
న్యూఢిల్లీ: సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చేయడంతో అత్యధికులు తమకు తామే సెలెబ్రిటీలమన్న భావన ఉంటున్నారు. కొంతవరకు మంచిదే కానీ కేవలం లైకులు కామెంట్ల కోసం ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ లేనిపోని రాద్ధాంతాన్ని సృష్టిస్తున్నారు. ఇలాగే ఒకామె తొందరపడి తన అమ్మమ్మ చనిపోయారన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభాసుపాలైంది.
అమ్రిత్ అనే పేరుతో ట్విట్టర్ అకౌంట్ నడుపుతున్న ఒక యువతి తన అమ్మమ్మ చనిపోయారన్న విషయాన్ని చాలా క్రియేటివ్ గా పోస్ట్ చేసింది. ఆమె అమ్మమ్మ బ్రతికుండగా సోఫాలో కూర్చుని తింటున్న ఫోటోను ఒకపక్కన మరొపక్కన ఆమె లేకుండా ఖాళీగా ఉన్న సోఫా ఫోటోను పోస్ట్ చేసి.. ఫోటోలతో పాటు "నేను దీని నుండి ఎప్పటికీ కోలుకోలేను.." అని రాసింది. పెద్దావిడ మరణవార్తను తన ఫాలోవర్లకు చెప్పాలన్న కుతూహలం కన్నా వారి సానుభూతి రూపంలో లైకులు కామెంట్లు పొందాలన్న ఆమె ఆత్రుతే ఎక్కువగా కనిపించింది నెటిజన్లకు.
దీంతో వారు కూడా సున్నిత శైలిలో విచారాన్ని వ్యక్తం చేస్తూ కఠినమైన కామెంట్లతో ఆ యువతిని చెడామడా వాయించేస్తున్నారు. "మీ అమ్మమ్మ మరణం తీరని లోటు. అలాగని ప్రతిదీ ఇంటర్నెట్లో పోస్ట్ చేయాలా?" అని కొందరు రాస్తే.. ఆమె చావు నీకు ఇలా ఉపయోగపడిందన్న మాట, మీకు రిప్లై ఇస్తే నాకు మెసేజులు మీద మెసేజులు వస్తున్నాయని మరొకరు.. కామెంట్లు చేశారు. ఎవరేమనుకుంటున్నారన్న విషయాన్ని పక్కనబెడితే.. సదరు వ్యక్తి చేసిన పోస్టుకు మాత్రం 40 లక్షల పైచిలుకు వీక్షణలు దక్కాయి. అదీ సోషల్ మీడియా పవర్ అంటే..
I’m never going to recover from this pic.twitter.com/yRhfdApZap
— A (@ammmmmmrit) July 10, 2023
ఇది కూడా చదవండి: రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు!
Comments
Please login to add a commentAdd a comment