
సోషల్ మీడియా ప్రేమకు సరిహద్దులు లేవని ప్రూవ్ చేస్తోంది. ఎక్కడెక్కడ దేశాల వాళ్లని కలుపుతోంది. మనసునే కదిలించే కొంగొత్త ప్రేమ కథలు పుట్టుకొస్తున్నాయి. ఔరా దేశాలు వేరు, సంస్కృతి సంప్రదాయలు వేరైనా ఎలా ఒక్కటవుతున్నారు వీళ్లు అనిపిస్తున్నాయి. చెప్పాలంటే సినిమాని తలిపించే లవ్ స్టోరీలుగా నిలుసున్నాయి. అలాంటి అందమైన ప్రేమ కథే ఈ జంటది. ఇద్దరి దేశాల మధ్య సప్త సముద్రాలు దాటి రావాల్సినంత దూరం. అయినా ఇద్దరూ ఒక్కటయ్యారు.
అమెరికా అమ్మాయి ఆంధ్ర అబ్బాయిల మధ్య చిగురించిన ప్రేమ కథ ఇది. అందుకు సంబంధించిన ఘటనను మొత్తం వీడియో డాక్యుమెంట్ రూపంలో షేర్ చేశారు. ఆ వీడియోలో అమెరికా అమ్మాయి జాక్లిన్ ఫోరెరో తాను ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల వ్యక్తితో ఎలా ప్రేమలో పడింది వివరించింది.
తాను ఆంద్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన చందన్ అనే వ్యక్తిని ప్రేమించానని, అతడు తనకంటే తొమ్మిది సంవత్సరాలు చిన్నవాడని చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో తాము ఇద్దరూ ఎలా కమ్యూనికేట్ చేసుకునేవారో, వీడియో కాల్ ముచ్చట్లతో సహా చూపించింది. దాదాపు 14 నెలలు ఇన్‌స్టాగ్రాంలో ముచ్చంటించుకున్న విధానం, అతడిని కలుసుకుంది మొత్తం ఆ డాక్యుమెంట్‌లో సవివరంగా వెల్లడించింది.
చందన్ కోసం ఆమె అమెరికాను విడిచి వచ్చి మరీ పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం ఈ జంట ఒక YouTube ఛానెల్‌ని నిర్వహిస్తోంది. అందులో తమ అందమైన ప్రేమ కథను పంచుకున్నారు. వయస్సు, సంస్కృతి, జాతి, ఆర్థిక స్థితి వంటి సాంస్కృతిక నిబంధనలకు అధిగమించి తామెలా ఒక్కటైంది చెప్పుకొచ్చారు. నెటిజన్లు మాత్రం మీ జంట చాలా బాగుంది, వివాహ జీవితం మంచిగా సాగాలంటూ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు పెట్టారు. కాగా, అమెరికా అమ్మాయి జాక్లిన్ ఫోరెరో ఇది రెండోపెళ్లి కావడం గమనార్హం.
(చదవండి: వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..? బిల్‌గేట్స్ ఏమన్నారంటే..)