
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అమ్మమ్మ రెండేళ్ల క్రితమే మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తను మరోసారి అమ్మమ్మను గుర్తు చేసుకుని ఎమోషనలైంది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. 'విల్ మిస్ యూ అజ్జి' అంటూ ఆమెతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. కాగా.. ఇటీవలే బుట్టబొమ్మ తన చెల్లెలు భూమి పెళ్లిలో సందడి చేస్తూ కనిపించింది. గతంలో కూడా పూజా తన అమ్మమ్మతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
కాగా.. గతేడాది బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో కిసీ కా భాయ్.. కిసి కీ జాన్ చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. టాలీవుడ్‌లో గుంటూరు కారం చిత్రంలో ఛాన్స్ కొట్టేసినప్పటికీ ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బుట్టబొమ్మ చేతిలో చిత్రాలేవీ లేవు. ప్రస్తుతం ముంబై భామకు అవకాశాలు తక్కువగానే వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment