రికార్డులును బ్రేక్ చేసిన బామ్మ వంటకాలను ఘుమఘుమలు ఆస్వాదించాం. అంతకుమించి 90సంవత్సరాల వయసులో యోగాసనాలతో ఇరగదీసిన వీడియోలను చూసి మురిసిపోయాం. తాజాగా మరో బామ్మ వీడియో నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఆధునిక కంప్యూటర్‌లో డిలీట్, బ్యాక్ బటన్లతో కుస్తీలు పడుతూ టైపింగ్‌కోసం అష్టకష్టాలుడుతున్న నేటి తరం టైపిస్టులకు, కంప్యూటర్ ఆపరేటర్లకు సవాల్ విసురుతోందంటే అతిశయోక్తి కాదేమో. టైపింగ్ మిషన్‌మీద సునామీ వేగంతో తన వేళ్లతో పరుగులు పెట్టిస్తున్న వైనం నెటిజనులను బాగా ఆకట్టుకుటోంది.