వాషింగ్టన్: మనవరాలికి నానమ్మ జన్మనివ్వటమేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే, సరోగసి పున్యమా అని ఇలాంటి వింత సంఘటనలు ఇటీవల సాధ్యమవుతున్నాయి. 56 ఏళ్ల ఓ మహిళ తన కొడుకు, కోడలి బిడ్డకు సరోగసి ద్వారా జన్మనిచ్చింది. ఈ సంఘటన అమెరికాలోని ఉతాహ్ ప్రాంతంలో జరిగింది. తన కోడలికి గర్భాశయాన్ని తొలగించిన క్రమంలో ఈ సరోగసి పద్ధతికి తానే అంగీకరించారని, ఆ దంపతులు మరో అవకాశం లేకుండా పోయిందని ద పీపుల్స్ మీడియా పేర్కొంది.
ఉతాహ్ ప్రాంతానికి చెందిన జెఫ్ హాక్ అనే వ్యక్తి భార్య కాంబ్రియాకు గర్భాశయం తొలగించారు. ఈ క్రమంలో సరోగసి ద్వారా వారి బిడ్డను కనివ్వడనికి అతడి 56 ఏళ్ల తల్లి నాన్సీ హాక్ ఆఫర్ చేసింది. అయితే, అది సాధ్యం కాదని మొదట వాదించాడు జెఫ్ హాక్. అయితే, వైద్యులు చేసి చూపించారు. జెఫ్ హాక్ తల్లి తన మనవరాలికి జన్మనిచ్చింది. మరోవైపు.. ఆ పాప జెప్ హాక్, కాంబ్రియాల ఐదో సంతానం కావటం గమనార్హం. ఇది ఒక గొప్ప సందర్భమని, ఎంత మంది తన తల్లి జన్మనివటాన్ని చూస్తారని పేర్కొన్నాడు జెఫ్ హాక్. బిడ్డకు జన్మనిచ్చిన క్రమంలో నాన్సీ హాక్ భావోద్వేగానికి గురయ్యారని, అయితే ఆ పాపను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లలేకపోయారని ద పీపుల్స్ పేర్కొంది.
నానమ్మ గుర్తుగా పాపకు హన్నా అని నామకరణం చేశారు జెఫ్ హాక్, కాండ్రియా. తన తల్లి ఓరోజు అర్ధరాత్రి నిద్రలేచి తన పేరు హన్నాగా చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు జెఫ్ హాక్. డెలివరీకి ముందే, ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయకముందే కడుపులో ఉంది పాపేనని చేప్పారు నాన్సీ. ఒక మహిళ తన మనవరాలిని మోయడం అనేది అసాధారణమైన విషయమని డాక్టర్ రస్సెల్ ఫౌల్స్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విలాసవంతమైన ఇంట్లో 43 ఏళ్లపాటు పనిమనిషిగా.. బిడ్డ వల్లే ఇప్పుడు ఏకంగా ఓనర్!
Comments
Please login to add a commentAdd a comment