
అడ్డగుట్ట: సొంత అమ్మమ్మపైనే ఓ యువకుడు లైంగికదాడికి యత్నించిన సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీను కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఎంకమ్మ(80) భర్త మృతి చెందడంతో బీ.సెక్షన్‌లో ఉంటున్న తన తన కుమార్తె కౌసల్య ఇంట్లో ఉంటుంది. కౌసల్యకు గణేష్, రఘు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు రఘు మద్యం తాగుతూ జులాయిగా తిరిగేవాడు. గురువారం ఇంట్లో ఎవరూలేని సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రఘు ఇంట్లో నిద్రిస్తున్న ఎంకమ్మపై లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు రఘుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రఘుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment