woman give birth
-
‘మనవరాలి’కి జన్మనిచ్చిన 56 ఏళ్ల మహిళ
వాషింగ్టన్: మనవరాలికి నానమ్మ జన్మనివ్వటమేంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే, సరోగసి పున్యమా అని ఇలాంటి వింత సంఘటనలు ఇటీవల సాధ్యమవుతున్నాయి. 56 ఏళ్ల ఓ మహిళ తన కొడుకు, కోడలి బిడ్డకు సరోగసి ద్వారా జన్మనిచ్చింది. ఈ సంఘటన అమెరికాలోని ఉతాహ్ ప్రాంతంలో జరిగింది. తన కోడలికి గర్భాశయాన్ని తొలగించిన క్రమంలో ఈ సరోగసి పద్ధతికి తానే అంగీకరించారని, ఆ దంపతులు మరో అవకాశం లేకుండా పోయిందని ద పీపుల్స్ మీడియా పేర్కొంది. ఉతాహ్ ప్రాంతానికి చెందిన జెఫ్ హాక్ అనే వ్యక్తి భార్య కాంబ్రియాకు గర్భాశయం తొలగించారు. ఈ క్రమంలో సరోగసి ద్వారా వారి బిడ్డను కనివ్వడనికి అతడి 56 ఏళ్ల తల్లి నాన్సీ హాక్ ఆఫర్ చేసింది. అయితే, అది సాధ్యం కాదని మొదట వాదించాడు జెఫ్ హాక్. అయితే, వైద్యులు చేసి చూపించారు. జెఫ్ హాక్ తల్లి తన మనవరాలికి జన్మనిచ్చింది. మరోవైపు.. ఆ పాప జెప్ హాక్, కాంబ్రియాల ఐదో సంతానం కావటం గమనార్హం. ఇది ఒక గొప్ప సందర్భమని, ఎంత మంది తన తల్లి జన్మనివటాన్ని చూస్తారని పేర్కొన్నాడు జెఫ్ హాక్. బిడ్డకు జన్మనిచ్చిన క్రమంలో నాన్సీ హాక్ భావోద్వేగానికి గురయ్యారని, అయితే ఆ పాపను తనతో పాటు ఇంటికి తీసుకెళ్లలేకపోయారని ద పీపుల్స్ పేర్కొంది. నానమ్మ గుర్తుగా పాపకు హన్నా అని నామకరణం చేశారు జెఫ్ హాక్, కాండ్రియా. తన తల్లి ఓరోజు అర్ధరాత్రి నిద్రలేచి తన పేరు హన్నాగా చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు జెఫ్ హాక్. డెలివరీకి ముందే, ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయకముందే కడుపులో ఉంది పాపేనని చేప్పారు నాన్సీ. ఒక మహిళ తన మనవరాలిని మోయడం అనేది అసాధారణమైన విషయమని డాక్టర్ రస్సెల్ ఫౌల్స్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Cambria Hauck (@cambriairene) ఇదీ చదవండి: విలాసవంతమైన ఇంట్లో 43 ఏళ్లపాటు పనిమనిషిగా.. బిడ్డ వల్లే ఇప్పుడు ఏకంగా ఓనర్! -
అంబులెన్స్ లేదు.. పీహెచ్‌సీకి తాళం.. ఆటోలోనే ప్రసవించిన మహిళ
సాక్షి, ఆదిలాబాద్(గాదిగూడ): బిడ్డకు జన్మనివ్వడమంటే ఓ మహిళకు పునర్జన్మగా భావిస్తారు. అలాంటి ప్రసవ సమయంలో పరిస్థితులు అన్ని సాఫీగా ఉంటేనే ఎలాంటి వేదన ఉండదు.. కానీ ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లేందుకు 108 వాహనం, అమ్మఒడి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఓ గిరిజన మహిళ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఆటోలోనే బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గాదిగూడ మండలం కూనికాస గ్రామానికి చెందిన ఆత్రం గంగాదేవికి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. చదవండి: తెలంగాణ: జైళ్లలో మగ్గుతున్న యువత.. హత్యలు, లైంగిక దాడులే అధికం.. దీంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. మండల కేంద్రంలో వాహనం అందుబాటులో లేదని వారు సమాచారం ఇచ్చారు. అమ్మఒడి వాహనం కోసం సంప్రదించినా డీజిల్ లేదని సిబ్బంది చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఆటో సాయంతో గంగాదేవిని గాదిగూడ పీహెచ్‌సీకి మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తీసుకెళ్లారు. అయితే పీహెచ్‌సీకి తాళం వేసి ఉండటంతో అదే ఆటోలో నార్నూర్ మండలంలోని ఝరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మారేగావ్ సమీపంలో ఆశ కార్యకర్త కె.జారుబాయి సాయంతో గంగాదేవి పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను ఝరి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ కూడా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్‌నర్స్ వైద్యమందించడం గమనార్హం. చదవండి: ఐటీ కంపెనీలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఇంకొంత కాలం ఇంటి నుంచే! -
విమానంలో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
కోల్కత్తా : విమానంలో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. థాయ్‌లాండ్‌కు చెందిన మహిళ(23) నిండు గర్బిని. అయినప్పటికీ ఖతార్ ఎయిర్వేస్కు చెందిన ఓ విమానం క్యూఆర్ 830లో దోహా నుంచి బ్యాంకాక్‌కు ప్రయాణం చేస్తోంది. కాగా తెల్లవారు జామున 3 గంటలకు మహిళకు పురిటి నొప్పులు మొదలవ్వడంతో క్యాబిన్ సిబ్బంది సహాయంతో మహిళ ప్రసవించింది. అనంతరం అత్యవసర ల్యాండింగ్ కింద కోల్‌కత్తాలో విమానం ల్యాండింగ్ చేయడానికి పైలట్ అధికారుల అనుమతి కోరారు. దీనికి కోల్కత్తా ఏటీసీ ఒప్పుకోవడంతో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశారు. అక్కడి నుంచి మహిళను హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. -
విమానంలో ప్రసవం.. అత్యవసరంగా..
ముంబై : విమానంలో బిడ్డకు జన్మనిచ్చింది ఓ ఇండినేషియా మహిళ. బుధవారం ఉయయం అబుదాబి నుంచి జకర్తా వెళ్తున్న ఎతిహడ్ ఎయిర్వేస్ విమానంలో ఓ నిండు గర్భిణీ ప్రయాణిస్తున్నారు. మార్గ మధ్యలో పురుటినొప్పులు రావడంతో సిబ్బంది సాయంతో విమానంలోనే బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ముంబైకి మళ్లించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే మహిళను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానం రెండు గంటల ఆలస్యంగా జకర్తాకు చేరుకుందని ఎతిహాడ్ ఎయిర్వేస్ విమాన ప్రతినిధి తెలిపారు. -
గర్భిణి ప్రసవానికి సైనికుల సహకారం..
రోమ్ః సెంట్రల్ రోమ్ స్క్యేర్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సైనికులు ఓ గర్భిణి ప్రసవానికి సహకరించి ప్రాణాపాయంనుంచీ కాపాడారు. ప్రసవంకోసం దగ్గరలో ఉన్న ఆస్పత్రికి నడుచుకుంటూ వెడదామని ప్రయత్నించిన మహిళకు ఉన్నట్లుండి నొప్పులు ఎక్కువవ్వతో దిక్కు తోచని ఆమె.. అరుపులు ప్రారంభించింది. దీంతో అక్కడికి దగ్గరలోనే విధులు నిర్వహిస్తున్న సైనికులు ఆమెకు తక్షణ సహాయం అందించారు. అత్యవసర పరిస్థితుల్లో బిడ్డకు జన్మనిచ్చేందుకు సహకరించి, తల్లీ బిడ్డల ప్రాణాలను నిలబెట్టారు. పియాజ్జాశాన్ బార్టోలోమియో లో కాపలాగా ఉన్న ఇద్దరు సైనికులకు రాత్రి పదిగంటల సమయంలో మహిళ ఏడుపులు వినిపించడంతో అప్రమత్తమయ్యారు. ప్రసవంకోసం ఆస్పత్రికి నడుచుకుంటూ వెడుతున్న మహిళకు నొప్పులు తీవ్రం కావడంతో ఆమె ప్రసవానికి తాత్కాలిక ఏర్పాట్లు చేసి ఆదుకున్నారు. అత్యవసర సేవల్లో భాగంగా ప్రసవం అనంతరం బొడ్డు తాడు కత్తిరించిన సైనికులు.. తల్లీ బిడ్డలను సమయానికి ఆస్పత్రికి తరలించి సేవాభావాన్ని చాటుకున్నారు. అయితే తమకింకా పిల్లలు పుట్టలేదని, ప్రసవం గురించి పెద్దగా తెలియదని చెప్పిన సోల్జర్.. కార్పోరల్ ఫ్రాన్సిస్కో మన్కా.. ఎలాగైనా బాధితురాలిని రక్షించాలన్నదే తమ ధ్యేయమని, అందుకే అత్యవసర చికిత్సా విభాగం చేరేలోపు తోచిన సహాయం అందించామని చెప్పారు. రోమ్ నుంచి దగ్గరలోని మోంటెరోటోండ్ నగరానికి ఆస్పత్రికి వెళ్ళేందుకు బయల్దేరిన 33 ఏళ్ళ కాంగో మహిళకు.. టైబరిన్ ఐస్ ల్యాండ్ లోని ఫ్రాటెల్లీ ఆస్పత్రికి చేరేలోపే నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో బిడ్డకు జన్మనిచ్చేందుకు తక్షణ సహకారం అందించిన సైనికులు.. అనంతరం తల్లీ బిడ్డలను రోమ్ లోని ప్రఖ్యాత ప్రసూతి ఆస్పత్రి ఫాట్ బెనె ఫ్రాటెల్లీ కి తరలించారు. మరో ఇద్దరు పిల్లలను చూసుకుంటూ భర్త ఇంట్లోనే ఉండగా ఆమె ప్రసవంకోసం ఆస్పత్రిలో చేరేందుకు బయల్దేరినట్లు తెలుస్తోంది.