praised PM Narendra Modi
-
Chandrayaan 3: భూమిపై సంకల్పం.. జాబిల్లిపై సాకారం
న్యూఢిల్లీ: చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. వారికి అభినందనలు తెలియజేశారు. భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇప్పుడు చంద్రుడిపై భారత్ అడుగుపెట్టిందని అన్నారు. ఇది కేవలం భారత్ విజయం కాదని చెప్పారు. ఈ ఘనత ప్రపంచంలోని ప్రజలందరికీ చెందుతుందని చెప్పారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వెళ్లిన మోదీ బుధవారం సాయంత్రం చంద్రయాన్–3 సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను టీవీలో ప్రత్యక్షంగా వీక్షించారు. ల్యాండింగ్ సకెŠస్స్ అయిన వెంటనే ఇస్రో సైంటిస్టులను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. బ్రిక్స్ సదస్సు కోసం ప్రస్తుతం తాను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పటికీ తన మనసు, ఆత్మ మొత్తం భారత్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోని బలమైన జీ20 కూటమికి భారత్ నాయకత్వం వహిస్తున్న ఈ శుభసందర్భంలో చంద్రయాన్–3 ప్రయోగం సఫలం కావడం మరింత ఆనందాన్ని ఇస్తోందన్నారు. భూగోళంపై మనం తీసుకున్న సంకల్పం చందమామపై నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం చిరస్మరణీయమని తెలిపారు. ఈ అద్భుత క్షణం శాశ్వతంగా మదిలో నిలిచిపోతుందని చెప్పారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందంటూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదొక చరిత్రాత్మక సందర్భమని ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందుతున్న భారత్‌కు ఇది ప్రతీక అని చెప్పారు. కొత్త చరిత్రను భారత్ లిఖించిందని వెల్లడించారు. నవ భారతదేశంలో నూతన శిఖరాలకు చేరుకుంటున్నామని, అందుకు మనమంతా సాకు‡్ష్యలమని వివరించారు. శాస్త్రవేత్తల అంకితభావం వల్లే.. అమృతకాలంలో ఇది మొదటి విజయమని అన్నారు. ఇది అమృత వర్షమని అభివర్ణించారు. ఆకాశమే హద్దు కాదని భారత్ పదేపదే నిరూపిస్తోందని ప్రధాని మోదీ చమత్కరించారు. ఇప్పటిదాకా ఎవరూ చేరుకోని జాబిల్లి దక్షిణ ధ్రువానికి భారత్ చేరుకుందని ఉద్ఘాటించారు. మన శాస్త్రవేత్తల అంకితభావం, నైపుణ్యం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. చందమామకు సంబంధించిన మన ఊహాగానాలు, ప్రచారంలో ఉన్న కథలు ఇక మారుతాయని, సామెతలు కొత్త తరం కోసం కొత్త అర్థాలను వెతుక్కుంటాయని వ్యాఖ్యానించారు. భూమిని తల్లిగా, చంద్రుడిని మామగా మనం భావిస్తామని చెప్పారు. ‘చందమామ దూర్ కే’ అంటుంటామని, ఇకపై ‘చందమామ ఏక్ టూర్ కే’ అనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వివరించారు. తద్వారా జాబిల్లిపై పర్యటనలు త్వరలో ప్రారంభమవుతాయని పరోక్షంగా స్పష్టం చేశారు. సూర్యుడిపై పరిశోధనల కోసం ‘ఆదిత్య–ఎల్1’ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోందని చెప్పారు. శుక్రగ్రహంపైనా అధ్యయనం చేసే ప్రణాళిక ఉందన్నారు. అనంతరం ప్రధాని మోదీ ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్‌తో మాట్లాడారు. అభినందనలు తెలిపారు. -
భాగీరథి అమ్మకు ఆధార్!
తిరువనంతపురం: 105 సంవత్సరాల వయసులో నాల్గవ తరగతి పరీక్ష పూర్తిచేసి ‘మన్‌కీ బాత్’రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న కేరళ బామ్మ, భాగీరథి అమ్మ త్వరలో ఆధార్ కార్డు పొందనున్నారు. కేరళలోని కొల్లామ్‌లో నివసించే భాగీరథి అమ్మ కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ (కేఎస్‌ఎల్‌ఎమ్) నిర్వహించిన నాల్గో తరగతి పరీక్ష పాసైన ‘పెద్దవయసు విద్యార్థి’గా పేరొందారు. తనను మోదీ ప్రస్తావిండంతో సంతోషపడినా, ఆధార్ కార్డు ఇంతవరకు లేదని ఆవేదనచెందారు. కార్డు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్దిపొందలేకపోయారు. విషయం తెల్సుకున్న ఓ జాతీయ బ్యాంకు అధికారులు ఇటీవల ఆమె ఇంటికెళ్లి ఆధార్ ప్రక్రియను పూర్తిచేశారు. ‘కార్డు పొందేందుకు గతంలో యత్నించినా.. వృద్ధాప్యం కారణంగా ఆమె వేలిముద్రలు, కంటి రెటీనా స్కాన్ చేయలేకపోయాం’అని ఓ అధికారి వివరించారు. -
ఫేస్బుక్ పోస్ట్..‘సీ విజిల్’ అలర్ట్
రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాల్సిన ఎన్నికల నియమావళిని 2013 నుంచి సామాజిక మాధ్యమాలకు కూడా వర్తింప చేశారు. కానీ తగిన యంత్రాంగం లేక సామాజిక మాధ్యమాలను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు తొలిసారిగా ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఫేస్‌బుక్‌పై కొరడా ఝుళిపించింది. పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడి విడుదలయిన వైమానిక దళం పైలట్ అభినందన్‌తో బీజేపీ నేతలు ఉన్న రెండు పోస్టర్లను వెంటనే తొలగించాలని ఈసీ ఫేస్‌బుక్‌ను ఆదేశించింది. ఆ పోస్టర్లలో అభినందన్‌తో పాటు బీజేపీ నేతలు మోదీ, అమిత్ షా, ఢిల్లీ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ శర్మ తదితరులు ఉన్నారు. అభినందన్‌ను, మోదీని పొగుడుతూ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. వీటిని మార్చి 1న ఫేస్బుక్లో షేర్ చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి చెందిన ‘సి విజిల్’ యాప్‌కు ఫిర్యాదు అందింది. పరిశీలించిన ఎన్నికల సంఘం సైనికుల ఫొటోలు ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకోవడం నియమావళికి విరుద్ధం కాబట్టి ఆ పోస్టర్లను ఉపసంహరించుకోవాలని ఫేస్బుక్ భారత్, దక్షిణాసియా డైరెక్టర్ శివనాథ్ తుక్రాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాజకీయ ప్రచారం కోసం సాయుధ దళాల ఫొటోలను ఉపయోగించకూడదని ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశించినా కూడా చాలా పార్టీలు ముఖ్యంగా బీజేపీ బాలాకోట్ దాడి, అభినందన్ ఫొటోలను ఉపయోగించుకుంటోందని ద వైర్ పత్రిక పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అభినందన్ విడుదలను ప్రచారానికి ఉపయోగించుకుంటోందని తెలిపింది. -
ఒక జత బట్టలు మాత్రమే ఉన్నాయి: సీఎం
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నుంచి గొప్ప విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ‘ఈ రోజుల్లో సన్యాసులకు ప్రజలు భిక్ష కూడా వేయడం లేదు. ప్రధాని మోదీ ఏకంగా నాకు ఉత్తరప్రదేశ్ ఇచ్చారు. సానుకూలంగా ఎలా ఆలోచించాలి, గొప్ప పనులు ఏవిధంగా చేయాలనేది ఆయన నుంచి నేర్చుకున్నాన’ని సీఎం యోగి చెప్పారు. తాను ముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదని పేర్కొన్నారు. ‘రేపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ప్రమాణ స్వీకారానికి ముందురోజు అమిత్ షా నాతో చెప్పారు. హఠాత్తుగా అలా చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నా దగ్గర ఒక జత బట్టలు మాత్రమే ఉన్నాయ’ని వెల్లడించారు. పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. యూపీ పట్టిన రోగం ఏంటో తనకు తెలుసునని, దాన్ని వదిలించేందుకు ప్రయత్నిస్తానని సీఎం యోగి చెప్పారు.