టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే(67) కన్నుమూశారు. మృత్యువుతో పోరాడి ఆయన ఓడిపోయారని జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సాయుధుడైన దుండగుడి కాల్పుల్లో గాయపడ్డ అబేను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి.. కాపాడేందుకు వైద్యులు శాయశక్తుల ప్రయత్నించారని జపాన్ ప్రధాని కాసేపటి క్రితం ప్రకటించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించి పోవడంతో ఆయన్ని కాపాడడం వీలు కాలేదని అధికారులు ప్రకటించారు.
శుక్రవారం ఓ సభలో ఆయన ప్రసంగిస్తుండగా.. దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఘటనాస్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరోవైపు షింజోను కాపాడే ప్రయత్నం చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.
Officials say former Japanese Prime Minister #ShinzoAbe has been confirmed dead. He was reportedly shot during a speech on Friday in the city of Nara, near Kyoto: Japan's NHK WORLD News pic.twitter.com/7ayJpNCw17
— ANI (@ANI) July 8, 2022
Comments
Please login to add a commentAdd a comment