మూడోసారి ముక్కుతో టైపింగ్ చేసి రికార్డ్
తన రికార్డు తానే అధిగమించిన వినోద్ కుమార్
ముక్కుతో టైప్ చేయడమే విశేషం. అందులో కూడా రికార్డ్. మళ్లీ తన రికార్డును తానే అధిగమించాడో వ్యక్తి. ఆయన పేరే ‘టైపింగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ వినోద్ కుమార్ చౌదరి. స్పెషల్ కీబోర్డుపైన ముక్కుతో వర్ణమాలను అత్యంత వేగంగా టైప్ చేసి ఈ ఫీట్‌ని మరోసారి రికార్డు స్థాయిలో సాధించాడు. వినోద్ కుమార్ చౌదరి ముక్కుతో కీబోర్డు ఆపరేట్ చేస్తున్న వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డు సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేసింది.
వరుసగా మూడోసారి కీబోర్డుపై అతి తక్కువ టైంలో ముక్కుతో ఆల్పాబెట్ టైప్ చేసి రికార్డులకెక్కారు వినోద్. 2023లో తొలిసారిగా 27.80 సెకన్లతో రికార్డు క్రియేట్ చేశారు. అదే ఏడాది రెండో ప్రయత్నంలో 26.73 సెకన్లతో తన రికార్డుని తానే అధిగమించారు. ఇపుడుముచ్చటగా మూడోసారి కూడా కేవలం 25.66 సెకన్లలో ఆల్ఫాబెట్ ని టైప్ చేసి రికార్డు బ్రేక్ చేశారు.
How quickly could you type the alphabet with your nose (with spaces)? India's Vinod Kumar Chaudhary did it in 26.73 seconds ⌨️👃 pic.twitter.com/IBt7vghVai
— Guinness World Records (@GWR) May 30, 2024
ఈ విజయం పై వినోద్ సంతోషం ప్రకటించారు. ముక్కుతో టైపింగ్ చేయడంతో పాటు టైపింగ్‌లో పలు రికార్డులు తన పేరిట ఉన్నాయన్నారు. తన వృత్తి టైపింగ్ అని.. అందులో రికార్డు సృష్టించాలని కోరుకున్నానని అన్నారు. గంటలతరబడి సాధన చేసి ఈ రికార్డు బ్రేక్ చేశానని పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్ లా తన పేరుతోనూ చాలా రికార్డులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు సచిన్ లా రికార్డుల రారాజు అనిపించుకోవడమే తన జీవిత లక్ష్యమని చెప్పడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment