ఆండ్రూ టై
జైపూర్ : ఆకస్మాత్తుగా ఏదైనా చెడు వార్త వింటేనే తట్టుకోలేము.. ఇక అది మన కుటుంబ సభ్యుల గురించైతే..ఆ బాధ వర్ణనాతీతం. కానీ కింగ్స్ పంజాబ్ ఆటగాడు, ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై దుఃఖాన్ని దిగమింగుకోని రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్నాడు.ఈ మ్యాచ్‌లో ఆడటమే కాదు నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఆండ్రూ టై నానమ్మ మరణించినట్లు మంగళవారం అతనికి కబురందింది. కానీ ఆటపట్ల శ్రద్దతో ఏ మాత్రం కుంగుబాటుకు లోనుకానీ టై అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దీంతో ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.
రాజస్తాన్ ఇన్నింగ్స్ అనంతరం తీవ్ర భావోద్వేగానికి లోనైన టై తన నానమ్మ మరణించిన విషయాన్ని తెలిపాడు. ‘ మా నానమ్మ ఇక లేరు. ఈ ప్రదర్శనను ఆమెతో నాకుటుంబ సభ్యులకు అంకితమిస్తున్నాను. ఇది నాకు భావోద్వేగపూరితమైన మ్యాచ్. నా జీవితంలో చాలా కఠినమైన రోజు. నేనెప్పుడు క్రికెట్‌ను ఇష్టపడుతాను. మా జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. ఒక్కోసారి బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణిస్తారు. కొన్నిసార్లు విఫలం అవుతారు. పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. కొత్త బంతి మాకు అనుకూలించింది.’ అని వ్యాఖ్యానించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత గౌతమ్‌ను ఔట్ చేసిన టై చివరి ఓవర్‌లో బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, ఉనద్కత్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో రాజస్తాన్ 158 పరుగుల సాధారణ లక్ష్యమే నమోదు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్ మినహా పంజాబ్ బ్యాట్స్‌మన్ విఫలమవ్వడంతో రాజస్తాన్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment