేకమైనమంత్రిత్వ విభాగం కావాలని కూడా కోరుతోంది. -
రతన్ టాటాకు స్ఫూర్తి ఎవరో తెలుసా..!
రతన్ టాటా మన దేశం గర్వించదగ్గ పారిశ్రామికవేత్త. పారిశ్రామిక విజయాలలోనే కాదు, వదాన్యతలోనూ ఆయన ఎందరికో స్ఫూర్తి ప్రదాత. అంతటి రతన్ టాటాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందనే నానుడి రతన్ టాటా విషయంలోనూ నిజమే! చిన్ననాటి నుంచి రతన్ టాటాకు స్ఫూర్తి ఆయన నాయనమ్మే! రతన్ టాటా నాయనమ్మ నవాజ్‌బాయి టాటా సన్స్ కంపెనీకి మొదటి మహిళా డైరెక్టర్. టాటా ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా కూడా ఆమె సేవలందించారు.రతన్ టాటాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన తల్లిదండ్రులు విడాకులు పొంది విడిపోయారు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో రతన్ టాటా, ఆయన తమ్ముడు జిమ్మీ టాటాల బాధ్యతను నాయనమ్మ నవాజ్‌బాయి చేపట్టారు. వారిద్దరినీ అల్లారుముద్దుగా పెంచారు. సాటి మనుషులతో మెలగాల్సిన తీరును, జీవితంలో పాటించాల్సిన విలువలను నేర్పించారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన నాయనమ్మే తనకు స్ఫూర్తి ప్రదాత అని, తాను సాధించిన విజయాల ఘనత ఆమెకే చెందుతుందని రతన్ టాటా ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. నాయనమ్మ పెంపకంలో పెరగకపోయి ఉంటే, తాను ఇంతటివాణ్ణి కాగలిగేవాణ్ణి కాదని రతన్ టాటా తరచుగా చెబుతుండేవారు. ఇక్కడ చదువు పూర్తయ్యాక ఉన్నతవిద్య కోసం రతన్ టాటా అమెరికా వెళ్లారు. కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత లాస్ ఏంజెలిస్‌లోని ఒక ఆర్కిటెక్చర్ సంస్థలో ఉద్యోగంలో చేరారు. అక్కడే స్థిరపడిపోవాలనుకున్న దశలో నాయనమ్మ నవాజ్‌బాయి అనారోగ్యానికి లోనయ్యారు. స్వదేశానికి తిరిగి వచ్చేయమని ఆమె కోరడంతో రతన్ టాటా అమెరికా జీవితానికి స్వస్తిచెప్పి, బాంబేకు వచ్చేసి, టాటా సంస్థల బాధ్యతల్లో పాలుపంచుకోవడం మొదలుపెట్టారు. (చదవండి: నాలుగుసార్లు ప్రేమలో పడినా..!) -
90 ఏళ్లు... రెండు మైళ్లు..: సొసైటీకీమె దివిటీ
పత్రికలకు, రేడియోకు దూరంగా ఉండే ఆ బామ్మ ఆగ్రహంతో రగిలిపోయింది. కోలకతాలో జూనియర్ డాక్టర్‌పై సాగిన హత్యాచారకాండను మనవరాళ్ల ద్వారా వినగానే ‘సమాజం ఇలాంటి వాటిని ఎలా అంగీకరిస్తుంది? పదండి అందరం నిరసన తెలుపుదాం’ అని 90 ఏళ్ల మాయా రాణి అర్ధరాత్రి కేండిల్ పట్టి రెండు మైళ్లు నడిచింది. ప్రతి అడుగు మనలో కదలిక ఆశిస్తోంది.ఆమెను చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. నడుము ఒంగిపోయినా అడుగులు తొణకడం లేదు. శరీరం బలహీనంగా ఉన్నా మాట తీవ్రతలో వెనుకంజ లేదు. మొన్నటి బుధవారం (ఆగస్టు 14) కోల్‌కతాలో అర్ధరాత్రి సాగిన నిరసనలో 90 ఏళ్ల ఆ బామ్మ చేతిలో క్యాండిల్ పట్టుకుని జనంతోపాటు నడుస్తూంటే అందరూ ఆమెను చూసి స్ఫూర్తి పొందారు. ఆమెతోపాటు మరింత ఉద్వేగంగా నడిచారు.ఇంత దారుణమా...కోల్‌కతాలోని జోకా ప్రాంతంలో నివాసం ఉండే 90 ఏళ్ల మాయారాణి చక్రవర్తికి ఆగస్టు 9న జరిగిన హత్యాచారం గురించి మనవరాళ్ల ద్వారా తెలిసింది. డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం జరిపి హత్య చేశారన్న వార్త తెలియగానే ఆమె కదిలిపోయింది. తన కోల్‌కతా నగరంలో ఇంత దారుణమా అనుకుందామె. ‘ఇంతటి ఘోరాన్ని నా జీవితంలో వినలేదు’ అందామె వాళ్లతో. ‘దీనిని సమాజం ఎలా అంగీకరిస్తుంది? మీరంతా ఏం చేస్తున్నారు?’ అని మనవరాళ్లను ప్రశ్నించింది. ‘మేము అర్ధరాత్రి నిరసన చేయబోతున్నాం. రాత్రిళ్లు సురక్షితంగా తిరగ్గలిగే మా హక్కు కోసం నినదించబోతున్నాం’ అని వాళ్లు చెప్పారు. ‘అయితే నేనూ వస్తాను’ అందామె. ‘రెండు మైళ్లు నడవాలి’ అన్నారు వాళ్లు. ‘నేను నడుస్తాను’ అందామె ఖండితంగా.క్యాండిల్ పట్టుకుని...మోకా అనే ఏరియాలోని తన అపార్ట్మెంట్ నుంచి ఆ ఏరియా ఇ.ఎస్.ఐ ఆస్పత్రి వరకు మూడు కిలోమీటర్లు నడిచింది మాయారాణి చక్రవర్తి. ‘బయట క్షేమంగా లేకపోతే ఇంట్లో మాత్రం క్షేమంగా ఎలా ఉండగలరు ఆడవాళ్లు. నా మనవరాళ్లు పని మీద, చదువు కోసం బయటకు వెళితే వాళ్లు వచ్చేంత వరకూ బితుకుబితుకుమంటూ ఉండాలా నేను. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితిని అందరం మార్చాలి. అంతేకాదు ఇంత దారుణ నేరం చేసినవారికి శిక్ష పడాలి’ అందామె. సమాజంలో ఎన్ని ఘోరాలు జరిగినా జడత్వంతో మనకెందుకులే అనుకునేవారికి ఆ బామ్మ కదలిక ఒక దివిటీ కావాలని ఆశిద్దాం. -
నయా ట్రెండ్ : అమ్మమ్మ చేతి వంట
నిన్నటి తరం పిల్లలకు అమ్మమ్మ నాన్నమ్మ వంటకాల రుచి గురించి చెబితే చాలు నగర వాసపు జీవితాల్లో ఆ రుచిని మిస్ అవుతున్న విధానాన్ని తలుచుకొని మరీ బాధ పడి పోతారు. ఆనంద్ భరద్వాజ్ అతని భార్య నళిని పార్థిబన్‌లు చెన్నైలో ఉంటున్నతమ అమ్మమ్మ జానకి పాటి వంటకాలను పండగల సమయాల్లో ఎంతగా కోల్పోతున్నామో గ్రహించారు. చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి, అమ్మమ్మ వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. 82 ఏళ్ల అమ్మమ్మ చేత వ్యాపారాన్ని ప్రారంభించారు.నేడు 32 దేశాలకు ఆ రుచులను అందిస్తూ ఈ వయసులో అమ్మమ్మను వ్యాపారవేత్తగా మార్చేశారు. దేశంలో దక్షిణ భారతీయ వంటకాలకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ముఖ్యంగా పండగల సమయాల్లో బామ్మలు వండే పిండివంటల రుచి మనుమలను నగరవాసం నుంచి లాక్కుని వచ్చేలా చేస్తుంది. అచ్చం ఇదే విధంగా 2015లో దీపావళి సమయంలో కుటుంబ సభ్యులు బామ్మ జానకి పాటి స్పెషల్ వంటకాలను మిస్ అయ్యారు. బామ్మ చేతి వంట రుచి గొప్పతనాన్ని ఆమె మనవడు ఆనంద్ భరద్వాజ్ అతని భార్య నళిని పార్థిబన్ మరీ మరీ గుర్తు చేసుకున్నారు. ‘దీపావళికి మా అమ్మమ్మ జాంగ్రీలు, మురుకులు, మైసూర్ పాక్‌లను చాలా జాగ్రత్తగా తయారు చేసేది. ఆమె వంట చేస్తున్నప్పుడు మనవళ్లైన మాకు కథలు కూడా చెబుతుండేది. ఆ జ్ఞాపకం నేడు ఎస్కెసి (స్వీట్ కారం కేఫ్)ను ప్రారంభించేలా చేసింది’ అని చెబుతుంది నళిని పార్ధిబన్. రూ.2000 ల పెట్టుబడిఆనంద్, నళిని తమ అమ్మమ్మ చేతి వంట రుచిని ప్రపంచానికి పరిచయం చేయాలను కున్నారు. సంప్రదాయ దక్షిణ భారత స్నాక్న్కు ఆధునిక ట్విస్ట్ ఇవ్వడానికి వారు చాలా ప్రయత్నాలే చేశారు. అయితే, ఈ ప్రయాణం కష్టమైందని త్వరలోనే గ్రహించారు. చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. దీంతో ఇంటిలోని ఒక చిన్న గదిలో రూ.2000 పెట్టుబడితో ప్రారంభించారు. మొదట కస్టమర్లను సంపాదించడానికి వార్తాపత్రికల మధ్యలో కరపత్రాలను ఉంచి, పంపిణీ చేసింది. దీంతో ఆర్డర్లు వెల్లువెత్తడం పారంభించాయి. జనం కొద్ది రోజుల్లోనే అమ్మమ్మ స్నాక్స్‌ని బాగా ఇష్టపడ్డారు. ప్రతి దశలోనూ కొత్త ఉత్సాహం‘వంటకాలన్నీ అమ్మమ్మవే. ఆమె చెప్పినట్టే చేస్తాం. కానీ, వంటను దగ్గరగా ఉండి పర్యవేక్షిస్తుంటాం. ఎక్కడా రాజీ పడకుండా చూసుకుంటాం’ అని నళిని చెబితే, ‘నాణ్యమైన దినుసులతో పాటు ప్రేమ, శ్రద్థతో మా కుటుంబం కోసం చేసే విధంగా తయారు చేస్తాం’ అని జానకి పాటి చెబుతుంది. పాటీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా తయారుచేస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఈ బామ్మ ఉత్సాహాన్ని ఎవరైనా పొందవచ్చు. క్రికెటర్ ఎంఎస్ ధోని పట్ల తన ప్రేమను సోషల్‌మీడియా ద్వారా పంచుకొని ఆనందిస్తుంటుంది. జీవితంలోని ఈ దశనూ ఆనందంగా గడపడం కోసం ఉత్సాహంగా పనిచేస్తుంది. ‘ఇది నాకు పునర్జన్మ లాంటిది. మీరు ప్రయత్నించేవరకు మీకూ తెలియదు మీలోని శక్తి ఎంతో’ అని అందరికీ చెబుతుంది. ‘మా బామ్మలోని శక్తి మాకూ ప్రేరణగా పనిచేస్తుంది. ఆమె తన అభిమాన క్రికెటర్నీ ఉత్సాహపరుస్తుంది. అలాగే, సరికొత్త మొబైల్ యాప్స్ గురించి నేర్చుకుంటుంది. ఆమెకు జీవితం పట్ల ఉన్న అభిరుచి అసమానమైనది’ అంటూ తమ అమ్మమ్మ గురించి ఆనందంగా వివరిస్తుంది నళిని. నేడు ఎస్కెసి (స్వీట్ కారమ్ కేఫ్) స్టార్టప్ భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలకు విస్తరించి, అమ్మమ్మ చేతి వంట సూపర్ అంటోంది. -
అమ్మమ్మను తలుచుకుని ఎమోషనలైన పూజా హెగ్డే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అమ్మమ్మ రెండేళ్ల క్రితమే మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తను మరోసారి అమ్మమ్మను గుర్తు చేసుకుని ఎమోషనలైంది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. 'విల్ మిస్ యూ అజ్జి' అంటూ ఆమెతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. కాగా.. ఇటీవలే బుట్టబొమ్మ తన చెల్లెలు భూమి పెళ్లిలో సందడి చేస్తూ కనిపించింది. గతంలో కూడా పూజా తన అమ్మమ్మతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. కాగా.. గతేడాది బాలీవుడ్లో సల్మాన్ ఖాన్‌తో కిసీ కా భాయ్.. కిసి కీ జాన్ చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. టాలీవుడ్లో గుంటూరు కారం చిత్రంలో ఛాన్స్ కొట్టేసినప్పటికీ ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బుట్టబొమ్మ చేతిలో చిత్రాలేవీ లేవు. ప్రస్తుతం ముంబై భామకు అవకాశాలు తక్కువగానే వస్తున్నాయి. -
ఈ స్టూడెంట్ వయసు జస్ట్... 92
‘చదువుకు వయసుతో పనేమిటి’ అనేది పాత డైలాగే కావచ్చు గానీ 92 సంవత్సరాల సలీమాఖాన్‌కు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే బామ్మను 92 ఏళ్ల వయసులోనూ బడి బాట పట్టించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులందర్‌షహర్‌కు చెందిన సలీమాకు బడి సౌకర్యం లేకపోవడం, రకరకాల పరిస్థితుల వల్ల చదువుకునే అవకాశం దొరకలేదు. ఆరు నెలల క్రితం బడిలో చేరిన సలీమా పిల్లలతో పాటు క్లాస్‌రూమ్‌లో కూర్చునేది. చదవడం, రాయడం నేర్చుకుంది. ‘నేను కూడా చదవగలుగుతున్నాను. రాయగలుగుతున్నాను అనే సంతోషాన్ని చెప్పడానికి మాటలు లేవు’ అంటుంది సలీమాఖాన్. ‘మొదట్లో ఆమెకు చదువు చెప్పడానికి టీచర్లు తటపటాయించారు. అయితే ఆమెను వద్దనడానికి మా దగ్గర ఏ కారణం కనిపించలేదు. ఆమె పట్టుదల చూసి టీచర్లకు ఉత్సాహం వచ్చింది. అక్షరాస్యురాలిని కావాలి అనే ఆమె పట్టుదల టీచర్లకు నచ్చింది’ అంటుంది స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ శర్మ. -
విలేజ్ పంచాయతీ ప్రెసిడెంట్: వీరమ్మాళ్ @ 89
‘సేవకు వయసుతో పని ఏమిటి?’ అంటోంది 89 సంవత్సరాల వీరమ్మాళ్. ఈ బామ్మ తమిళనాడులోని అరిట్టపట్టి గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్. రకరకాల కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే వీరమ్మాళ్ తన ఆరోగ్య రహస్యం ‘నిరంతర కష్టం’ అంటోంది... మామూలుగానైతే బామ్మల మాటల్లో ‘మా రోజుల్లో’ అనేది ఎక్కువగా వినబడుతుంది. అది ఆ వయసుకు సహజమే కావచ్చుగానీ 89 సంవత్సరాల వీరమ్మాళ్ ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. నలుగురితో కలిసి నడుస్తుంది. వారి కష్టసుఖాల్లో భాగం అవుతుంది. వీరమ్మాళ్ విలేజ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మధురైలోని అరిట్టపట్టి గ్రామాన్ని తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర తొలి బయో డైవర్శిటీ సైట్‌గా ఎంపిక చేసింది. అరిట్టపట్టిలో పుట్టి పెరిగి అక్కడే వివాహం అయిన వీరమ్మాళ్‌కు ఆ గ్రామమే ప్రపంచం. అలా అని ‘ఊరి సరిహద్దులు దాటి బయటకు రాదు’ అనే ముద్ర ఆమెపై లేదు. ఎందుకంటే గ్రామ సంక్షేమం, అభివృద్ధి కోసం ఉన్నతాధికారులతో మాట్లాడడానికి పట్టణాలకు వెళుతూనే ఉంటుంది. ‘ఫలానా ఊళ్లో మంచిపనులు జరుగుతున్నాయి’ లాంటి మాటలు చెవిన పడినప్పుడు పనిగట్టుకొని ఆ ఊళ్లకు వెళ్లి అక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేస్తుంటుంది. తన గ్రామంలో అలాంటి కార్యక్రమాలు అమలయ్యేలా కృషి చేస్తుంటుంది. ‘స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం’ అనే మాట గట్టిగా వినిపించని రోజుల్లోనే స్వయం–సహాయక బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేది. రైతులకు వ్యవసాయ రుణాలు అందేలా ఆఫీసుల చుట్టూ తిరిగేది. మహిళలు గడప దాటి వీధుల్లోకి వస్తే... ‘ఇదేం చోద్యమమ్మా’ అని గుసగుసలాడుకునే కాలం అది. వీరమ్మాళ్ మాత్రం గ్రామంలోని రకరకాల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఊళ్లు తిరిగేది. ఎవరు ఎలా మాట్లాడుకున్నా పట్టించుకునేది కాదు. ఆమె దృష్టి మొత్తం సమస్యల పరిష్కారంపైనే ఉండేది. విలేజ్ ప్రెసిడెంట్‌గా వాటర్ ట్యాంకులు, వాగులు దాటడానికి వంతెనలు నిర్మించింది. జల్ జీవన్ మిషన్ కింద ఎన్నో ఇండ్లకు తాగునీరు అందేలా చేసింది. వీధిలైట్ల నుంచి వీధుల పరిశుభ్రత వరకు అన్నీ దగ్గరి నుంచి చూసుకుంటుంది. అలా అని ఊళ్లో అందరూ వీరమ్మాళ్‌కు సహకరిస్తున్నారని కాదు. ఎవరో ఒకరు ఏదో రకంగా ఆమె దారికి అడ్డుపడుతుంటారు. వారి నిరసన వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది. అలాంటి వారికి వీరమ్మాళ్ తరపున గ్రామస్థులే సమాధానం చెబుతుంటారు. గ్రామంలో వృథాగా పడి ఉన్న భూములను వినియోగంలోకి తీసుకువచ్చే విషయంపై దృష్టి పెట్టింది వీరమ్మాళ్. ‘పనికిరాని భూమి అంటూ ఏదీ ఉండదు. మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా, వృథాగా వదిలేస్తున్నామా అనే దానిపైనే ఆ భూమి విలువ ఆధారపడి ఉంటుంది’ అంటుంది వీరమ్మాళ్. ‘వీరమ్మాళ్ అంకితభావం గురించి ఆ తరం వాళ్లే కాదు ఈ తరం వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు. గ్రామ అభివృధ్ధికి సంబంధించి ఎంతోమందికి ఆమె స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నాడు అరిట్టపట్టి విలేజ్ ఫారెస్ట్ కమిటీ హెడ్ ఆర్’ ఉదయన్. రోజూ ఉదయం అయిదు గంటలకు నిద్ర లేచే వీరమ్మాళ్ వంటపని నుంచి ఇంటి పనుల వరకు అన్నీ తానే స్వయంగా చేసుకుంటుంది. పొలం పనులకు కూడా వెళుతుంటుంది. ‘బామ్మా... ఈ వయసులో ఇంత ఓపిక ఎక్కడిది?’ అని అడిగితే– ‘నా గ్రామం బాగు కోసం నా వంతుగా కష్టపడతాను... అని అనుకుంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అదే శక్తిగా మారి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుడు నన్ను ఈ భూమి మీది నుంచి తీసుకుపోయే లోపు గ్రామ అభివృద్ధి కోసం నేను కన్న కలలు సాకారం కావాలని కోరుకుంటున్నాను’ అంటుంది వీరమ్మాళ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుప్రియ సాహు అరిట్టపట్టి గ్రామానికి వచ్చి బామ్మను కలుసుకుంది. ‘వీరమ్మాళ్ బామ్మతో మాట్లాడడం, ఆమె నోటి నుంచి గ్రామ అభివృద్ధి ప్రణాళికల గురించి వినడం అద్భుతమైన అనుభవం’ అంటుంది సుప్రియ. -
సిగ్గు.. సిగ్గు.. చావు వార్తని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..
న్యూఢిల్లీ: సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చేయడంతో అత్యధికులు తమకు తామే సెలెబ్రిటీలమన్న భావన ఉంటున్నారు. కొంతవరకు మంచిదే కానీ కేవలం లైకులు కామెంట్ల కోసం ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ లేనిపోని రాద్ధాంతాన్ని సృష్టిస్తున్నారు. ఇలాగే ఒకామె తొందరపడి తన అమ్మమ్మ చనిపోయారన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభాసుపాలైంది. అమ్రిత్ అనే పేరుతో ట్విట్టర్ అకౌంట్ నడుపుతున్న ఒక యువతి తన అమ్మమ్మ చనిపోయారన్న విషయాన్ని చాలా క్రియేటివ్ గా పోస్ట్ చేసింది. ఆమె అమ్మమ్మ బ్రతికుండగా సోఫాలో కూర్చుని తింటున్న ఫోటోను ఒకపక్కన మరొపక్కన ఆమె లేకుండా ఖాళీగా ఉన్న సోఫా ఫోటోను పోస్ట్ చేసి.. ఫోటోలతో పాటు "నేను దీని నుండి ఎప్పటికీ కోలుకోలేను.." అని రాసింది. పెద్దావిడ మరణవార్తను తన ఫాలోవర్లకు చెప్పాలన్న కుతూహలం కన్నా వారి సానుభూతి రూపంలో లైకులు కామెంట్లు పొందాలన్న ఆమె ఆత్రుతే ఎక్కువగా కనిపించింది నెటిజన్లకు. దీంతో వారు కూడా సున్నిత శైలిలో విచారాన్ని వ్యక్తం చేస్తూ కఠినమైన కామెంట్లతో ఆ యువతిని చెడామడా వాయించేస్తున్నారు. "మీ అమ్మమ్మ మరణం తీరని లోటు. అలాగని ప్రతిదీ ఇంటర్నెట్లో పోస్ట్ చేయాలా?" అని కొందరు రాస్తే.. ఆమె చావు నీకు ఇలా ఉపయోగపడిందన్న మాట, మీకు రిప్లై ఇస్తే నాకు మెసేజులు మీద మెసేజులు వస్తున్నాయని మరొకరు.. కామెంట్లు చేశారు. ఎవరేమనుకుంటున్నారన్న విషయాన్ని పక్కనబెడితే.. సదరు వ్యక్తి చేసిన పోస్టుకు మాత్రం 40 లక్షల పైచిలుకు వీక్షణలు దక్కాయి. అదీ సోషల్ మీడియా పవర్ అంటే.. I’m never going to recover from this pic.twitter.com/yRhfdApZap — A (@ammmmmmrit) July 10, 2023 ఇది కూడా చదవండి: రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు! -
సైకో వీరంగం.. గుమ్మం నుంచి బామ్మను లాగి..
ఫ్రాన్స్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఇంటి గుమ్మం ముందు నిలబడిన బామ్మ, చిన్నారిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలితో పాటు ఆమె మనవరాలు కూడా గాయపడింది. బోర్డియక్స్ నగరంలో ఈ ఘటన జరిగింది. అయితే.. నిందితుడు ఓ ఆఫ్రికా దేశం నుంచి వలస వచ్చిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నిందితున్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఓ కాలనీలో బామ్మ తన మనవరాలితో నివసిస్తోంది. ఇంట్లో ఎవరూ లేని కారణంగా కాస్త బోరింగ్‌గా ఫీల్ అయిన బామ్మ గుమ్మం ముందుకు వచ్చింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఆఫ్రికన్ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని గమనించిన బామ్మ తన మనవరాలితో వెంటనే ఇంట్లోకి వెళ్లి డోర్ మూసేయడానికి ప్రయత్నం చేసింది. కానీ నిందితుడు వారిని అడ్డగించాడు. డోర్ వేయకుండా ఆపేసి వారిని బయటకు లాగాడు. విచక్షణా రహితంగా చిన్నారిని ఇంటి నుంచి బయటకు విసిరాడు. అనంతరం బామ్మపై దాడి చేసి.. విలువైన వస్తువులను లాక్కెళ్లాడు. బాధితులకు స్వల్పంగా గాయాలయ్యాయి. Shocking video of violent attack on a grandmother and granddaughter by a migrant in Bordeaux, France goes viral; Netizen demand strict anti-immigration laws. pic.twitter.com/kqjeE2tFW9 — Megh Updates 🚨™ (@MeghUpdates) June 20, 2023 ఈ వీడియో క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు అకారణంగా దాడి చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్‌కు వచ్చే విదేశీయులపై ఆంక్షలు విధించాలని కోరారు. ఇమ్మిగ్రేషన్ నియమాలను కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. నిందితున్ని అరెస్టు చేశారు. ఆఫ్రికా నుంచి వలస వచ్చిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. ఇదీ చదవండి: గొంతును ఏమార్చారు, ఒరిజినల్‌గా నమ్మించారు -
భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు!
సాధారణంగా వయసు మీద పడే కొద్దీ విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారు. వృద్ధాప్యం కారణంగా ఆ వయసులో వచ్చే మోకాళ్లు, నడుము నొప్పులు వారిని తెగ ఇబ్బంది పెడుతంటాయి. ఇక్కడి వరకు అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఓ బామ్మ మాత్రం తాను కాస్త డిఫెరెంట్ అంటోంది. 65 ఏళ్లు దాటిన కూడా వ్యాపారం చేస్తూ ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తోంది. యుక్త వయస్కురాలు చేసినట్లు అన్ని పనులు చేస్తోంది. అసలు ఈ బామ్మ ఎవరు..? ఆ వ్యాపారం ఏంటో అనే వివరాలను తెలుసుకుందాం. ఆ ఆలోచనే.. లక్షల సంపాదనగా మారింది గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా నబానా గ్రామంలో నవాల్బీన్ దల్సంభాయ్ చౌదరి (65). ఈ బామ్మ పెద్దగా చదువుకోలేదు. వయసులో ఉన్నప్పుడు గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నాం. కానీ, వయసు అయ్యే కొద్దీ కూలి పని కష్టంగా మారింది. ఇక ఏం పనులు చేసుకోగలం అని ఆలోచించగా ఓ ఐడియా తట్టింది. అదే పాడి పరిశ్రమ పెట్టాలన్న నిర్ణయానికి పునాది వేసింది. అలా 15 ఏళ్ల క్రితం 15 గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించింది దల్సంభాయ్. కాల క్రమేణా ఆ 15 గేదెలు కాస్తా 250కి పైగా విస్తరించాయి. ప్రస్తుతం రోజూ 11 వందల లీటర్ల పాలను సరఫరా చేస్తోంది. దీని ద్వారా ప్రతి నెలా ఆమె 11 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రతి 15 రోజులకు 7 నుంచి 8 లక్షల రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. నవాల్బీన్ ఏడాదికి 25 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఆమె నడుపుతున్న డెయిరీలో 10 మంది పనిచేస్తున్నారు. వారి నెల జీతం రూ. లక్షన్నర. మహిళా సాధికారతకు నవాల్బీన్ మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. 60 ఏళ్ల వయసులో కూడా పాల వ్యాపారం విజయవంతంగా సాగిస్తున్న ఈ బామ్మను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చదవండి: సిబిల్ స్కోరు గురించి ఈ విషయాలు తెలియక.. తిప్పలు పడుతున్న ప్రజలు! -
‘మనవరాలి’కి జన్మనిచ్చిన 56 ఏళ్ల మహిళ
వాషింగ్టన్: మనవరాలికి నానమ్మ జన్మనివ్వటమేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే, సరోగసి పున్యమా అని ఇలాంటి వింత సంఘటనలు ఇటీవల సాధ్యమవుతున్నాయి. 56 ఏళ్ల ఓ మహిళ తన కొడుకు, కోడలి బిడ్డకు సరోగసి ద్వారా జన్మనిచ్చింది. ఈ సంఘటన అమెరికాలోని ఉతాహ్ ప్రాంతంలో జరిగింది. తన కోడలికి గర్భాశయాన్ని తొలగించిన క్రమంలో ఈ సరోగసి పద్ధతికి తానే అంగీకరించారని, ఆ దంపతులు మరో అవకాశం లేకుండా పోయిందని ద పీపుల్స్ మీడియా పేర్కొంది. ఉతాహ్ ప్రాంతానికి చెందిన జెఫ్ హాక్ అనే వ్యక్తి భార్య కాంబ్రియాకు గర్భాశయం తొలగించారు. ఈ క్రమంలో సరోగసి ద్వారా వారి బిడ్డను కనివ్వడనికి అతడి 56 ఏళ్ల తల్లి నాన్సీ హాక్ ఆఫర్ చేసింది. అయితే, అది సాధ్యం కాదని మొదట వాదించాడు జెఫ్ హాక్. అయితే, వైద్యులు చేసి చూపించారు. జెఫ్ హాక్ తల్లి తన మనవరాలికి జన్మనిచ్చింది. మరోవైపు.. ఆ పాప జెప్ హాక్, కాంబ్రియాల ఐదో సంతానం కావటం గమనార్హం. ఇది ఒక గొప్ప సందర్భమని, ఎంత మంది తన తల్లి జన్మనివటాన్ని చూస్తారని పేర్కొన్నాడు జెఫ్ హాక్. బిడ్డకు జన్మనిచ్చిన క్రమంలో నాన్సీ హాక్ భావోద్వేగానికి గురయ్యారని, అయితే ఆ పాపను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లలేకపోయారని ద పీపుల్స్ పేర్కొంది. నానమ్మ గుర్తుగా పాపకు హన్నా అని నామకరణం చేశారు జెఫ్ హాక్, కాండ్రియా. తన తల్లి ఓరోజు అర్ధరాత్రి నిద్రలేచి తన పేరు హన్నాగా చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు జెఫ్ హాక్. డెలివరీకి ముందే, ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయకముందే కడుపులో ఉంది పాపేనని చేప్పారు నాన్సీ. ఒక మహిళ తన మనవరాలిని మోయడం అనేది అసాధారణమైన విషయమని డాక్టర్ రస్సెల్ ఫౌల్స్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Cambria Hauck (@cambriairene) ఇదీ చదవండి: విలాసవంతమైన ఇంట్లో 43 ఏళ్లపాటు పనిమనిషిగా.. బిడ్డ వల్లే ఇప్పుడు ఏకంగా ఓనర్! -
అతడికి 19.. ఆమెకు 56.. పెళ్లికి సిద్ధమైన జంట
బ్యాంకాక్: ప్రేమ గుడ్డిది, దానికి వయసు, పరిధి, దూరం వంటి వాటితో సంబంధం ఉండదు అనే డైలాగులు చాలా సినిమాల్లో వినే ఉంటాం. దానిని థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట నిజం చేసి చూపుతోంది. ఇద్దరి మధ్య 37 ఏళ్ల వయసు తేడా ఉంది. అయినప్పటికీ.. 19 ఏళ్ల యువకుడు, 56 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆమెతో నిశ్చితార్థం సైతం చేసుకున్నాడటా! ప్రస్తుతం వారి ప్రేమ, పెళ్లి అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారింది. ఉత్తర థాయ్‌లాండ్‌లోని సఖోన్ నఖోన్ రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల వుతిచాయ్ చంతరాజ్ అనే యువకుడు, 56 ఏళ్ల వయసు ఉన్న జన్లా నమువాన్గ్రాక్ అనే మహిళను పెళ్లి చేసుకోబోతున్నాడు. అతని 10 ఏళ్ల వయసున్నప్పుడు ఆమెను కలిశాడు. ఇరువురు ఇరుగుపొరుగు ఇంట్లోనే ఉండేవారు. ఈ క్రమంలో ఇంటిని శుభ్రం చేసేందుకు తనకు సాయం చేయమని వుతిచాయ్ని కోరేది మహిళ. ఇలా.. చిన్న చిన్న పనుల్లో సాయంగా ఉంటుండంతో ఇరువురి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 37 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ గత రెండేళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారు. ‘రెండేళ్లుగా జల్నాతో ఉంటున్నాను. ఒకరు హాయిగా జీవించేలా చేయొచ్చని నా జీవితంలో తొలిసారి తెలుసుకున్నా. పాడైపోయిన ఆమె ఇంటిని చూశాను. ఆ తర్వాత ఆమెకు మంచి జీవితం అందించాలని ఆలోచించాను. ఆమె చాలా కష్టపడి పని చేసే వ్యక్తి, నిజాయితీగా ఉంటుంది. ఆమెను నేను ఆరాధిస్తాను.’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. వయసులో తేడా పట్ల వారు ఆందోళన చెందటం లేదు. ఇంటర్వ్యూలు, బహిరంగంగా తమ బంధాన్ని వెల్లడించటంలో ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు. నగరంలో బయటకి వెళ్లినప్పుడు చేతులు పట్టుకుని, ముద్దులు పెట్టుకుంటూ సరదాగా కనిపిస్తున్నారు కూడా. అయితే.. జల్నా తన భర్తతో విడిపోయింది. ఆమెకు ముగ్గురు 30 ఏళ్లకుపైగా వయసున్న పిల్లలు ఉన్నారు. వుతిచాయ్ తనలో యువతిననే ఆలోచన కలిగించాడని చెబుతోంది. ‘వుతిచాయ్ నాకు ఒక సూపర్ హీరో. ప్రతి రోజు నాకు సాయం చేస్తాడు.అతను పెద్దవాడయ్యాక మా ఇరువురి మధ్య భావాలు మొదలయ్యాయి.’ అని పేర్కొంది జల్నా. త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: వీడియో: చెంప దెబ్బకు డెలివరీబాయ్ ఇచ్చిన రియాక్షన్.. మరీ వయొలెంట్‌గా ఉందే! -
మద్యం త్రాగేందుకు డబ్బులు ఇవ్వాలని నానమ్మపై మనువడి దాడి
-
ప్రాణాలు తీసిన డిప్రెషన్
నిజాంపేట్ (హైదరాబాద్): గోరు ముద్దలు తినిపించాల్సిన అమ్మమ్మే గొంతు నులిమి ఊపిరి తీసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతల్లి పేగుబంధాన్ని తెంపేసుకుంది. 12 ఏళ్ల క్రితం దూరమైన కుటుంబ పెద్దను కుమారుడు దగ్గర చేసే యత్నంలో.. ఇది నచ్చని తల్లీకూతుళ్లు తీవ్ర మానసిక క్షోభకు గురై చనిపోవాలనుకున్నారు. ఈ క్రమంలో 18 నెలల బాలుడి ఊపిరి తీసి ఉరి వేసుకున్నారు. వీరిలో తల్లి చనిపోగా కూతురు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద ఘటన గురువారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లికి చెందిన లలిత (56), కృష్ణమూర్తి దంపతులు హైదరాబాద్‌లోని నిజాంపేట్ వినాయకనగర్‌లో ఉంటున్నారు. వీరికి కుమారుడు శ్రీకర్. ఇద్దరు కూతుళ్లు అర్చన, దివ్య ఉన్నారు. లలిత భర్త కృష్ణమూర్తి 12 ఏళ్ల క్రితం భార్యతో విభేదించి వేరుగా ఉంటున్నాడు. లలిత ఇద్దరు కూతుళ్ల వివాహాలు చేసి అత్తారిళ్లకు పంపించింది. శ్రీకర్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగేళ్లుగా కుటుంబంలో మనస్పర్థలు.. నాలుగేళ్ల క్రితం దివ్య వివాహం సమయంలో శ్రీకర్ తన తండ్రి కృష్ణమూర్తిచే కన్యాదానం చేయించాలని కుటుంబంలో ప్రతిపాదన తెచ్చాడు. దీనికి తల్లి లలిత, చెల్లెలు దివ్య ఒప్పుకోలేదు. ఆయన వస్తే తను పెళ్లి చేసుకోనని దివ్య కరాఖండీగా చెప్పింది. దీంతో శ్రీకర్ తన ప్రతిపాదన విరమించుకున్నాడు. అప్పటి నుంచి శ్రీకర్ తన తండ్రి కృష్ణమూర్తితో టచ్‌లో ఉన్నట్లు మిగతా కుటుంబ సభ్యులు భావిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కూకట్‌పల్లిలో కూతురు దివ్య వద్ద లలిత కొద్ది రోజులు.. కుమారుడి వద్ద కొద్ది రోజులు ఉంటూ వస్తోంది. కుమారుడి వయసు 35 ఏళ్లు దాటుతున్నా వివాహం కాకపోవడం, సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరడం లేదని లలిత ఆందోళనకు గురయ్యేది. దీనికి తోడు ఎప్పుడో దూరమైన భర్తకు కుమారుడు దగ్గరవుతున్నాడనే అనుమానం పెరిగిపోసాగింది. ఆత్మహత్యకు ప్రేరేపించిన లలిత.. 15 రోజుల క్రితం దివ్యతో లలిత తనకు బతకాలని లేదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తల్లితో ఎక్కువ అనుబంధం ఉన్న దివ్య ఆమె లేని జీవితం తనకూ వద్దనుకుంది. తాము చనిపోతే శివ కార్తికేయ అనాథ అవుతాడని, దీంతో బాలుడినీ చంపాలని తల్లీకూతుళ్లు నిర్ణయించుకున్నారు. మొదట చిన్నారి గొంతునులిమి.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న తల్లీకూతుళ్లు.. మొదట శివ కార్తికేయను గొంతు నులిమి అమ్మమ్మ లలిత ఊపిరితీసింది. అనంతరం తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మరో గదిలో దివ్య చున్నీతో మెడకు వేసుకుని చనిపోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. తన శక్తి చాలకపోవడంతో తెల్లవారుజామున పక్కగదిలో ఉన్న శ్రీకర్‌ను నిద్ర లేపింది. ఆందోళనకు గురైన అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని దివ్యను ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో తమ మృతికి ఎవరూ కారణం కాదనే సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. -
KTR Hometown: అవ్వా.. నేను వెంకటమ్మ మనవడిని
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని తన నానమ్మ ఊరు కోనాపూర్‌లో మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటించారు. ‘అవ్వా.. నేను వెంకటమ్మ మనవన్ని’అంటూ పలకరించారు. ఊరంతా కలియదిరుగుతూ గ్రామస్తులతో ముచ్చటించారు. తర్వాత ఊర్లో తన సొంత డబ్బు రూ.2.5 కోట్లతో నానమ్మ పేరుతో కట్టిస్తున్న బడికి శంకుస్థాపన చేశారు. గ్రామానికి వెళ్లే దారిలో వాగుపై రూ.2.40 కోట్లతో కట్టిస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి, రూ.75 లక్షలతో వేస్తున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. రూ.24 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. మాది మొదటి నుంచీ ఉన్నత కుటుంబమే తమది మొదటి నుంచి ఉన్నత కుటుంబమేనని కేటీఆర్ చెప్పారు. ‘మా తాత రాఘవరావుది సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట. ఆయన వందల ఎకరాల ఆసామి. నానమ్మ వెంకటమ్మది కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపూర్ (పోసానిపల్లె). నానమ్మ వాళ్లింట్లో మగ పిల్లలు లేకపోవడంతో తాతను 1930ల్లో ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నరు. కోనాపూర్‌లో చెరువు కింద ఆయకట్టులో సగం భూమి మా తాతదే. ఊరి కింది భాగాన 500 ఎకరాలకు పైగా భూమి ఉండేది. నిజాం సర్కారు ఎగువ మానేరుకు ప్లానింగ్ చేస్తే తాత, నానమ్మల భూమి అంతా అందులో మునిగింది. అప్పుడు నిజాం సర్కారు రూ.2.5 లక్షల ముంపు పరిహారం ఇచ్చింది. ఆ డబ్బులతో తాత, నానమ్మ సిద్దిపేట జిల్లా చింతమడకకు వలస వెళ్లారు. అక్కడ ఆ డబ్బుతో వందల ఎకరాల భూమి కొన్నారు. మా నానమ్మ, తాతలు వదిలి వెళ్లిన కోనాపూర్‌లో సొంత డబ్బుతో కార్పొరేట్‌ను మించిన సర్కారు బడి కట్టించాలనుకున్న. ఈ రోజు ముహూర్తం కుదిరింది. ఏడాదిలోపు భవనం నిర్మాణం పూర్తి చేస్త. రెండంతస్తుల్లో 14 గదులతో బడి నిర్మితమవుతుంది. విద్యా మంత్రిని తీసుకువచ్చి ప్రారంభించుకుందాం’ అని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఏప్రిల్, మే నెలల్లో మానేరు పొంగిందా! సీఎం కేసీఆర్‌ది వ్యవసాయ కుటుంబమని, పొలం కొనుక్కుని ఇళ్లు కట్టుకుంటే ఫాంహౌస్ సీఎం అని విమర్శిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నోరుందని కొందరు ఏది పడితే అది మాట్లాడుతున్నారని.. సీఎం వయసు, స్థాయికి విలువ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారని దుయ్యబట్టారు. ‘మాకు కూడా మస్తు మాట్లాడొచ్చు. కానీ బాధ్యతలున్నాయి’అన్నారు. రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం అంటే ఏంటో తెలిసినవాడు కాబట్టే రైతులకు సీఎం మేలు చేస్తున్నారని చెప్పారు. దుర్భిక్ష ప్రాంతాలైన సిరిసిల్ల, దుబ్బాక, సిద్దిపేట లాంటి ప్రాంతాలకు కాళేశ్వరం ద్వారా నీరు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఎగువ మానేరు ఎప్పుడన్నా ఏప్రిల్, మే నెలల్లో పొంగి పొర్లిందా అని ప్రశ్నించారు. మానేరు నది మొత్తం జీవనదిలా మారిందన్నారు. మానేరుతో అనుబంధం ‘ఎగువ మానేరు నిర్మాణంతో నానమ్మ వాళ్ల భూములు ముంపునకు గురైతే మిడ్ మానేరు నిర్మాణంతో అమ్మమ్మ ఊరు కొదురుపాక మునిగింది. అమ్మమ్మ వాళ్ల భూముల మునిగాయి. మా చిన్న అమ్మమ్మ వాళ్లది వచ్చునూరు. దిగువ మానేరులో వాళ్ల ఊరు మునిగింది. మానేరు నదితో మా కుటుంబానికి ఏదో తెలియని అనుబంధం ఉంది’అని కేటీఆర్ వివరించారు. అమ్మమ్మ ఊరిలోనూ బడి కట్టిస్తా పేదలకు మంచి విద్య అందించాలన్న లక్ష్యంతో ‘మన ఊరు–మన బడి’కి సీఎం శ్రీకారం చుట్టారని, కార్యక్రమం కింద 26 వేల పాఠశాలల అభివృద్ధికి రూ.7,300 కోట్లు ఖర్చు చేయనున్నామని కేటీఆర్ వివరించారు. కామారెడ్డికి మెడికల్ కాలేజీ వస్తోందని, బీబీపేటలో జూనియర్ కాలేజీ త్వరలోనే ఏర్పాటవుతుందని చెప్పారు. సిరిసిల్ల జిల్లాలోని తన అమ్మమ్మ ఊరు కొదురుపాకలోనూ అమ్మమ్మ పేరుతో పాఠశాల కట్టిస్తానని కేటీఆర్ ప్రకటించారు. అర్హులకు ఆసరా పెన్షన్లిస్తాం సిరిసిల్ల: రాష్ట్రంలోని అర్హులైన వారికి కొత్తగా ఆసరా పెన్షన్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రైతుల రూ.50 వేల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రూ. 20 వేల కోట్లతో 2.70 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను 560 చదరపు అడు గులతో నిర్మించామని.. పైసా లంచం లేకుండా లబ్ధిదారులకు అందించామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికా తలసరి ఆదాయం 60 వేల డాలర్లని (సుమారు రూ. 60 లక్షలు), మన దేశ తలసరి ఆదాయం రూ.1,800 ఉందని చెప్పారు. అచ్చే దిన్ అంటూ సిలిండర్, పెట్రోల్ ధరలను కేం ద్రం పెంచుతోందని.. మతాల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు. ఎల్ఐసీ వంటి సంస్థలను అమ్మేస్తున్నారన్నారు. సిరిసిల్ల రాజీవ్ నగర్ రోడ్డులో మినీ స్టేడియం ప్రారంభోత్సవం సందర్భంగా జనం తోపులాట గా కేటీఆర్‌ను నెట్టడంతో ఆయన అసహనానికి గురయ్యారు. మున్సిపల్, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియం లోకి రాకుండానే వెనుదిరిగారు. కేటీఆర్‌కు కేసీఆర్ ఫోన్ కోనాపూర్‌లో తిరుగుతూ నానమ్మ వాళ్ల పాత ఇంటి వద్దకు చేరుకున్నప్పుడు సీఎం కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడున్నావని సీఎం అడిగారని, నానమ్మ ఇంటి ముందు నిలబడ్డానని చెబితే మురిసిపోయారని కేటీఆర్ చెప్పారు. గ్రామస్తులు అడిగినవాటికి భరోసా ఇవ్వాలని కూడా చెప్పారని, వినతిపత్రంలో పేర్కొన్న వాటిని కలెక్టర్ పరిశీలించి నివేదికను తనకు ఇస్తే సీఎంతో మాట్లాడి శాంక్షన్ చేయిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్మన్ శోభ, ఎమ్మెల్సీ వీజీగౌడ్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటి తదితరులు పాల్గొన్నారు. -
Sheelaa Bajaj: ధీర వనిత.. నానమ్మ కథ
షీలా బజాజ్ వయసు 78. దేహం కదలికలు కష్టమయ్యే వయసు. కీళ్లు కదలికలు తగ్గే వయసు. కానీ, ఆమె మాత్రం చురుగ్గా వేళ్లు కదుపుతోంది. వేగంగా అడుగులు వేస్తోంది. ఊలుతో స్వెటర్లు అల్లుతోంది. చలికాలంలో చంటి పిల్లల పాదాలు, చేతులకు తొడిగే ఊలు సాక్సు, గ్లవ్స్ కూడా చక్కగా అల్లేస్తోంది. చేతిలో నైపుణ్యం ఉంటే వార్థక్యం కూడా దూరమవుతుందని చెబుతోంది షీలా బజాజ్. అంతేకాదు, తన మనుమరాలు యుక్తి 78 ఏళ్ల వయసులో తనను సంపాదనపరురాలిగా మార్చిందని సంతోషపడుతోంది షీలా బజాజ్. నానమ్మ కథ షీలా బజాజ్ జీవితంలో అనేక ఎదురుదెబ్బలకు గురైంది. కొడుకు అర్ధంతరంగా మర ణించాడు. అప్పటికి అతడి కూతురు యుక్తి చిన్నపాప. మనుమరాలిలో కొడుకును చూసుకుంటూ కోడలికి ధైర్యం చెబుతూ కుటుంబానికి అండగా నిలిచింది. ఆమె మనోధైర్యాన్ని చూసి విధికి కన్నుకుట్టినట్లుంది. కోడలిని కూడా పొట్టన పెట్టుకుంది. ఇక మిగిలింది తనూ, మనుమరాలు యుక్తి. ఆ పాపకి నానమ్మలోనే అందరూ. ఇప్పటికీ నానమ్మ అని చెప్పాల్సినప్పుడు యుక్తి ‘అమ్మ’ అనే సంబోధిస్తుంది. అంతటి అనుబంధం వాళ్లది. నానమ్మ కథ వినకుండా ఏ రోజూ నిద్రపోయేది కాదు యుక్తి. ఆ కథలన్నింటిలోనూ ఒకటే నీతి ఉండేది. కష్టం అనేది ఉండదు, పరిస్థితులు మాత్రమే ఉంటాయి. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడమే మనం చేయాల్సింది, చేయగలిగింది. ఈ నీతిని వింటూ పెరిగింది యుక్తి. నానమ్మ చెప్పిన కథలన్నింటికంటే ఆమె జీవిత కథే తనకు అత్యంత స్ఫూర్తివంతం అంటుంది యుక్తి. కాలం తన సమయాన్ని తాను పాటిస్తూ ముందుకు సాగిపోయింది. యుక్తి చదువుకుని, ఉద్యోగంలో చేరింది. షీలా బజాజ్ లో ఒంటరితనం మొదలైంది. ఇంతలో కరోనా వచ్చింది. ‘‘అమ్మ రోజంతా ఎంత ఒంటరితనానికి లోనవుతుందనేది నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో గమనించాను. ఆమెకు తెలియకుండానే ఆమెను తనకిష్టమైన పనిలో నిమగ్నం అయ్యేలా చేయగలిగాను. నాకు చిన్నప్పుడు అల్లినట్లే స్కార్ఫ్‌లు, స్వెటర్లు అల్లిపెట్టమ్మా... అని అడిగాను. ఊలు చేతిలోకి తీసుకున్న తర్వాత ఆమె ఇక చాలన్నా వినలేదు. ‘ఇలా అల్లుతూ ఉంటే.... నీ చిన్ననాటి రోజులే కాదు, నా చిన్ననాటి రోజులు కూడా గుర్తుకు వస్తున్నాయి’ అంటూ తనకు తోచినవన్నీ అల్లుతూ ఉండేది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. అవి కావాలని అడిగిన వాళ్లకు అమ్మేసి, ఆ డబ్బు ఇచ్చాను. తాను సంపాదనపరురాలినయ్యానని తెలిసిన ఆ క్షణం చూడాలి అమ్మ సంతోషం. నా బాల్యంలో నా ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఎంత భరోసానిచ్చిందో నాకిప్పటికీ గుర్తే. ఇప్పుడు నా పెంపకంలో ఉన్న అమ్మకు అంతటి భరోసా కల్పించడం నా బాధ్యత కదా’’ అంటోంది యుక్తి. మెదడు చురుకుదనం వేళ్లలో ఇక షీలా బజాజ్ అయితే... తన సృజనాత్మకతకు పదును పెట్టి ఊలుతో దిండు కవర్లు, కుషన్ కవర్లు, బాటిల్ కవర్, మగ్ వార్మర్ వంటి వినూత్నమైన అల్లికలను రూపొందిస్తోంది. ఇంత శ్రమ వద్దంటే వినదు కూడా. ‘ఈ వయసులో ఇంత వేగంగా అల్లగలగడం అంటే నాకెంతో గర్వం కదా. వేగం ఎందుకు తగ్గించుకోవాలి’ అని ప్రశ్నిస్తోంది. ‘డిజైన్‌కి అనుగుణంగా వేళ్లు వేగంగా కదులుతున్నాయంటే నా మెదడు కూడా అంతే చురుగ్గా ఉందని అర్థం’ అంటున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వు ఆమె పెదవుల మీద విరుస్తుంది. నిజమే... మనోధైర్యం ఉంటే పెరిగే వయసు ఉత్సాహానికి అడ్డంకిగా మారదు. చదవండి: International Day of Older Persons: అమ్మానాన్నలకు ఏం చేస్తున్నాం? -
కూతురు ఇష్టం లేని పెళ్లి.. మనవడిని కిరాతకంగా చంపిన బామ్మ
చెన్నై: కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కోపంతో ఓ మహిళ తన మనవడిని కిరాతకంగా హత్య చేసింది. పసివాడు అనే కనికరం కూడా లేకుండా ఆ బామ్మ ఈ ఘోరానికి పాల్పడింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. వివరాల ప్రకారం, కోయంబత్తూరులోని అన్బాగం వీధిలో నాగలక్షి అద్దె ఇంట్లో నివసిస్తూ ఓ హోటల్లో హౌస్ కీపర్‌గా పనిచేస్తోంది. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం, ఆమె కుమార్తె నందినికి (24) వృత్తిరీత్యా కాల్ టాక్సీ యజమాని కమ్ డ్రైవర్ నిత్యానందంతో వివాహం జరిగింది. అయితే ఆమె కోరికకు విరుద్ధంగా తన కుమార్తె వివాహం చేసుకున్నందుకు నాగలక్షి నిత్యానందంపై పగ పెంచుకుంది. ఎనిమిది నెలల క్రితం, నందిని తన భర్తతో అభిప్రాయభేదాల కారణంగా ఆమె తన చిన్న కుమారుడిని తీసుకుని నాగలక్ష్మి ఇంటికి వెళ్లింది. గత కొన్ని రోజులుగా, నాగలక్షికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో నందిని హోటల్లో పనిచేయడం ప్రారంభించింది. మంగళవారం రాత్రి పని నుంచి తిరిగి వచ్చిన నందిని తన బిడ్డ శ్వాస తీసుకోకపోవడం గమనించి, అతడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ బాలుడు చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. కొడుకు మరణంపై అనుమానంతో నందిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయగా అందులో పిల్లాడి పుర్రె పగిలిపోయిందని, అతని గొంతులో బిస్కెట్ రేపర్ దొరికిందని నివేదిక పేర్కొంది. పోలీసుల విచారణలో, నాగలక్షి చిన్నారిని చంపినట్లు తేలడంతో ఆమెను అరెస్టు చేశారు. చదవండి: SR Nagar: వందల కోట్ల రూపాయల ఆస్తి.. వృద్ధుల కిడ్నాప్ -
అమ్మమ్మే కడతేర్చింది..!
సంగారెడ్డి అర్బన్: కూతురుకు రెండో వివాహం చేయడం కోసం ఏడాదిన్నర వయసున్న మనవడిని చెరువులోకి తోసి హత్య చేసింది ఓ అమ్మమ్మ. ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలో శుక్రవారం కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. సంగారెడ్డిలోని రాజంపేటకాలనీకి చెందిన నాగమణి తన కూతురు సుజాత మనవళ్లు మహేష్, జశ్వంత్‌లతో నివాసముంటోంది. సుజాత భర్త రెండేళ్ల క్రితం మృతి చెందడంతో తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో పుల్కల్ మండలం బద్రిగూడెంకు చెందిన జనార్దన్‌తో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. చెరువులో తోసి ఏమీ తెలియనట్లు.. తనను పెళ్లి చేసుకోవాలని సుజాత.. జనార్దన్‌పై ఒత్తిడి తెచ్చింది. అయితే పెద్ద కుమారుడిని ఎవరైనా దత్తత తీసుకుంటారని, ఏడాదిన్నర ఉన్న చిన్న కుమారుడిని ఎలాగైనా వదిలించుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కూతురు పెళ్లికి చిన్నారిని అడ్డు తొలగించాలని నాగమణి నిర్ణయించుకుంది. చిన్నారిని వెంట తీసుకుని వెళ్లి బొబ్బలికుంట చెరువులో తోసేసింది. బాలుడు ఊపిరి ఆడక మృతిచెందాడు. బాలుడు అదృశ్యమయ్యాడని ఈ నెల 29న పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో అమ్మమ్మే నింది తురాలని తేలింది. నాగమణితోపాటు సుజాతను, జనార్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు -
షాకింగ్ న్యూస్: దుష్టశక్తులకు బలివ్వడానికి బాలిక కిడ్నాప్
బెంగళూరు: నమ్మకం మనల్ని బతికిస్తుంది. అదే నమ్మకం అతి అయితే ప్రమాదం కూడా. మూడ నమ్మకాలకు పల్లెలని, పట్టణాలని తేడాలేదు. కాక పోతే పల్లెల్లో కొంచెం ఎక్కువ. దేన్నైనా నమ్మడం మన లక్షణం. అన్నింటికీ ఆధారాలు ఉండవు. దేవుడు, దెయ్యం, మంత్రాలు, ప్రకృతి శక్తులు, ఆచారాలు, సంప్రదాయాలు ఇలా ఎన్నో ఉన్నాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా మూఢ నమ్మకాలు మాత్రం తగ్గడంలేదు. అయితే తాజాగా కర్ణాటకలోని నెలమంగళ సమీపంలో ఉన్న గాంధీ అనే గ్రామంలో దుష్టశక్తులకు బలివ్వడానికి ఓ పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ పదేళ్ల బాలిక ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా.. సావిత్రమ్మ, సౌమ్య అనే వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేశారు. అయితే పాప కనిపించకపోవడంతో ఆ బాలిక బామ్మ చుట్టు పక్కల వెతికింది. కాగా, సమీపంలో దుష్టశక్తుల నుంచి రక్షణకు పూజలు చేస్తున్న చోటు నుంచి కేకలు వినిపించడంతో.. బామ్మ సమీపంలోని పొలంలో వెళ్లింది. అక్కడ బాలిక మెడలో దండలు వేసి పూజలు చేస్తున్నట్లు గ్రహించి తమ వారితో వెళ్లి పాపను రక్షించిందని పోలీసులు తెలిపారు. తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులు పూజారితో సహా ఓ నలుగురు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసును ఉపసంహరించుకోవాలని నిందితులు బెదిరిస్తున్నట్లు శనివారం బాధితుడి కుటుంబం మరో మారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వైరల్: బోల్ట్ దంపతులకు కవలలు.. సునామీ సృష్టిస్తున్న పేర్లు -
విషాదం: అమ్మమ్మా.. ఎంతపని చేశావ్!
అమలాపురం టౌన్: రెండేళ్ల వయస్సులో తండ్రి మరణం.. మూడేళ్ల వయసులో తల్లి వేరే పెళ్లితో దూరం..అమ్మమ్మ పెంపకంతో జీవనం... ఇప్పుడు ఆ ఒక్క ఆసరాగా ఉన్న అమ్మమ్మ కరోనాతో మరణం... అయినవాళ్లు ఉన్నా ఎవరూ తనను సాకేందుకు ముందుకు రాకపోవడం...నేను ఇక అనాథగా మిగిలిపోతానా... నన్నెవరూ చేరదీయరా...అంటూ ఆ పదేళ్ల బాలుడు పడుతున్న మనోవేదన వర్ణనాతీతం. అమలాపురం మైపాలవీధికి చెందిన సంకు సాయిచరణ్ రెండో ఏటే అతని తండ్రి అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. దీంతో తల్లి, అన్న, అతను దిక్కులేని వారయ్యారు. ఆ కుటుంబం అమలాపురంలోని అమ్మమ్మ సూర్యవతి ఇంటికి చేరుకుంది. అన్నయ్యను బంధువులు దత్తత తీసుకున్నారు. అమ్మమ్మ పెద్ద మనసుతో ఆలోచించి తన కూతురికి వేరే పెళ్లి చేసి పంపించేసి, సాయిచరణ్‌ను తనే పెంచుకోవాలనుకుంది. అనుకున్నట్టుగానే ఏడేళ్ల కిందట అమ్మమ్మ.. సాయిచరణ్ అమ్మకు ఖమ్మం జిల్లా సింగరేణి ప్రాంతానికి చెందిన అప్పటికే భార్య చనిపోయిన వ్యక్తికి రెండో పెళ్లి చేసి సాగనంపింది. అప్పటి నుంచి మనవడు సాయిచరణ్‌ను చదివిస్తూ అల్లా రు ముద్దుగా చూస్తోంది. గత నెలలో అమ్మమ్మ సూర్యావతికి కరోనా సోకి మృత్యువాత పడింది. వేరే పెళ్లితో అప్పడు వెళ్లిన అమ్మ, సూర్యావతి కుమారులు కలిసి ఆమె అంత్యక్రియలు ముగించారు. కొద్దిరోజులకు సాయిచరణ్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. సాయిచరణ్‌ను ఎవరు పెంచాలన్నదే ప్రశ్నార్థకం? అమ్మమ్మ దిన కార్యక్రమం ఆమె రక్త సంబంధీకులంతా ఏ లోటూ లేకుండా పూర్తి చేశారు. అయితే సాయి చరణ్‌ను ఇక నుంచి ఎవరు పెంచాలనే ప్రశ్న తలెత్తింది. సాయిచరణ్‌కు తల్లిగా ఆమె తీసుకుని వెళితే బాగుంటుందని అమలాపురంలోని వారి బంధువులు ఒకే మాటగా చెప్పారు. అయి తే సాయిచరణ్ తల్లి, ఆమె భర్త మాత్రం అతని బాగోగులు బయట నుంచి మేమూ చూస్తూ ఉంటాం. అతడిని అమలాపురంలోని బంధువులే చేరదీసి పెంచాలని కోరుతున్నారు. బుధ, గురువారాల్లో అమలాపురంలోని ఆ కుటుంబాల పెద్దలు ఇరు పక్షాలతో చర్చించినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో నేనెవరికీ వద్దా... నన్నెవరూ తీసుకు వెళ్లరా..అంటూ సాయిచరణ్ మౌనంగా రోదిస్తున్నాడు. చదవండి: ఆధార్ లేకున్నా టీకా మరణించి.. నలుగురిలో జీవించి.. -
దారుణం: మనవరాలిని చంపి.. ఆపై బామ్మ నాటకం
జైపూర్: రాజస్థాన్‌లోని కనకాబాయి (50) అనే ఓ మహిళ ఓ గొడవ విషయంలో మరో వ్యక్తికి గుణపాఠం నేర్పడానికి తన మూడేళ్ల మనరాలిని చంపేసింది. పైగా ఆ బాలికను రామేశ్వర్ మొగ్యా అనే వ్యక్తి చంపినట్లు ఆరోపించింది. పోలీసుల వివరాల ప్రకారం.. మే 30 న, బోరినా గ్రామంలోని రెండు గ్రూపులు నీళ్ల కోసం వెళ్లి మార్గం మధ్యలో గొడవకు దిగారు. ఈ ఘర్షణలో కొంతమంది గాయపడగా.. అమర్లాల్ మొగ్యా అనే వ్యక్తి మూడేళ్ల కుమార్తె మృతి చెందింది. దాంతో రామేశ్వర్ మొగ్యాపై ఆ బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు రామేశ్వర్ మొగ్యా కుమార్తె కూడా గొడవలో గాయపడినట్లు గుర్తించారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని కనకబాయి.. రామేశ్వర్ మొగ్యాను బెదిరించింది. దాంతో రామేశ్వర్ మొగ్యా అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కనకబాయి ప్రవర్తనపై అనుమానం రావడంతో విచారించి నిందితురాలిని అరెస్ట్ చేశారు. (చదవండి: 11 ఏళ్ల క్రితం తప్పిపోయింది.. పక్కనే నివసిస్తున్నా ఎవరూ గుర్తించలేదు!) -
అమ్మమ్మ ఇంట్లో మనవరాలి చోరీ
నేరేడ్మెట్ : సొంత అమ్మమ్మ ఇంట్లోనే చోరీ చేసిన మనవరాలితోపాటు ఆమె స్నేహితుడిని నేరేడ్మెట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి తెలిపిన మేరకు.. కేశవనగర్‌కు చెందిన డీజే ఆపరేటర్ పర్షా అజయ్(21), దమ్మాయిగూడలోని వీఆర్ఆర్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న ఫ్యాషన్ డిజైనర్ పట్రిసియా(21)లు రెండేళ్లుగా స్నేహితులుగా కొనసాగుతున్నారు. లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. పట్రిసియా తన బంగారు గొలుసు ఇవ్వగా అమ్మేశాడు. చెడు అలవాట్లకు బానిసైన అజయ్ డబ్బుల కోసం స్నేహితురాలి సొంత అమ్మమ్మ అమిలియా ఇంట్లో చోరీకి పధకం వేశారు. ఇందులో భాగంగా గత నెల 31వ తేదీన డిఫెన్స్ కాలనీలోని అమ్మమ్మ ఇంటికి మనవరాలు పట్రిసియా వెళ్లి అక్కడే ఉంది. అదే రోజు అర్థరాత్రి అమ్మమ్మ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న సుమారు 18 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసింది. తన స్నేహితుడు అజయ్‌కు ఫోన్ చేసి డిఫెన్స్ కాలనీకి పిలిపించి చోరీ చేసిన అభరణాలను అప్పగించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పట్రిసియా, అజయ్‌లు నిందితులుగా తేలడంతో ఇద్దరినీ అరెస్టు చేసి, చోరీ సోత్తును పోలీసులు రికవరీ చేశారని డీసీపీ చెప్పారు. బాలికపై లైంగిక దాడి.. యువకుడి అరెస్టు చైతన్యపురి: మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన యువకుడిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. న్యూమారుతీనగర్‌లో నివసించే తంగళ్లపల్లి మణికంఠ (20)ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సెల్‌ఫోన్ ద్వారా పద్నాలుగు సంవత్సరాల ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. తరచూ ఫోన్లో మాట్లాడే వాడు. గత శుక్రవారం మాయమాటలు చెప్పి బాలికను మన్సూరాబాద్‌లోని ఓ గదికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం నిందితుడు మణికంఠను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
వైరల్: మందు కోసం పిల్లోడిని పడేసింది
ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులెలాగో పిల్లలను సరిగా పట్టించుకోవడమే మానేస్తున్నారు. నానమ్మ, అమ్మమ్మ తాతయ్యల దగ్గర వదిలేసి వారి పనులను చూసుకుంటున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండే వీరికి మనవళ్లతోనే బోలెడంత కాలక్షేపం. కానీ పైన ఫొటోలో కనిపిస్తున్న నానమ్మ చేసిన పనికి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అంతలా తప్పు పట్టేందుకు ఆమె ఏం చేసిందనుకుంటున్నారా.. అసలు సంగతి తెలిస్తే మీరే అవాక్కవుతారు. సోఫాలో కూర్చున్న బామ్మ పక్కన బుడ్డోడు నిలబడ్డాడు. ఆమె ఎదుట మందు గ్లాసు ఉంది. అది కంటపడటంతో పిల్లవాడు దాన్ని అందుకోవాలని ప్రయత్నించి పడేయబోయాడు. అంతే.. ఆమె చటుక్కున చంటోడిని వదిలేసి గ్లాసు కిందపడి పగిలిపోకుండా కాపాడింది.(చదవండి: ‘ముంబై పవర్ కట్’ టాప్‌లో ట్రెండింగ్) కానీ చంటోడు మాత్రం నానమ్మ తనను వదిలేయడంతో ఢమాలున కిందపడ్డాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను ఎనిమిది మిలియన్ల మందికి పైగా వీక్షించారు. కొందరు నెటిజన్లు ఆమె చేసిన పనిని మెచ్చుకుంటూ పెద్ద ప్రమాదం జరగకుండా కాపాడిందని కొనియాడుతున్నారు. గ్లాసు కింద పడుంటే పిల్లవాడికి గాయాలయ్యే అవకాశం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో పిల్లవాడి కన్నా మందుకే అంత ప్రాధాన్యతనివ్వడమేంటని విమర్శిస్తున్నారు. ఆల్కహాల్ కోసం బుడ్డోడిని కింద పడేసిందంటున్నారు. (చదవండి: వైరల్: తల్లిని కాపాడేందుకు ఐదేళ్ల పిల్లాడు..) When you've finally become an adult and have your priorities straight. pic.twitter.com/fSSIX2I6XT — The Cultured Ruffian (@CulturedRuffian) October 12, 2020 -
వీళ్లు మనుషులు కాదు.. రాక్షసులు
సాక్షి, చెన్నై : వారు మనుషులమనే విషయాన్ని మరిచిపోయారు. రాక్షసంగా ప్రవర్తించారు. అక్రమ సంతానమని వద్దని అమ్మ, అమ్మమ్మ కలిసి పుట్టిన నాలుగు రోజుల బిడ్డను సజీవ దహనం చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఇడ్లీ తినలేదన్న ఆగ్రహంతో ఆడ బిడ్డను పెద్దమ్మ కర్రతో కొట్టి చంపేసింది. పోలీసుల కథనం మేరకు.. తెన్కాశి జిల్లా శంకరన్ కోయిల్ రైల్వే కాలనీ సమీపంలో వేకువ జామున మృతదేహం కాలుతున్న వాసన రావడాన్ని వాకింగ్ వెళ్లిన వారు గుర్తించారు. దగ్గరకు వెళ్లి చూడగా ఓ పసికందు అగ్నికి ఆహుతి అవుతుండడంతో మంటల్ని ఆర్పే యత్నం చేశారు. అప్పటికే ఆ శిశువు మరణించింది. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ మంగై కరసి బృందం అక్కడికి చేరుకుని విచారించగా మగబిడ్డగా తేలింది. పసికందును సజీవ దహనం చేసిన వారి కోసం వేట మొదలెట్టారు. ఎస్పీ సుగుణాసింగ్ సైతం రంగంలోకి దిగారు. విచారణలో రైల్వే కాలనీ ఆరో వీధికి చెందిన శంకర గోమతి, ఆమె తల్లి ఇంద్రాణి ఈ కిరాతకానికి పాల్పడినట్టు తేలింది. వివాహం కాకుండానే ఓ వ్యక్తి ద్వారా శంకర గోమతి గర్భవతి అయింది. ఆబార్షన్‌కు యత్నించినా, సమయం మించడంతో గత్యంతరం లేక బిడ్డను కనాల్సి వచ్చింది. ఈ విషయం బయటకు రాకుండా తల్లి, కుమార్తె జాగ్రత్త పడ్డారు. బిడ్డ పుట్టిన నాలుగో రోజున ఈ అక్రమ సంతానం తమకు వద్దు అని ఈ కిరాతకానికి ఒడిగినట్టు విచారణలో తేలింది. దీంతో ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. (చదవండి: విశాఖలో విషాదం, కుటుంబం ఆత్మహత్య) ఇడ్లీ తినలేదని.. కళ్లకురిచ్చి జిల్లా త్యాగుదుర్గానికి చెందిన రోశి భార్య జయరాణి ఇటీవల మరణించింది. దీంతో రోశి రెండో వివాహం చేసుకున్నాడు. తన కుమార్తె ప్రిన్సీమేరి(5)ని జయరాణి తల్లి పచ్చయమ్మాల్ ఇంట్లో వదలి పెట్టాడు. పచ్చయమ్మాల్తో పాటు పెద్ద కుమార్తె ఆరోగ్య మేరీ ఆ ఇంట్లో ఉంది. బుధవారం పచ్చయమ్మాల్ పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఇంట్లో ఆరోగ్య మేరి, ప్రిన్సీ ఉన్నారు. ఇడ్లీ తినేందుకు ప్రిన్సీ మారాం చేయడంతో పెద్దమ్మ ఆరోగ్య మేరీ ఆగ్రహానికి లోనైంది. ఆ బిడ్డను ఇంట్లో ఉన్న దుడ్డుకర్రతో కొట్టింది. తీవ్రంగా గాయపడిన బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరిశీలించిన వైద్యులు బాలిక అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆరోగ్యమేరీని అరెస్టు చేశారు. బిడ్డ విక్రయం కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి అరగల కురిచ్చికి చెందిన మురుగవేల్, హేమలత దంపతులకు ముగ్గురు పిల్లలు. గత నెలాఖరులో మరో బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. కరోనాతో పనులు లేక పోషణ కష్టంగా మారింది. దీంతో పుట్టిన బిడ్డను తమ బంధువు పులియంకండ్రిగకు చెందిన ఫలినో ద్వారా కోయంబత్తూరుకు చెందిన రాజశేఖర్, కోకిల దంపతులకు రూ.80 వేలకు విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న శిశుసంక్షేమ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆ బిడ్డను విక్రయించిన తల్లిదండ్రుల్ని, కొనుగోలు చేసిన వారిని, మధ్యవర్తిని బుధవారం అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, చెన్నై తిరువొత్తియూరులో పైఅంతస్తులో ఆడుకుంటున్న లారీ డ్రైవర్ సుకుమార్ కుమారుడు సురేష్ కింద పడ్డాడు. చాలాసేపు ఎవరూ పట్టించుకోలేదు. ఎట్టకేలకు స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. -
అమ్మమ్మా.. ఇదేందమ్మా!
వీణవంక (హుజూరాబాద్): నెల రోజుల శిశువును అమ్మమ్మ అమ్మేసింది. మనవరాలి ఆలనా పాలనా చూడాల్సిన ఆమె అప్పులు తీర్చుకోవడం కోసం రూ లక్షకు విక్రయించింది. శిశువు కనిపించకపోవడంపై కూతురు నిలదీయడం.. తల్లీకూతుళ్ల గొడవను ఓ వ్యక్తి డయల్ 100కు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన జమల్పూరి పద్మ, రమేశ్ నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో నెల రోజుల క్రితం పద్మ ఆడశిశువుకు జన్మనిచ్చింది. వారం క్రితం భర్తతో గొడవ పడిన పద్మ.. స్వగ్రామంలోని తల్లి కనకమ్మ ఇంటికి వచ్చింది. కూతురికి మాయమాటలు చెప్పిన కనకమ్మ.. నాలుగు రోజుల క్రితం శిశువును పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి రూ.1.10 లక్షలకు విక్రయించింది. శిశువు కనిపించకపోవడంతో తల్లిని నిలదీయగా మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీసింది. పద్మ గట్టిగా నిలదీయడంతో డబ్బులకు అమ్మేశానని చెప్పడంతో రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. ప్రేమ వివాహం నచ్చనందుకే..! పద్మకు గతంలోనే వివాహమైంది. కుమారుడు, కూతురు ఉన్నారు. రమేశ్‌ను రెండో వివాహం చేసుకుంది. కులాంతర వివాహం చేసుకోవడంతో తల్లికి నచ్చలేదు. కూతురుపై కక్ష పెంచుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో అదునుగా తీసుకున్న కనకమ్మ.. కూతురును తన ఇంటికి తీసుకొచ్చింది. శిశు విహార్‌కు తరలింపు శిశువు విక్రయంపై ఎస్సై కిరణ్‌రెడ్డి పూర్తి స్థాయిలో విచారణ జరిపి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పర్చేందుకు కరీంనగర్‌లోని శిశువిహార్‌కు తరలించారు. కాగా, శిశువు విక్రయంలో కొందరు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు తెలిసింది. కనకమ్మ రూ.2 లక్షలు డిమాండ్ చేయగా రూ.1.10 లక్షలకు బేరం కుదిర్చినట్లు సమాచారం. -
94 ఏళ్ల వయస్సులో ‘సాహసం’
లండన్ : పండు ముదుసలి. 94 ఏళ్లు. కాటికి కాళ్లు చాపుకునే వయస్సు. అత్యంత సాహసానికి ఒడిగట్టింది. తన కుటుంబ సభ్యులను కలసుకోవాలనే ఆరాటమే అందుకు కారణం. ఇది వర కే లండన్ చేరుకున్న తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఫ్రాన్స్ నుంచి లండన్‌లోని డోవర్ రేవుకు అతి చిన్న పడవలో ఇద్దరు, ముగ్గురితో కలసి బయల్దేరింది. అత్యంత ప్రమాదకరమైన ఇంగ్లీషు ఛానల్లో అతి చిన్న పడవలో డోవర్ రేవు చేరుకునేందుకు బయల్దేరడం అంటే దుస్సాహసమే. ఇలాంటి దుస్సాహసాలకు ఎంతో ఇప్పటి వరకు ఎంతో మంది బలైపోయారు. అయినప్పటికీ ఫ్రాన్స్ నుంచి ఇంగ్లండ్‌కు అక్రమ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. 94 ఏళ్ల పండు ముసలవ్వ చిన్న పడవలో ఇంగ్లీష్ ఛానల్లో 21 మైళ్లు ప్రయాణించగానే బ్రిటన్ గస్తీ నౌకా దళం గమనించింది. వెంటనే ఆమెను, ఆమెతో పాటు వచ్చిన మరో ఇద్దరుముగ్గురిని అదుపులోకి తీసుకొని ఒడ్డుకు చేర్చింది. 94 ఏళ్లు కలిగిన వారు ఇంత వరకు వలస వచ్చేందుకు ప్రయత్నించలేదని, బహూశ వలసకు వచ్చిన వారిలో అతి పెద్ద వయస్కురాలు ఆమెనే కావొచ్చని ఇంగ్లండ్ నౌకాధికారులు తెలిపారు. ఆమె పేరు వెల్లడించేందుకు వారు నిరాకరించారు. (కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్!) ఇతరులతోపాటు తనకు పౌరసత్వం ఇవ్వాలని డోవర్ ఒడ్డుకు చేరుకున్న 94 ఏళ్ల వృద్ధురాలు దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధాప్యరీత్య ఆమెకు పౌరసత్వం లభించవచ్చని బ్రిటీష్ మీడియా అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు ఐదువేల మంది ఇంగ్లీష్ ఛానల్ ద్వారా ఫ్రాన్స్ నుంచి లండన్ వలస వచ్చేందుకు ప్రయత్నించారని బ్రిటీష్ అధికార వర్గాలు తెలిపాయి. చదవండి: ‘ఇంటి నుంచి పని’లో పదనిసలు -
అమ్మ కన్నా నానమ్మే ఎక్కువైందని..
చండీగఢ్: ప్రేమ ప్రాణం పోస్తుందంటారు. కానీ అదే ప్రేమ ప్రాణం తీస్తుందనడానికి ఓ ఘటన ఉదాహరణగా నిలిచింది. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన కుల్వీందర్ కౌర్ అనే మహిళకు అరష్ ప్రీత్ అనే ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. ఆమె భర్త ఉపాధి నిమిత్తం ఇటలీకి వెళ్లగా.. కొడుకుతో కలిసి అత్తగారింట్లోనే నివసిస్తోంది. అయితే ఆమెకు అత్తకు పొసిగేది కాదు. కానీ ఆమె పంచప్రాణాలైన కొడుకు మాత్రం తన నానమ్మతో బాగా చనువుగా ఉండేవాడు. ఇది కుల్వీందర్‌కు ఎంతమాత్రమూ నచ్చేది కాదు. (పైలట్ కోసం సిక్కుల ఔదార్యం) తనకన్నా నానమ్మపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని ఆమె లోలోపలే రగిలిపోయింది. ఈ క్రమంలో అత్తాకోడళ్ల మధ్య గొడవ కూడా జరిగింది. దీంతో కుల్వీందర్ తన కొడుకును చంపి తాను చనిపోవాలని నిర్ణయించుకుంది. కన్నకొడుకును కత్తితో పొడిచి అనంతరం భవనంలోని రెండో అంతస్థు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లవాడి అరుపులు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అతడి గదిలోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో అతడు శవమై కనిపించాడు. సదరు మహిళ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. హత్యానేరం కింద పోలీసులు కుల్వీందర్ కౌర్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనేది తెలియాల్సి ఉంది. (కన్న కూతురిని హతమార్చిన తల్లి.. ఆపై) -
తాప్సీ ఇంట్లో విషాదం..
నటి తాప్సీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తాప్సీ ఎంతగానో ఇష్టపడే ఆమె బామ్మ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె శనివారం ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. గురుద్వారలో తన బామ్మ అంతిమ సంస్మరణలకు చెందిన ఓ ఫొటోను షేర్ చేసిన తాప్సీ భావోద్వేగానికి లోనయ్యారు. ‘కుటుంబంలోని ఆ తరం వాళ్లు ఎప్పటికీ నిలిచిపోయే శూన్యాన్ని మనకు వదిలి వెళతారు’ అని పేర్కొన్నారు. దీంతో పలువురు నెటిజన్లు తాప్సీ బామ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే తన బామ్మ ఏ కారణం చేత మరణించారో మాత్రం తాప్సీ వెల్లడించలేదు. కాగా, తెలుగులో ఝమ్మంది నాదం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన తాప్సీ.. పలు చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉన్న ఆమె.. పలు ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తు మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. View this post on Instagram The last of that generation in the family leaves us with a void that will stay forever.... Biji ❤️ A post shared by Taapsee Pannu (@taapsee) on May 30, 2020 at 3:04am PDT -
భాగీరథి అమ్మకు ఆధార్!
తిరువనంతపురం: 105 సంవత్సరాల వయసులో నాల్గవ తరగతి పరీక్ష పూర్తిచేసి ‘మన్‌కీ బాత్’రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న కేరళ బామ్మ, భాగీరథి అమ్మ త్వరలో ఆధార్ కార్డు పొందనున్నారు. కేరళలోని కొల్లామ్‌లో నివసించే భాగీరథి అమ్మ కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ (కేఎస్‌ఎల్‌ఎమ్) నిర్వహించిన నాల్గో తరగతి పరీక్ష పాసైన ‘పెద్దవయసు విద్యార్థి’గా పేరొందారు. తనను మోదీ ప్రస్తావిండంతో సంతోషపడినా, ఆధార్ కార్డు ఇంతవరకు లేదని ఆవేదనచెందారు. కార్డు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్దిపొందలేకపోయారు. విషయం తెల్సుకున్న ఓ జాతీయ బ్యాంకు అధికారులు ఇటీవల ఆమె ఇంటికెళ్లి ఆధార్ ప్రక్రియను పూర్తిచేశారు. ‘కార్డు పొందేందుకు గతంలో యత్నించినా.. వృద్ధాప్యం కారణంగా ఆమె వేలిముద్రలు, కంటి రెటీనా స్కాన్ చేయలేకపోయాం’అని ఓ అధికారి వివరించారు. -
అమ్మమ్మ అశీర్వాదం
కడుపు పండటం.. తమలపాకుతో నోరు పండటం.. గోరింటాకుతో చేయి పండటం.. దైవధ్యానంతో బతుకు పండటం.. ఎన్ని పంటలు జీవితంలో! సంక్రాంతికి కూడా ధాన్యపు సిరులతో పాటుగా పండవలసినవి ఎన్నో ఉంటాయి. అవి పండకపోతే సంక్రాంతి లక్ష్మి కళ కాస్తయినా తగ్గుతుంది. కళ తగ్గితే ఆ లక్ష్మీదేవి ఎలా ఉంటుందన్న ఆలోచనకు అక్షరరూపమే ఈ సృజన రచన. ‘రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా ఈ కోవెల నీ ఇల్లు కొలువై ఉందువుగానీ’ అంటూ నన్ను ఎంత సాదరంగా ఆహ్వానించేవారో! ఇప్పుడెక్కడో గానీ ఆ స్వాగత గీతం వినిపించడం లేదు. స్వాగత తోరణం కనిపించట్లేదు’’ అని కలతపడింది సంక్రాంతి లక్ష్మి. ఆ మాటకు అమ్మమ్మ ఫక్కున నవ్వింది. సంక్రాంతి లక్ష్మి నిర్లిప్తంగా కూర్చుని ఉంది. ఆమె వదనంలో చిరునవ్వుల కాంతులు మినుకు మినుకుమంటున్నాయి తప్ప ప్రకాశించడం లేదు. ఊహ తెలిశాక ఎనభై సంక్రాంతులను చూసిన అమ్మమ్మ అక్కడికి వచ్చింది. వస్తూనే, ‘‘అమ్మా! సంక్రాంతి లక్ష్మీ.. నీ నిర్లిప్తతకు కారణం చెప్పు. మేం తీర్చగలిగేదైతే తీరుస్తాం. నువ్వు విషయం చెబితేనే కదా మాకు తెలిసేది’ అంటూ సంక్రాంతి లక్ష్మి చేతిలో చేయి వేసింది. అనునయించింది. ‘‘చెప్పు తల్లీ’’ అని మరొకసారి అడిగింది. సంక్రాంతి లక్ష్మి మౌనం వీడింది. ‘‘అమ్మమ్మా! కొన్నేళ్ల వరకు నేను కళకళలాడుతూ ఉండేదాన్ని. హరిదాసులు చిటితాళాలు మీటుతూ హరినామస్మరణ చేస్తుంటే, వీనుల విందుగా ఉండేది నాకు. వారి కావళ్లు ధాన్యాలతో నిండిపోతుంటే, నా మనసు కూడా పరవళ్లు తొక్కేది. గంగిరెద్దుల మేళాలు ఇంటింటికీ వచ్చి, డోలుసన్నాయి వాయిస్తూ, గంగిరెద్దును ఆడిస్తూ, ఆ ఎద్దును రకరకాల పాత చీరలతో అలంకరిస్తుంటే, వారి కళ్లలోని ఆనందాన్ని చూసి ఎంత సంబరపడేదాన్నో. ఇంటింటా ఆడపిల్లలు తెల్లవారుజామునే లేచి, వెన్నెల వన్నెతో పోటీ పడే ముగ్గుపిండితో రంగవల్లులు తీర్చుతుంటే, ఆకాశంలోని చుక్కలు నేల మీద చుక్కల్ని చూసి ఈర్ష్య పడుతుంటే, నాకు ఎంత ఆహ్లాదంగా అనిపించేదో. ధనుర్మాసం నెల్నాళ్లు గజగజ వణికే చలిలో దుప్పట్లు కూడా కప్పుకోకుండా, ఆవు పేడ కోసం బయలుదేరేవారు. గోవులను పెంచేవారి ఇళ్లన్నీ ఈ ఆడపిల్లల్తో కళకళలాడేవి. వారంతా వరుసలో నిలబడి, ఆవు పేడ తెచ్చుకుని, ఇంటికి వచ్చి, వాటిని గొబ్బెమ్మలుగా తయారుచేసి, పసుపు కుంకాలతో, పూలతో అలంకరించి, ఇంటి ముందున్న ముగ్గులో వాటిని ఉంచితే.. నేను కళకళలాడేదాన్ని. ఇప్పుడు ఆ కళకళలు పోయి వెలవెలలాడుతున్నాను. ఏ ఇంట్లోనూ చంటి పిల్లలకు భోగం చేసే భోగి పళ్లు కనిపించట్లేదు, భోగి మంటలు తగ్గిపోయాయి. బొమ్మల కొలువైతే లక్షమందిలో ఒకరు కూడా పెట్టట్లేదు. పిండి వంటలు మానేశారు. పొంగళ్లు, బొబ్బట్లు, అరిసెలు, గారెలు.. ఏవీ ... అసలు పండుగే జరుపుకోకపోతుంటే, ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తాయి నా పిచ్చితనం కాకపోతేను. ‘రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా ఈ కోవెల నీ ఇల్లు కొలువై ఉందువుగానీ’ అంటూ నన్ను ఎంత సాదరంగా ఆహ్వానించేవారో! ఇప్పుడెక్కడో గానీ ఆ స్వాగత గీతం వినిపించడం లేదు. స్వాగత తోరణం కనిపించట్లేదు. మరి నేను బాధ పడకుండా ఉండగలనా అమ్మమ్మా!’’ అంటూ అమ్మమ్మ చేతి కొంగుతో ముఖాన్ని దాచుకుంది సంక్రాంతి లక్ష్మి. అమ్మమ్మ ఫక్కున నవ్వింది. అయ్య.. వెర్రిపిల్లా! ఇందుకా నువ్వు బాధ పడుతున్నది. మరి నేను ఇంకెంత బాధపడాలి. నీ కంటె ఎక్కువ కష్టాలు చూశాను నా జీవితంలో. ముప్పై ఏళ్ల క్రితం వరకు పండుగ సెలవులకు నా మనవలంతా ఇంటికి వచ్చేవారు. వాళ్లకి ఎన్ని పిండివంటలు చేసిపెట్టేదాన్నో. ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చి, రహస్యంగా అడిగి తినేవారు. నేను ఇన్నేళ్లు ఇంత ఆయుర్దాయంతో ఉండటానికి కారణం ఆ జ్ఞాపకాలే. నా మనవలు, మునిమనవలు నా దగ్గరకు రావటం మానేసి పాతికేళ్లయ్యింది. ఇప్పుడు మళ్లీ రెండు మూడు సంవత్సరాలుగా వస్తున్నారు. అంటే నీకు అర్థమైందా! ఆనందమైనా, బాధ అయినా ఎక్కువకాలం ఉండదు. కష్టసుఖాలు, వెలుగునీడలు, తెలుపునలుపుల్లాగా.. పండుగలు కూడా కొన్నాళ్లు ఆనందంగాను, కొన్నాళ్లు ఏమీ లేకుండాను, మళ్లీ ఆనందంగాను గడుస్తాయి. నీ శోభ చిరకాలం చిరస్థాయిగానే ఉంటుంది. నువ్వు దిగులు పడకు. నువ్వు మళ్లీ తెలుగు లోగిళ్లలో సంబరాలు చూస్తావు. సంతోషంగా న వ్వుతూ ఉండు. తథాస్తు! చిరంజీవ! స్వస్తి!’’ అంటూ అమ్మమ్మ సంక్రాంతి లక్ష్మిని ఆశీర్వదించింది. – వైజయంతి పురాణపండ -
అమ్మమ్మపై మనవడి పైశాచికత్వం
అడ్డగుట్ట: సొంత అమ్మమ్మపైనే ఓ యువకుడు లైంగికదాడికి యత్నించిన సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీను కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఎంకమ్మ(80) భర్త మృతి చెందడంతో బీ.సెక్షన్లో ఉంటున్న తన తన కుమార్తె కౌసల్య ఇంట్లో ఉంటుంది. కౌసల్యకు గణేష్, రఘు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు రఘు మద్యం తాగుతూ జులాయిగా తిరిగేవాడు. గురువారం ఇంట్లో ఎవరూలేని సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రఘు ఇంట్లో నిద్రిస్తున్న ఎంకమ్మపై లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు రఘుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రఘుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తాతయ్య, నానమ్మలకు కారులో చోటు లేదా?
కారులో నాలుగు సీట్లుంటాయి.అమ్మా నాన్న ఇద్దరు పిల్లలకు సరిపోయేలా. సంసారం కారు కూడా అలాగే తయారైంది. ప్రయాణంలో పెద్దలు అడ్డమవుతున్నారు.బంధుత్వాలకి స్పీడ్‌బ్రేకర్లు పడుతున్నాయి.కలిసి చేసే ప్రయాణంలో ఇన్ని కుదుపులున్నప్పుడువిడి ప్రయాణం చేసి కలిసుండమంటున్నారు సైకియాట్రిస్టులు. కార్లను బేన్ చేయాలి అని ఒక నిమిషం అనిపించింది విశ్వానికి.ఆ గేటెడ్ కమ్యూనిటీలో తమ ఇంటి బయట పార్క్ చేసి ఉన్న తన కారును చూస్తే కోపం కూడా వచ్చింది అతనికి.గొడవ కారు వల్లనా? లేక నాలుగు సీట్లకు మించి ఎదగని మనుషుల వల్లనా?ఎం.టెక్ చేశాక పెళ్లి చేసుకున్నాడు విశ్వం. జంషెడ్‌పూర్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. భార్యను తీసుకుని అక్కడికి వెళ్లిపోయాడు. వెళ్లాక కారు కొన్నాడు. కారు నడపడం అతడికి సరదాగా ఉండేది. కొత్త భార్య పక్కన కూచుని ఉంటే నడపడం ఇంకా బాగుండేది.సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చే సమయానికి భార్య రెడీగా ఉండేది. కారు తీసుకొని షికారుకు వెళ్లేవారు. సడన్‌గా ఆమె సినిమా ప్రోగ్రామ్ అంటే కారులోనే రయ్యిమని వెళ్లిపోయేవారు. ఇద్దరు పిల్లలు పుట్టారు. వారి కోసం వెనుక రెండు సీట్లు సిద్ధంగా ఉన్నాయి. పిల్లలు వెనుక తల్లిదండ్రులు ముందు కూచుని డిక్కీలో రెండు మూడు రోజులకు సరిపడా బట్టలు పడేసుకొని ఒక్కోసారి హాలిడీ ట్రిప్‌కు వెళ్లిపోయేవారు. ఊరుగాని ఊరు... భాషకాని భాష.పెద్దగా ఫ్రెండ్స్ లేరు. కనుక బర్త్‌డే పార్టీ అయినా పండుగ వచ్చినా సెలవుదినమైనా నలుగురూ ఎంజాయ్ చేయడమే వారికి అలవాటైపోయింది.పదహారేళ్లు గడిచిపోయాయి.ఎంతకాలం ఇలా పరాయి ప్రాంతంలో? హైదరాబాద్ వెళ్లి అక్కడ ఉందాం అనుకున్నాడు విశ్వం. భార్య రాధ కూడా సరేనంది. పిల్లలిద్దరు ఒకరు ఎనిమిదిలోకి మరొకరు ఇంటర్లోకి వచ్చే సమయం కావడంతో ఇదే అదను అని కూడా అనుకున్నారు.‘విడిగా ఉండటం ఎందుకు? మా అమ్మా నాన్నతో ఉందాం. పెద్ద ఇల్లు కదా. ఏం ఇబ్బంది?’ అన్నాడు విశ్వం.‘అదే బెటర్. పెద్దవాళ్ల తోడు కూడా ఉన్నట్టుంటుంది’ అని రాధ.వాళ్లు హైదరాబాద్ వచ్చేశారు.మరో సంవత్సరానికి రాధ, విశ్వం మానసిక ప్రశాంతత కోల్పోయి, ఒకరిమీద ఒకరికి ప్రేమ చచ్చిపోయి, తీవ్ర అశాంతిలో ఉండగా సైకియాట్రిస్ట్ దగ్గరకు కౌన్సెలింగ్‌కు వచ్చారు. ‘ఏమిటి సమస్య?’ అని అడిగింది లేడీ సైకియాట్రిస్ట్.‘ఇద్దరం చాలా తగువులాడుకుంటున్నాం. జీవితం నరకంగా ఉంది’ అన్నాడు విశ్వం.‘ఆయన ముఖం చూస్తేనే కోపం వస్తోంది’ అంది రాధ.అన్నివిధాలా పరిణితి ఉన్న ఈ జంటకు ఏం సమస్య వచ్చిందా అని సైకియాట్రిస్ట్ ఆలోచించింది.అత్తామామలతో కలిసి ఉండటం మొదలెట్టాక రాధకు అనిపించిన మొదటి విషయం ఇకమీదట పిల్లల్ని ఇంట్లో వదిలి భర్తతో షికారుకు వెళ్లొచ్చు. డిన్నర్‌కు వెళ్లొచ్చు. సినిమాకు వెళ్లొచ్చు అని. పెళ్లయిన వెంటనే కాన్పు జరగడం పరాయి ప్రాంతంలో ఉండటం వల్ల మరోమనిషి తోడు లేకపోవడం వల్ల పిల్లల అన్నిపనులూ తనే చేయాల్సి రావడం ఎప్పుడూ పిల్లలు తోడుగా ఉండటం... వీటన్నింటి వల్ల భర్తతో గడిపే సమయం వచ్చింది అని రాధ అనుకుంది.రాధ అత్తమామలు ఏమో కొడుకు కోడలు రావడంతోనే అమ్మయ్యా ఇక అందరం కలిసి ఉండొచ్చు, కలిసి తిరగొచ్చు... ఇన్నాళ్లు కొడుకు కోడలు మనమలతో జీవితం చూడలేదు. ఇక ఒక్క క్షణం కూడా వీళ్లను వదిలేది లేదు అనుకున్నారు.రాధ, విశ్వంలు హైదరాబాద్ వచ్చినా వారి ధోరణి జంషడ్‌పూర్ ధోరణిగానే ఉంది. తమ పాటికి తాము ఫోన్ మాట్లాడుకుని, సడన్‌గా ఈవెనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం, ఒక్కోసారి ఇద్దరే వెళ్లడం, ఒక్కోసారి నలుగురే వెళ్లడం కొనసాగించారు. నిజానికి ఉన్న కారులో నలుగురే వెళ్లగలరు. నాలుగు సీట్లే ఉంటాయి. తమ సంగతి ఏమిటి అని అత్తామామలకు రంధి మొదలయ్యింది.‘వాళ్లు అక్కడున్నా అంతే. ఇక్కడున్నా అంతేనా?’ అని అత్తగారు మామగారి దగ్గర బాధ పడింది.‘ఇంట్లో పెద్దవాళ్లకు ఒక మాటచెప్తే ఏం పోతుంది?’ అని మామగారు మనసులో అనుకున్నారు.కాని మనసులో ఉన్నవి మనసులోనే ఉండవు. చేష్టలలో బయటపడతాయి. అత్తామామల నిరసన మెల్లగా రాధను తాకడం మొదలైంది.‘ఇదేమిటండీ... మీ అమ్మానాన్నలు మనల్ని చూసి ఏడుస్తున్నారు. కాళ్లు చేతులు గట్టిగా ఉన్నవాళ్లేగా. తిరగాలంటే వాళ్లూ తిరగొచ్చు. ఒక్క కారులో అందరం ఎలా తిరుగుతాం. వాళ్లకూ ఒక కారు ఉందిగా. డ్రైవర్‌ను పెట్టుకొని తిరగమనండి’ అంది రాధ ఒకరోజు విశ్వంతో.‘వాళ్లకు మనం తప్పితే ఎవరున్నారు. మనం ఎలాగోలా వాళ్లను కూడా కలుపుకొని పోవాలి’ అన్నాడు విశ్వం.కాజువల్‌గా అన్న మాటే. గతంలో అలా అతని ప్రాధాన్యంలో మరో మనిషి లేడు. ఇప్పుడు అతని ప్రాధాన్యంలో తల్లిదండ్రులు ఉన్నారని రాధకు అర్థం కావడంతోటే విశ్వం ‘కూరగాయలు తేనా’ అన్నా ‘గొంతుకోయనా’ అన్నట్టు రాధకు వినిపించడం మొదలయ్యింది.ఇంట్లో నాలుగు స్తంభాలాటగా ఉంది.నాలుగు స్తంభాలున్నప్పుడే అది ఇల్లవుతుందిగానీ ఏ స్తంభం ఎంతదూరంలో ఉండాలన్నదే పేచీగా మారింది. నవ్వుకుంటూ స్నేహంగా ఉండే ఆ మనుషులు చిరాగ్గా మారిపోయారు. పిల్లలకు కూడా ఇదంతా విసుగ్గా అనిపిస్తోంది. దీనికంతటికి ఫుల్స్టాప్ పెట్టాలని కౌన్సెలింగ్‌కు వచ్చారు.‘చూడండి... ఇందులో నేను చేయగలిందేమీ లేదు. మీ అమ్మా నాన్నలూ మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది’ అంది సైకియాట్రిస్ట్ విశ్వంతో.ఇది తెలిసిన విశ్వం తండ్రి ‘ఎందుకురా... సైకియాట్రిస్ట్ సమక్షంలోనే మాట్లాడుకుందాం’ అని ఆ వయసులో భార్యను వెంటబెట్టుకుని వచ్చాడు.ఆయనే సైకియాట్రిస్ట్‌తో అన్నాడు–‘చూడమ్మా... మేం ఒక విధంగా ఆలోచిస్తే వీరు ఒకవిధంగా రియాక్ట్ అయ్యారు. ప్రేమలూ బంధాలు ఆప్యాయతలు మరీ ఎక్కువైనా కష్టమే. అందరం తమదైన జీవితాన్ని జీవించే పద్ధతికి అలవాటయ్యామని నాకు అర్థమైంది. వీళ్ల గొడవ చూసి నేను కూడా ఆలోచించాను. ఆ గేటెడ్ కమ్యూనిటీలోనే మా వీధిలోనే వీళ్లు ఇంకొక ఇల్లు తీసుకుంటే సరిపోతుంది. మాతోనే ఉన్నట్టుంటుంది. విడిగానూ ఉన్నట్టుంటుంది. సాయంత్రాలు కలవొచ్చు. ఆదివారాలు కలవొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవొచ్చు. అంతేకాదు... ఒకరికొకరం కంటపడకుండా కొన్ని గంటలు ఉండొచ్చు. దూరం కూడా ప్రేమకు ఆధారం అనిపిస్తోంది. వీళ్లు మాతోనే ఉండాలని మాకు నియమం లేదు. కాని మా కళ్ల ముందు ఉండాలనైతే ఉంది’ అన్నాడాయన. ఆరు నెలలు గడిచాయి.రెండు కుటుంబాలు ఇప్పుడు ఆ చేదును మర్చిపోయాయి. అత్తగారు మామగారు ఇన్స్టెంట్ డ్రైవర్‌కు కాల్చేసి కావాల్సిన సమయాల్లో బయటకు వెళుతున్నారు. మనవల్ని కూడా తీసుకెళుతున్నారు. విశ్వం, రాధ ఒక్కోసారి పిల్లల్ని ఇంట్లో ఉంచి అత్తా మామలతో గుళ్లకు గోపురాలకు వెళ్లివస్తున్నారు. రెండు వంటగదులే అయినా వండినవి ఇరువురికీ అందుతున్నాయి.ఇది కూడా బాగున్నట్టే ఉంది.బంధాలు తెగిపోకుండా చేసుకునే ఏ అమరికైనా స్వాగతించాల్సిందే కదా .– కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ -
హార్ట్ టచింగ్ ఫోటో: కంటతడి పెట్టాల్సిందే..
అమ్మ తనకు ఆకలిగా ఉన్నా.. పిల్లల కడుపు నింపిన తర్వాతే భోజనం చేస్తుంది. కానీ పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆ తల్లి ప్రేమను మర్చి పోతారు. తమ దారేదో తాము చూసుకుంటారు. తల్లిదండ్రులకు పట్టేడన్నం పెట్టడానికి వెనుకాడతారు. వయసు పైబడిన వారు తమకు భారమైనట్టు, తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో విడిచిపెడుతుంటారు. మనవళ్లు, మనవరాళ్లను వారికి దూరం చేస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో ప్రతి ఒక్కరినీ చలింప చేస్తోంది. ఓ స్కూల్ బాలిక, ఓ వృద్ధురాలి పక్కన కూర్చుని గుక్కపెట్టి ఏడ్చే ఆ ఫోటో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఫోటోలోని బాలిక, స్కూల్ ఫీల్డ్ ట్రిప్‌లో భాగంగా అనూహ్యంగా ఓ వృద్ధాశ్రమంలో ఉన్న తన నాన్మమ్మను కలుసుకుంటోంది. ఇన్నాళ్లు నాన్నమ్మ బయటికి వెళ్లిందని నాన్న చెప్పే మాటలనే నమ్ముతూ వస్తున్న ఆ బాలికకు.. వృద్ధాశ్రమంలో తన నాన్నమ్మ కనిపించడం, ఆ తర్వాత నిజం తెలియడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గుజరాత్‌లోని ఓ ఫోటోగ్రాఫర్ దాదాపు పదేళ్ల కిందట ఈ హృదయ విదారకమైన సంఘటనతో పాటు వారి ఫోటోను కూడా గుజరాతి డైలీ ‘దివ్య భాస్కర్’లో ఫ్రంట్ పేజీలో పబ్లిష్ చేశాడు. అప్పట్లో అది ఓ సంచలన టాఫిక్‌గా మారింది. ఆ ఫోటో ఫేస్బుక్లో పెద్ద ఎత్తున షేర్ అయింది. తాజాగా పదేళ్ల తర్వాత మరోసారి ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2007 సెప్టెంబర్ 12న ఫోటోజర్నలిస్ట్ కల్పెష్ ఎస్ భరేచ్‌కు గుజరాత్ మనినగర్‌లోని జీఎన్సీ స్కూల్ ప్రిన్సిపాల్ నుంచి ఫోన్ వచ్చింది. ఘోదసర్‌లోని మనిలాల్ గాంధీ వృద్ధాశ్రమానికి స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్నామని, ఈ స్కూల్ ట్రిప్‌ను కవర్ చేయమని ప్రిన్సిపాల్ కోరారు. భరేచ్, పిల్లలతో పాటు వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు. కానీ ఆ అసైన్‌మెంటే తన జీవితాన్ని ఓ మలుపు తిప్పుతుందని భరేచ్ కలలో కూడా ఊహించి ఉండడు. ఫీల్డ్ ట్రిప్‌లో భాగంగా పిల్లలను, పెద్ద వాళ్ల పక్కన కూర్చోమని.. మంచి మంచి ఫోటోలు తీస్తున్నాడు. స్కూల్ పిల్లల్లో ఒక చిన్న అమ్మాయి.. ఒక గదిలోకి వెళ్లగానే ఓ ముసలావిడ దగ్గరికి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. ఆ మహిళ కూడా చిన్నారిని గట్టిగా పట్టుకుని ఏడ్చింది. ఏం జరిగిందా? అని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కానీ ఆ ముసలావిడ చెప్పిన స్టోరీ వినగానే మేమందరం ఒక్కసారిగా మూగబోయాం అని భరేచ్ చెప్పాడు. ఆ ముసలావిడ, ఆ అమ్మాయికి నాన్నమ్మ అట. ఎంతో కాలం తర్వాత మనవరాలిని చూసిన ఆ ముసలావిడ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు గట్టిగా పట్టుకుని తనివితీరా ఏడ్చారు. నాన్నమ్మ బయటికి వెళ్లిందని ఎప్పుడూ నాన్న చెబుతుండే వాడని ఆ పాప చెప్పింది. కానీ ఎప్పుడూ కూడా వృద్ధాశ్రమంలో ఉందని చెప్పలేదని కన్నీంటి పర్యంతమైంది. నానమ్మ, మనవరాళ్లు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్న ఫోటోతో పాటు, వీరి స్టోరీని గుజరాతి డైలీ దివ్య భాస్కర్లో ఫ్రంట్ పేజీలో పబ్లిష్ చేశారు. గుజరాత్ అంతటా అప్పట్లో ఇదే బిగ్ డిబేట్. అన్ని పత్రికలు, ఛానళ్లు కూడా దీన్నే మెయిన్ స్టోరీగా బ్రాడ్కాస్ట్ చేశాయి. ఆమెను వృద్ధాశ్రమం నుంచి తన ఇంటికి తీసుకెళ్లినట్టు భరేచ్ తర్వాత స్థానిక టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడెందుకు వైరల్ అవుతుంది.... ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా.. బీబీసీ గుజరాతీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్‌లను తమ కెరీర్లో తీసిన ఉత్తమమైన ఫోటోలను షేర్ చేయమని కోరింది. బీబీసీ గుజరాతీకి భరేచ్.. తన బెస్ట్ ఫోటోలన్నింటిన్నీ షేర్ చేయగా.. ఈ ఫోటో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. భరేచ్ ప్రస్తుతం దివ్య భాస్కర్లో పనిచేస్తున్నాడు. తన తండ్రి ఫోటో సోషల్ మీడియా వైరల్ అయిందని... చాలామంది సెలబ్రిటీలు దీనిపై ట్వీట్ చేస్తున్నారని.. కేవలం పేరు కోసం కాకుండా.. వృత్తి మీద ప్రేమతో పనిచేయాలని తన తండ్రి ఎప్పుడూ సూచిస్తుంటాడని... నిజంగా ఇది తమకెంతో గర్వకారణమని భరేచ్ కొడుకు దీపమ్ ఫేస్బుక్లో ఓ పోస్టులో తెలిపాడు. -
జల్దీ షాదీ కరో బేటా
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఈనెల 26న బర్త్‌డే జరుపుకున్నారు. అదే రోజు కొన్ని బెదిరింపులు ఎదుర్కొన్నారట ఆయన. అయితే అవి వృత్తిపరమైనవి కాదండోయ్.. వ్యక్తిగతమైనవి. ముప్పై మూడేళ్లు వచ్చాయ్.. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? అని అర్జున్ కపూర్ వాళ్ల నానమ్మ (నిర్మలా కపూర్) ప్రేమగా బెదిరించారట. ఈ విషయాన్ని అర్జున్ పంచుకుంటూ–‘‘రిక్వెస్ట్, బెదిరింపు, కమాండ్... ఏదైనా అనుకో.. కానీ పెళ్లి మాత్రం ఎప్పుడు చేసుకుంటావు? అని ఇంట్లో ఒకటే పోరు పెడుతున్నారు. బర్త్ డే రోజు పంపిన గిఫ్ట్ కార్డ్ మీద కూడా ‘జల్దీ షాదీ కరో బేటా’ (త్వరగా పెళ్లి చేసుకో బాబు) అని రాసి పంపారు నానమ్మ’’ అన్నారు. -
ఆ బామ్మ ఎవరో చెప్పిన సెహ్వాగ్
భోపాల్ : పాత తరం టైప్ మెషీన్‌పై తన వేళ్లను అలవోకగా, అతివేగంగా పరుగులు పెట్టిస్తూ.. ఆధునిక కంప్యూటర్లో డిలీట్, బ్యాక్ బటన్లతో కుస్తీలు పడుతూ ఉన్న ఓ బామ్మ వీడియో కొద్దిరోజులుగా నెట్టింట్లో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వీడియో వైరల్ అయితే అయింది కానీ ఈ టైపింగ్ బామ్మ ఎవరు? ఎక్కడి వారు అన్న విషయం తెలియలేదు. సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించే టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆ బాధ్యత తీసుకొని ఆ బామ్మ ఎవరో ప్రపంచానికి తెలియజేశాడు. ఈ టైపింగ్ బామ్మ మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌కు చెందిన మహిళ అని ట్వీట్ చేశాడు. A superwoman for me. She lives in Sehore in MP and the youth have so much to learn from her. Not just speed, but the spirit and a lesson that no work is small and no age is big enough to learn and work. Pranam ! pic.twitter.com/n63IcpBRSH — Virender Sehwag (@virendersehwag) June 12, 2018 ‘నాకు సూపర్ మహిళా. మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో నివసించే ఈమె నుంచి యువత ఎంతో నేర్చుకోవచ్చు.ఆమె చేతి వేళ్ల వేగం గురించి కాదు.. చిన్న ఉద్యోగం, పెద్ద వయసు పనిచేయడానికి ఆటంకం కాదనే పాఠాన్ని నేర్చుకోవచ్చు.. ప్రణామ్!’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఈ బామ్మను మరోసారి సూపర్ వుమన్ను చేసింది. దీంతో జాతీయ మీడియా ఆమె ఇంటి తలుపు తట్టింది. రుణాలు చెల్లించడానికే ఈ ఉద్యోగం చేస్తున్నట్లు టైపింగ్ బామ లక్ష్మీబాయ్ తెలిపారు. నేను అడుక్కోలేను.. ‘నా కూతురికి ప్రమాదం జరగడంతో రుణం తీసుకున్నాను. అది చెల్లించడానికే ఈ ఉద్యోగం చేస్తున్నా. నేను అడుక్కోలేను. జిల్లా కలెక్టర్ రాఘవేంద్ర సాయంతో ఈ ఉద్యోగం లభించింది. సెహ్వాగ్ నా వీడియో షేర్ చేయడం బాగుంది. రుణాలు చెల్లించడానికి, సొంత ఇళ్లు నిర్మించుకోవడానికి నాకు సాయం కావాలి’ అని లక్ష్మీబాయ్ తెలిపారు. -
సూపర్ బామ్మ వైరల్ వీడియో
సాక్షి: రికార్డులను బ్రేక్ చేసిన బామ్మ వంటకాలను ఘుమఘుమలు ఆస్వాదించాం. అంతకుమించి 90సంవత్సరాల వయసులో యోగాసనాలతో ఇరగదీసిన వీడియోలను చూసి మురిసిపోయాం. తాజాగా మరో బామ్మ వీడియో నెట్లో చక్కర్లు కొడుతోంది. పాత తరం టైప్ మెషీన్‌పై తన వేళ్లను అలవోకగా, అతివేగంగా పరుగులు పెట్టిస్తూ.. ఆధునిక కంప్యూటర్లో డిలీట్, బ్యాక్ బటన్లతో కుస్తీలు పడుతూ టైపింగ్కోసం అష్టకష్టాలుడుతున్న నేటి తరం టైపిస్టులకు, కంప్యూటర్ ఆపరేటర్లకు సవాల్ విసురుతోందంటే అతిశయోక్తి కాదేమో. టైపింగ్ మిషన్‌మీద సునామీ వేగంతో టైప్ చేస్తున్న వైనం నెటిజనులను బాగాఆకట్టుకుటోంది. ఈ వీడియో ఎపుడు, ఎక్కడ తీసింది లాంటి ఇతర వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. కానీ రిజిస్ట్రార్ ఆఫీసులో నోటరీని టైప్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ముదిమి వయసులో కూడా తమకిష్టమైన క్రీడలు తదితర రంగాల్లో ప్రతిభను చాటుకున్న వారిని చాలామందినే చూశాం. కానీ ఈ టైపింగ్ బామ్మ మాత్రం నిజంగా సూపరే.. మరి మీరు కూడా ఓ లుక్కేసుకోండి.. -
టైపింగ్ మిషన్‌మీద సునామీ వేగంతో
-
దుఃఖాన్ని దిగమింగుకొని వికెట్లు తీశాడు
జైపూర్ : ఆకస్మాత్తుగా ఏదైనా చెడు వార్త వింటేనే తట్టుకోలేము.. ఇక అది మన కుటుంబ సభ్యుల గురించైతే..ఆ బాధ వర్ణనాతీతం. కానీ కింగ్స్ పంజాబ్ ఆటగాడు, ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై దుఃఖాన్ని దిగమింగుకోని రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్నాడు.ఈ మ్యాచ్‌లో ఆడటమే కాదు నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఆండ్రూ టై నానమ్మ మరణించినట్లు మంగళవారం అతనికి కబురందింది. కానీ ఆటపట్ల శ్రద్దతో ఏ మాత్రం కుంగుబాటుకు లోనుకానీ టై అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దీంతో ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ అనంతరం తీవ్ర భావోద్వేగానికి లోనైన టై తన నానమ్మ మరణించిన విషయాన్ని తెలిపాడు. ‘ మా నానమ్మ ఇక లేరు. ఈ ప్రదర్శనను ఆమెతో నాకుటుంబ సభ్యులకు అంకితమిస్తున్నాను. ఇది నాకు భావోద్వేగపూరితమైన మ్యాచ్. నా జీవితంలో చాలా కఠినమైన రోజు. నేనెప్పుడు క్రికెట్‌ను ఇష్టపడుతాను. మా జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. ఒక్కోసారి బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణిస్తారు. కొన్నిసార్లు విఫలం అవుతారు. పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. కొత్త బంతి మాకు అనుకూలించింది.’ అని వ్యాఖ్యానించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత గౌతమ్‌ను ఔట్ చేసిన టై చివరి ఓవర్లో బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, ఉనద్కత్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో రాజస్తాన్ 158 పరుగుల సాధారణ లక్ష్యమే నమోదు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్ మినహా పంజాబ్ బ్యాట్స్‌మన్ విఫలమవ్వడంతో రాజస్తాన్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అవ్వ చేసిన పొరపాటు.. ఎయిర్‌పోర్టు హడల్
బ్రిస్బేన్ : ముంబైకి చెందిన ఓ బామ్మ చేసిన పొరపాటు ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టు అధికారులకు చుక్కలు చూపించింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన వెంకట లక్ష్మి అనే బామ్మ తన పుట్టిన రోజు వేడుకల కోసం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు వెళ్లింది. వెళ్తూ ఓ బ్యాగ్‌లో తన లగేజీని తీసుకెళ్లింది. అసలు సమస్య అక్కడే ప్రారంభం అయ్యింది. ఎయిర్‌పోర్టులో దిగంగానే బామ్మ లగేజ్‌పై ఉన్న విషయాన్ని చూసిన అధికారులు హడలి పోయారు. అంతే కాకుండా లగేజీ మొత్తం తనిఖీ చేశారు. కానీ ఏమీ బయట పడలేదు. కానీ అసలు విషయం ఏంటంటే.. బామ్మ తను తీసుకెళ్లే బ్యాగ్‌పై బాంబే టూ బ్రిస్బేన్ బదులు 'బాంబ్ టూ బ్రిస్బేన్' అని రాసుకుంది. అది చూసిన అధికారులు బ్యాగ్‌లో బాంబ్ ఉందేమోనన్న అనుమానంతో ఎయిర్‌పోర్టు మొత్తం అలెర్ట్ చేశారు. అనంతరం బామ్మను ప్రత్యేక గదిలో విచారించగా అసలు విషయం ఏంటో తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. బ్యాగ్‌పై తగిన ఖాళీ లేకపోవడం వల్ల బాంబే బదులు బాంబ్ అని రాసుకున్నానంటూ అధికారులకు తెలిపింది. ఈ సంఘటనపై బామ్మ కుమార్తె జోతిరాజ్ మాట్లాడుతూ తన తల్లికి ఇంగ్లీష్ పూర్తిగా రాదని, చదవడం రాయడం అరకొరగా తెలుసునంటూ అధికారులకు తెలిపింది. అందుచేతనే బ్యాగ్‌పై అలా రాసుకొచ్చిందని, బాంబ్ అని రాయడం వల్ల ఎదురయ్యే పర్యవసానాలు తన తల్లికి తెలియవంటూ అధికారులకు వివరించింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. So, this caused a bit of an issue at #Brisbane airport. Police cordoned off part of the terminal after this bag popped out on the luggage belt. The passenger was coming from Mumbai, formerly Bombay. Airport code: BOM. #CommonwealthGames2018 pic.twitter.com/p7qgTFLMsX — Siobhan Heanue (@siobhanheanue) April 5, 2018 -
హీరోయిన్ బామ్మ ‘జిగేల్ రాణి’ స్టెప్పులు!
‘జిల్.. జిల్.. జిగేల్ రాణి’ పాట ఇప్పుడు ఇంటర్నెట్లో దుమ్మురేపుతోంది. రాంచరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ సినిమాలోని ఈ ప్రత్యేక పాట వీడియో ప్రోమోను.. రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ పాటలో పూజా హెగ్డే చూపించిన సోయగాలు, వేసిన స్టెప్పులు.. డ్యాన్స్‌తో అదరగొట్టిన రాంచరణ్.. అన్నీ ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ప్రస్తుతం (బుధవారం సాయంత్రానికి) య్యూటూబ్‌లో నంబర్ వన్‌గా ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను దాదాపు 30 లక్షల వ్యూస్ వచ్చాయి. ఆన్లైన్లో దుమ్మురేపుతున్న ఈ పాటకు స్వయంగా పూజాహెగ్డే బామ్మ కూడా స్టెప్పులు వేశారు. 86 ఏళ్ల బామ్మ హుషారుగా ఈ పాటకు స్టెప్పులు వేస్తున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘మా బామ్మ గతకొన్ని రోజులుగా ఆస్పత్రిలో ఉంది. నా ‘జిగేల్ రాణి’ పాట ప్రోమోను చూసి ఆమె సంతోషంలో మునిగిపోయారు. వెంటనే లేచి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఈ పాట ఆమెకు ఎనర్జి ఇచ్చినట్టు ఉంది. అందుకే నేను చేసి పనిని ఇష్టపడి చేస్తాను’ అని పూజ ట్వీట్ చేశారు. జిగేల్ రాణి పాటకు పూజ బామ్మ స్టెప్పులు వేయడం నెటిజన్లను అలరిస్తోంది. -
కరుణించని అధికారులు..
► రేషన్ కార్డులో పేరున్నా... వేలిముద్రలు పడలేదని బియ్యం ఇవ్వని వైనం ►ఏడాది కాలంగా పింఛన్ కోసం ఎదురుచూపులు ►కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోని యంత్రాంగం ►మీకోసంలో కలెక్టర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్న వృద్ధురాలు కడప: అడుగులు వేయడానికే అవ్వకు కష్టం....అలాంటిది ఏడాది కాలంగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. చేతిలో కర్ర ఉంటే తప్ప కదల్లేని పరిస్థితి. ఒకవైపు భర్త తనువు చాలించిన బాధ.. మరోవైపు కడుపు నింపుకునేందుకు కావాల్సిన బువ్వ కోసం పడుతున్న వేదన అంతా ఇంతా కాదు.. రేషన్‌కార్డులో పేరున్నా.. వేలి ముద్రలు పడలేదనే నెపం చూపి నెలల తరబడి అధికారులు బియ్యానికి ఎసరు పెట్టారు. భర్త మృతి చెంది ఏడాది దాటినా నేటికీ పింఛన్ అందడం లేదు. నడవలేకున్నా.. అంతో ఇంతో ఆసరా ఇస్తుందన్న ఆశతో పింఛన్, రేషన్ కోసం అవ్వ ఏడాదిగా పడుతున్న తిప్పలు చూసి కూడా అధికారులు కరుణించలేదు. వీరబల్లి మండలం రామాపురం పంచాయతీ పరిధిలో నివాసముంటున్న కొండూరు వెంకట్రాజు ఏడాది క్రితం మృత్యువాతపడ్డాడు. అప్పటివరకు వెంకట్రాజుతోపాటు భార్య రెడ్డెమ్మ పేరు మీద ఉన్న రేషన్‌కార్డుపై బియ్యంతోపాటు ఇతర సరుకులు వచ్చేవి. తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ ఆ వృద్ధురాలికి బియ్యం రాలేదు.. పింఛన్ మంజూరు కాలేదు. దీంతో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. చూస్తాం...చేస్తాం...అన్న హామీలు తప్ప ఆమెకు న్యాయం జరగలేదు. రేషన్ లేదు...పింఛన్ రాదు.. రెడ్డెమ్మకు రేషన్ కార్డు ఉంది. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్ఏపీ 11380 1701345 నెంబరుతో రేషన్‌కార్డు మంజూరైంది. అయినా దాదాపు చాలా రోజులుగా సరుకులు ఇవ్వడం లేదు. కేవలం వేలి ముద్రలు పడటం లేదని మూడు, నాలుగు నెలలుగా సాకు చెబుతున్నారు. తీరా ఆరా తీస్తే ఇన్‌యాక్టివ్ పేరుతో కార్డునే తొలగించినట్లు తెలుస్తోంది. అలాగే పింఛన్ కోసం కూడా ఏడాది కాలంగా నిరీక్షిస్తోంది. ఒకటికి రెండుమార్లు దరఖాస్తు చేసినా బుట్టదాఖలు చేశారు. కనీసం భర్త చనిపోయిన తర్వాత వితంతువు పేరుతో అయినా ఇవ్వవచ్చు.. అదీ చేయలేదు. కలెక్టర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్న అవ్వ ఎంతమందిని మొక్కినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం కడప కలెక్టరేట్లో జరిగిన మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ బాబూరావునాయుడును రెడ్డెమ్మ కలిసి గోడు వెళ్లబోసుకుంది. న్యాయం చేయండి మహాప్రభో అంటూ వేడుకుంది. మరి ఆ వృద్ధురాలికి న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే. -
అవ్వ కళ్లలో ఆనందపు జల్లు
ఆ అవ్వ కళ్లలో ఆనందం వెల్లివిరిసింది.. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూపాన్ని ఐదేళ్లుగా కళ్లలో పెట్టుకుని ఆరాధిస్తున్న ఆమె.. శనివారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసింది. ఆ మహానేత ప్రతిరూపాన్ని చూసిన వెంటనే ఆమె మోము కోటి కాంతుల దివ్వెలా వెలిగిపోయింది. ఆ మనవడి ఆప్యాయత, పలకరింపుతో పులకించిపోయింది. అనురాగంగా ‘అవ్వా ఎక్కడ నుంచి వచ్చావ’ని జగన్ అడగడంతో గుండెలనిండా సంతోషంతో ‘గుంటూరు జిల్లా ఈపూరు నుంచి వచ్చానయ్యా.. నాకు పింఛన్ ఇచ్చి అన్నం పెట్టిన ఆ మహానుభావుడు కనుమరుగైనప్పటి నుంచి నిన్ను చూడాలని కలలు కంటున్నా.. ఇన్నాళ్లకు కుదిరిందయ్యా’ అని చెప్పింది. ఇది విన్న ప్రతిపక్ష నేత చిన్న పిల్లాడిలా మారిపోయి బామ్మను గుండెలకు హత్తుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, పార్టీ నాయకులతో సమావేశాలు వంటి కార్యక్రమాలను పక్కనపెట్టి స్వచ్ఛమైన చిరు దరహాసంతో ఆమెతో 15 నిమిషాలు మాట్లాడారు. ‘నిన్ను చాలా ఇబ్బంది పెట్టారయ్యా.. ఎవ్వరికీ భయపడకు.. నువ్వు సీఎం అవుతావు’ అంటూ అవ్వ ధీమాగా చెప్పి అక్కడి నుంచి సెలవు తీసుకుంది.. జగన్‌ను కలిసిన మధుర క్షణాలను గుండెలనిండా నింపుకుంటూ.. ఈపూరు (వినుకొండ) -
బామ్మకు షాకిచ్చిన హైదరాబాద్ బుడ్డోడు!
-
92 ఏళ్ల బామ్మను వేధిస్తున్న డోనాల్డ్ ట్రంప్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల అభ్యర్థిగా పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ చీకటి కోణాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. స్కాట్లాండ్లోని తన లగ్జరీ గోల్ఫ్ కోర్టును విస్తరించడం కోసం ట్రంప్ 92 ఏళ్ల ఓ స్కాటిష్ బామ్మను, ఆమె కుమారుడిని గత నాలుగేళ్లుగా వేధిస్తున్నారు. తాగేందుకు నీళ్లు లేకుండా చేయడమే కాకుండా కంటి మీద కునుకు లేకుండా కూడా చేస్తున్నారు. డోలాల్డ్ ట్రంప్‌కు స్కాట్లాండ్లోని అబర్డీన్షైర్లో 600 హెక్టార్లలో లగ్జరీ గోల్ఫ్ కోర్టు ఉంది. దీన్ని 2012లో ప్రారంభించారు. ఆ తర్వాత దీన్ని మరింత విస్తరించాలనుకున్నారు. దీనికి ఆనుకొని 92 ఏళ్ల మోలీ ఫోర్బ్స్ ఇల్లుంది. అందులో ఆమె తన కుమారుడు మైఖేల్ ఫోర్బ్స్తో కలసి నివసిస్తోంది. ఎంతోకొంత నష్టపరిహారం చెల్లిస్తామని, ఇల్లు, వాకిలి వదిలేసి వెళ్లాల్సిందిగా ట్రంప్ మనుషులు బెదిరిస్తూ వచ్చారు. అయినా మోలీ ఫోర్బ్స్ ఆయన బెదిరింపలకు భయపడలేదు. చచ్చినా సరే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన ట్రంప్ మనుషులు గోల్ఫ్ కోర్టు నుంచి ఆమె ఇంటికి వెళుతున్న మంచినీళ్ల పైపులైన్‌ను ధ్వంసం చేశారు. దాంతో ఫోర్బ్స్ ఇంటికి మంచినీటి సరఫరా నిలిచిపోయింది. స్థానిక ప్రభుత్వ అధికారులకు ఆమె ఫిర్యాదు చేశారు. ట్రంప్ మనుషులు దాన్ని ధ్వంసం చేసినందున ట్రంప్‌యే దాన్ని మరమ్మతు చేయాలని స్థానిక అధికారులు నోటీసు ఇచ్చి ఊరుకున్నారు. మరమ్మతు చేయడానికి ట్రంప్ ససేమిరా అన్నారు. చేసేదేమీలేక మోలీ ఫోర్బ్స్ దూరానున్న ఏటి వద్దకెళ్లి గత నాలుగేళ్లుగా అవసరమైన నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇళ్లు ఖాళీచేయించడానికి ఆమెపై మరింత ఒత్తిడి తీసుకరావడం కోసం ఆమె ఇంటిముందు గోల్ప్ కోర్టు సరిహద్దులో భారీ గోడను నిర్మించారు. ఆమె బెడ్రూమ్కు ఎదురుగా ఫ్లడ్ లైట్ ఏర్పాటు చేశారు. ఫ్లడ్‌లైట్ వెళుతురుకు తనకేరోజు సరిగ్గా నిద్ర పట్టడంలేదని, అయినా సరే వారి ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని, తన బొందిలో ప్రాణం ఉన్నంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని మోలీ ఫోర్బ్స్ ‘యూ హావ్ బీన్ ట్రంప్డ్ టూ’ అనే డాక్యుమెంటరీ చిత్రంలో వెల్లడించారు. ఆమె పోరాటానికి ఆమె కుమారుడు మైఖేల్ ఫోర్బ్స్ కూడా మద్దతిస్తున్నారు. ట్రంప్ మనషులు పొద్దస్తమానం తన ఇంటిముందుకు వచ్చి రకారకాలుగా తిట్టి పోతుంటారని, వారి తిట్లను పట్టించుకోవడం మానేశానని ఆమె చెప్పారు. స్కాట్‌ల్యాండ్‌లో 90 శాతం ప్రజలు ట్రంప్‌కు వ్యతిరేకమని మైఖేల్ ఫోర్బ్స్ తెలిపారు. ట్రంప్‌ను దేశాధ్యక్షుడిగా ఎన్నికుంటే అది అమెరికన్ల దౌర్భాగ్యం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘యూ హావ్ బీన్ ట్రంప్డ్ టూ’ అనే డాక్యుమెంటరీని బ్రిటీష్ ఫిల్మ్ మేకర్ ఆంటోని బాక్స్టర్ నిర్మించారు. అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లోగా దీన్ని విడుదల చేస్తానని ఆయన మీడియాకు తెలిపారు. దీన్ని నిర్మించడం వెనక తనకు రెండు లక్ష్యాలు ఉన్నాయని, ట్రంప్ వేధింపులకు గురవుతున్న మోలీ ఫోర్బ్స్‌ను న్యాయం జరగాలని కోరుకోవడం ఒకటైతే అలాంటి వ్యక్తిని ఓ దేశాధ్యక్షుడిగా ఎలా ఎన్నుకుంటారని అమెరికన్లను ప్రశ్నించడం రెండో లక్ష్యమని ఆయన అన్నారు. స్కాట్లాండ్ తన తల్లి ఊరవడంతో అక్కడ ట్రంప్ రెండు లగ్జరీ గోల్ఫ్ కోర్టులను నిర్మించారు. అబర్డీన్షైర్లో నిర్మించినదానికి ‘ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ లింక్స్’ అని పేరు పెట్టగా, అయిర్షైర్లో నిర్మించిన గోల్ఫ్ కోర్టుకు ‘టర్న్బెర్రీ’ అని పేరు పెట్టారు. -
అందరూ ఉన్నా అనాథలా అవ్వ
ఐదుగురు కొడుకులున్నా పట్టించుకోని వైనం నిరాహారదీక్షతో తనువు చాలించిన దైన్యం అశ్వాపురం: ఐదుగురు కొడుకులున్నా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన 80 ఏళ్ల వృద్ధురాలు కందిమళ్ల సరోజనమ్మ గురువారం మృతిచెందారు. రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆమె ఆరోగ్యం గురువారం నాటికి పూర్తిగా క్షీణించింది. అటు అధికారులు కూడా స్పందించకపోవడంతో ఆమెకు మరణమే శరణ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. సరోజనమ్మకు ఐదుగురు కొడుకులతో పాటు ముగ్గురు కుమార్తెలు. ఈ ఐదుగురు కుమారుల్లో ఎవరూ పట్టించుకోవడం లేదు. మూడో కుమారుడు కందిమళ్ల కృష్ణారెడ్డి తల్లి సరోజనమ్మ పేరిట ఉన్న ఎనిమిదిన్నర ఎకరాల భూమిలో నాలుగు ఎకరాలు ఆమెకు తెలియకుండా నకిలీ సంతకాలతో పట్టా చేయించుకున్నాడు. తన భూమిని తనకు ఇప్పించడంతో పాటు కొడుకులు పోషణ బాధ్యత చూసే విధంగా చర్యలు తీసుకోవాలని సరోజనమ్మ బుధవారం నుంచి నిరాహారదీక్ష చేపట్టింది. అన్నపానీయాలు మాని దీక్ష చేస్తుండటంతో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించి సొమ్మసిల్లి పడిపోయింది. కుటుంబసభ్యులు, స్థానికులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గ్రామస్తుల ఆగ్రహం రెండురోజులుగా 80 ఏళ్ల వృద్ధురాలు పంచాయతీ ఆఫీసు ఎదుట ఆందోళన చేస్తుంటే కుటుంబసభ్యులు, అధికారులు స్పందించపోవడంపై మొండికుంట గ్రామస్తులు మండిపడ్డారు. అధికారులు ఆ వృద్ధురాలి సమస్య ఏమిటో కూడా తెలుసుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఈ 'మిరాకిల్'.. వెరీవెరీ రేర్!
అమ్మమ్మ, అమ్మ, మనవరాలు.. ఈ అనుబంధమే ఎంతో మధురమైనది. ఈ అనుబంధానికి ఓ 'అద్భుతం' తోడయితే అది 'మిరాకిల్' జననం అవుతుంది. ఇంతకువిషయమేమిటంటే 'మిరాకిల్' అనే పండంటి పాప జనవరి 18న జన్మించింది. ఆ రోజు ఎంత స్పెషల్ అంటే అదే రోజున 'మిరాకిల్' తల్లి ఎయిమీ హెర్నాండో, అమ్మమ్మ కూడా జన్మించారు. అంటే ఆ కుటుంబంలో మూడు తరాలకు చెందిన ఆడపిల్లలు ఒకేరోజున ఈ భూమి మీద అడుగుపెట్టారన్నమాట. జనవరి 18న హెర్నాండో 33వ పుట్టినరోజు. అదే రోజున ఆమె తల్లి 56వ పడిలో అడుగుపెట్టింది. అలాంటి తరుణంలో గర్భవతిగా ఉన్న హెర్నాండోకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. హెర్నాండోలో ఒకటే ఎక్సైట్మెంట్. 'నేను లేబర్ రూమ్‌లోకి వెళ్లగానే.. డాక్టర్‌కు ఒకటే విషయం చెప్పాను అర్ధరాత్రి లోపు ప్రసవం జరుగాలని..' అని హెర్నాండో ఇప్పుడు గర్వంగా చెప్తోంది. జనవరి 18న సాయంత్రం భూమి మీద అడుగుపెట్టిన ఆ పండంటిపాపకు 'మిరాకిల్ జాయ్' అని పెట్టారు. 'మా పుట్టినరోజులకు ఇంతకన్నా గొప్ప బహుమతి ఏముంటుంది' అంటూ ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది. 'లేబర్‌రూమ్‌లో పురిటినొప్పుల పడుతున్నడు.. ఓ మై గాడ్.. ఈ అద్భుతం నిజంగానే జరుగుతున్నదా అని ఎక్సైట్ అయ్యాను' అని తెలిపింది. అదృష్టం జన్మదినం విషయంలోనే కాదు వారి బరువు విషయంలోనూ కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది. 'మా అమ్మ పుట్టినప్పుడు తను ఆరు పౌండ్ల 10 ఔన్సులు బరువు ఉందట. నేను పుట్టినప్పుడు నా బరువు ఆరు పౌండ్ల 9 ఔన్సులు. ఇప్పుడు మిరాకిల్ ఆరు పౌండ్ల 8 ఔన్సులు ఉంది. ఇది కూడా ఎంతో కూల్ విషయం కదా' అంటోంది ఆమె. సాధారణంగా మూడు తరాల వారు ఒకే తేదీన జన్మించడం అత్యంత అరుదని, అది 1,33,225 మందిలో ఒకరికి జరిగే అవకాశం ఉంటుందని గణాంక శాస్త్రవేత్త కీత్ డెవ్లిన్ వివరించారు. దాదాపు ఏడేళ్ల ఇబ్బందుల తర్వాత గర్భవతి అయిన హెర్నాండో తన నాలుగో సంతానమైన పాపకు 'మిరాకిల్' అని పెట్టడం అనివిధాల సమంజసం అని భావిస్తున్నట్టు చెప్తోంది. -
తాత, బామ్మకు పెళ్లి.. చేశారు మళ్లీ
గుండేపల్లి (నల్లజర్లరూరల్) : మనుమలు, మునిమనుమలతో సహా వారసులంతా ఒక్కచోట చేరి తాతా, బామ్మలకు పెళ్లి చేశారు. ఇన్నాళ్ల వారి దాంపత్య జీవితాన్ని తీయగా పండించుకున్న వారికి ఈ షష్టిపూర్తి పండగ పూట ఓ చిరుకానుక అయ్యింది. తమ వారసులు మళ్లీ పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తు చేయడంతో ఆ రెండు మనసులు మురిసిపోయాయి. బోసి నవ్వుతో తాత, బామ్మలు పులకించిపోయారు. నల్లజర్ల మండలం గుండేపల్లి గ్రామానికి చెందిన గుడ్ల పుల్లయ్యకు 102 సంవత్సరాలు. ఆయన భార్యకు 94 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఎవరికీ భారం కాకుండా ఇప్పటికీ ఆ జంట తమ పనులు తామే చేసుకుంటూ, తమ వంట తామే చేసుకుంటూ జీవిస్తున్నారు. గురువారం ఆ దంపతులకు వారి కుమారులు, మనవళ్లు, మనవరాండ్రు మొత్తం 69 మంది షష్టిపూర్తి ఉత్సవం నిర్వహించి ఊరంతా భోజనాలు పెట్టారు. వారి సంతానం అంతా వ్యవసాయ కూలీలుగానే ఉంటున్నా వారి ప్రేమలను చూసి గ్రామస్తులు సరదాపడ్డారు. వారంతా ఇదే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. -
మనవరాలికి జన్మనిచ్చిన అమ్మమ్మ...
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. కూతురి కోసం నవమాసాలు మోసి ఓ బిడ్డకు కని కూతురుకి కానుకగా ఇచ్చింది. చెప్పాలంటే చిన్నారి కెల్సీ మెక్ కిస్సాక్ చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఈ చిన్నారికి జన్మనిచ్చింది ఆమె తల్లి కాదు, అమ్మమ్మ. దాంతో కెల్సీకి అమ్మమ్మ ట్రెసీ థాంప్సన్ అమ్మ అయినట్లయింది. సాధారణంగా తాము అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య అవుతున్నారంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. తన కూతురి నుంచి మనవరాలిని పొందితే ఆనందించాలని ఓ మహిళ భావించింది. కానీ, కూతురు కెల్లీ మెక్ కిస్సాక్కి కాస్త ఆనారోగ్య కారణాల వల్ల సంతానోత్పత్తి సమస్యలు తలెత్తాయి. కూతురుకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. కెల్లీ, ఆరోన్ దంపతులు చాలా ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సరోగసి విధానమే వారికి ఉన్న చివరి మార్గమని వైద్యులు సూచించారు. ఈ పరిస్థితుల్లో పెద్ద మనసు చేసుకుని అద్దె గర్భానికి అంగీకరించింది. సరోగసి విధానం ద్వారా మనవరాలికి జన్మనిచ్చింది. ఈ జీవితంలో నాకు మా అమ్మ ట్రెసీ థాంప్సన్ చాలా పెద్ద బహుమతి ఇచ్చిందని కెల్లీ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనకు తల్లిని అయ్యే అవకాశం లేనిపక్షంలో తన బిడ్డలకు జన్మనివ్వాలని టీజేజ్లో ఉన్నప్పుడు కెల్లీ తన తల్లిని ఆటపట్టిస్తూ ఉండేది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగాలేనందున మా అమ్మ ఇచ్చిన మాట నేర్చుకుందని చెప్పుకొచ్చింది. బుధవారం ట్రేసీ మెక్ కిస్సాక్ మూడున్నర కిలోగ్రాముల ఆరోగ్యకరమైన చిన్నారికి జన్మనిచ్చింది. ఈ విషయాలను ఆ కుటుంబసభ్యులు మీడియాతో పంచుకున్నారు. అనారోగ్య సమస్యలతో పిల్లల్ని నేరుగా కనలేని తల్లిదండ్రులకు సరోగసి విధానం ద్వారా బిడ్డల్ని పొందడం ఉత్తమమని కెల్లీ, ఆరోన్ దంపతులు సహా చిన్నారికి జన్మనిచ్చిన ట్రెసీ థాంప్సన్ అంటున్నారు. -
'జుకర్ బర్గ్ వారసుడి'తో డేటింగ్..!
షకీరాలాంటి గొంతు, షరపోవాలా ఆటతీరు, కనీసం చదువులో రాణింపు.. ఇవేవీ లేకుండా ఓ టీనేజ్ అమ్మాయి గొప్ప ధనవంతురాలు కావాలంటే ఏం చెయ్యాలి? ఈ ప్రశ్న తనకుతానే వేసుకుని, తన మనుమరాలికి ఓ బామ్మ ఇచ్చిన సలహా, ఆ సలహాకు ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ స్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 'డియర్ జుకర్ బర్గ్.. ఎవరైనా ఓ నెర్డీ(ఎప్పుడూ టెక్నాలజీతో కుస్తీపడే వ్యక్తి) ఫెలోతో డేటింగ్ చెయ్యమని నా మనుమరాలికి సలహా ఇచ్చా. సాధారణ దుస్తులు, భూతద్దాలంటి కళ్లద్దాలు పెట్టుకుని ఎప్పుడూ సిస్టమ్ మీద పనిచేసుకుంటూ.. సాధారణ వ్యక్తిలా కనిపించే అలాంటి వాళ్లే భవిష్యత్ లో మీలా గొప్ప కార్యాలు సాధిస్తారు. కోటానుకోట్లు సంపాదిస్తారు. అందుకే నా మనుమరాల్ని నెర్డీతో డేట్ కు వెళ్లమని ప్రోత్సహిస్తున్నా' అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది డార్లిన్ లొరెటా అనే బామ్మ. అందుకు ప్రతిగా 'నెర్డీ ఫెలోతో డేటింగ్ చెయ్యడం కంటే స్వయంగా అలా తయారవ్వటమే ఉత్తమం. మీ తరఫున మీ మనుమరాలికి నేనిచ్చే సలహా ఇదే' అని జుకర్ బర్గ్ బదులిచ్చారు. ఏ ఆధారం లేకున్నా తమ కాళ్లపై తాము నిలబడేలా అమ్మాయిలను తయారుచేయాలని తాను గతంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశాడు. జుకర్ బర్గ్ ప్రతిస్పందన అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు లైక్స్ వర్షం కురిపించారు. ఇంతకు ముందు చెప్పినట్లే తన కంపెనీలో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు ఫేస్ బుక్ వ్యవస్థాపక సీఈవో జుకర్ బర్గ్. ప్రస్తుతం ఆ కంపెనీ సాధారణ ఉద్యోగుల్లో కేవలం 16 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అదే ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో 23 శాతం మహిళలున్నారు. మిగిలిన టెక్నాలజీ కంపెనీల్లోనూ మహిళా ఉద్యోగుల సంఖ్య అంతంతమాత్రమే! -
39 ఏళ్ల తర్వాత వాళ్లిద్దరూ కలిశారు
సినిమా కథను తలపించేలాగా ఎప్పుడో 39 ఏళ్ల క్రితం విడిపోయిన మనవరాలిని.. బామ్మ మళ్లీ కలుసుకుంది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించిందని, తన మనవరాలు మళ్లీ తన దగ్గరకు వచ్చిందంటూ క్రిస్మస్ పండగరోజు అర్జెంటీనాకు చెందిన 92 ఏళ్ల మార్లా ఇసాబెల్ చిచా డి మరియాని చెప్పారు. 1976లో మిలటరీ అధికారులు.. మార్లా మనవరాలు క్లారా అనాహి మరియానిని తీసుకెళ్లారు. క్లారా మూణ్నెళ్ల పసిబిడ్డగా ఉన్నప్పుడు సైన్యం ఆ చిన్నారి తల్లిని చంపి ఎత్తుకెళ్లారు. క్లారా కోసం గాలిస్తూ ఆమె తండ్రి డానియల్ 1977లో అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి మార్లా తన మనవరాలి కోసం అన్వేషిస్తోంది. 'గ్రాండ్ మదర్స్ ఆఫ్ ద ప్లాజా డి మయో' అనే మానవహక్కుల సంస్థ విడిపోయిన కుటుంబ సభ్యులను కలిపేందుకు కృషి చేస్తోంది. ఈ సంస్థలో పనిచేసిన మార్లా 1980లో విడిపోయి మనవరాలి పేరుతో క్లారా అనాహి ఫౌండేషన్‌ను స్థాపించింది. ఎనిమిదేళ్ల క్రితం మార్లా తన మనవరాలికి బహిరంగం లేఖ రాసింది. 'సైన్యం దాడిలో మరణించావని నన్ను నమ్మించేందుకు ప్రయత్నించారు. నువ్వు బతికేఉన్నావని నాకు తెలుసు. నిన్ను చూసి, ఆప్యాయంగా కౌగిలించుకోవాలన్నదే నా కోరిక' అని లేఖలో పేర్కొంది. అంతేగాక క్లారా తల్లిదండ్రులు వివరాలు, వారి అభిరుచులను లేఖలో రాసింది. సుదీర్ఘ అన్వేషణ అనంతరం మార్లా తన మనవరాలు క్లారాను గుర్తించింది. వీరిద్దరికీ జన్యుపరీక్షలు నిర్వహించగా 99.9 శాతం సరిపోలాయి. -
29 ఏళ్లకే బామ్మయ్యింది..
బ్రూనో ఎయిర్స్: సమాజంలో మారిన పరిస్థితుల వల్ల 29 ఏళ్ల వయసు యువతులు చాలా మంది అవివాహితులుగానే ఉంటున్నారు. చదువు, ఉద్యోగం, బాధ్యతలు వల్ల లేటు వయసు వివాహాలు పెరుగుతున్నాయి. అర్జెంటీనాలో 29 ఏళ్ల యువతి బామ్మయ్యింది. ఆమె 14 ఏళ్ల కొడుకు తండ్రయ్యాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా నిజం! అర్జెంటీనాలోని మెండోజా రాష్ట్రంలోని శాన్ రఫెల్ నగరంలో లుసియా డిసిరీ పాస్టెనెజ్ (29).. తన కొడుకు (14) తండ్రి అయ్యాడని చెప్పింది. తన కొడుకు స్కూల్‌కు వెళుతూనే.. మనవడి బాగోగులు చూసుకుంటున్నాడని పాస్టెనెజ్ తెలిపింది. తన కొడుకు, అతని గర్ల్‌ఫ్రెండ్ విషయంలో తాను జోక్యం చేసుకోబోనని, వారిద్దరినీ పెళ్లి చేసుకోవాలని కానీ లేదా కలసి జీవించాలని కాని చెప్పనని వెల్లడించింది. తన కొడుకు గర్ల్‌ఫ్రెండ్ వారి ఇంట్లోనే ఉంటుందని తెలిపారు. తన కుమారుడికి అండగా ఉంటామని, అయితే టీనేజ్‌లో తండ్రి కావడం బాగోదని సలహా ఇచ్చారు. పాస్టెనెజ్కు నలుగురు పిల్లలు ఉన్నారు. -
డ్రీమ్‌గర్ల్ మళ్లీ ప్రమోషన్ కొట్టేసింది
ముంబై : డ్రీమ్‌గర్ల్ అంటే చటుక్కున్న గుర్తుకు వచ్చేది హేమమాలిని. ఆమె ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ కొట్టేస్తుంది. ఇప్పటికే బీజేపీ టికెట్‌తో మధుర లోక్‌స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికై లోక్‌సభలో అడుగుపెట్టిన ఆమె... ఇప్పుడు తాజాగా మరో ప్రమోషన్ అందుకుంది. అది అలాంటి ఇలాంటి ప్రమోషన్ కాదు ... డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఏకంగా అమ్మమ్మ స్థానంలోకి కూర్చోబెట్టింది. ఆమె చిన్న కుమార్తె అహానా డియోల్ వోరా గురువారం చిన్న బాబుకు జన్మనిచ్చింది. దాంతో హేమమాలిని ఆనందంతో ఉబ్బితబ్బిబయింది. ఈ సంతోషకరమైన వార్తను ఆమె తన అభిమానులతో మైక్రోబ్లాగ్ ద్వారా పంచుకున్నారు. దేవుని ఆశీస్సులతో అహానా బాబుకు జన్మనిచ్చింది. అహానా... ఆమె కుమారుడు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని 66 ఏళ్ల హేమమాలిని తెలిపింది. హేమమాలిని, ధర్మేంద్రల చిన్న కుమార్తె అయిన అహానా 2014, ఫిబ్రవరి 2వ తేదీన ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ వోరాతో అహానా పెళ్లయిన సంగతి తెలిసిందే. అహానా ఒడిస్సీ నృత్య కళాకారిణి, ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
అమ్మమ్మ
మెట్రోకథలు సరిగ్గా పదడుగుల దూరంలో ఉన్న త్రీ బై సిక్స్ కాట్ మీద ఆమె కొంచెం కదిలింది. నిన్న రాత్రి నుంచి నీళ్లు లేవు. కూతురు తెలివైనది. కొంచెం ఊహించి ఒకటి రెండు బకెట్లు ముందే నింపి పెట్టుకుంది. తెల్లారి అవే అక్కరకొచ్చాయి. ఏదో ముక్కూ మూతీ కడుక్కున్నాం అనిపించి కూతురు, అల్లుడు, వారి కంటే ముందే అప్పర్ కేజీ చదువుతున్న మనవరాలు వెళ్లిపోయారు. కొంచెం ఎంగిలి పడి, అంటే ఏం లేదు, కాసింత రాగిజావ గొంతులో పోసుకొని ఇప్పుడే అలా మంచం మీద వాలింది. ఇంతలోనే ఈ అంతరాయం. చప్పుడు వింటూ ఉంది. అది రానురాను దగ్గరపడుతూ రొద మార్చుకుంటూ బకెట్ నిండబోతోందనే సంకేతాన్ని ఇస్తూ ఉంది. ఇప్పుడు లేవాలి. కాళ్లు కాళ్లుగా మిగిలి చాలా కాలం అయ్యింది. కీళ్లనొప్పులు. సుగర్ ఒకటి. ఈ మధ్య తల తిరిగిపోతుంటే స్పాండిలోసిస్ అన్నారు. భర్త బతికినంతకాలం మంగళసూత్రం ఉండింది. ఇప్పుడు మెడపట్టి. మెల్లగా లేచి కూచుంది. నిజానికి ఇది కొంచెం సులువైన పనే. అలా కొద్దిగా నడుచుకుంటూ వెళ్లి చేత్తో తిప్పేస్తే ట్యాప్ బంద్. కాని మధ్యాహ్నం అంత సులభం కాదు. మూడింటికల్లా మనవరాలు స్కూల్ నుంచి వస్తుంది. వచ్చినప్పటి నుంచి ఆగకుండా ఉంటుంది. ఫస్ట్‌ఫ్లోర్‌కి పోతుంది. సెకండ్ ఫ్లోర్‌కి పోతుంది. లేదంటే థర్డ్ఫ్లోర్కు దిగేస్తుంది. వెనుక పరిగెత్తలేదు. పట్టుకోలేదు. కుదురుగా కూచోబెడితే వీపు తిప్పే లోపల టీవీ బల్ల ఎక్కేస్తుంది. అదిలిస్తున్నా వినకుండా నీళ్లు కింద పోసేస్తుంది. సోఫా మీద నుంచి మంచం మీద దుముకుతూ తల ఎక్కడ పగలగొట్టు కుంటుందో అని అదో భయం. ఆరుకో ఏడుకో కూతురు వచ్చేదాకా ఇదే కష్టం. కాని జీవితంలో ఈ మాత్రం కష్టమైనా ఉన్నందుకు ఆమెకు అప్పుడప్పుడు సంతోషంగా ఉంటుంది. పాపకు కష్టమవుతుందమ్మా అని కూతురు అనకపోతే- పాపను చూసుకుంటున్నానన్న తృప్తితో తానిక్కడ ఉండకపోతే- ఎక్కడికి పోయేటట్టు? కొడుకు అత్తాపూర్‌లో ఉంటాడు. అక్కడి నుంచి మణికొండ షిఫ్ట్ అవుతాడట. పిల్లలు పెద్దవాళ్లు. ఇంత పెద్ద నగరంలో వాళ్ల అవసరాల కోసమని కోడలు కూడా ఏదో ఒక పని చేయక తప్పదు. అందరూ వెళ్లాక ఇంట్లో మీరొక్కరే బోరైపోతారత్తయ్యా అంటుంది కోడలు. అదీ నిజమే. కాని ఈ మధ్య ఆమెకు చిన్న గిల్ట్ వచ్చింది. స్కూల్ ఉన్నన్ని రోజులు మనవరాలిని చూసుకుంటుంది. కనుక ఇక్కడ ఉండొచ్చు. ఈ ఇంటి తిండి తినొచ్చు. కాని రెండు నెలలు వేసవి సెలవులొచ్చాయి. అప్పుడు కూడా కదలక మెదలక తిని కూచుంటూ ఉంటే అల్లుడేమనుకుంటాడు? కొడుకును అడగాలా? ఎక్కడా... తీసుకెళ్లాలనే ఉంది... పిల్లలకు ఎగ్జాములు, కోచింగులు, ఎంట్రన్స్‌లు... మా ముఖాలను చూస్తేనే డిస్టర్బెన్స్ ఫీలవుతున్నారు... మిమ్మల్ని కూడా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకా అని... అంటుంది కోడలు. ఆ మాటా నిజమే. బెజవాడలో ఉండగా లంకంత సంసారాన్ని ఈదింది. వచ్చే కాలూ వెళ్లే కాలూ. ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి పెట్టకపోయినా వారందరితో మనసు పెట్టి మాట్లాడేది. ఆ మాట కోసం వచ్చేవాళ్లు. మొన్న- ఎస్.ఎం.ఎస్ చూడటం నేర్చుకోమ్మా అన్నాడు కొడుకు. హడలిపోయింది. వాడు బాగా బిజీ. అయినప్పటికీ అతి కష్టం మీద వారం పది రోజులకు ఒకసారైనా గుర్తు పెట్టుకొని మాట్లాడతాడు. ఎస్.ఎం.ఎస్ చూడటం నేర్చుకుంటే బిజీలో ఉంటూ మెసేజ్‌లతోనే మాట్లాడేస్తాడా అని భయం. ఈ వయసులో ఎందుకులేరా అని తప్పించేసింది. బకెట్ నిండింది. లేచి ట్యాప్ కట్టేసి మెల్లగా వచ్చి కూచుంది. చుట్టూ చూసింది. టూ బెడ్రూమ్ ఫ్లాట్‌లో మంచం పట్టేంత స్థలం! అది మాత్రమే తనది. తక్కిన స్థలంలో ఒక గది బెడ్రూమ్కి, ఒక గది అల్లుడి కంప్యూటర్‌కి, కాగితాలకి, స్నేహితులెవరైనా వస్తే కాలక్షేపానికి. ఈ మధ్య తనకో గది ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంది. తన వస్తువులు, బ్యాగులు, బట్టలు, ఆల్బమ్‌లు... అల్లుడు ఫ్రిజ్ తెరిస్తే తన ఇన్సులిన్ బాటిళ్లు కనిపించడం ఆమెకు ఇబ్బందిగా ఉంది. స్టూల్ సాఫ్టెన్ కోసం ఈ మధ్య డాక్టరు క్రిమాఫిన్ రిఫర్ చేశాడు. ఆ బాటిల్ బయట కనిపించడమూ ఇబ్బందే. ఆ మాటకొస్తే కొడుకు దగ్గరకు వెళ్లినా తనకో గది దొరికే వీలు లేదు. అక్కడనే ఏముంది, గమనించింది కదా, చాలా ఫ్లాట్లలో పెద్దాళ్లకు ఒకటే స్థలం. హాలు. అక్కడే ఉండాలి. అక్కడే పడుకోవాలి. కామన్ టాయిలెట్ వాడుకోవాలి. సాయంత్రం ఐదూ ఆరు మధ్యన బయట కారిడార్‌లో నిలబడితే అన్ని ఫ్లోర్లలో తనలాంటి ఇద్దరు ముగ్గురు గాలి పీల్చుకోవడానికా అన్నట్టు బయట నిలుచుని కనిపిస్తారు. జుట్టు తెల్లబడి, చర్మం వదులయ్యి, వెన్ను తేలి.... ఎవరూ మాట్లాడుకోరు. ఏం మాట్లాడుకోవాలి గనక? మనవరాలు వచ్చింది. సంతోషం, కంగారు తెచ్చింది. ఆకలిగా ఉంది అనంటే దాని నోటికి ఏదైనా పెడుతున్న ఆ కాసిన్ని క్షణాలు అమృతంలా అనిపించాయి. ఆ తర్వాత కూతురు వచ్చేంత వరకూ దాని అల్లరిని ఎలా ఉగ్గబట్టి భరించిందో ఏమో. కూతురు వచ్చాక అమ్మయ్య కాసేపు కబుర్లు చెప్పొచ్చు అనుకుంది. కాని ఇవాళ దాని మూడ్ బాగలేదు. రావడం రావడం బ్యాగ్ పడేసి చర్రుపర్రు మంటోంది. ఈ టైమ్‌లో ఏం మాట్లాడితే ఏం గొడవో. గప్‌చిప్‌గా ఊరుకుంది. రాత్రయ్యింది. అదైతే ఆమెకు చాలా భయంగా అనిపిస్తుంది. కాళ్లు పీకుతాయి. కళ్లు గుంజుతాయి. నిద్ర పట్టదు. ఏవేవో జ్ఞాపకాలు వస్తాయి. నిద్ర మాత్రలు మంచివి కాదు. ఏ ఆలోచనా లేకుండా పడుకోవే అదే వస్తుంది అంటుంది కూతురు. ఏ ఆలోచనా లేకుండానా? తండ్రి గుర్తొచ్చాడు. అరవై ఏళ్లు వచ్చినా ఎనిమిది తర్వాత బజారులో ఉండేవాడు కాదు. అబ్బీ అని తల్లి పిలిచిందంటే వస్తున్నా అమ్మా అని పరిగెత్తుకుంటూ వెళ్లి మంచం దగ్గర నిలబడేవాడు. ఆయన తినడం కళ్లతో చూసుకున్నాకే ఆమె తినేది. ఆ తర్వాత హాయిగా నిద్ర పోయేది. రాత్రి టైమ్ ఎంతయ్యిందో తెలియడం లేదు. నిద్ర పట్టడం లేదు. ఈ ఫ్లాట్‌కు గాలి, వెలుతురు తక్కువ. పగలైనా రాత్రయినా హాలు చీకటిగా, ఉక్కగా ఉంటుంది. ఫ్యాను వేసినా అంతే. పూజలు, మంత్రాలు... వీటికి సమయమే లేనట్టుగా జీవితం గడిచిపోయింది. ఇప్పుడు కొత్తగా దేవుణ్ణి తలుచుకోవడం చేతకావడం లేదు. దూరంగా రోడ్డు మీద ట్రక్కులు తిరుగుతున్న చప్పుడు వింటూ కళ్లు మూసుకుని అటూ ఇటూ మసలుతూ ఉండిపోయింది. తెల్లవారింది. మొదట మనవరాలు వెళ్లిపోయింది. అల్లుడు టూవీలర్ ఎక్కి ఆఫీస్‌కు పరుగు తీశాడు. కూతురు మంచం దగ్గర నిలబడి గబగబా ఏవో జాగ్రత్తలు, వంటింటి పురమాయింపులు చేసి లిఫ్ట్ కోసం కూడా ఆగకుండా మెట్లు దిగిపోయింది. తొమ్మిది దాటి పది అయ్యింది. బాత్రూమ్లో పెద్ద చప్పుడుతో ట్యాప్ మొదలయ్యింది. తన నిమిత్తం లేకుండా నీళ్లు నింపుకుంటున్న బకెట్ అంతకు పది అడుగుల దూరంలో ఉన్న మంచం మీద ఆమె కదలిక కోసం ఎదురు చూస్తూ ఉంది. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
సంతాన బామ్మ!
వయసు 65. సంతానం 13. ఏడుగురు మనవలు, మనవరాళ్లు కూడా ఉన్నారు. అయినా, మరోసారి ఒకే కాన్పులో నలుగురు పిల్లలు! జర్మనీ మహిళ అన్నెగ్రెట్ రౌనిక్ పొందిన సంతాన భాగ్యం ఇది. కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా ముదిమిలో గర్భం దాల్చిన రౌనిక్ శనివారం ఉదయం ఉక్రెయిన్‌లోని ఓ ఆస్పత్రిలో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. దీంతో ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన అత్యధిక వయసు మహిళగా రౌనిక్ రికార్డు సృష్టించింది. ఈసారి ముగ్గురు మగబిడ్డలు, ఒక ఆడబిడ్డ. కానీ నెలలు నిండకుండానే 26 వారాలకే (ఆరు నెలలకే) జన్మించారు! అయినా, వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, బతికే అవకాశాలు బాగున్నాయని వైద్యులు ప్రకటించారు. ఇంగ్లిష్, రష్యన్ భాషలు బోధించే టీచర్ అయిన రౌనిక్ పెద్ద కూతురు వయసు 44 ఏళ్లు కాగా, చిన్న కూతురు వయసు 9 ఏళ్లు. చివరిసారిగా 55 ఏళ్ల వయసులో రౌనిక్ 13వ బిడ్డను ప్రసవించింది. అయితే, తనకు ఆడుకోవడానికి ఓ బుల్లి తమ్ముడు లేదా చెల్లి కావాలని చిన్న కూతురు కోరడంతో ఈ వయసులో ఇలా మరోసారి గర్భం దాల్చింది. నాలుగు అండాలు ఫలదీకరణం చెందినట్లు గుర్తించిన వైద్యులు మొదట్లోనే హెచ్చరించినా, ఆమె వెనకడుగు వేయలేదు. నలుగురినీ క నేందుకే మొగ్గు చూపింది. ఇంత వయసులోనూ తాను ఇంత ఫిట్‌గా ఉండటం గురించి ప్రశ్నిస్తే.. పిల్లలే తన ‘యవ్వన’ రహస్యమని చిరునవ్వులతో బదులిస్తోంది ఈ బామ్మ. -
వండర్ బామ్మ
-
బంగారం కోసం అమ్మమ్మను నరికేశాడు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తాండూరులోని గాంధీనగర్‌లో శనివారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. బంగారం కోసం సొంత అమ్మమ్మను మనుమడు నరికి చంపాడు. అనంతరం నిందితుడు ధనరాజ్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు ధన్రాజ్పై కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కథనం ప్రకారం... ధనరాజ్ తల్లిదండ్రులను విడిచి అమ్మమ్మతో కలిసి తాండూరులో నివసిస్తున్నాడు. వ్యసనాలకు బానిస అయిన ధనరాజ్ తరచు నగదు కావాలని అమ్మమ్మను వేధించేవాడు. ఆ క్రమంలో నగలు కావాలని అమ్మమ్మను అడిగాడు. అందుకు ఆమె నిరకరించింది. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో తాగిన మైకంలో ఉన్న ధన్‌రాజ్... అక్కడే ఉన్న గొడ్డలితో ఆమెపై దాడి చేసి... నరికాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. -
ఫైనల్ మ్యాచ్ చూస్తున్నంత సేపూ ఒకటే టెన్షన్
ములపర్రు (ఆచంట) : ‘నవంబరు 16ను ఎప్పటికీ మరిచిపోలేం.. మా చిన్నోడు (కిడాంబి శ్రీకాంత్) ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన రోజు అది.. ఆ రోజు రాత్రి ఫైనల్ మ్యాచ్ చూస్తున్నంత సేపు ఒకటే టెన్షన్.. ప్రత్యర్థి సామాన్యుడు కాదు మరి.. చైనా దిగ్గజం లీన్డాన్.. అప్పటికే రెండు సార్లు మా చిన్నోడు అతని చేతిలో ఓడిపోయాడు.. మూడోసారి తలపడుతున్నాడు.. పోరు హోరాహోరీగా సాగుతోంది.. మా చిన్నోడి ఆట చూసి గెలుస్తాడనుకున్నాం.. దేవుడిపైనే భారం వేశాం.. చివరకు ఎవరూ ఊహించని విధంగా శ్రీకాంత్ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు’ అని కిడాంబి శ్రీకాంత్ తాతయ్య, అమ్మమ్మలు కొంమాండూరి స్వామినాథ న్, శేషవల్లి ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాంత్ తల్లి రాధా ముకుంద నాగమణి స్వగ్రామం పెనుగొండ మండలం ములపర్రు గ్రామం. బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన శ్రీకాంత్ గురించి తెలుసుకునేందుకు ఆనందడోలికల్లో మునిగితేలుతున్న తాతయ్య, అమ్మమ్మలతో ఇంటర్వ్యూ. మీ మనవడు శ్రీకాంత్ విజయంపై మీ స్పందన చాలా సంతోషంగా ఉంది. ఆటల ద్వారా మా మనవడు పేరు ప్రపంచ దేశాల్లో మారుమోగుతుండటం చాలా హ్యాపీ. కష్టానికి తగిన ఫలితమిది. మీరెప్పుడైనా మీ మనవడు ఈ స్థాయికి వెళతాడని ఊహించారా వాడు చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌లో ప్రతిభ చూపేవాడు. ఎప్పటికైనా మంచిపేరు తెచ్చుకుంటాడనే నమ్మకం మాకుంది. మీ పెద్దమనవడు కూడా ఇదే రంగంలో ఉన్నారంట కదా అవును పెద్ద మనుమడు నందగోపాల్, చిన్న మనుమడు శ్రీకాంత్. ఇద్దరు బ్యాడ్మింటన్ ప్లేయర్లే. శ్రీకాంత్ బ్యాడ్మింటన్‌లో రాణించడానికి ప్రోత్సాహకులు ఎవరు మా అల్లుడు (శ్రీకాంత్ తండ్రి)కి కూడా ఆటలంటే ఇష్టం. దేవుని దయవ ల్ల వారి ఆర్థిక పరిస్థితి బాగుండటంతో పిల్లలను ప్రోత్సహించారు. శ్రీకాంత్ ఈ స్థాయికి వెళ్లాడంటే ఆయనే కారణం. శ్రీకాంత్ ఎక్కడ శిక్షణ తీసుకున్నాడు విశాఖ, ఖమ్మంలో కొద్దికాలం శిక్షణ పొందాడు. తర్వాత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ అకాడమీలో ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నాడు. భవిష్యత్‌లో శ్రీకాంత్ ఏం సాధించాలని మీరు కోరుకుంటున్నారు పుల్లెల గోపీచంద్ అంత ఎత్తుకు ఎదగాలని, ఒలింపిక్స్‌లో ఆడాలని కోరుకుంటున్నాం. అకాడమీ ఏర్పాటుచేసి తనలాంటి క్రీడాకారుల్ని తయారు చేయాలని ఆశిస్తున్నాం. శ్రీకాంత్‌కు మీరిచ్చే సలహా ఏమైనా ఉందా విజయాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోకూడదు. భవిష్యత్‌లో మరింత కష్టపడి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. మీ చిన్నోడికి మీరిచ్చే కానుక ఏమైనా ఉందా చిన్నోడికే కాదు పెద్దోడికి కూడా ఇచ్చేందుకు రెండు ఇంక్ పెన్నులు కొని సిద్ధంగా ఉంచాం. -
శాన్వి హత్యకేసులో రఘునందన్‌కు మరణ శిక్ష