Ex Minister Raghuveera Reddy Dance With GrandDaughter, Video Viral - Sakshi
Sakshi News home page

మనవరాలితో కలిసి స్టెప్పులేసిన రఘువీరారెడ్డి..

Published Wed, Nov 9 2022 10:56 AM | Last Updated on Wed, Nov 9 2022 3:26 PM

Former Minister Raghuveera Reddy Dance With GrandDaughter - Sakshi

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘువీరా రెడ్డి గురించి తెలియని వారుండరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి.. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత నెలకొన్న పరిణామాలతో పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా కుటుంబంతో గడపడం మొదలుపెట్టారు.

ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదా వ్యక్తిగా అందరిలో కలిసిపోయి జీవిస్తున్నారు. తాజాగా.. రఘువీరా రెడ్డి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన మనుమరాలితో సరదాగా డ్యాన్స్ వేసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. టీవీలో ఓ పాట పెట్టి.. దానికి అనుగుణంగా రఘువీరా తన మనుమరాలితో కలిసి డ్యాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement