విమానంలో ప్రసవం.. అత్యవసరంగా.. | Indonesian Woman Gives Birth To Baby On Board Etihad Flight | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 24 2018 4:07 PM | Last Updated on Wed, Oct 24 2018 4:08 PM

Indonesian Woman Gives Birth To Baby On Board Etihad Flight - Sakshi

ముంబై : విమానంలో బిడ్డకు జన్మనిచ్చింది ఓ ఇండినేషియా మహిళ. బుధవారం ఉయయం అబుదాబి నుంచి జకర్తా వెళ్తున్న ఎతిహడ్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో ఓ నిండు గర్భిణీ ప్రయాణిస్తున్నారు. మార్గ మధ్యలో పురుటినొప్పులు రావడంతో సిబ్బంది సాయంతో విమానంలోనే బిడ్డకు జన్మనిచ్చారు.

దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ముంబైకి మళ్లించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే మహిళను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా విమానం  రెండు గంటల ఆలస్యంగా జకర్తాకు చేరుకుందని ఎతిహాడ్‌ ఎయిర్‌వేస్‌ విమాన ప్రతినిధి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement