కోల్‌కత్తా : విమానంలో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. థాయ్‌లాండ్‌కు చెందిన మహిళ(23) నిండు గర్బిని. అయినప్పటికీ ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానం క్యూఆర్ 830లో దోహా నుంచి బ్యాంకాక్‌కు ప్రయాణం చేస్తోంది. కాగా తెల్లవారు జామున 3 గంటలకు మహిళకు పురిటి నొప్పులు మొదలవ్వడంతో క్యాబిన్ సిబ్బంది సహాయంతో మహిళ ప్రసవించింది.
అనంతరం అత్యవసర ల్యాండింగ్ కింద కోల్‌కత్తాలో విమానం ల్యాండింగ్ చేయడానికి పైలట్ అధికారుల అనుమతి కోరారు. దీనికి కోల్‌కత్తా ఏటీసీ ఒప్పుకోవడంతో కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశారు. అక్కడి నుంచి మహిళను హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment