ముంబై: ఇన్వెస్టర్ల విస్తృత ప్రయోజనాల దృష్టా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ(ఎన్‌ఎస్‌ఈ) కొత్త మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. అలాగే, తన ఎన్‌ఎస్‌ఈ వెబ్‌సైట్ సేవలు మరింత మెరుగుపరిచింది. తెలుగుతో సహా 11 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు తమకు నచ్చిన ప్రాంతీయ భాషల్లోని డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కొత్త మైలురాయి
కాగా, ఎన్‌ఎస్‌ఈ మొబైల్ యాప్ యాపిల్ స్టోర్, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. మార్కెట్‌కు సంబంధించిన ఇండికేషన్లు, అప్‌డేట్లు, ట్రెండింగ్, ఆప్షన్ డేటా ట్రేడింగ్ సంబంధిత కాల్స్, పుట్స్ తదితర సమగ్ర సమాచారం ఇందులో ఉంది. పెట్టుబడి దారులు సురక్షితమైన సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment