
భోపాల్ : పాత తరం టైప్ మెషీన్‌పై తన వేళ్లను అలవోకగా, అతివేగంగా పరుగులు పెట్టిస్తూ.. ఆధునిక కంప్యూటర్‌లో డిలీట్, బ్యాక్ బటన్లతో కుస్తీలు పడుతూ ఉన్న ఓ బామ్మ వీడియో కొద్దిరోజులుగా నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వీడియో వైరల్ అయితే అయింది కానీ ఈ టైపింగ్ బామ్మ ఎవరు? ఎక్కడి వారు అన్న విషయం తెలియలేదు. సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించే టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆ బాధ్యత తీసుకొని ఆ బామ్మ ఎవరో ప్రపంచానికి తెలియజేశాడు. ఈ టైపింగ్ బామ్మ మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌కు చెందిన మహిళ అని ట్వీట్ చేశాడు.
A superwoman for me. She lives in Sehore in MP and the youth have so much to learn from her. Not just speed, but the spirit and a lesson that no work is small and no age is big enough to learn and work. Pranam ! pic.twitter.com/n63IcpBRSH
— Virender Sehwag (@virendersehwag) June 12, 2018
‘నాకు సూపర్ మహిళా. మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో నివసించే ఈమె నుంచి యువత ఎంతో నేర్చుకోవచ్చు.ఆమె చేతి వేళ్ల వేగం గురించి కాదు.. చిన్న ఉద్యోగం, పెద్ద వయసు పనిచేయడానికి ఆటంకం కాదనే పాఠాన్ని నేర్చుకోవచ్చు.. ప్రణామ్!’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఈ బామ్మను మరోసారి సూపర్ వుమన్‌ను చేసింది. దీంతో జాతీయ మీడియా ఆమె ఇంటి తలుపు తట్టింది. రుణాలు చెల్లించడానికే ఈ ఉద్యోగం చేస్తున్నట్లు టైపింగ్ బామ లక్ష్మీబాయ్ తెలిపారు.
నేను అడుక్కోలేను..
‘నా కూతురికి ప్రమాదం జరగడంతో రుణం తీసుకున్నాను. అది చెల్లించడానికే ఈ ఉద్యోగం చేస్తున్నా. నేను అడుక్కోలేను. జిల్లా కలెక్టర్ రాఘవేంద్ర సాయంతో ఈ ఉద్యోగం లభించింది. సెహ్వాగ్ నా వీడియో షేర్ చేయడం బాగుంది. రుణాలు చెల్లించడానికి, సొంత ఇళ్లు నిర్మించుకోవడానికి నాకు సాయం కావాలి’ అని లక్ష్మీబాయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment