Karnataka Crime News: Anger At The Daughter In Law Caused The Death Of His Granddaughter - Sakshi
Sakshi News home page

కోడలిపై కోపం.. మూడు రోజుల తర్వాత ఏం జరిగిందంటే?

Published Tue, Mar 15 2022 7:23 AM | Last Updated on Tue, Mar 15 2022 9:58 AM

Anger At The Daughter In Law Caused The Death Of His Granddaughter - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తుమకూరు(కర్ణాటక): కొడుకు–కోడలిపై కోపంతో ఓ మహిళ మనవరాలి చావుకు కారణమైంది. వివరాలు.. కుణిగల్‌ తాలూకా సాసలు గ్రామానికి చెందిన జయమ్మ కుమారుడు పుట్టరాజుకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కూతురు త్రిషా ఉంది. ఈ పెళ్లి పుట్టరాజ తల్లి జయమ్మకు ఇష్టం లేదు. దీంతో తరచూ కోడలుతో గొడవ పడేది. ఇటీవల జయమ్మ త్రిషాను బయటకు  తీసుకెళ్లినప్పుడు బాలికను పిచ్చి కుక్క కరిచింది.

చదవండి: రన్నింగ్‌ బస్సులు ఎక్కి.. యువతులపై వికృత చేష్టలు

అయితే కోడలుపై కోపంతో జయమ్మ విషయం ఎవరికీ చెప్పలేదు. మూడు రోజుల తర్వాత చిన్నారి అస్వస్థతకు గురైంది. తర్వాత నాలుగు రోజులకు రేబీస్‌ వ్యాధితో మరణించింది. కుక్క కరిచినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు జయమ్మను నిలదీయగా విషయం చెప్పింది. కుణిగల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని జయమ్మపై విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement