
నటి తాప్సీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తాప్సీ ఎంతగానో ఇష్టపడే ఆమె బామ్మ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె శనివారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. గురుద్వారలో తన బామ్మ అంతిమ సంస్మరణలకు చెందిన ఓ ఫొటోను షేర్ చేసిన తాప్సీ భావోద్వేగానికి లోనయ్యారు. ‘కుటుంబంలోని ఆ తరం వాళ్లు ఎప్పటికీ నిలిచిపోయే శూన్యాన్ని మనకు వదిలి వెళతారు’ అని పేర్కొన్నారు. దీంతో పలువురు నెటిజన్లు తాప్సీ బామ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్లు చేస్తున్నారు.
అయితే తన బామ్మ ఏ కారణం చేత మరణించారో మాత్రం తాప్సీ వెల్లడించలేదు. కాగా, తెలుగులో ఝమ్మంది నాదం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన తాప్సీ.. పలు చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఆమె.. పలు ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తు మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment