తన ప్రేమపెళ్లిని అంగీకరించకపోవడంతో మనవరాలు అవ్వను హత్య చేసింది. ఈ సంఘటన జోలార్‌పేట సమీపంలో చోటుచేసుకుంది. పక్కిరితక్కా ప్రాంతానికి చెందిన ధనపాల్ కుమార్తె మంజు (20). అదే ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమపెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి మంజు అవ్వ జానకియమ్మాల్ (92) వ్యతిరేకత తెలిపింది.
ఆగ్రహించిన మనవరాలు బుధవారం రాత్రి జానకియమ్మాల్ ఇంట్లో ఒంటరిగా ఉండగా అక్కడికి వచ్చిన మంజు అవ్వతో వాగ్వాదానికి దిగింది. ఆ సమయంలో జానకియమ్మాల్‌ను మంజు నగలు ఇవ్వాలని కోరింది. జానికియమ్మాల్ అందుకు నిరాకరించడంతో ఆగ్రహించిన మంజు దుడ్డుకర్రతో అవ్వ తలపై దాడి చేసింది. ఆమె ధరించి ఉన్న ఆరున్నర సవర్ల నగలను మంజు దోచుకెళ్లింది. ఈ ఘటనలో జానికియమ్మాల్ మృతిచెందింది. పోలీసులు మంజును అరెస్టు చేశారు.