
తిరువనంతపురం: 105 సంవత్సరాల వయసులో నాల్గవ తరగతి పరీక్ష పూర్తిచేసి ‘మన్‌కీ బాత్’రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న కేరళ బామ్మ, భాగీరథి అమ్మ త్వరలో ఆధార్ కార్డు పొందనున్నారు. కేరళలోని కొల్లామ్‌లో నివసించే భాగీరథి అమ్మ కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ (కేఎస్‌ఎల్‌ఎమ్) నిర్వహించిన నాల్గో తరగతి పరీక్ష పాసైన ‘పెద్దవయసు విద్యార్థి’గా పేరొందారు. తనను మోదీ ప్రస్తావిండంతో సంతోషపడినా, ఆధార్ కార్డు ఇంతవరకు లేదని ఆవేదనచెందారు. కార్డు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్దిపొందలేకపోయారు. విషయం తెల్సుకున్న ఓ జాతీయ బ్యాంకు అధికారులు ఇటీవల ఆమె ఇంటికెళ్లి ఆధార్ ప్రక్రియను పూర్తిచేశారు. ‘కార్డు పొందేందుకు గతంలో యత్నించినా.. వృద్ధాప్యం కారణంగా ఆమె వేలిముద్రలు, కంటి రెటీనా స్కాన్ చేయలేకపోయాం’అని ఓ అధికారి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment