Grandmother killed
-
రేబిస్‌తో ఉన్మాదిగా మారి చంపి తిన్నాడు!
జైపూర్: రాజస్తాన్‌లో ఒళ్లు జలదరించే ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి వృద్ధురాలిని చంపి, ఆమె మాంసం తిన్నాడు. ముంబైలో ఉండే సురేంద్ర ఠాకూర్(24) ఇటీవలే తన సొంత పాలి జిల్లా సెండ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని సరధనా గ్రామానికి వచ్చాడు. పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్న అతడు శుక్రవారం పొలంలో పశువులు మేపుకుంటూ ఉన్న శాంతిదేవి(65)ని బండరాయితో మోది చంపేశాడు. అనంతరం ఆమె మాంసం తిన్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతడిని అతికష్టమ్మీద పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హత్య, నరమాంసభక్షణ నేరం కింద పోలీసులు కేసు పెట్టారు. ఠాకూర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. రేబిస్ వ్యాధి(హైడ్రోఫోబియా) బాధితుల్లో వ్యాధి ముదిరితే చివరి దశలో ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. -
Texas shooting: ఫేస్బుక్లో ప్రకటించి మరీ...
హూస్టన్: హంతకుడు రామోస్ ఫేస్బుక్లో ముందుగా ప్రకటించి మరీ నరమేధానికి పాల్పడ్డాడు! ‘నానమ్మను కాల్చబోతున్నా’ అని మంగళవారం 11 గంటలప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆమెను కాల్చాక, ‘ఇప్పుడు స్కూల్లో షూటౌట్‌కు బయల్దేరుతున్నా’’ అంటూ మరో పోస్ట్ చేశాడు. అరగంటకే దారుణానికి తెగబడ్డాడు. దీనిపై ఉదయం నుంచీ పలు సంకేతాలిస్తూ వచ్చాడు. ‘ఓ చిన్న రహస్యం చెప్పాలనుకుంటున్నా’ అంటూ లాస్‌ఏంజెలెస్‌కు చెందిన ఓ యువతికి ఇన్‌స్టాగ్రాంలో మంగళవారం ఉదయమే మెసేజ్ చేశాడు. ‘‘ఇంకాసేపట్లో నేను...’’ అంటూ 9.16కు ఓ స్మైలీ ఎమోజీ పెట్టాడు. ‘‘11 గంటల లోపు చెప్తా’’ అంటూ ముగించాడు. 11.30కు నరమేధం సృష్టించాడు. తన టిక్‌టాక్ పేజీ పరిచయంలో ‘పిల్లలూ! నిజ జీవితంలో కూడా భయపడేందుకు రెడీగా ఉండండి’’ అని కూడా రాసుకున్నాడు! కాల్పులకు వాడిన తుపాకులను, మేగజైన్లను రామోస్ తన 18వ పుట్టిన రోజు సందర్భంగా గత వారమే కొన్నాడు. వాటితో పోజిస్తూ ఫొటోలు దిగడమే గాక ఇన్‌స్టాగ్రాంలో అప్లోడ్ చేశాడు. టెక్సాస్‌లో 18 ఏళ్లు నిండితే లైసెన్సుతో పని లేకుండా తుపాకులు కొనుక్కోవచ్చు. నానమ్మతో నిత్యం గొడవలే డిగ్రీ చదవలేకపోయానంటూ రామోస్ నిత్యం బాధపడేవాడని పొరుగువారు చెప్పారు. ఈ విషయమై నిత్యం నానమ్మతో గొడవ కూడా పడేవాడన్నారు. స్థానిక విండీస్ సరుకుల దుకాణంలో పని చేసే అతనిది దూకుడు మనస్తత్వమని సహోద్యోగులు చెబుతున్నారు. ‘‘ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు. మహిళా ఉద్యోగులకు అసభ్య మెసేజీలు పంపేవాడు. వాళ్లతో చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. స్థానిక పార్కులో పలువురితో బాక్సింగ్ చేసేవాడు’’ అన్నారు. అతనికి తల్లితోనూ సరిపడేది కాదని, అందుకే కొద్ది నెలల క్రితమే నానమ్మ ఇంటికి వచ్చాడని చెప్పారు. రామోస్ స్కూల్ మేట్స్ సోమవారం డిగ్రీ పూర్తి చేసి పట్టాలు తీసుకున్నారని సమాచారం. ఆ ఆక్రోశంతోనే దారుణానికి ఒడిగట్టాడని భావిస్తున్నారు. నానమ్మపై కాల్పులు జరిపి, ‘నన్ను కాల్చేస్తున్నాడు’ అని ఆమె అరుస్తుండగానే కారెక్కి స్కూలుకేసి దూసుకెళ్లాడు. నత్తితో బాధపడేవాడు రామోస్‌కు నత్తి ఉండేదని, దాంతో బాల్యంలో స్కూళ్లో తోటి పిల్లల చేతిలో చాలా అవమానాలకు గురయ్యాడని అతని సహ విద్యార్థి చెప్పాడు. ‘‘రామోస్ నత్తిని, అతను వేసుకునే నాసిరకం బట్టలను పిల్లలంతా బాగా వెక్కిరించేవారు. అతని పేదరికాన్ని కూడా హేళన చేసేవారు. చూట్టానికి గే మాదిరిగా కన్పిస్తున్నావంటూ ఆటపట్టించేవారు. అది భరించలేక అతను స్కూలు ఎగ్గొట్టేవాడు. చివరికి మొత్తానికే మానేశాడు’’ అని చెప్పుకొచ్చాడు. తర్వాత షూటింగ్ అంటే ఇష్టం పెంచుకున్నాడని, కాల్ ఆఫ్ డ్యూటీ అనే ఫైటింగ్ గేమ్‌కు వీరాభిమానిగా మారాడని వివరించాడు. -
మనువడు కొట్టడంతో నాయనమ్మ మృతి
కాగజ్‌నగర్‌రూరల్ ఆదిలాబాద్: మనుమడు కొట్టడంతో కాగజ్‌నగర్ మండలంలోని అందవెల్లి గ్రామానికి చెందిన బూరం రాజక్క(90) ఆదివారం మృతి చెందింది. ఈజ్గాం ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాలివీ..రాజక్క కుమారుడు ఐదు సంవత్సరాల క్రితం మృతి చెందటంతో ఆమె తన కోడలు వద్ద ఉంటోంది. ఇటీవల మనుమడు బూరం పెంటయ్యతో గొడవ కావడంతో అనుకోకుండా కొట్టాడు. దీంతో కాలు విరిగింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు కూతురు ఫిర్యాదు మేరకు పెంటయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని అవ్వను చంపేసింది
తన ప్రేమపెళ్లిని అంగీకరించకపోవడంతో మనవరాలు అవ్వను హత్య చేసింది. ఈ సంఘటన జోలార్‌పేట సమీపంలో చోటుచేసుకుంది. పక్కిరితక్కా ప్రాంతానికి చెందిన ధనపాల్ కుమార్తె మంజు (20). అదే ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమపెళ్లి చేసుకుంది. ఈ పెళ్లికి మంజు అవ్వ జానకియమ్మాల్ (92) వ్యతిరేకత తెలిపింది. ఆగ్రహించిన మనవరాలు బుధవారం రాత్రి జానకియమ్మాల్ ఇంట్లో ఒంటరిగా ఉండగా అక్కడికి వచ్చిన మంజు అవ్వతో వాగ్వాదానికి దిగింది. ఆ సమయంలో జానకియమ్మాల్ను మంజు నగలు ఇవ్వాలని కోరింది. జానికియమ్మాల్ అందుకు నిరాకరించడంతో ఆగ్రహించిన మంజు దుడ్డుకర్రతో అవ్వ తలపై దాడి చేసింది. ఆమె ధరించి ఉన్న ఆరున్నర సవర్ల నగలను మంజు దోచుకెళ్లింది. ఈ ఘటనలో జానికియమ్మాల్ మృతిచెందింది. పోలీసులు మంజును అరెస్టు చేశారు.