Granddaughter
-
Akshainie Reddy: నానమ్మ గురించి రాస్తా...
పన్నెండేళ్ల అమ్మాయి పదహారేళ్ల్ల అమ్మాయి గురించి కథ రాస్తే ఎలా ఉంటుంది?! ఏడవతరగతి చదువుతున్న పన్నెండేళ్ల పట్లోళ్ల అక్షయినీ రెడ్డి రాసిన ‘ట్రైల్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్’ పుస్తకం ద్వారా మనకు ఈ విషయాలు తెలుస్తాయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనవరాలు అక్షయినీ రెడ్డి.‘‘మా నానమ్మ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో రోజూ చూస్తుంటాను. నానమ్మ, అమ్మ, నాన్న.. మా ఇంట్లోని వ్యక్తులే నాకు స్ఫూర్తి. నానమ్మ లైఫ్ గురించి ఒక బుక్ రాయాలనుకుంటున్నాను...’ అంటూ ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.‘‘నాకు కథలపైన ఆసక్తి మొదలైందంటే అమ్మ చెప్పిన స్టోరీస్ వల్లే. రోజూ రాత్రి పడుకునే ముందు అమ్మ రకరకాల కథలు చెబుతుంటుంది. తముణ్ణి, నన్ను బయటకు తీసుకెళ్లినప్పుడైనా, కాస్త టైమ్ దొరికినా ఏదో చిట్టి కథ ఉంటుంది. సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు కథలు చెప్పి, వాటిని షార్ట్ ఫార్మ్‌లో రాసి చూపించమనేది. తర్వాత్తర్వాత పుస్తకాల్లోని కథలు చదివినా, వాటిని ఒక చిన్న పేరాలో రాసి చూపించేదాన్ని. ఈ అలవాటు నాకు పుస్తకాలంటే ఇష్టం పెరిగేలా చేసింది. ఇప్పుడు నా కోసం ఇంట్లో ఓ లైబ్రరీయే ఏర్పాటు చేశారు. ఎక్కువ భాగం ఇంగ్లిష్వే ఉంటాయి. ఫారినర్స్ రాసినవి, సుధామూర్తి రచనలు బాగా చదువుతాను. ఒక బుక్ చదివాక బాగా నచ్చితే ఆ బుక్ నుంచి మరొక స్టోరీ రాస్తాను. ‘ట్రైల్ ఆఫ్ మిస్ ఫార్చ్యూన్’ పుస్తకం అలా రాసిందే. నానమ్మ, నాన్న, అమ్మ, స్కూల్లో టీచర్స్, ఫ్రెండ్స్.. చాలా మెచ్చుకున్నారు.బలమైన వ్యక్తిత్వం‘ట్రైల్ ఆఫ్ మిస్ ఫార్చ్యూన్’ బుక్ లో పదహారేళ్ల అమ్మాయి పేరు ఆటమ్. ఆమె భావోద్వేగాలు ఈ పుస్తకం నిండా ఉంటాయి. ఒక చిన్న వెకేషన్ కోసం తల్లిదండ్రులను ఒప్పించి మెక్సికోకు బయల్దేరుతుంది. అనుకోని సంఘటనలో తల్లి మరణిస్తుంది. తమ కుటుంబం నుంచి దూరమైన ఆంటోనియోను కలుసుకుంటుంది. క్షేమకరం కాని ఆ ్రపాంతంలో ఉండలేక మెక్సికో నుంచి వాళ్లు లండన్‌కు చేరుకుంటారు. అక్కడ జేమ్సన్ అనే వ్యక్తిని కలుస్తారు. జేమ్సన్ కుటుంబంతో ఉండటమూ క్షేమకరం కాదని అర్థమై తండ్రి, ఆంటోనియోలతో కలిసి జర్మనీకి వెళ్లిపోతుంది. జీవితమెప్పుడూ సంతోషంగా ఉండాలనుకునే ఆటమ్ ప్రతినిత్యం సమస్యలతో చేసే ప్రయాణం గురించి ఈ కథ వివరిస్తుంది. ఆ అమ్మాయి స్నేహాలను ఎలా డెవలప్ చేసుకుంటుంది, ఫ్యామిలీని ఎలా చూసుకుంటుంది, ఒకమ్మాయి ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అనే విషయాలు నేర్పిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే హ్యాపీ ఎండింగ్ తప్పక దొరుకుతుంది అనే హోప్‌ని ఇస్తుంది. నా ఫ్రెండ్స్ టైటిల్ విషయంలో, కవర్ పేజీ విషయంలో సాయం చేశారు. ఈ బుక్ కోసం ఏడాది పాటు వర్క్ చేశాను. నిజానికి 16 ఏళ్ల అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది అనే విషయాలను గురించి అంతగా మ్యాచ్ చేయలేకపోవచ్చు. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరూ బుక్స్ బాగా చదువుతారు. వారికి ఈ పుస్తకంలో స్నేహపూర్వక స్వభావం, స్ట్రాంగ్ విల్‌పవర్, వ్యక్తిత్వం బాగా నచ్చాయి. నా ఫ్రెండ్స్‌కు నేను రాసిన స్టోరీ నచ్చింది. నా ఫ్రెండ్స్ ఈ బుక్ కొని చాలా సపోర్ట్ చేశారు. స్కూల్లో అందరూ నన్ను అభినందించారు. కొందరు మంచి విమర్శలు కూడా చేశారు.ఎంతో నేర్చుకోవాలి...రచనలు చేయడంలో చాలా నేర్చుకోవాల్సి ఉందని నాకు ఈ పుస్తకం ద్వారా తెలిసి వచ్చింది. వచ్చిన విమర్శల నుంచి కూడా నేర్చుకుంటున్నాను. స్టోరీలో ఒక పాత్రను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఆ క్యారెక్టర్ని ఎలా డెవలప్ చేయాలి, స్టోరీ ΄్లాట్ ఎలా రాయాలి.. వంటివి నేర్చుకోవాలి. ఇదంతా తెలుసుకుంటూనే నా రచనల్లో వాటిని ఇంక్లూడ్ చేస్తూ వెళ్లాలని ఉంది. ముఖ్యంగా మా నానమ్మ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో చూస్తుంటాను. నానమ్మ గురించి ఒక బుక్ రాయాలనుకుంటున్నాను. అందుకు, నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. మంచి రైటర్‌గా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పేరుతెచ్చుకుంటూనే లాయర్ని అవ్వాలనే లక్ష్యంతో చదువుకుంటున్నాను. లాయర్‌గా న్యాయం కోసం పోరాటం చేస్తూనే, నా రచనల ద్వారా కొంతమందినైనా ప్రభావితం చేయాలనేది నా ముందున్న లక్ష్యం’’ అంటూ తెలిపింది ఈ బాల రచయిత్రి. టైమ్ క్రియేషన్ఈ బుక్ రిలీజ్ అయ్యాక మా ఫ్రెండ్స్‌తో సహా కొంతమంది నీకు టైమ్ ఎలా సరిపోతుంది అని అడిగారు. నేను టైమ్‌ను క్రియేట్ చేసుకున్నాను. రోజులో ఒక గంటసేపు ఈ బుక్ కోసం కేటాయించుకున్నాను. మొత్తం ఇరవై ఐదు వేల పదాలు. నేనే స్వయంగా టైప్ చేసి, ఎడిటింగ్ చేసుకుంటూ, తిరిగి మార్పులు చేసుకుంటూ రాశాను. దీనిని బుక్‌గా తీసుకురావడానికి అమ్మవాళ్లకు చెప్పకుండానే నలుగురు పబ్లిషర్స్‌తో మాట్లాడాను. వాళ్లు ఆశ్చర్యపోయారు. పబ్లిషర్స్ అమ్మ వాళ్లను అ్రపోచ్ అవడంతో... ఈ పని ఈజీ అయ్యింది. – నిర్మలారెడ్డిఫొటోలు: గడిగె బాలస్వామి -
Kai Madison Trump: మా మంచి తాతయ్య!
మిల్వాకీ: అది రిపబ్లికన్ల నేషనల్ కాన్ఫరెన్స్. బుధవారం రాత్రి ఓ 17 ఏళ్ల అమ్మాయి వేదికనెక్కింది. తొలి ప్రసంగమే అయినా ఎక్కడా ఆ ఛాయలే లేవు. అనేకానేక అంశాలపై తడుముకోకుండా మాట్లాడి అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. దాంతో హాలంతా పదేపదే చప్పట్లతో మార్మోగింది. ార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనను అబ్బురంగా, ఒకింత గర్వంగా చూసుకుంటూ మురిసిపోయారు. ఆ టీనేజర్ కాయ్ మాడిసన్. ట్రంప్ మనవరాలు. ‘‘తాతా! మీరే నాకు స్ఫూర్తి’’ అని కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారామె. 10 మంది మనవలూ, మనవరాళ్లలో కాయ్ అందరికంటే పెద్ద. ట్రంప్ పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్, ఆయన మాజీ భార్య వనెసా కూతురు. నేనూ ట్రంప్‌నే... తాతయ్య ఎప్పుడూ దేశం మంచినే కోరతారని కాయ్ చెప్పుకొచ్చారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చేందుకు పోరాడుతున్నారన్నారు. ఎందరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొని నిలిచారంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ‘‘ఆయనలో బయటికి ప్రపంచానికి పెద్దగా తెలియని కోణాన్ని మీతో పంచుకోదలిచా. తాతగా ఆయనెంతో ప్రేమాస్పదుడు. మేం చిన్నపిల్లలుగా ఉండగా అందరు తాతల్లాగే మమ్మల్నెంతో గారాబం చేసేవారు. మా పేరెంట్స్ చూడకుండా చాక్లెట్లు, కూల్డ్రింకులు ఇప్పించేవారు. మేం ఆనందపడితే చూసి మురిసిపోయేవారు. స్కూల్లో ఎలా చదవుతున్నామో ఎప్పటికప్పుడూ తెలుసుకునేవారు. ఓసారి నాకు బాగా మార్కులొస్తే ఆ ప్రోగ్రెస్ కార్డును ప్రింట్ తీయించి మరీ మిత్రులందరికీ చూపించుకుని సంబరపడ్డారు. నాకు తరచూ కాల్ చేసి గోల్ఫ్ ఎలా ఆడుతున్నానో ఆరా తీసేవారు. తన గోల్ఫ్ కథలన్నీ పంచుకునేవారు. ‘స్కూల్లో ఉన్నా తాతయ్యా, మాట్లాడలేను’ అని చెప్పాల్సి వచ్చేది. ఇద్దరం కలిసి గోల్ఫ్ ఆడేప్పుడు నన్ను ఓడించడానికి ప్రయతి్నంచేవారు. కానీ పడనిచ్చేదాన్ని కాదు. నేను కూడా ట్రంప్‌నే తాతయ్యా అనేదాన్ని!’’ అంటూ గుర్తు చేసుకున్నారు. 2015లో ట్రంప్ తొలిసారి అధ్యక్ష అభ్యర్థి అయినప్పటి నుంచీ కాయ్ ఆయనతో కలిసి పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రధాన ప్రచార వేదికపై కనిపించడం, మాట్లాడటం ఇదే తొలిసారి. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారామె. ట్రంప్‌పై కాల్పులు జరిగిన వెంటనే ఆయన పిడికిలెత్తి నినదిస్తున్న ఫొటోను పోస్ట్ చేసి, ‘‘తాతా, ఐ లవ్యూ. పోరాడుతూనే ఉండు!’’ అని రాశారు. ఆమెకు సొంత యూట్యూబ్ చానల్ ఉంది.మా నాన్నసింహసదృశుడు హత్యా యత్నాన్ని ట్రంప్ గొప్పగా ఎదుర్కొన్నారని ఆయన పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్ (46) అన్నారు. ‘‘రక్తం ధారగా కారుతున్నా రొమ్ము విరిచి నిలబడ్డారు. నేపథ్యంలో జాతీయ పతాకం రెపరెపలాడుతుండగా చెయ్యెత్తి పిడికిలి బిగించి పోరాట నినాదాలు చేశారు. అమెరికా పోరాట స్ఫూర్తికే ప్రతీకగా నిలిచారు. కాబోయే దేశాధ్యక్షుడు సింహసదృశుడని నిరూపించారు’’ అంటూ కొనియాడారు. ట్రంప్ భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అల్లుడు జరేద్ కుష్నర్ తదితర కుటుంబ సభ్యులు గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) సదస్సులో పాల్గొంటారు. -
Navishka Birthday Celebrations Pics: మెగాస్టార్ మనవరాలు నవిష్క బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ప్రధానిపై బండారు దత్తాత్రేయ మనుమరాలి పద్యం
సాక్షి, హైదరాబాద్: హరియాణా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ మనుమరాలు జశోధర తనపై పఠించిన పద్యాన్ని విని ప్రధాని నరేంద్రమోదీ మంత్రముగ్ధులయ్యారు. జశోధర పద్య పఠనానికి సంబంధించిన వీడియోను బండారు దత్తాత్రేయ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ ‘ఆమె మాటలు శక్తికి మూలం‘అని పేర్కొన్నారు. Creative and adorable. Her words are a source of great energy as well. https://t.co/9BTgtFkpH9 — Narendra Modi (@narendramodi) December 10, 2023 ఇదీ చదవండి: మధ్యప్రదేశ్ సీఎం ఎవరు? రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది? -
సిగ్గు.. సిగ్గు.. చావు వార్తని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..
న్యూఢిల్లీ: సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చేయడంతో అత్యధికులు తమకు తామే సెలెబ్రిటీలమన్న భావన ఉంటున్నారు. కొంతవరకు మంచిదే కానీ కేవలం లైకులు కామెంట్ల కోసం ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ లేనిపోని రాద్ధాంతాన్ని సృష్టిస్తున్నారు. ఇలాగే ఒకామె తొందరపడి తన అమ్మమ్మ చనిపోయారన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభాసుపాలైంది. అమ్రిత్ అనే పేరుతో ట్విట్టర్ అకౌంట్ నడుపుతున్న ఒక యువతి తన అమ్మమ్మ చనిపోయారన్న విషయాన్ని చాలా క్రియేటివ్ గా పోస్ట్ చేసింది. ఆమె అమ్మమ్మ బ్రతికుండగా సోఫాలో కూర్చుని తింటున్న ఫోటోను ఒకపక్కన మరొపక్కన ఆమె లేకుండా ఖాళీగా ఉన్న సోఫా ఫోటోను పోస్ట్ చేసి.. ఫోటోలతో పాటు "నేను దీని నుండి ఎప్పటికీ కోలుకోలేను.." అని రాసింది. పెద్దావిడ మరణవార్తను తన ఫాలోవర్లకు చెప్పాలన్న కుతూహలం కన్నా వారి సానుభూతి రూపంలో లైకులు కామెంట్లు పొందాలన్న ఆమె ఆత్రుతే ఎక్కువగా కనిపించింది నెటిజన్లకు. దీంతో వారు కూడా సున్నిత శైలిలో విచారాన్ని వ్యక్తం చేస్తూ కఠినమైన కామెంట్లతో ఆ యువతిని చెడామడా వాయించేస్తున్నారు. "మీ అమ్మమ్మ మరణం తీరని లోటు. అలాగని ప్రతిదీ ఇంటర్నెట్లో పోస్ట్ చేయాలా?" అని కొందరు రాస్తే.. ఆమె చావు నీకు ఇలా ఉపయోగపడిందన్న మాట, మీకు రిప్లై ఇస్తే నాకు మెసేజులు మీద మెసేజులు వస్తున్నాయని మరొకరు.. కామెంట్లు చేశారు. ఎవరేమనుకుంటున్నారన్న విషయాన్ని పక్కనబెడితే.. సదరు వ్యక్తి చేసిన పోస్టుకు మాత్రం 40 లక్షల పైచిలుకు వీక్షణలు దక్కాయి. అదీ సోషల్ మీడియా పవర్ అంటే.. I’m never going to recover from this pic.twitter.com/yRhfdApZap — A (@ammmmmmrit) July 10, 2023 ఇది కూడా చదవండి: రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు! -
సైకో వీరంగం.. గుమ్మం నుంచి బామ్మను లాగి..
ఫ్రాన్స్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఇంటి గుమ్మం ముందు నిలబడిన బామ్మ, చిన్నారిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలితో పాటు ఆమె మనవరాలు కూడా గాయపడింది. బోర్డియక్స్ నగరంలో ఈ ఘటన జరిగింది. అయితే.. నిందితుడు ఓ ఆఫ్రికా దేశం నుంచి వలస వచ్చిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే నిందితున్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఓ కాలనీలో బామ్మ తన మనవరాలితో నివసిస్తోంది. ఇంట్లో ఎవరూ లేని కారణంగా కాస్త బోరింగ్‌గా ఫీల్ అయిన బామ్మ గుమ్మం ముందుకు వచ్చింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఆఫ్రికన్ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని గమనించిన బామ్మ తన మనవరాలితో వెంటనే ఇంట్లోకి వెళ్లి డోర్ మూసేయడానికి ప్రయత్నం చేసింది. కానీ నిందితుడు వారిని అడ్డగించాడు. డోర్ వేయకుండా ఆపేసి వారిని బయటకు లాగాడు. విచక్షణా రహితంగా చిన్నారిని ఇంటి నుంచి బయటకు విసిరాడు. అనంతరం బామ్మపై దాడి చేసి.. విలువైన వస్తువులను లాక్కెళ్లాడు. బాధితులకు స్వల్పంగా గాయాలయ్యాయి. Shocking video of violent attack on a grandmother and granddaughter by a migrant in Bordeaux, France goes viral; Netizen demand strict anti-immigration laws. pic.twitter.com/kqjeE2tFW9 — Megh Updates 🚨™ (@MeghUpdates) June 20, 2023 ఈ వీడియో క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు అకారణంగా దాడి చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్‌కు వచ్చే విదేశీయులపై ఆంక్షలు విధించాలని కోరారు. ఇమ్మిగ్రేషన్ నియమాలను కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. నిందితున్ని అరెస్టు చేశారు. ఆఫ్రికా నుంచి వలస వచ్చిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. ఇదీ చదవండి: గొంతును ఏమార్చారు, ఒరిజినల్‌గా నమ్మించారు -
మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్
సాక్షి, ముంబై: ముద్దుల మనవరాలి కోసం కొండమీద కోతినైనా తీసుకురాగల సామర్థ్యం ఆసియా బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సొంతం. అందుకే ఏకంగా మనవరాలు బుల్లి ప్రిన్సెస్‌ను ఇంటికి తీసుకెళ్లందుకు భారీ కాన్వాయ్‌నే ఏర్పాటు చేయారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌నుంచి లగ్జరీ కార్లతో కూడిన భారీ కార్ కాన్వాయ్‌తో పాపాయిని ఇంటికి ఆహ్వానించి కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో బిజినెస్ వర్గాల్లోనూ విశేషంగా నిలుస్తోంది. దిగ్గజ పారిశ్రామికవేత్త మనవరాలు భారీ భద్రత మధ్య, దేశీయ, విదేశీ లగ్జరీ కార్లు కాన్వాయ్‌తో ఇంటికి చేరింది. సుమారు 50 కోట్లకు పైగా విలువైన 20కి పైగా కార్లు ఉన్నాయి.రోల్స్ రాయిస్ కల్లినన్ SUV, లంబోర్ఘిని ఉరస్, మెర్సిడెస్-AMG G63, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-మేబ్యాక్ S580 లాంటి సూపర్ లగ్జరీ కార్లతో భారీ కాన్వాయ్ ముంబై వీధుల్లో సందడి చేసింది. (యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు) అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా గత వారం ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వీరికి ఇప్పటికే పృథ్వి అనే కుమారుడు కూడా ఉన్నాడు. అంబానీ కుటుంబంలోని ఈ పాపాయి రావడంతో ముఖేశ్, నీతా అంబానీ తరువాతి వారసుల సంఖ్య నాలుగుకి చేరింది. కుమార్తె ఇషా, ఆనంద్ పిరామల్ దంపతులకు ట్విన్స్ కృష్ణ ,ఆదియా ఉన్నారు. -
కోర్టు మెట్లెక్కిన అమితాబ్ బచ్చన్ మనవరాలు
-
వైట్‌హౌస్‌లో పెళ్లి సందడి... జోబైడెన్ మనవరాలు పెళ్లి
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ పెళ్లి శోభతో కళకళ లాడనుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో ఆయన మనవరాలు నవోమీ బైడెన్ వివాహం శనివారం జరగనుంది. బైడెన్ మనవరాలు నవోమీ బైడెన్ పీటర్ నీల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోనున్నారు. ఐతే నవోమీ లాయర్ కాగా, ఆమె కాబోయే భర్త పీటర్ నీల్ ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా లా స్కూల్ నుంచి గాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఇదిలా ఉండగా, వైట్‌హౌస్‌లో ఇంతవరకు 18 వివాహాలు జరిగాయి, అవి కూడా అధ్యక్షుడి కూతుళ్ల వివాహాలే. ఇలా అధ్యక్షుడు హోదాలో ఉండగా వైట్‌హౌస్‌లో మనవరాలు పెళ్లి జరగడం ఇదే ప్రథమం. ఇది వైట్‌హౌస్ చరిత్రలోనే తొలిసారి. అంతేగాదు వైట్‌హౌస్‌లో ఈ పెళ్లి 10వ డ్యాక్యుమెంట్ వెడ్డింగ్ అవుతుంది. వాస్తవానికి వైట్‌హౌస్‌లో ఎక్కువగా అధ్యక్షుడి కుమార్తెల వివాహాలే జరిగాయి. పీటర్ నీల్-నయోమీ బైడెన్ అధ్యక్షుడు బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ కుమార్తె అయిన నవోమీ బైడెన్ , నీల్‌తో గత నాలుగేళ్లుగా వాషింగ్టన్లో సహజీవనం చేస్తున్నారు. ఈ శనివారం వైట్‌హౌస్‌లో జరగనున్న వివాహా వేడుకలో ఇద్దరు ఒక్కటి కానున్నారు. ఈ మేరకు అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ మాట్లాడుతూ...నవోమీ తన పెళ్లిని ప్లాన్ చేసుకోవడం, తనకునచ్చిన వ్యక్తి సెలక్ట్ చేసుకోవడం చాలా అద్భతంగానూ, సంతోషంగానూ ఉంది. తనను పెళ్లికూతురిలా చూడటానికి సంతోషిస్తున్నాను అని అన్నారు. (చదవండి: అమెరికా సెనేట్‌పై పట్టు నిలుపుకున్న డెమొక్రాట్లు) -
మనవరాలితో కలిసి స్టెప్పులేసిన రఘువీరారెడ్డి..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘువీరా రెడ్డి గురించి తెలియని వారుండరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి.. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత నెలకొన్న పరిణామాలతో పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా కుటుంబంతో గడపడం మొదలుపెట్టారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదా వ్యక్తిగా అందరిలో కలిసిపోయి జీవిస్తున్నారు. తాజాగా.. రఘువీరా రెడ్డి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన మనుమరాలితో సరదాగా డ్యాన్స్ వేసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. టీవీలో ఓ పాట పెట్టి.. దానికి అనుగుణంగా రఘువీరా తన మనుమరాలితో కలిసి డ్యాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
లైంగిక ఆరోపణలు.. మనస్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య
డెహ్రాడూన్: కోడలి ఫిర్యాదుతో తీవ్ర మనస్తాపం చెందిన ఉత్తరాఖండ్ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ(59) బలవన్మరణానికి పాల్పడ్డారు. బహుగుణ బుధవారం హల్ద్వాని ప్రాంతంలోని తన నివాసంలో వాటర్ ట్యాంక్ ఎక్కి తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. కాగా తన కూతురిని లైంగిక వేధిస్తున్నట్లు కోడలు మామ రాజేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోడలు ఫిర్యాదు మేరకు బహుగుణపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇది జరిగిన మూడు రోజులకే బహుగుణ ఇలా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. బహుగుణ ఆత్మహత్యకు పాల్పడే ముందు ఇక తాను బతకలేనని, చనిపోతున్నట్లు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకునేలోపే బహుగుణ ఇంటి ముందు ఉన్న వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కాడు. అయితే లౌడ్ స్పీకర్ ఉపయోగించి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని, కిందికి దిగి రావాలని పోలీసులు మాజీ మంత్రిని వేడుకున్నారు. అయినప్పటికీ పోలీసుల మాటలు వినకుండా ‘నేను ఏం తప్ప చేయలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’ అంటూ పదేపదే గట్టిగా అరిచాడు. ఒకానొక సమయంలో బహుగుణ పోలీసుల విజ్ఞప్తి మేరకు కిందికి దిగివస్తడనుకున్న క్రమంలో అనుహ్యంగా వాటర్ ట్యాంక్‌పై తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు విడిచాడు. చదవండి: హరియాణా మాజీ ముఖ్యమంత్రికి షాక్! నాలుగేళ్ల జైలు శిక్ష పోలీసులు, ఇంటి పొరుగువారు చూస్తుండగానే బహుగుణ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే కోడలు చేసిన ఆరోపణలపై తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అధికారులు తెలిపారు.మరోవైపు తండ్రి ఆత్మహత్యకు ప్రేరేపించారని కొడుకు అజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడలు, ఆమె తండ్రి అలాగే మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకుడైన బహుగుణ 2004-5లో ఎన్డీ తివారీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. -
కోడలిపై కోపం.. మూడు రోజుల తర్వాత ఏం జరిగిందంటే?
తుమకూరు(కర్ణాటక): కొడుకు–కోడలిపై కోపంతో ఓ మహిళ మనవరాలి చావుకు కారణమైంది. వివరాలు.. కుణిగల్ తాలూకా సాసలు గ్రామానికి చెందిన జయమ్మ కుమారుడు పుట్టరాజుకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కూతురు త్రిషా ఉంది. ఈ పెళ్లి పుట్టరాజ తల్లి జయమ్మకు ఇష్టం లేదు. దీంతో తరచూ కోడలుతో గొడవ పడేది. ఇటీవల జయమ్మ త్రిషాను బయటకు తీసుకెళ్లినప్పుడు బాలికను పిచ్చి కుక్క కరిచింది. చదవండి: రన్నింగ్ బస్సులు ఎక్కి.. యువతులపై వికృత చేష్టలు అయితే కోడలుపై కోపంతో జయమ్మ విషయం ఎవరికీ చెప్పలేదు. మూడు రోజుల తర్వాత చిన్నారి అస్వస్థతకు గురైంది. తర్వాత నాలుగు రోజులకు రేబీస్ వ్యాధితో మరణించింది. కుక్క కరిచినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు జయమ్మను నిలదీయగా విషయం చెప్పింది. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని జయమ్మపై విచారణ చేపట్టారు. -
Sheelaa Bajaj: ధీర వనిత.. నానమ్మ కథ
షీలా బజాజ్ వయసు 78. దేహం కదలికలు కష్టమయ్యే వయసు. కీళ్లు కదలికలు తగ్గే వయసు. కానీ, ఆమె మాత్రం చురుగ్గా వేళ్లు కదుపుతోంది. వేగంగా అడుగులు వేస్తోంది. ఊలుతో స్వెటర్లు అల్లుతోంది. చలికాలంలో చంటి పిల్లల పాదాలు, చేతులకు తొడిగే ఊలు సాక్సు, గ్లవ్స్ కూడా చక్కగా అల్లేస్తోంది. చేతిలో నైపుణ్యం ఉంటే వార్థక్యం కూడా దూరమవుతుందని చెబుతోంది షీలా బజాజ్. అంతేకాదు, తన మనుమరాలు యుక్తి 78 ఏళ్ల వయసులో తనను సంపాదనపరురాలిగా మార్చిందని సంతోషపడుతోంది షీలా బజాజ్. నానమ్మ కథ షీలా బజాజ్ జీవితంలో అనేక ఎదురుదెబ్బలకు గురైంది. కొడుకు అర్ధంతరంగా మర ణించాడు. అప్పటికి అతడి కూతురు యుక్తి చిన్నపాప. మనుమరాలిలో కొడుకును చూసుకుంటూ కోడలికి ధైర్యం చెబుతూ కుటుంబానికి అండగా నిలిచింది. ఆమె మనోధైర్యాన్ని చూసి విధికి కన్నుకుట్టినట్లుంది. కోడలిని కూడా పొట్టన పెట్టుకుంది. ఇక మిగిలింది తనూ, మనుమరాలు యుక్తి. ఆ పాపకి నానమ్మలోనే అందరూ. ఇప్పటికీ నానమ్మ అని చెప్పాల్సినప్పుడు యుక్తి ‘అమ్మ’ అనే సంబోధిస్తుంది. అంతటి అనుబంధం వాళ్లది. నానమ్మ కథ వినకుండా ఏ రోజూ నిద్రపోయేది కాదు యుక్తి. ఆ కథలన్నింటిలోనూ ఒకటే నీతి ఉండేది. కష్టం అనేది ఉండదు, పరిస్థితులు మాత్రమే ఉంటాయి. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడమే మనం చేయాల్సింది, చేయగలిగింది. ఈ నీతిని వింటూ పెరిగింది యుక్తి. నానమ్మ చెప్పిన కథలన్నింటికంటే ఆమె జీవిత కథే తనకు అత్యంత స్ఫూర్తివంతం అంటుంది యుక్తి. కాలం తన సమయాన్ని తాను పాటిస్తూ ముందుకు సాగిపోయింది. యుక్తి చదువుకుని, ఉద్యోగంలో చేరింది. షీలా బజాజ్ లో ఒంటరితనం మొదలైంది. ఇంతలో కరోనా వచ్చింది. ‘‘అమ్మ రోజంతా ఎంత ఒంటరితనానికి లోనవుతుందనేది నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో గమనించాను. ఆమెకు తెలియకుండానే ఆమెను తనకిష్టమైన పనిలో నిమగ్నం అయ్యేలా చేయగలిగాను. నాకు చిన్నప్పుడు అల్లినట్లే స్కార్ఫ్‌లు, స్వెటర్లు అల్లిపెట్టమ్మా... అని అడిగాను. ఊలు చేతిలోకి తీసుకున్న తర్వాత ఆమె ఇక చాలన్నా వినలేదు. ‘ఇలా అల్లుతూ ఉంటే.... నీ చిన్ననాటి రోజులే కాదు, నా చిన్ననాటి రోజులు కూడా గుర్తుకు వస్తున్నాయి’ అంటూ తనకు తోచినవన్నీ అల్లుతూ ఉండేది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. అవి కావాలని అడిగిన వాళ్లకు అమ్మేసి, ఆ డబ్బు ఇచ్చాను. తాను సంపాదనపరురాలినయ్యానని తెలిసిన ఆ క్షణం చూడాలి అమ్మ సంతోషం. నా బాల్యంలో నా ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఎంత భరోసానిచ్చిందో నాకిప్పటికీ గుర్తే. ఇప్పుడు నా పెంపకంలో ఉన్న అమ్మకు అంతటి భరోసా కల్పించడం నా బాధ్యత కదా’’ అంటోంది యుక్తి. మెదడు చురుకుదనం వేళ్లలో ఇక షీలా బజాజ్ అయితే... తన సృజనాత్మకతకు పదును పెట్టి ఊలుతో దిండు కవర్లు, కుషన్ కవర్లు, బాటిల్ కవర్, మగ్ వార్మర్ వంటి వినూత్నమైన అల్లికలను రూపొందిస్తోంది. ఇంత శ్రమ వద్దంటే వినదు కూడా. ‘ఈ వయసులో ఇంత వేగంగా అల్లగలగడం అంటే నాకెంతో గర్వం కదా. వేగం ఎందుకు తగ్గించుకోవాలి’ అని ప్రశ్నిస్తోంది. ‘డిజైన్‌కి అనుగుణంగా వేళ్లు వేగంగా కదులుతున్నాయంటే నా మెదడు కూడా అంతే చురుగ్గా ఉందని అర్థం’ అంటున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వు ఆమె పెదవుల మీద విరుస్తుంది. నిజమే... మనోధైర్యం ఉంటే పెరిగే వయసు ఉత్సాహానికి అడ్డంకిగా మారదు. చదవండి: International Day of Older Persons: అమ్మానాన్నలకు ఏం చేస్తున్నాం? -
విషాదం: మనవరాలిని ఎత్తుకుని మిద్దెపై బట్టలు ఆరవేస్తుండగా..
క్రిష్ణగిరి(కర్ణాటక): క్రిష్ణగిరి సమీపంలో జరిగిన కరెంటు షాక్‌తో తల్లీ కూతురు, మనవరాలు ఘటనా స్థలంలోనే మృతి చెందిన ఘటన సింగారపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అంబేడ్కర్ నగర్‌కు చెందిన పిచ్చుమణి భార్య ఇంద్ర (52), ఆమె కూతురు మహాలక్ష్మి (25). ఈమెకు మిట్టపల్లికి చెందిన శివతో గత నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగి మూడేళ్ల కూతురుంది. ఇటీవల పుట్టింటికి చేరుకుంది. ఆదివారం సాయంత్రం ఇంద్ర మనవరాలిని ఎత్తుకుని మిద్దెపై బట్టలు ఆరవేస్తుండగా ఆకస్మాత్తుగా వైర్లు తగిలి కరెంటు షాక్ కొట్టింది. ఆమె కేకలు వేయడంతో కూతురు మిద్దెపైకెళ్లి రక్షించే యత్నంలో ముగ్గురికీ షాక్ తగిలి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సింగారపేట పోలీసులు మృతదేహాలను స్వాధీనపరుచుకొని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సింగారపేట ప్రాంతంలో సంచలనం సృష్టించింది. -
దారుణం: మనవరాలిని చంపి.. ఆపై బామ్మ నాటకం
జైపూర్: రాజస్థాన్‌లోని కనకాబాయి (50) అనే ఓ మహిళ ఓ గొడవ విషయంలో మరో వ్యక్తికి గుణపాఠం నేర్పడానికి తన మూడేళ్ల మనరాలిని చంపేసింది. పైగా ఆ బాలికను రామేశ్వర్ మొగ్యా అనే వ్యక్తి చంపినట్లు ఆరోపించింది. పోలీసుల వివరాల ప్రకారం.. మే 30 న, బోరినా గ్రామంలోని రెండు గ్రూపులు నీళ్ల కోసం వెళ్లి మార్గం మధ్యలో గొడవకు దిగారు. ఈ ఘర్షణలో కొంతమంది గాయపడగా.. అమర్లాల్ మొగ్యా అనే వ్యక్తి మూడేళ్ల కుమార్తె మృతి చెందింది. దాంతో రామేశ్వర్ మొగ్యాపై ఆ బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు రామేశ్వర్ మొగ్యా కుమార్తె కూడా గొడవలో గాయపడినట్లు గుర్తించారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని కనకబాయి.. రామేశ్వర్ మొగ్యాను బెదిరించింది. దాంతో రామేశ్వర్ మొగ్యా అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కనకబాయి ప్రవర్తనపై అనుమానం రావడంతో విచారించి నిందితురాలిని అరెస్ట్ చేశారు. (చదవండి: 11 ఏళ్ల క్రితం తప్పిపోయింది.. పక్కనే నివసిస్తున్నా ఎవరూ గుర్తించలేదు!) -
మనవరాలికి సంగీత పాఠాలు
ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా తన మనవరాలికి సంగీత పాఠాలు నేర్పిస్తున్నారు. ఇళయరాజా తనయుడు యువన్‌శంకర్ రాజా కుమార్తె జియా యువన్ ఇటీవల తాత దగ్గర పియానో నేర్చుకుంటున్న వీడియో చాలామందిని ఆకట్టుకుంది. పియానోతో సరిగమలు ఎలా పలికించాలో మనవరాలికి నేర్పుతున్న దృశ్యాన్ని వీడియో తీసి, సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు యువన్. ఈ వీడియో చూసిన శ్రుతీహాసన్ , విజయ్ ఏసుదాసు, శ్వేతాపండిట్ వంటి వారు ‘చాలా బాగుంది’ అంటూ జియాని అభినందిస్తూ కామెంట్లు పెట్టారు. కాగా ఇళయరాజా ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆ సంగతలా ఉంచితే.. ఇళయరాజా వారసులుగా కుమారులు కస్తూరి రాజా, యువన్ శంకర్ రాజా, కుమార్తె భవతారిణి కూడా సంగీతప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ ముగ్గురూ సంగీతదర్శకులుగానే కాదు పాటలు కూడా పాడతారు. మరి.. ఇప్పుడు మనవరాలికి కూడా స్వరాలు నేర్పిస్తున్నారంటే ఇళయరాజా కుటుంబం నుంచి మరో మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ వచ్చే అవకాశం ఉందని ఊహించవచ్చు. -
ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర
ముంబై: జీవితాంతం పిల్లల కోసం కష్టపడ్డాడు.. వారి కాళ్ల మీద వారు నిలబడేలా తీర్చి దిద్దాడు.. పెళ్లిల్లు చేశాడు.. బాధ్యత తీరింది. మలి సంధ్యలో మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తూ హాయిగా గడుపుదామనుకున్నాడు. అయితే అన్ని మనం అనుకున్నట్లే జరిగితే అది జీవితం ఎందుకవుతుంది. తానోటి తలిస్తే.. దైవం మరొకటి తలిచింది. ఇద్దరు కుమారులు చనిపోయారు. కోడళ్లు, వారి పిల్లల బాధ్యత తన మీద పడింది. దాంతో విశ్రాంతిగా గడపాల్సిన జీవిత చరమాంకంలో రాత్రింబవళ్లు ఆటో నడుపుతూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి ఉన్న ఏకైక ఆస్తి ఇల్లు మాత్రమే. కానీ చివరకు దాన్ని కూడా అమ్మి.. ఆటోలోనే తిని.. అందులోనే పడుకుంటున్నాడు. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే.... దేస్రాజ్ ఆటో నడుపుతూ జీవితం సాగించేవాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిని పెంచి పెద్ద చేసి వివాహం చేశాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఆరేళ్ల క్రితం పని కోసం బయటకు వెళ్లిన ఓ కుమారుడు తిరిగి ఇంటికి రాలేదు. వారం రోజుల తర్వాత శవమై కనిపించాడు. చేతికి అందిన వచ్చిన కొడుకు అర్థాంతరంగా కన్ను మూస్తే.. ఆ తండ్రికి ఎంత కడుపుకోతే మాటల్లో చెప్పలేం. తన శరీరంలో సగం భాగం చచ్చిపోయినట్లు అనిపించింది దేస్రాజ్‌కు. కానీ తాను బాధపడుతూ కూర్చుంటే.. కుటుంబ సభ్యుల ఆకలి తీరదు కదా. అందుకే కొడుకు చనిపోయిన బాధను దిగమింగి మరుసటి రోజే ఆటో నడపడానికి వెళ్లాడు. దెబ్బ మీద దెబ్బ.. మరో విషాదం కొడుకు చనిపోయిన బాధ నుంచి కోలుకోకముందే.. రెండు సంవత్సరాల తర్వాత మరో విషాదం చోటు చేసుకుంది. మిగిలిన ఒక్క కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేళ్ల వ్యవధిలోనే ఇద్దరు కుమారులను పొగొట్టుకున్న ఆ తండ్రి బాధను వర్ణించడానికి మాటలు చాలవు. అప్పుడు కూడా దేస్రాజ్ కుంగిపోలేదు. కుమారుల మరణంతో ఒంటరి వాళ్లైన తన కోడళ్లు, నలుగురు మనవలు, మనవరాళ్ల బాధ్యత అతడి కళ్ల ముందు మెదిలింది. దాంతో బాధను దిగమింగుకుని.. వారి బాధ్యతను భుజాన వేసుకున్నాడు దేస్రాజ్. మనవరాలికిచ్చిన మాట కోసం కుటుంబాన్ని పోషించాల్సిన ఇద్దరు మగాళ్లు చనిపోవడం.. వృద్ధుడైన తాత తమ కోసం కష్టపడుతుండటం చూసిన దేస్రాజ్ మనవరాలు విలవిల్లాడింది. తొమ్మిదవ తరగతి చదువుతున్న ఆ అమ్మాయి చదువు మానేసి.. ఏదైనా పని చేస్తానని తాతకు చెప్పింది. చదువులో ముందుండే పిల్ల.. బడి మానేసి.. పనికి వెళ్లి జీవితం నాశనం చేసుకోవడం దేస్రాజ్‌కు నచ్చలేదు. ఆ క్షణమే ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనవరాలి చదువుకు ఆటంకం కలగకూడదనుకున్నాడు. కోరుకున్న చదువు చెప్పిస్తానని మనవరాలికి మాట ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి ఉదయం ఆరు గంటలకు ఆటోతో ఇంటి నుంచి బయటకు వెళ్తే రాత్రి పదింటికి తిరిగి వచ్చేవాడు. అలా నెలంతా కష్టపడి 10 వేల రూపాయలు సంపాదిస్తే.. దానిలో ఆరు వేలు మనవరాలి చదువు కోసం ఖర్చు చేస్తే... మిగతా సొమ్ము కుటుంబ సభ్యుల తిండి కోసం కేటాయించేవాడు. తాత తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టింది దేస్రాజ్ మనవరాలు. ఇంటర్లో 80 శాతం స్కోర్ చేసింది. ఆ రోజు ఆ ముసలి తాత సంబరం చూడాలి. తన ఆటో ఎక్కినవారందరికి ఈ విషయం చెప్పి తెగ మురిసిపోయాడు. ఆ రోజంతా ప్రయాణికుల దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు. అప్పటి నుంచి ఆటోలోనే తిండి, నిద్ర.. ఆ తర్వాత మనవరాలు బీఈడీ చదవడం కోసం ఢిల్లీ వెళ్తానని తాతను అడిగింది. ఢిల్లీ పంపించి చదివించడం అంటే మాటలు కాదు. ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. కాలేజీ ఫీజు, అక్కడ ఉండి చదువుకోవడానికి హాస్టల్ ఫీజు ఇతరాత్ర ఖర్చులు చాలా ఉంటాయి. ఏం చేయాలో దేస్రాజ్‌కు తోచలేదు. ఎలాగైనా మనవరాల్ని ఢిల్లీ పంపిచాలనుకున్న ఆ ముసలి తాత.. తమకున్న ఒకే ఒక్క ఆస్తి ఇంటిని అమ్మేశాడు. భార్య, కోడళ్లు, ఇతర మనవలు, మనవరాళ్లను బంధువులు ఊరికి పంపించి.. వారు అక్కడే ఉండే ఏర్పాట్లు చేశాడు. ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బుతో మనవరాలిని ఢిల్లీ పంపించి చదివిస్తున్నాడు. ఇక నాటి నుంచి ఆటోనే తనకు ఇల్లు, వాకిలి అయ్యింది. రోజంతా ఆటో నడుపుతూ.. అందులోనే తింటూ.. ఆటోలోనే నిద్రపోతూ కాలం గడుపుతున్నాడు. ఆ మాటతో నేను పడిన కష్టం అంతా మర్చిపోయాను దేస్రాజ్ గురించి తెలుసుకున్న హ్యుమన్స్ ఆఫ్ బాంబే వారు ఆయనతో మాట్లాడారు. ‘‘ఇంత కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.. ఎప్పుడు బాధ అనిపించలేదా’’ అని ప్రశ్నించగా.. అందుకు దేస్రాజ్ ‘‘నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టపడి పని చేయడం అలవాటయ్యింది. ప్రస్తుతం జీవితం మరీ అంత దారుణంగా ఏం లేదు. బాగానే సాగిపోతోంది. ఇక ఈ వయసులో కూడా కష్టపడటం అంటే.. నా కుటుంబం కోసమే కదా. బాధ ఎందుకు. నా మనవరాలు బాగా చదువుతోంది. మా కుటుంబం నుంచి తొలి గ్రాడ్యుయేట్ తనే. కొద్ది రోజుల క్రితం ఫోన్ చేసి.. తను క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్పింది. ఆ మాటతో నేను పడిన శ్రమ అంతా మర్చిపోయాను. తను తప్పకుండా టీచర్ అవుతుంది. ఆ రోజు తనను దగ్గరుకు తీసుకుని ‘‘నన్ను గర్వపడేలా చేశావ్ తల్లి’’ అని ఆశీర్వదిస్తాను. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు దేస్రాజ్. వెల్లువెత్తుతున్న ప్రశంసలు.. ఆర్థిక సాయం దేస్రాజ్ కథను హ్యూమన్స్ ఆఫ్ బాంబే గురువారం తన ఫేస్బుక్ పేజిలో షేర్ చేసింది. ఇది చదివిన వారంతా ‘‘తాత నీ గురించి చదువుతుంటే కన్నీళ్లు ఆగడం లేదు.. కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నావ్.. యువతలో ఉన్న ఎందరో సోమరిపోతులకన్నా మీరు వంద రేట్లు నయం. తప్పక మీ మనవరాలు టీచర్ అవుతుంది.. మీ పేరు నిలబెడుతుంది’’ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక చాలా మంది నెటిజనులు దేస్రాజ్‌కు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఓ ఫేస్బుక్ యూజర్ గుంజర్ రాటి దేస్రాజ్ పేరు మీద క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు దాదాపు 270 మంది 5.3 లక్షల రూపాయలు దేస్రాజ్ కోసం ఇచ్చారు. ఇక ఈ స్టోరి కాంగ్రెస్ నాయకురాలు అర్చనా దాల్మియాను కూడా కదిలించింది. ఆమె తన ట్విట్టర్లో దేస్రాజ్ ఆటో నంబర్, మొబైల్ నంబర్, అతడు పని చేసే ప్రాంతం వివరాలు షేర్ చేశారు. ‘‘మనం ఆయనకు సాయం చేయాలి.. దయచేసి ముందుకు రండి అని’’ పిలుపునిచ్చారు. Desraj is a Auto driver on streets of Mumbai! His 2 sons hv died in accident & suicide. He drives frm 6am in th morn to 10 pm to earn Rs10000 /month. You cn find him at Khar Danda naka, Auto no 160. His no is 08657681857. We need to reach out to help. RT pl & Mumbaikars pl help. pic.twitter.com/5zAm9TtgT5 — Archana Dalmia (@ArchanaDalmia) February 11, 2021 చదవండి: ఆ ఫోటో వెనక ఇంత కథ ఉంది వధువు కాళ్లకు నమస్కరించిన భర్త -
నవిష్క..వేడుక
చిరంజీవి కుటుంబంలో డిసెంబర్ 25న రెండు పండగలు జరిగాయి. ఒకటి క్రిస్మస్ సెలబ్రేషన్ కాగా మరోటి చిరంజీవి మనవరాలు నవిష్క పుట్టినరోజు వేడుక. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కల్యాణ్ దేవ్ల కూతురు నవిష్క. ఈ చిన్నారికి మొదటి పుట్టినరోజు ఇది. ఈ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది చిరంజీవి ఫ్యామిలీ. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఉపాసన. ‘‘హ్యాపీ బర్త్‌డే డార్లింగ్ నవిష్క. మీ అత్తామామ (ఉపాసన, రామ్‌చరణ్)కు నువ్వంటే చాలా ప్రేమ’’ అని ఈ ఫొటోలను షేర్ చేశారు. కల్యాణ్ దేవ్, నవిష్క, శ్రీజ, రామ్‌చరణ్, ఉపాసన -
హార్ట్ టచింగ్ ఫోటో: కంటతడి పెట్టాల్సిందే..
అమ్మ తనకు ఆకలిగా ఉన్నా.. పిల్లల కడుపు నింపిన తర్వాతే భోజనం చేస్తుంది. కానీ పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆ తల్లి ప్రేమను మర్చి పోతారు. తమ దారేదో తాము చూసుకుంటారు. తల్లిదండ్రులకు పట్టేడన్నం పెట్టడానికి వెనుకాడతారు. వయసు పైబడిన వారు తమకు భారమైనట్టు, తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో విడిచిపెడుతుంటారు. మనవళ్లు, మనవరాళ్లను వారికి దూరం చేస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో ప్రతి ఒక్కరినీ చలింప చేస్తోంది. ఓ స్కూల్ బాలిక, ఓ వృద్ధురాలి పక్కన కూర్చుని గుక్కపెట్టి ఏడ్చే ఆ ఫోటో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఫోటోలోని బాలిక, స్కూల్ ఫీల్డ్ ట్రిప్‌లో భాగంగా అనూహ్యంగా ఓ వృద్ధాశ్రమంలో ఉన్న తన నాన్మమ్మను కలుసుకుంటోంది. ఇన్నాళ్లు నాన్నమ్మ బయటికి వెళ్లిందని నాన్న చెప్పే మాటలనే నమ్ముతూ వస్తున్న ఆ బాలికకు.. వృద్ధాశ్రమంలో తన నాన్నమ్మ కనిపించడం, ఆ తర్వాత నిజం తెలియడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గుజరాత్‌లోని ఓ ఫోటోగ్రాఫర్ దాదాపు పదేళ్ల కిందట ఈ హృదయ విదారకమైన సంఘటనతో పాటు వారి ఫోటోను కూడా గుజరాతి డైలీ ‘దివ్య భాస్కర్’లో ఫ్రంట్ పేజీలో పబ్లిష్ చేశాడు. అప్పట్లో అది ఓ సంచలన టాఫిక్‌గా మారింది. ఆ ఫోటో ఫేస్బుక్లో పెద్ద ఎత్తున షేర్ అయింది. తాజాగా పదేళ్ల తర్వాత మరోసారి ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2007 సెప్టెంబర్ 12న ఫోటోజర్నలిస్ట్ కల్పెష్ ఎస్ భరేచ్‌కు గుజరాత్ మనినగర్‌లోని జీఎన్సీ స్కూల్ ప్రిన్సిపాల్ నుంచి ఫోన్ వచ్చింది. ఘోదసర్‌లోని మనిలాల్ గాంధీ వృద్ధాశ్రమానికి స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్నామని, ఈ స్కూల్ ట్రిప్‌ను కవర్ చేయమని ప్రిన్సిపాల్ కోరారు. భరేచ్, పిల్లలతో పాటు వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు. కానీ ఆ అసైన్‌మెంటే తన జీవితాన్ని ఓ మలుపు తిప్పుతుందని భరేచ్ కలలో కూడా ఊహించి ఉండడు. ఫీల్డ్ ట్రిప్‌లో భాగంగా పిల్లలను, పెద్ద వాళ్ల పక్కన కూర్చోమని.. మంచి మంచి ఫోటోలు తీస్తున్నాడు. స్కూల్ పిల్లల్లో ఒక చిన్న అమ్మాయి.. ఒక గదిలోకి వెళ్లగానే ఓ ముసలావిడ దగ్గరికి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. ఆ మహిళ కూడా చిన్నారిని గట్టిగా పట్టుకుని ఏడ్చింది. ఏం జరిగిందా? అని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కానీ ఆ ముసలావిడ చెప్పిన స్టోరీ వినగానే మేమందరం ఒక్కసారిగా మూగబోయాం అని భరేచ్ చెప్పాడు. ఆ ముసలావిడ, ఆ అమ్మాయికి నాన్నమ్మ అట. ఎంతో కాలం తర్వాత మనవరాలిని చూసిన ఆ ముసలావిడ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు గట్టిగా పట్టుకుని తనివితీరా ఏడ్చారు. నాన్నమ్మ బయటికి వెళ్లిందని ఎప్పుడూ నాన్న చెబుతుండే వాడని ఆ పాప చెప్పింది. కానీ ఎప్పుడూ కూడా వృద్ధాశ్రమంలో ఉందని చెప్పలేదని కన్నీంటి పర్యంతమైంది. నానమ్మ, మనవరాళ్లు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్న ఫోటోతో పాటు, వీరి స్టోరీని గుజరాతి డైలీ దివ్య భాస్కర్లో ఫ్రంట్ పేజీలో పబ్లిష్ చేశారు. గుజరాత్ అంతటా అప్పట్లో ఇదే బిగ్ డిబేట్. అన్ని పత్రికలు, ఛానళ్లు కూడా దీన్నే మెయిన్ స్టోరీగా బ్రాడ్కాస్ట్ చేశాయి. ఆమెను వృద్ధాశ్రమం నుంచి తన ఇంటికి తీసుకెళ్లినట్టు భరేచ్ తర్వాత స్థానిక టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడెందుకు వైరల్ అవుతుంది.... ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా.. బీబీసీ గుజరాతీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్‌లను తమ కెరీర్లో తీసిన ఉత్తమమైన ఫోటోలను షేర్ చేయమని కోరింది. బీబీసీ గుజరాతీకి భరేచ్.. తన బెస్ట్ ఫోటోలన్నింటిన్నీ షేర్ చేయగా.. ఈ ఫోటో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. భరేచ్ ప్రస్తుతం దివ్య భాస్కర్లో పనిచేస్తున్నాడు. తన తండ్రి ఫోటో సోషల్ మీడియా వైరల్ అయిందని... చాలామంది సెలబ్రిటీలు దీనిపై ట్వీట్ చేస్తున్నారని.. కేవలం పేరు కోసం కాకుండా.. వృత్తి మీద ప్రేమతో పనిచేయాలని తన తండ్రి ఎప్పుడూ సూచిస్తుంటాడని... నిజంగా ఇది తమకెంతో గర్వకారణమని భరేచ్ కొడుకు దీపమ్ ఫేస్బుక్లో ఓ పోస్టులో తెలిపాడు. -
పోలీసులను ఆశ్రయించిన ఎమ్మెల్యే మనవరాలు
మదురై: దిండుగల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ మదురై జిల్లా తిరుపరకుండ్రం ఎమ్మెల్యే మనవరాలు పోలీసులను ఆశ్రయించింది. అన్నాడీఎంకేలో గెలుపొంది మృతిచెందిన ఎమ్మెల్యే శీనివేలు మనవరాలు కీర్తన. ఆమె భర్త సెంథిల్‌కుమార్. ఈ ఇరువురూ తమను పరువు హత్య చేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారని, తమను రక్షించాలని కోరుతూ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. వీరికి భద్రత కల్పిస్తామని పోలీసు సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు. -
హల్చల్ చేస్తున్న మెగా వారసురాలు
ముంబై: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫోటోలతో సంచలనం సృష్టిస్తున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు 'నవ్య నవేలి నంద' మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే తనదైన శైలిలో సోషల్ మీడియాలో వైరల్ లా మారడం బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. లండన్‌లోని ప్రఖ్యాత సెవెన్ ఓక్స్ స్కూల్లో చదువుకుంటున్న నవ్య తాజాగా మరికొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఓ యువకుడితో కలిసి ఉన్న ఫోటోలను ఆమె పోస్టు చేసింది. సెలబ్రిటీ కుటుంబానికి చెందిన నవ్య కొన్ని సంచలన ఫోటోలను షేర్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారడం కామనే. ఇటీవలే ఆమె 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తనతో పాటు చదువుకుంటున్న గర్ల్ గ్యాంగ్, మరికొందరు స్టార్ కిడ్స్ తో కలిసి పార్టీ చేసుకుంది. దీంతోపాటు, తన స్నేహితులతో కలిసి వివిధ సందర్బాల్లో దిగిన ఫోటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తోంది. ఈ ఫోటోల్లో లండన్ లోనే చదువుకుంటున్న షారుక్ తనయుడు ఆర్యన్ ఎక్కువగా దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.. -
39 ఏళ్ల తర్వాత వాళ్లిద్దరూ కలిశారు
సినిమా కథను తలపించేలాగా ఎప్పుడో 39 ఏళ్ల క్రితం విడిపోయిన మనవరాలిని.. బామ్మ మళ్లీ కలుసుకుంది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించిందని, తన మనవరాలు మళ్లీ తన దగ్గరకు వచ్చిందంటూ క్రిస్మస్ పండగరోజు అర్జెంటీనాకు చెందిన 92 ఏళ్ల మార్లా ఇసాబెల్ చిచా డి మరియాని చెప్పారు. 1976లో మిలటరీ అధికారులు.. మార్లా మనవరాలు క్లారా అనాహి మరియానిని తీసుకెళ్లారు. క్లారా మూణ్నెళ్ల పసిబిడ్డగా ఉన్నప్పుడు సైన్యం ఆ చిన్నారి తల్లిని చంపి ఎత్తుకెళ్లారు. క్లారా కోసం గాలిస్తూ ఆమె తండ్రి డానియల్ 1977లో అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి మార్లా తన మనవరాలి కోసం అన్వేషిస్తోంది. 'గ్రాండ్ మదర్స్ ఆఫ్ ద ప్లాజా డి మయో' అనే మానవహక్కుల సంస్థ విడిపోయిన కుటుంబ సభ్యులను కలిపేందుకు కృషి చేస్తోంది. ఈ సంస్థలో పనిచేసిన మార్లా 1980లో విడిపోయి మనవరాలి పేరుతో క్లారా అనాహి ఫౌండేషన్‌ను స్థాపించింది. ఎనిమిదేళ్ల క్రితం మార్లా తన మనవరాలికి బహిరంగం లేఖ రాసింది. 'సైన్యం దాడిలో మరణించావని నన్ను నమ్మించేందుకు ప్రయత్నించారు. నువ్వు బతికేఉన్నావని నాకు తెలుసు. నిన్ను చూసి, ఆప్యాయంగా కౌగిలించుకోవాలన్నదే నా కోరిక' అని లేఖలో పేర్కొంది. అంతేగాక క్లారా తల్లిదండ్రులు వివరాలు, వారి అభిరుచులను లేఖలో రాసింది. సుదీర్ఘ అన్వేషణ అనంతరం మార్లా తన మనవరాలు క్లారాను గుర్తించింది. వీరిద్దరికీ జన్యుపరీక్షలు నిర్వహించగా 99.9 శాతం సరిపోలాయి. -
తాతకు తలకొరివి పెట్టిన మనవరాలు
అనారోగ్యంతో మృతి చెందిన తాతకు తన మనవరాలు తలకొరివి పెట్టిన సంఘటన తొర్రూరు మండలంలోని చింతలపెల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కొండం చంద్రారెడ్డి (75) ఒక్కగానొక్క కొడుకు యాకూబ్‌రెడ్డి గతంలో మృతి చెందాడు. యాకూబ్‌రెడ్డికి కుమారై శ్రావ్య మాత్రమే ఉంది. దీంతో చంద్రారెడ్డికి మనవరాలు శ్రావ్యతో తలకొరివి పెట్టించారు. అతి చిన్న వయసులోనే తాతకు మనవరాలు తలకొరివి పెట్టడాన్ని చూసిన ప్రజలు కన్నీరుమున్నీరుగా రోదించారు. -
ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని అవ్వను చంపేసింది
తన ప్రేమపెళ్లిని అంగీకరించకపోవడంతో మనవరాలు అవ్వను హత్య చేసింది. ఈ సంఘటన జోలార్‌పేట సమీపంలో చోటుచేసుకుంది. పక్కిరితక్కా ప్రాంతానికి చెందిన ధనపాల్ కుమార్తె మంజు (20). అదే ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమపెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి మంజు అవ్వ జానకియమ్మాల్ (92) వ్యతిరేకత తెలిపింది. ఆగ్రహించిన మనవరాలు బుధవారం రాత్రి జానకియమ్మాల్ ఇంట్లో ఒంటరిగా ఉండగా అక్కడికి వచ్చిన మంజు అవ్వతో వాగ్వాదానికి దిగింది. ఆ సమయంలో జానకియమ్మాల్ను మంజు నగలు ఇవ్వాలని కోరింది. జానికియమ్మాల్ అందుకు నిరాకరించడంతో ఆగ్రహించిన మంజు దుడ్డుకర్రతో అవ్వ తలపై దాడి చేసింది. ఆమె ధరించి ఉన్న ఆరున్నర సవర్ల నగలను మంజు దోచుకెళ్లింది. ఈ ఘటనలో జానికియమ్మాల్ మృతిచెందింది. పోలీసులు మంజును అరెస్టు చేశారు.