వరంగల్: టాలెంట్ ఉండాలే గానీ దాన్ని ఆపడం ఎవరి తరం కాదు..కాకపోతే కొంచెం ఆలస్యం కావొచ్చు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఎందరో ప్రతిభావంతులు త్వరగానే వెలుగులోకి వస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక ప్రతిభ కనబర్చింది. ఓ పాటకు ఆమె చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దాదాపు మూడు లక్షల మంది ఆమె వీడియోను వీక్షించారు. వివరాల్లోకి వెళ్తే.. మల్లంపల్లిలోని ప్రభుత్వ హైస్కూల్‌లో దాసుగూడెం తండాకు చెందిన కునుసోత్ అంజలి పదో తరగతి చదువుతోంది. గత ఫిబ్రవరిలో సదరు పాఠశాలలో బాలసభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో అప్పుడు 9వ తరగతి చదువుతున్న అంజలి ‘కాలం నీతో నడవదు... నిన్ను అడిగి ముందుకు సాగదు’ అనే పాటకు సూపర్ డ్యాన్స్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను గత మే 21న ఓ వ్యక్తి యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు.
దీంతో ఆ విద్యార్థి డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఆ వీడియోకు దాదాపు 3 లక్షల వ్యూస్ వచ్చాయి. అలాగే 10 వేల మంది వరకు లైక్ చేశారు. ఇప్పుడంతా ఆ విద్యార్ధి డ్యాన్స్ గురించే మాట్లాడుతూ ఉండడం విశేషం. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుల్లా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ అంజలి డ్యాన్స్‌లో ప్రతిభావంతురాలని, ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్‌లో మంచి డ్యాన్సర్‌గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment