ఫ్రాన్స్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఇంటి గుమ్మం ముందు నిలబడిన బామ్మ, చిన్నారిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలితో పాటు ఆమె మనవరాలు కూడా గాయపడింది. బోర్డియక్స్ నగరంలో ఈ ఘటన జరిగింది. అయితే.. నిందితుడు ఓ ఆఫ్రికా దేశం నుంచి వలస వచ్చిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నిందితున్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరంలోని ఓ కాలనీలో బామ్మ తన మనవరాలితో నివసిస్తోంది. ఇంట్లో ఎవరూ లేని కారణంగా కాస్త బోరింగ్‌గా ఫీల్ అయిన బామ్మ గుమ్మం ముందుకు వచ్చింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఆఫ్రికన్ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని గమనించిన బామ్మ తన మనవరాలితో వెంటనే ఇంట్లోకి వెళ్లి డోర్ మూసేయడానికి ప్రయత్నం చేసింది. కానీ నిందితుడు వారిని అడ్డగించాడు. డోర్ వేయకుండా ఆపేసి వారిని బయటకు లాగాడు. విచక్షణా రహితంగా చిన్నారిని ఇంటి నుంచి బయటకు విసిరాడు. అనంతరం బామ్మపై దాడి చేసి.. విలువైన వస్తువులను లాక్కెళ్లాడు. బాధితులకు స్వల్పంగా గాయాలయ్యాయి.
Shocking video of violent attack on a grandmother and granddaughter by a migrant in Bordeaux, France goes viral; Netizen demand strict anti-immigration laws. pic.twitter.com/kqjeE2tFW9
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 20, 2023
ఈ వీడియో క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు అకారణంగా దాడి చేయడంపై అసహనం వ‍్యక్తం చేశారు. ఫ్రాన్స్‌కు వచ్చే విదేశీయులపై ఆంక్షలు విధించాలని కోరారు. ఇమ్మిగ్రేషన్ నియమాలను కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. నిందితున్ని అరెస్టు చేశారు. ఆఫ్రికా నుంచి వలస వచ్చిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు.
ఇదీ చదవండి: గొంతును ఏమార్చారు, ఒరిజినల్‌గా నమ్మించారు
Comments
Please login to add a commentAdd a comment