మెరుపు బ్రౌజింగ్ కోసం..
నెట్‌బ్రౌజింగ్ మెరుపువేగంతో జరిగిపోవాలంటే ఎన్నో చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. బ్రౌజర్ ఓపెన్ చేసిన ప్రతిసారీ వెబ్‌సైట్ పేరు మొత్తం టైప్ చేయాల్సిన పనిలేదు. కొంత శ్రమకోర్చి షార్ట్‌కట్‌లను ఏర్పాటు చేసుకుంటే మీరు తరచూ చూసే వెబ్‌సైట్లను చటుక్కున ఓపెన్ చేయవచ్చు.
మీరు క్రోమ్ బ్రౌజర్ వాడుతూంటే ఓమ్నీ బాక్స్ (వెబ్ అడ్రస్ టైప్ చేసే చోటు)పై రైట్ క్లిక్ చేసి ‘ఎడిట్ సెర్చ్ ఇంజిన్స్’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఒక డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. దాంట్లో అదర్ సెర్చ్ ఇంజిన్స్ అని ఉన్న చోట మీరు తరచూ బ్రౌజ్ చేసే వెబ్‌సైట్‌ను ఏ ‘కీవర్డ్’తో ఓపెన్ చేయాలనుకుంటున్నారో, యూఆర్‌ఎల్ లను టైప్ చేయండి. అంతే. ఆ తరువాత మీరు కేవలం ఆ కీవర్డ్ ఒక్కటి కొడితే ఆ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.
మౌస్ ముట్టుకోకుండానే...
కొంతమందికి టైపింగ్, ఇంకొంతమందికి మౌస్ క్లిక్‌లంటే పరమచిరాకు. అలాంటి వారికోసం కీబోర్డు షార్ట్‌కట్‌లు ఎంతో ఉపయోగపడతాయి. వీలైనన్ని ఎక్కువ కీబోర్డు షార్ట్‌కట్‌లను నేర్చుకుంటే సర్ఫింగ్ మరింత సులువు అవుతుంది. టైపింగ్ కంటే మౌస్ క్లిక్‌ల ద్వారా వేళ్లు, చేతి కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుందన్నది గమనార్హం.
కొత్త ట్యాబ్ ఓపెన్ చేయాలంటే ‘కంట్రోల్ + టీ’, ఉపయోగిస్తున్న ట్యాబ్‌ను క్లోజ్ చేసేందుకు ‘కంట్రోల్ + డబ్ల్యూ’, ఒక ట్యాబ్ నుంచి మరోదానికి వెళ్లేందుకు ‘కంట్రోల్ + ట్యాబ్’, ఉపయోగిస్తున్న పేజీని రిఫ్రెష్ చేసేందుకు ‘ఎఫ్5’ ఫంక్షన్ కీ, ఫుల్‌స్క్రీన్‌లోకి మారేందుకు, వెనక్కు వచ్చేందుకు ‘ఎఫ్11’, అడ్రస్‌బార్‌లోని విషయాలను హైలైట్ చేసేందుకు, కర్సర్‌ను అక్కడ ఉంచేందుకు ‘ఎఫ్6’, పనికొస్తాయి.