
సంగారెడ్డి అర్బన్: కూతురుకు రెండో వివాహం చేయడం కోసం ఏడాదిన్నర వయసున్న మనవడిని చెరువులోకి తోసి హత్య చేసింది ఓ అమ్మమ్మ. ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలో శుక్రవారం కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. సంగారెడ్డిలోని రాజంపేటకాలనీకి చెందిన నాగమణి తన కూతురు సుజాత మనవళ్లు మహేష్, జశ్వంత్‌లతో నివాసముంటోంది. సుజాత భర్త రెండేళ్ల క్రితం మృతి చెందడంతో తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో పుల్‌కల్ మండలం బద్రిగూడెంకు చెందిన జనార్దన్‌తో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.
చెరువులో తోసి ఏమీ తెలియనట్లు..
తనను పెళ్లి చేసుకోవాలని సుజాత.. జనార్దన్‌పై ఒత్తిడి తెచ్చింది. అయితే పెద్ద కుమారుడిని ఎవరైనా దత్తత తీసుకుంటారని, ఏడాదిన్నర ఉన్న చిన్న కుమారుడిని ఎలాగైనా వదిలించుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కూతురు పెళ్లికి చిన్నారిని అడ్డు తొలగించాలని నాగమణి నిర్ణయించుకుంది. చిన్నారిని వెంట తీసుకుని వెళ్లి బొబ్బలికుంట చెరువులో తోసేసింది. బాలుడు ఊపిరి ఆడక మృతిచెందాడు. బాలుడు అదృశ్యమయ్యాడని ఈ నెల 29న పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో అమ్మమ్మే నింది తురాలని తేలింది. నాగమణితోపాటు సుజాతను, జనార్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
Comments
Please login to add a commentAdd a comment