
పోలీసులను ఆశ్రయించిన ఎమ్మెల్యే మనవరాలు
మదురై: దిండుగల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ మదురై జిల్లా తిరుపరకుండ్రం ఎమ్మెల్యే మనవరాలు పోలీసులను ఆశ్రయించింది. అన్నాడీఎంకేలో గెలుపొంది మృతిచెందిన ఎమ్మెల్యే శీనివేలు మనవరాలు కీర్తన. ఆమె భర్త సెంథిల్‌కుమార్. ఈ ఇరువురూ తమను పరువు హత్య చేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారని, తమను రక్షించాలని కోరుతూ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. వీరికి భద్రత కల్పిస్తామని పోలీసు సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు.