కారణం ఏంటో తెలియదు కానీ విమానంలో కొంతమంది యువకులు తగువులాడుకున్నారు. చిన్నగా మొదలైన వీరిమధ్య గొడవ మాటామాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. విమానం గాల్లో ఉండగా.. తోటి ప్రయాణికుల ముందే రౌడీల్లా తన్నుకున్నారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌కు చెందిన థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ విమానంలో చోటుచేసుకుంది. బ్యాంకాంక్ నుంచి కోల్‌కతా వస్తున్న థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ టేకాఫ్ అయ్యింది. విమానం గాల్లో ఉండగా అద్దాలు పెట్టుకున్న ఓ యువకుడు తన ఎదురుగా ఉన్న బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తితో గొడవకు దిగాడు.
విమానంలో ప్రయాణికులందరూ చూస్తుండగానే ఇద్దరు కొద్దిసేపు వాదులాడుతుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు విమాన సిబ్బంది, సహా ప్రయాణికులు ప్రయత్నించినా గొడవ సద్దుమణగలేదు. ఇంతలో అద్దాలు పెట్టుకున్న వ్యక్తికి మద్దతుగా తన స్నేహితులు రావడంతో గొడవ ఇంకాస్తా పెద్దది అయ్యింది.
దీంతో అందరూ కలిసి ఎదుటి వ్యక్తిపై చేయిచేసుకున్నారు. ఒక్కడిని చేసి అతడిపై అందరూ దాడి చేశారు. వతల వ్యక్తి ఒక్కటే కావడంతో తనను తాను రక్షించుకుంటూ వారి చేతిలో తన్నులు తిన్నాడు. ఈ తతంగాన్నంతా ఓ ప్రయాణికుడు రికార్డ్ చేయగా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Not many smiles on this @ThaiSmileAirway flight at all !
— VT-VLO (@Vinamralongani) December 28, 2022
On a serious note, an aircraft is possibly the worst place ever to get into an altercation with someone.
Hope these nincompoops were arrested on arrival and dealt with by the authorities.#AvGeek pic.twitter.com/XCglmjtc9l
ఇందులో.. ఇద్దరిలో ఒకరు.. కూర్చోని నెమ్మదిగా మాట్లాడండి అని చెబుతుండగా.. ఎదుటి వ్యక్తి ముందు చేయి కిందకు దించు అని అరవడం వినిపిస్తోంది. సెకన్ల వ్యవధిలోనే వీరి మధ్య గొడవ పెరగడంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. విమానంలో అలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. రైలు, బస్సులో సీటు కోసం గొడవ పడటం చూశాం. కానీ విమానంలో ఒకరినొకరు తన్నుకోవడం ఏంట్రా బాబూ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ గొడవ ఎందుకు మొదలైందనే విషయం స్పష్టంగా తెలియరాలేదు. అంతేగాక ఇప్పటివరకు, థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ ఈ ఘటనపై స్పందించలేదు.
చదవండి: Bomb Cyclone: జారిపోతున్న కార్లు.. మంచులా మారుతున్న వేడి నీళ్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్..
Comments
Please login to add a commentAdd a comment