అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ పెళ్లి శోభతో కళకళ లాడనుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో ఆయన మనవరాలు నవోమీ బైడెన్ వివాహం శనివారం జరగనుంది. బైడెన్ మనవరాలు నవోమీ బైడెన్ పీటర్ నీల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోనున్నారు. ఐతే నవోమీ లాయర్ కాగా, ఆమె కాబోయే భర్త పీటర్ నీల్ ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా లా స్కూల్ నుంచి గాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా, వైట్‌హౌస్‌లో ఇంతవరకు 18 వివాహాలు జరిగాయి, అవి కూడా అధ్యక్షుడి కూతుళ్ల వివాహాలే. ఇలా అధ్యక్షుడు హోదాలో ఉండగా వైట్‌హౌస్‌లో మనవరాలు పెళ్లి జరగడం ఇదే ప్రథమం. ఇది వైట్‌హౌస్ చరిత్రలోనే తొలిసారి. అంతేగాదు వైట్‌హౌస్‌లో ఈ పెళ్లి 10వ డ్యాక్యుమెంట్ వెడ్డింగ్ అవుతుంది. వాస్తవానికి వైట్‌హౌస్‌లో ఎక్కువగా అధ్యక్షుడి కుమార్తెల వివాహాలే జరిగాయి.
పీటర్ నీల్-నయోమీ బైడెన్
అధ్యక్షుడు బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ కుమార్తె అయిన నవోమీ బైడెన్ , నీల్‌తో గత నాలుగేళ్లుగా వాషింగ్టన్‌లో సహజీవనం చేస్తున్నారు. ఈ శనివారం వైట్‌హౌస్‌లో జరగనున్న వివాహా వేడుకలో ఇద్దరు ఒక్కటి కానున్నారు. ఈ మేరకు అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ మాట్లాడుతూ...నవోమీ తన పెళ్లిని ప్లాన్ చేసుకోవడం, తనకునచ్చిన వ్యక్తి సెలక్ట్ చేసుకోవడం చాలా అద్భతంగానూ, సంతోషంగానూ ఉంది. తనను పెళ్లికూతురిలా చూడటానికి సంతోషిస్తున్నాను అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment