new mobile app
-
ఎన్ఎస్ఈ కొత్త యాప్.. తెలుగులోనూ వెబ్సైట్
ముంబై: ఇన్వెస్టర్ల విస్తృత ప్రయోజనాల దృష్టా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ(ఎన్ఎస్ఈ) కొత్త మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. అలాగే, తన ఎన్ఎస్ఈ వెబ్సైట్ సేవలు మరింత మెరుగుపరిచింది. తెలుగుతో సహా 11 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు తమకు నచ్చిన ప్రాంతీయ భాషల్లోని డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కొత్త మైలురాయికాగా, ఎన్ఎస్ఈ మొబైల్ యాప్ యాపిల్ స్టోర్, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. మార్కెట్‌కు సంబంధించిన ఇండికేషన్లు, అప్డేట్లు, ట్రెండింగ్, ఆప్షన్ డేటా ట్రేడింగ్ సంబంధిత కాల్స్, పుట్స్ తదితర సమగ్ర సమాచారం ఇందులో ఉంది. పెట్టుబడి దారులు సురక్షితమైన సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. -
వాయిస్ విని వైరస్ గుట్టు చెప్పేస్తుంది
లండన్: కృత్రిమ మేథ మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్ జాడను ఇట్టే పసిగట్టి చెప్పే నూతన స్మార్ట్‌ఫోన్ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ‘మనిషి గొంతు విని అతనికి కోవిడ్ సోకిందో లేదో ఈ యాప్ చెప్పగలదు. కోవిడ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో ఫలితాలు ఇస్తుంది. ఎలాంటి ఖర్చు లేకుండా, త్వరగా, సులభంగా కోవిడ్ జాడ కనిపెట్టే విధానమిది. వాయిస్‌ను రికార్డ్ చేసి చెక్ చేస్తే సరిపోతుంది. నిమిషంలో ఫలితం వచ్చేస్తుంది. అల్పాదాయ దేశాల్లో ఇది ఎంతో ఉపయోగకరం’ అని పరిశోధకులు చెప్పారు. స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో నిర్వహించిన యురోపియన్ రెస్పిరేటరీ సొసైటీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్‌లో ఈ యాప్ సంబంధ వివరాలను బహిర్గతంచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఈ యాప్ 89 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తుందని రీసెర్చ్‌లో పాల్గొన్న అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా వ్యక్తి గొంతులో శ్వాస మార్గం, స్వరపేటికలు ఇన్ఫెక్షన్కు గురవుతాయి. దాంతో వచ్చిన మార్పులను ఈ యాప్ గుర్తిస్తుందని నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్ యూనివర్సిటీ మహిళా పరిశోధకులు వఫా అజ్బవీ చెప్పారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గణాంకాల నుంచి సేకరించిన స్వరనమూనాలను ఈ యాప్‌లో పొందుపరిచారు. ఆరోగ్యవంతులు, అస్వస్తులైన వారివి కలిపి 4,352 మందికి చెందిన 893 ఆడియో శాంపిళ్లను తీసుకున్నారు. ఇందులో 308 మంది కోవిడ్ రోగుల వాయిస్లూ ఉన్నాయి. యాప్ టెస్ట్‌లో భాగంగా నోటితో మూడు నుంచి ఐదుసార్లు గట్టిగా శ్వాస తీసుకోవాలి. మూడు సార్లు దగ్గాలి. స్క్రీన్ మీద చిన్న వాక్యాన్ని చదవాలి. వీటిని రికార్డ్ చేసిన యాప్ నిమిషంలో ఫలితాలు చూపిస్తుంది. -
అభిమానుల కోసం కొత్త ‘స్పోర్ట్స్ యాప్’
సాక్షి, హైదరాబాద్: అరవై పదాల్లో ఆసక్తికర క్రీడా సమాచారం... ఇదే లక్ష్యంతో కొత్త మొబైల్ అప్లికేషన్ మార్కెట్లోకి వచ్చింది. ‘వాట్స్ ఇన్ ద గేమ్’ పేరుతో రూపొందించిన ఈ యాప్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్ సహ భాగస్వామి. సాయిప్రణీత్‌తో పాటు అనిల్ కుమార్ మామిడాల, ఈజేబీ ప్రమీల కలిసి ఈ యాప్‌ను తీసుకొచ్చారు. ఇతర స్పోర్ట్స్ యాప్‌లతో పోలిస్తే ‘వాట్స్ ఇన్ ద గేమ్’ అన్ని రకాల క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని, షెడ్యూల్ మొదలు ఫలితాల వరకు సమాచారం అరవై పదాల్లోనే అందుబాటులో ఉంటుదని రూపకర్తలు వెల్లడించారు. ప్రొఫెషనల్‌గా బ్యాడ్మింటన్ క్రీడాకారుడినే అయినా... ఇతర క్రీడలపై తనకున్న ఆసక్తి, ఒక క్రీడాభిమానిగా అన్ని రకాల సమాచారం తెలుసుకోవాలని కుతూహలం కారణంగా ఇలాంటి యాప్ ఉంటే బాగుంటుందని భావించానని, అందుకే తాను భాగం అయ్యాయని సాయిప్రణీత్ వ్యాఖ్యానించాడు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
30 సెకన్లలోనే అన్ని వివరాలు
సాక్షి, విజయవాడ : విజయవాడ, గుంతకల్లు, నెల్లూరు డివిజన్ పరిధిలో కొత్త మొబైల్ యాప్స్‌ను రూపొందించినట్లు నెల్లూరు డీఎస్పీ వసంత్ కుమార్ గురువారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. 8.4 లక్షల నేరగాళ్ల డేటాను ఆన్లైన్లో పొందిపరిచినట్లు తెలిపారు. మొబైల్ గుర్తింపు పరికరంలో నేరగాళ్లు ఏ వేలిముద్ర వేసిన వాళ్ల వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఇంతకముందు ఎడమచేతి బొటన వేలి ముద్రలను తీసుకునే వారని తెలిపారు.వేలిముద్ర వేయగానే 23 నుంచి 30 సెకన్లలో అన్ని వివరాలు నమోదవుతాయని వెల్లడించారు. దీని ద్వారా నేరాలు జరగకుండా నియంత్రించవచ్చని, నేరాగాళ్ల కదలికలను గుర్తించడంలో తేలికవుతుందన్నారు. అలాగే 15 పోలీస్ స్టేషన్లకు అధికారులు 30 మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్‌లను అందజేసినట్లు డీఎస్పీ తెలిపారు. అదే విధంగా రైళ్లలో రోజుకు 60 నుంచి 70 బీట్లు ఉంటాయని, బీట్‌ళో ఉన్న సిబ్బంది ట్యాబ్, సెల్ ద్వారా మెసేజ్, వీడియోను ఈ యాప్ ద్వారా పంపవచ్చన్నారు. వేసవిలో ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. -
అరచేతిలో నేరగాళ్ల చిట్టా
► నేరస్తుల వివరాలు కంప్యూటరీకరణ ► పోలీసు శాఖ ప్రత్యేక యాప్ ► 90 శాతం పనులు పూర్తి ఏలూరు అర్బన్ : నేర నియంత్రణపై దృష్టి సారించిన పోలీసులు ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. నేరాల నిరోధానికి గతంలో అమలు చేసిన సాధారణ పరిశోధనలకు సాంకేతికను జోడిస్తున్నారు. దీనిలో భాగంగా పోలీసుశాఖ ప్రత్యేకతలు ఉన్న కొత్త యాప్‌ను రూపొందించుకుంది. దీంట్లో నేరస్తుల చరిత్రను నిక్షిప్తం చేయడంతో పాటు నేరగాళ్ల వేలిముద్రలు, ఆధార్ సంఖ్య పొందుపరుస్తున్నారు. ఇలా తయారైన యాప్‌ను రాష్ట్ర పోలీసు కార్యాలయంలోని కంప్యూటర్లోనే కాకుండా అన్ని పోలీసు కార్యాలయాల్లో, పోలీసుల వాడే స్మార్ట్ఫోన్లలో కూడా ఇన్స్టాల్ చేస్తారు. దీని వలన పోలీసులకు అనుమానితులు ఎదురైతే వెంటనే యాప్‌ను యాక్టివేట్ చేస్తే నేరగాళ్ల చరిత్ర సులభంగా తెలుస్తుంది. ఇలా అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి పంచుకునేందుకు పోలీసు శాఖ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఆధార్ నంబర్, వేలిముద్రల ఆధారంగా..: యాప్ అమలులోకి వస్తే నేరస్తుడి ఆధార్ నంబర్ లేదా వేలిముద్ర స్మార్ట్‌ఫోన్‌లో ఎంటర్ చేయగానే పూర్తి జాత కం స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీంతో నేర విచారణ పద్ధతుల అవసరం ఉండబోదనేది పోలీసుల భావన. దీనిని దృష్టిలో ఉంచుకుని నేరస్తుల పూర్తి వివరాలను కంప్యూటరీకరించేందుకు సిద్ధం చేస్తున్నారు. దందాలో భాగంగా ఇతరులను బెదిరించడం, భూ కబ్జాలు, తగాదాలు, ఆర్థిక లావాదేవీల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేయడం, దొంగతనాలు, బ్లాక్‌మెయిలింగ్, కిడ్నాప్‌లకు పాల్పడటం వంటి పలు నేరాలకు సంబంధించిన కార్యకలాపాలన్నింటినీ కళ్ల ముందు సాక్షాత్కరించేలా అన్ని వివరాలు సమగ్రంగా కంప్యూటర్లో నిక్షిప్తం చేసి అనంతరం ఇంటర్నెట్తో అనుసంధానించే పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. పూర్తిస్థాయిలో నేరాల నియంత్రణ లక్ష్యం: నేరాలను పూర్తిస్థాయిలో నివారించడం, అదుపుచేయడం పోలీసుల ఏకైక లక్ష్యం. దీనిలో భాగంగా పోలీసులు ఎప్పటికప్పుడు వ్యూహాలు రూపొందించుకుంటారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకునేందుకు యాప్ రూపకల్పన చేసుకున్నాం. దీని ద్వారా నేరస్తులను గుర్తించడం, కేసులను ఛేదించడ సులభమని భావిస్తున్నాం. అసలు నేరాలే జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం యాప్ అంతమ లక్ష్యం. –భాస్కర్‌భూషణ్, ఎస్పీ -
పిచ్చి పిచ్చిగా ‘పోక్‌మన్ గో’..
వాషింఘ్టన్: అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో వారం క్రితమే విడుదలైన ‘పోక్‌మన్ గో’ మొబైల్ యాప్ వీడియో గేమ్ దుమ్మురేపుతోంది. ప్రజలంతా పిచ్చి పిచ్చిగా ఈ గేమ్ వెంట పరుగులు తీస్తున్నారు. చర్చిలు, శ్మశానాలు, వార్ మెమోరియల్స్, మ్యూజియంలు ఏ స్థలాన్ని వదులకుండా అన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ మొబైల్ స్మార్ట్ ఫోన్లలో వేలం వెర్రిగా ఈ ఆట ఆడుతున్నారు. ‘దయచేసి ఇక్కడ పోక్‌మన్ ఆడవద్దు. ఈ స్థలానికున్న పవిత్రతను కాపాడండి’ అంటూ న్యూయార్క్‌లోని సెప్టెంబర్ 11 దాడుల స్మారక కేంద్రం వద్ద, కొన్ని శ్మశానాల వద్ద హెచ్చరిక బోర్డులు వెలిసాయంటే ఈ గేమ్ పట్ల అమెరికాలో ఎంత పిచ్చి పెరిగిందో తెలుసుకోవచ్చు. వాషింఘ్టన్ డీసీలోని హోలోకాస్ట్ మ్యూజియం అధికారులు కూడా ఇలాంటి హెచ్చరికలే జారీ చేశారు. ఇక సిడ్నీలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. సిడ్నీలోని ఓ అపార్ట్మెంట్ వద్ద దాదాపు 300 మంది మొబైల్ గేమ్ ప్లేయర్లు రాత్రి 11 గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ఈ గేమ్ ఆడుతూనే ఉన్నారు. చివరకు అపార్టుమెంట్ వాసుల ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి వారందరిని బలవంతంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. అరుపులు, కేకలు, గొంతు చించుకొని మాట్లాడుతుండడం వల్ల రాత్రంతా తమకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని అపార్ట్మెంట్ వాసులు మీడియాతో వాపోయారు. అమెరికాలోనైతే ఈ పిచ్చి పెళ్ళిళ్లకు దారితీసిందట. ‘పోక్‌మన్ గో’ ఆట ద్వారా తాము వీధులవెంట తిరగడం వల్ల అపరిచితులు పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రణయానికి దారితీసి పెళ్లిళ్లు చేసుకున్నామని ఓ రెండు జంటలు చెబుతుండగా, ఈ వీడియో గేమ్ ద్వారానే పరిచయమై ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నామని ఎన్నో జంటలు చెబుతున్నాయి. ‘అరే! మీరు కూడా పోక్‌మన్ గో ఆడుతున్నారా?, నేను కూడా అదే ఆట ఆడుతున్నాను. ఇప్పటి వరకు ఎన్ని క్రియేచర్లను క్యాచ్ చేశారు? రేర్ పోక్మన్లు ఎక్కడ దొరికాయి? బై ది బై నా పేరు .....మరి, మీ పేరు...’ ఇలా పోక్‌మన్ గో ప్లేయర్ల మధ్య కొత్త పరిచయాలు పెనవేసుకుంటున్నాయట. ‘టిండర్’ లాంటి డేటింగ్ సైట్లు అవసరం ఇక లేదని, పోక్‌మన్ గో అడితే సరిపోతుందని ప్లేయర్లు అంటున్నారు. డేటింగ్ స్పాట్‌గా పేరుపడ్డ ప్రాంతాలను ‘పోక్స్పాట్, పోక్స్టాప్’గా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా తమ చిరునామా చెప్పాల్సి వస్తే పలానా పోక్‌మన్ షాప్ పక్కన సందులో అని చెబుతున్నార ంటే పిచ్చి ఈ స్థాయికి చేరిందో తెలిసిపోతోంది. భారత్‌లో ఈ గేమ్ యాప్‌ను ఇప్పటి వరకు విడుదల చేయకపోయినప్పటికీ గేమ్ పట్ల క్రేజీ మాత్రం ఎక్కువగానే కనిపిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొన్న నాలుగు దేశాల పర్యటనకు వెళ్లిరాగా, పోక్‌మన్ క్యాచ్ చేయడానికే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారంటూ ట్వీట్లు వెల్లువెత్తాయంటే క్రేజీని అర్థం చేసుకోవచ్చు. పోక్‌మన్ గో గేమ్‌ను ఎలా ఆడతారంటే..... వీడియో గేమ్ విక్రేతల్లో ప్రసిద్ధి చెందిన ‘నింటెండో’ అనే జపాన్ కంపెనీ ఈ గేమ్ యాప్‌ను రూపొందించి మార్కెటింగ్ చేస్తోంది. జీఎపీఎస్ వ్యవస్థ ద్వారా ఈ గేమ్‌ను ఆడతారు. అందుకోసం ఈ కంపెనీ గూగుల్ మ్యాప్‌ను వాడుకునేందుకు ఫ్రాంచైజ్ తీసుకుంది. మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో మొబైల్ స్క్రీన్ గుండా కనిపించే పోక్‌మన్ క్రియేచర్లను క్యాచ్ చేయడమే ఈ ఆట లక్ష్యం. ఎవరైనా ఈ గేమ్ ఆడుతూ రోడ్డుమీద వెళుతున్నా, ఆ రోడ్డుపైన, మరెక్కడికెళితే అక్కడ పోక్‌మన్ ఫిక్షనల్ క్రియేచర్లు కనిపిస్తాయి. వాటిని క్యాచ్ చేస్తూ వెళ్లడమే. ఈ గేమ్ ఆడేవాళ్లు కనీసం సరాసరి రెండు కిలీమీటర్లు నడుస్తార న్నది ఏ లెక్క. అందుకనే దీన్ని వర్చువల్ రియాలిటీ గేమ్ అని కూడా పిలుస్తున్నారు. ఈ గేమ్‌లో 150 రకాల పోక్‌మన్ క్రియేచర్లు ఉన్నాయి. వాటిలో పికాచు, జాప్డోస్, చారిజార్డ్, న్యూటూ అనేవి అరుదైన్ పోక్మన్లు. వీటిని క్యాచ్ చేయడం కోసం కొంత మంది ప్లేయర్లు రోడ్ల వెంట, పార్కల వెంట పరుగులు తీస్తున్నారు. పరిసరాలను మరచిపోయి గేమ్‌లో లీనమవడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రమాదం ఉందని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. -
ఆస్పత్రుల చరిత్ర చెప్పే ‘హెల్దీ’ యాప్
పంజగుట్ట: హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, క్లినిక్‌లు, బ్లడ్ బ్యాంక్‌ల సమాచారం తెలుసుకునేందుకు విధూ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ‘హెల్దీ’ (Healtheey) పేరుతో కొత్త మొబైల్ యాప్ తయారు చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో యాప్ రూపకర్తలు గణేష్, సంపత్, సుదర్శన్ దీన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. బయటి నుంచి నగరానికి వచ్చి ఆస్పత్రుల వివరాలు తెలియక సతమతమయ్యే వారికి ఈ యాప్ ఉపయోగ పడుతుందన్నారు. నగరంలో ఎక్కడి నుండైనా ఆస్పత్రుల సమాచారం కోసం ఈ యాప్‌ను ఉపయోగించుకుంటే.. సదరు వ్యక్తి నిలబడిన చోటు నుంచి 5 కిలోమీటర్ల లోపు ఉన్న ఆస్పత్రుల వివరాలు, సదరు ఆస్పత్రి ఏ వ్యాధికి విజయవంతంగా చికిత్స అందిస్తుంది.. అక్కడి వైద్య పరికరాలు, వైద్యుల వివరాలు, సౌక ర్యాలు, ఆస్పత్రి చరిత్ర వస్తాయని తెలిపారు. ఇప్పటివరకూ యాప్‌లో నగరంలోని 50 ఆస్పత్రుల వివరాలు పొందుపరిచామని, త్వరలో మరికొన్ని ఆస్పత్రుల వివరాలు ఉంచనున్నట్లు తెలిపారు.