టోక్యో: ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన జపాన్ బామ్మ టొమికో ఇటూకా 116 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. హ్యోగో ప్రిఫెక్చర్‌లోని ఆషియా నగరంలోని వృద్ధాశ్రయంలో డిసెంబర్ 29వ తేదీన ఆమె తుదిశ్వాస విడిచారని జపాన్ ప్రభుత్వ వృద్ధుల వ్యవహారాల పర్యవేక్షణ విభాగం అధికారి యోషిట్సుగు నగటా చెప్పారు.
అరటి పండ్లు, జపాన్ పానీయం కల్పిస్‌ను అమితంగా ఇష్టపడే ఇటూకా 1908 మే 23వ తేదీన ఒసాకాలో జన్మించారు.హైసూ్కల్లో చదువుకునేటప్పుడు వాలీబాల్ ప్లేయర్. సుమారు 3,067 మీటర్ల ఎత్తున్న ఒంటాకె పర్వతాన్ని రెండుసార్లు అధిరోహించారు. ఆమెకు 20 ఏళ్లప్పుడు పెళ్లయింది. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కలిగారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భర్త సారథ్యంలోని దుస్తుల ఫ్యాక్టరీని నడిపారు.
భర్త 1979లో చనిపోయినప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఇటూకాకు ఒక కుమార్తె, ఒక కుమారుడు, ఐదుగురు మనవలు ఉన్నారు. కాగా, గతేడాది ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు 117 ఏళ్ల మరియా బ్రన్యాస్ మరణించడంతో ఆమె స్థానంలో ఇటూకాను అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా గెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్ ప్రకటించారు. తాజాగా ఇటూకా కన్నుమూయడంతో ఆమె కంటే 16 రోజులు మాత్రమే చిన్నదైన బ్రెజిల్‌కు చెందిన సన్యాసిని ఇనాహ్ కనబర్రోను ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పరిగణిస్తామని గెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment