typing
-
ఇది టైప్ చేశారంటే అంతే.. ఐఫోన్ క్రాష్!
ఐఫోన్లు, ఐప్యాడ్లలో కొత్త బగ్ ఒకటి బయటపడింది. కొన్ని అక్షరాలను టైప్ చేస్తే ఐఫోన్లు, ఐప్యాడ్లు క్రాష్ అవుతున్నాయి. “”: తర్వాత ఏదైనా అక్షరం టైప్ చేయగానే స్ప్రింగ్‌బోర్డ్ అని పిలిచే యాపిల్ డివైజ్ ఇంటర్ఫేస్ క్షణంలో క్రాష్ అయ్యి తిరిగి లాక్ స్క్రీన్‌కి వెళ్తోంది.ఈ విషయాన్ని మొదట ఓ సెక్యూరిటీ రీసెర్చర్ గుర్తించారు. ఆ తర్వాత టెక్ పబ్లికేషన్ ‘టెక్‌క్రంచ్’ కూడా దీన్ని పరీక్షించింది. సెట్టింగ్స్ యాప్ లేదా యాప్ యాప్ లైబ్రరీలోని సెర్చ్ బార్లో ఈ అక్షరాలను టైప్ చేయగా క్రాష్ అవుతోందని ధ్రువీకరించింది. కొన్ని సందర్భాల్లో డివైజ్ సాధారణ స్థితికి రావడానికి ముందు స్క్రీన్ ఒక సెకను బ్లాక్‌గా ఫ్లాష్ కావచ్చని పేర్కొంది.అయితే ఈ బగ్ భద్రతా ముప్పు కాదని నిపుణులు చెబుతున్నారు. ఐఓఎస్ సెక్యూరిటీ రీసెర్చర్ అయిన రియాన్ స్టోర్జ్ సమస్యను విశ్లేషిస్తూ ఇది మీ డివైజ్ భద్రతకు హాని కలిగించదని నిర్ధారించారు. డబుల్యూ అనే సెక్యూరిటీ స్టార్టప్‌ని స్థాపించిన మరో ఐఓఎస్ నిపుణుడు పాట్రిక్ వార్డ్లే కూడా బగ్ కొంచెం ఇబ్బంది కలిగించేదే అయినా ప్రమాదకరం కాదని అంగీకరిస్తున్నారు.కాగా ఈ బగ్‌పై యాపిల్ ఇంకా స్పందించలేదు. అయితే వారు భవిష్యత్తు అప్డేట్లో దాన్ని పరిష్కరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ అసౌకర్యాన్ని నివారించాలనుకుంటే, మీ ఐఫోన్, ఐప్యాడ్ సెర్చ్ బార్లలో “”: అని మాత్రం టైప్ చేయొద్దు. -
మనోళ్లు ముక్కుతో కూడా రికార్డులు కొట్టేస్తారు; వరుసగా మూడోసారి
ముక్కుతో టైప్ చేయడమే విశేషం. అందులో కూడా రికార్డ్. మళ్లీ తన రికార్డును తానే అధిగమించాడో వ్యక్తి. ఆయన పేరే ‘టైపింగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ వినోద్ కుమార్ చౌదరి. స్పెషల్ కీబోర్డుపైన ముక్కుతో వర్ణమాలను అత్యంత వేగంగా టైప్ చేసి ఈ ఫీట్‌ని మరోసారి రికార్డు స్థాయిలో సాధించాడు. వినోద్ కుమార్ చౌదరి ముక్కుతో కీబోర్డు ఆపరేట్ చేస్తున్న వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డు సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేసింది. వరుసగా మూడోసారి కీబోర్డుపై అతి తక్కువ టైంలో ముక్కుతో ఆల్పాబెట్ టైప్ చేసి రికార్డులకెక్కారు వినోద్. 2023లో తొలిసారిగా 27.80 సెకన్లతో రికార్డు క్రియేట్ చేశారు. అదే ఏడాది రెండో ప్రయత్నంలో 26.73 సెకన్లతో తన రికార్డుని తానే అధిగమించారు. ఇపుడుముచ్చటగా మూడోసారి కూడా కేవలం 25.66 సెకన్లలో ఆల్ఫాబెట్ ని టైప్ చేసి రికార్డు బ్రేక్ చేశారు.How quickly could you type the alphabet with your nose (with spaces)? India's Vinod Kumar Chaudhary did it in 26.73 seconds ⌨️👃 pic.twitter.com/IBt7vghVai— Guinness World Records (@GWR) May 30, 2024ఈ విజయం పై వినోద్ సంతోషం ప్రకటించారు. ముక్కుతో టైపింగ్ చేయడంతో పాటు టైపింగ్‌లో పలు రికార్డులు తన పేరిట ఉన్నాయన్నారు. తన వృత్తి టైపింగ్ అని.. అందులో రికార్డు సృష్టించాలని కోరుకున్నానని అన్నారు. గంటలతరబడి సాధన చేసి ఈ రికార్డు బ్రేక్ చేశానని పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్ లా తన పేరుతోనూ చాలా రికార్డులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు సచిన్ లా రికార్డుల రారాజు అనిపించుకోవడమే తన జీవిత లక్ష్యమని చెప్పడం విశేషం. -
ఈయన టైపింగ్ స్కిల్స్ చూస్తే వావ్ అనాల్సిందే
-
కంప్యూటర్ టైపింగ్‌లో తప్పులెందుకొస్తాయో తెలుసా?
చాలామంది గంటలతరబడి అలాగే కంప్యూటర్ ముందు కూర్చుని టైపింగ్ వంటి పనిచేస్తుంటారు. అలా చేస్తున్న క్రమంలో ముందు కాసేపు బాగానే ఉండి... ఆ తర్వాత తప్పులు ఎక్కువగా దొర్లుతుంటాయి. దీనికో కారణం ఉంది. ఇలా సుదీర్ఘకాలం పాటు స్థిరంగా ఒకే పోష్చర్‌లో కూర్చుంటే అది ‘స్టాటిక్ లోడింగ్’ అనే పరిస్థితికి దారితీస్తుంది. కొందరిలో కేవలం అరగంటకే ఈ పరిస్థితి వస్తుంది. ఈ కండిషన్లో రక్తప్రసరణ 20 శాతం మందగిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇలా కూర్చుండిపోయినప్పుడు వాళ్ల ఉచ్ఛ్వాస నిశ్వాసలు సైతం 30 శాతం మందగిస్తాయి. దాంతో ఆక్సిజన్ పాళ్లూ 30 శాతం తగ్గుతాయి. అంటే... ఆ మేరకు శరీరానికి అవసరమైన ప్రాణవాయువు తగ్గడంతో కూర్చుని పనిచేస్తున్నా కొద్దిసేపట్లోనే అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే వ్యాయామం తగ్గడం వల్ల కీళ్లనొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే దీర్ఘకాలంపాటు కంప్యూటర్‌పై పనిచేయాల్సిన వారు కొద్ది కొద్ది సేపటికోసారి లేచి కాసేపు తిరగాలి. అలాగే కంప్యూటర్ స్క్రీన్ వైపు రెప్పవాల్చకుండా చూడకూడదు. ప్రతి పది నిమిషాలకు ఒకమారు కళ్లకు కాస్త విశ్రాంతినిస్తూ ఉండాలి. ఇలా కంప్యూటర్‌పై కూర్చుని పనిచేసేవారు రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఈ సూచనలను అనుసరిస్తే చాలావరకు తప్పుల సంఖ్య తగ్గుతుంది. చదవండి: ఏసీ వాడుతున్నారా? ఇవి మీకోసమే -
ఏడుపదుల వయసులోనూ..
ఒకప్పుడు చిన్న మ్యాటర్ రాయాలన్నా టైప్ సెంటర్ల వద్దకు క్యూ కట్టాల్సి వచ్చేది.. కొన్ని ఉద్యోగాలకు టైపు రైటింగ్ తప్పనిసరి. టైప్ రైటింగ్ నేర్చుకునేందుకు సెంటర్ల వద్ద టైమ్ ఫిక్స్ చేసుకొని బ్యాచ్‌లు ఏర్పాటు చేసుకునేవారు. మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కాలనీలో చూసినా ఆన్లైన్, మీసేవ, నెట్ సెంటర్లే కనిపిస్తున్నాయి. ఏ సేవలైనా కంప్యూటర్ కావాల్సిందే.. దాదాపు టైప్ ఇనిస్టిట్యూట్స్ మూతపడ్డాయి. కానీ 70 సంవత్సరాల వయసులోనూ ఓ వ్యక్తి టైప్ ఇనిస్టిట్యూట్ నడిపిస్తూ.. నామమాత్రపు ఫీజు తీసుకొని ఎంతో మంది విద్యార్థులకు టైపింగ్‌లో శిక్షణ ఇస్తున్నాడు. సూరారం గ్రామానికి చెందిన సామల యాదగిరి సూపరింటెండెంట్‌గా రిటైరయ్యారు. బోయిన్‌పల్లిలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివిన ఆయన డిగ్రీ పూర్తి చేసి ఐడీపీఎల్‌లో పనిచేస్తూ, మరోపక్క అమీర్‌పేట్‌లో టైపు నేర్చుకొని లోయర్, హైయర్‌లో ఉత్తీర్ణత సాధించాడు. 1969లో పరిశ్రమల శాఖలో టైపిస్ట్‌గా చేరి నెలకు రూ.130 జీతం తీసుకున్నాడు. 1979లో సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాడు. పనిలో మరింత చురుగ్గా వ్యవహరించడంతో 1996లో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా ప్రమోషన్ పొంది మహబూబ్‌నగర్‌కు వెళ్లాడు. 2004లో పదవి విరమణ అనంతరం సూరారంలో కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శ్రీచక్ర టైపు ఇనిస్టిట్యూట్‌ను స్థాపించి నామమాత్రపు ఫీజు తీసుకుని యువతకు శిక్షణ ఇస్తున్నారు. ఏడు పదుల వయసులో కూడా నిముషానికి 45 పదాలు టైప్ చేస్తూ తనకుతానే సాటి అనిపించుకున్నాడు. శిక్షణ కోసం పేద, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా వస్తున్నారు. ఫీజు గురించి వారిపై ఎప్పుడూ ఒత్తిడి పెంచకుండా వారికి టైప్ రైటింగ్‌లో తర్ఫీదునిస్తున్నాడు. టైప్ మిషన్ మరిచిపోయారు నేటి యువత కంప్యూటర్ వాడుతున్నారు. కొంతమంది టైప్ చేసేందుకు బద్దకిస్తూ ఫోన్లో వాయిస్ టైపింగ్ చేస్తున్నారు. చాలామంది టైప్ మిషన్ అనేది ఉందనే విషయాన్ని మరిచిపోయారు. టైప్ రైటింగ్ నేర్చుకుంటేనే కంప్యూటర్‌పై రాణించగలుగుతారు. ప్రభుత్వం టైప్ మిషన్ నేర్చుకోవాలనే రూల్ పెడితే నేటి యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. – సామల యాదగిరి -
ఆ బామ్మ ఎవరో చెప్పిన సెహ్వాగ్
భోపాల్ : పాత తరం టైప్ మెషీన్‌పై తన వేళ్లను అలవోకగా, అతివేగంగా పరుగులు పెట్టిస్తూ.. ఆధునిక కంప్యూటర్లో డిలీట్, బ్యాక్ బటన్లతో కుస్తీలు పడుతూ ఉన్న ఓ బామ్మ వీడియో కొద్దిరోజులుగా నెట్టింట్లో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వీడియో వైరల్ అయితే అయింది కానీ ఈ టైపింగ్ బామ్మ ఎవరు? ఎక్కడి వారు అన్న విషయం తెలియలేదు. సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించే టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆ బాధ్యత తీసుకొని ఆ బామ్మ ఎవరో ప్రపంచానికి తెలియజేశాడు. ఈ టైపింగ్ బామ్మ మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌కు చెందిన మహిళ అని ట్వీట్ చేశాడు. A superwoman for me. She lives in Sehore in MP and the youth have so much to learn from her. Not just speed, but the spirit and a lesson that no work is small and no age is big enough to learn and work. Pranam ! pic.twitter.com/n63IcpBRSH — Virender Sehwag (@virendersehwag) June 12, 2018 ‘నాకు సూపర్ మహిళా. మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో నివసించే ఈమె నుంచి యువత ఎంతో నేర్చుకోవచ్చు.ఆమె చేతి వేళ్ల వేగం గురించి కాదు.. చిన్న ఉద్యోగం, పెద్ద వయసు పనిచేయడానికి ఆటంకం కాదనే పాఠాన్ని నేర్చుకోవచ్చు.. ప్రణామ్!’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఈ బామ్మను మరోసారి సూపర్ వుమన్ను చేసింది. దీంతో జాతీయ మీడియా ఆమె ఇంటి తలుపు తట్టింది. రుణాలు చెల్లించడానికే ఈ ఉద్యోగం చేస్తున్నట్లు టైపింగ్ బామ లక్ష్మీబాయ్ తెలిపారు. నేను అడుక్కోలేను.. ‘నా కూతురికి ప్రమాదం జరగడంతో రుణం తీసుకున్నాను. అది చెల్లించడానికే ఈ ఉద్యోగం చేస్తున్నా. నేను అడుక్కోలేను. జిల్లా కలెక్టర్ రాఘవేంద్ర సాయంతో ఈ ఉద్యోగం లభించింది. సెహ్వాగ్ నా వీడియో షేర్ చేయడం బాగుంది. రుణాలు చెల్లించడానికి, సొంత ఇళ్లు నిర్మించుకోవడానికి నాకు సాయం కావాలి’ అని లక్ష్మీబాయ్ తెలిపారు. -
సూపర్ బామ్మ వైరల్ వీడియో
సాక్షి: రికార్డులను బ్రేక్ చేసిన బామ్మ వంటకాలను ఘుమఘుమలు ఆస్వాదించాం. అంతకుమించి 90సంవత్సరాల వయసులో యోగాసనాలతో ఇరగదీసిన వీడియోలను చూసి మురిసిపోయాం. తాజాగా మరో బామ్మ వీడియో నెట్లో చక్కర్లు కొడుతోంది. పాత తరం టైప్ మెషీన్‌పై తన వేళ్లను అలవోకగా, అతివేగంగా పరుగులు పెట్టిస్తూ.. ఆధునిక కంప్యూటర్లో డిలీట్, బ్యాక్ బటన్లతో కుస్తీలు పడుతూ టైపింగ్కోసం అష్టకష్టాలుడుతున్న నేటి తరం టైపిస్టులకు, కంప్యూటర్ ఆపరేటర్లకు సవాల్ విసురుతోందంటే అతిశయోక్తి కాదేమో. టైపింగ్ మిషన్‌మీద సునామీ వేగంతో టైప్ చేస్తున్న వైనం నెటిజనులను బాగాఆకట్టుకుటోంది. ఈ వీడియో ఎపుడు, ఎక్కడ తీసింది లాంటి ఇతర వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. కానీ రిజిస్ట్రార్ ఆఫీసులో నోటరీని టైప్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ముదిమి వయసులో కూడా తమకిష్టమైన క్రీడలు తదితర రంగాల్లో ప్రతిభను చాటుకున్న వారిని చాలామందినే చూశాం. కానీ ఈ టైపింగ్ బామ్మ మాత్రం నిజంగా సూపరే.. మరి మీరు కూడా ఓ లుక్కేసుకోండి.. -
టైపింగ్ మిషన్‌మీద సునామీ వేగంతో
-
దారి చూపిన సూరీడు
టైపింగ్‌లో తొలితరం గురువు వీవీఎస్‌పీ ఓ వైపు రైల్వే ఉద్యోగిగా.. మరో వైపు టైపు శిక్షకుడిగా.. ఇంటి వద్దే శిక్షణ కేంద్రం ఏర్పాటు విద్యార్థులకు వేగం, నైపుణ్యంతో కూడిన పాఠాలు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వరంగల్ యువకులు నాటి కాలంలో ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండేవి. పదో తరగతి పాస్ అయిన తర్వాత ఐటీఐ, ఒకేషనల్ కోర్సులు పూర్తి చేస్తే వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేవి. దీంతో చాలా మంది విద్యార్థులు టెన్త్ పూర్తి చేయగానే వృత్తివిద్యను అభ్యసించే వారు. ఈ క్రమంలో సమాజంలో తనతోపాటు నలుగురు బాగుపడాలనే ఉద్దేశంతో ఓ రైల్వే ఉద్యోగి తనకు వచ్చిన టైపింగ్‌ను పలువురికి పరిచయం చేశారు. ఇంటినే శిక్షణ కేంద్రంగా మార్చి ఉదయం, సాయంత్రం వేళల్లో వారికి మేలైన తర్ఫీదు ఇచ్చారు. ఆయన పర్యవేక్షణలో శిక్షణ పొందిన వరంగల్ యువకులు ఉన్నతస్థాయిలో ఉద్యోగాలు చేస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. తొలితరం టైపింగ్ గురువుగా పేరొందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి వేదాంతం వెంకట సూర్యప్రకాశం(వీవీఎస్)పై స్ఫూర్తిదాయక కథనం. – సాక్షి, హన్మకొండ ప్రస్తుతం నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రతీ ఇంటిలో కంప్యూటర్లు సాధారణమయ్యాయి. అప్పట్లో టైపు నేర్చుకోవడం అనేది కామన్. పదో తరగతి పూర్తి చేసిన వారిలో చాలామంది తప్పనిసరిగా టైపు నేర్చుకునేవారు. టైపు చేయడం వచ్చి ఉంటే ఉద్యోగం గ్యారంటీ అనే భరోసా ఉండేది. ఇలాంటి సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వేదాంతం వెంకటసూర్యప్రకాశం రైల్వే ఉద్యోగిగా వరంగల్‌కు వచ్చారు. 1966 నుంచి 1994 వరకు ఆయన కాజీపేట లోని రైల్వే డీజిల్ లోకోషెడ్‌లో స్టెనోగా పనిచేశారు. ఈ క్రమంలో తనకు వచ్చిన టైపింగ్‌ను మరికొందరికి అందజేయాలనే ఉద్దేశంతో ఆయన తన ఇం టిలోనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఉదయం.. సాయంత్రం వేళల్లో శిక్షణ 70వ దశకంలో వరంగల్ యువతను ప్రభుత్వ కొలువుల వైపు మళ్లించిన దేవుడిగా వేదాంతం వెంకట సూర్యప్రకాశం నిలుస్తారని చెప్పవచ్చు. కాజీపేటలో ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు ఆయన ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రతి రోజు నాలుగు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చేవారు. ఒక్కో బ్యాచ్‌లో 60 మంది టైప్ నేర్చుకునే వారు. ప్రతీ రోజు 240 మందికి ప్రకాశం పంతులు శిక్షణ ఇచ్చేవారు. ఇందుకోసం తన ఇంటినే శిక్షణ కేంద్రంగా మార్చుకున్నారు. మెుదటి బ్యాచ్lతెల్లవారుజామున 4:00 గంటల నుంచి ఉదయం 10:00 గంటల వరకు ఉండేది. అనంతరం తన రైల్వే విధులకు వెళ్లేవారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం 6:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు నిర్విరామంగా శిక్షణ తరగతులు నిర్వహించేవారు. సుమారు 24 ఏళ్ల పాటు వరంగల్‌లో ఆయన ఎంతోమందికి శిక్షణ ఇచ్చారు. 1994లో కాజీపేట నుంచి సికింద్రాబాద్‌కు బదిలీ అయ్యే వరకు ఆయన ఇదే జీవన విధానాన్ని అవలంబించారు. ఉన్నత సంస్థల్లో ఉద్యోగాలు.. ప్రైవేట్ ఉద్యోగాలు లేకS.. చేసేందుకు ఉపాధి పనులు దొరకక నాటి కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువతకు ప్రకాశం మాస్టారు నేనున్నాననే భరోసా కల్పించారు. టైపింగ్ నేర్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు సులువుగా సాధించవచ్చని ఎంతో మంది యువకులకు అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన దగ్గర టైపింగ్ శిక్షణ పొందిన వరంగల్‌కు చెందిన 1500 మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం గమనార్హం. ఇందులో ఎంతోమంది ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో, ఉన్నత సంస్థల్లో పనిచేస్తున్నారు. రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం, సీబీఐ కార్యాలయంతోపాటు పలు కీలకమైన శాఖల్లో వారు విధు లు నిర్వరిస్తున్నారు. ప్రకాశం మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్న వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంతో అప్పట్లో ఆయన పేరు మార్మోగింది. గురువుకు సన్మానం వృత్తిలో భాగంగా కాజీపేట నుంచి సికింద్రాబాద్‌కు బదిలీపై వెళ్లిన ప్రకాశం పంతులు 2001లో ప్రైవేట్ సెక్రటరీ హోదాలో రైల్వేలో ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోనే నివాసముంటున్నారు. ఆయన వద్ద శిక్షణ పొందిన వారిలో వరంగల్, సికింద్రాబా ద్లో కలిపి దాదాపు రెండు వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అయితే తమ భవిష్యత్‌కు బాటలు వేసి.. తమను ఉన్నతస్థాయికి చేర్చేందుకు కృషి చేసిన ప్రకాశం పంతులు సేవలను పూర్వ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న శిషు్యలంతా ఈ ఏడాది జులైలో జరిగిన గురుపౌర్ణమి సందర్భంగా ప్రకాశం పంతులు దంపతులను సికింద్రాబాద్‌లో ఘనంగా సన్మానించారు. తమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేసిన మాస్టారు సేవలను వారు కొనియాడారు. పట్టుదల ఉండాలి నేను శిక్షణ ఇచ్చిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం సంతోషంగా ఉంది. ఇప్పటివరకు నేను వేలాది మందికి శిక్షణ ఇచ్చాను. ఇందులో అంకితభావం ఉన్న వారు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. వారి విజయాల్లో నా శిక్షణ ప్రభావం పదిశాతం ఉంటే.. మిగిలిన తొంభై శాతం వారి పట్టుదలే కారణం. గురువు పాఠాలు చెబితే శిషు్యడికి సరిగా అర్థం కావడం అన్నది శిక్షణకు సంబంధించి ముఖ్యమైన విషయం. వరంగల్‌కు చెందిన నా శిషు్యలు చాలా మంది ఉన్నత సంస్థల్లో ఉద్యోగాలు చేస్తుండడం ఆనందంగా ఉంది. – వేదాంతం వెంకటసూర్య ప్రకాశం, రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సార్ వల్లే ఈ స్థాయికి వచ్చా.. మేము గతంలో కాజీపేటలో నివాసముండేవాళ్లం. నేను సెయింట్ గ్యాబ్రియల్స్ స్కూల్లో చదువుకున్నాను. కొంతమంది మిత్రుల ద్వారా నేను ప్రకాశం సార్ గురించి తెలుసుకున్నాను. రోజు ఉదయమే ఆయన ఇంటికి వెళ్లి సార్ దగ్గర టైప్ నేర్చుకున్నాను. నాతో పాటు నేర్చుకున్న వాళ్లందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోని ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్మెంట్లో స్టెనోగా పనిచేస్తున్నాను. నా మిత్రులు కొందరు ప్రధాన మంత్రి, రాష్ట్రపతి కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. ఇంకొందరు పొరుగు రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రకాశం సార్ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. – పి. అనిల ఫణికుమార్, స్టెనో, ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ -
టచ్ చేయకుండా టైప్ చేయచ్చు
-
మెరుపు బ్రౌజింగ్ కోసం..
నెట్‌బ్రౌజింగ్ మెరుపువేగంతో జరిగిపోవాలంటే ఎన్నో చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. బ్రౌజర్ ఓపెన్ చేసిన ప్రతిసారీ వెబ్సైట్ పేరు మొత్తం టైప్ చేయాల్సిన పనిలేదు. కొంత శ్రమకోర్చి షార్ట్‌కట్‌లను ఏర్పాటు చేసుకుంటే మీరు తరచూ చూసే వెబ్సైట్లను చటుక్కున ఓపెన్ చేయవచ్చు. మీరు క్రోమ్ బ్రౌజర్ వాడుతూంటే ఓమ్నీ బాక్స్ (వెబ్ అడ్రస్ టైప్ చేసే చోటు)పై రైట్ క్లిక్ చేసి ‘ఎడిట్ సెర్చ్ ఇంజిన్స్’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఒక డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. దాంట్లో అదర్ సెర్చ్ ఇంజిన్స్ అని ఉన్న చోట మీరు తరచూ బ్రౌజ్ చేసే వెబ్‌సైట్‌ను ఏ ‘కీవర్డ్’తో ఓపెన్ చేయాలనుకుంటున్నారో, యూఆర్ఎల్ లను టైప్ చేయండి. అంతే. ఆ తరువాత మీరు కేవలం ఆ కీవర్డ్ ఒక్కటి కొడితే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మౌస్ ముట్టుకోకుండానే... కొంతమందికి టైపింగ్, ఇంకొంతమందికి మౌస్ క్లిక్లంటే పరమచిరాకు. అలాంటి వారికోసం కీబోర్డు షార్ట్కట్లు ఎంతో ఉపయోగపడతాయి. వీలైనన్ని ఎక్కువ కీబోర్డు షార్ట్‌కట్‌లను నేర్చుకుంటే సర్ఫింగ్ మరింత సులువు అవుతుంది. టైపింగ్ కంటే మౌస్ క్లిక్‌ల ద్వారా వేళ్లు, చేతి కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుందన్నది గమనార్హం. కొత్త ట్యాబ్ ఓపెన్ చేయాలంటే ‘కంట్రోల్ + టీ’, ఉపయోగిస్తున్న ట్యాబ్‌ను క్లోజ్ చేసేందుకు ‘కంట్రోల్ + డబ్ల్యూ’, ఒక ట్యాబ్ నుంచి మరోదానికి వెళ్లేందుకు ‘కంట్రోల్ + ట్యాబ్’, ఉపయోగిస్తున్న పేజీని రిఫ్రెష్ చేసేందుకు ‘ఎఫ్5’ ఫంక్షన్ కీ, ఫుల్స్క్రీన్లోకి మారేందుకు, వెనక్కు వచ్చేందుకు ‘ఎఫ్11’, అడ్రస్బార్లోని విషయాలను హైలైట్ చేసేందుకు, కర్సర్‌ను అక్కడ ఉంచేందుకు ‘ఎఫ్6’, పనికొస్తాయి.