డ్రీమ్గర్ల్ మళ్లీ ప్రమోషన్ కొట్టేసింది | Hema Malini is a Grandmother, Daughter Ahaana Gives Birth to Baby Boy | Sakshi
Sakshi News home page

డ్రీమ్గర్ల్ మళ్లీ ప్రమోషన్ కొట్టేసింది

Jun 12 2015 1:36 PM | Updated on Sep 3 2017 3:38 AM

డ్రీమ్గర్ల్ మళ్లీ ప్రమోషన్ కొట్టేసింది

డ్రీమ్గర్ల్ మళ్లీ ప్రమోషన్ కొట్టేసింది

డ్రీమ్గర్ల్ అంటే చటుక్కున్న గుర్తుకు వచ్చేది హేమమాలిని. ఆమె ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ కొట్టేస్తుంది.

ముంబై : డ్రీమ్గర్ల్ అంటే చటుక్కున్న గుర్తుకు వచ్చేది హేమమాలిని. ఆమె ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ కొట్టేస్తుంది. ఇప్పటికే బీజేపీ టికెట్తో మధుర లోక్స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికై లోక్సభలో అడుగుపెట్టిన ఆమె... ఇప్పుడు తాజాగా మరో ప్రమోషన్ అందుకుంది. అది అలాంటి ఇలాంటి ప్రమోషన్ కాదు ... డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఏకంగా అమ్మమ్మ స్థానంలోకి కూర్చోబెట్టింది. ఆమె చిన్న కుమార్తె అహానా డియోల్ వోరా గురువారం చిన్న బాబుకు జన్మనిచ్చింది.

దాంతో హేమమాలిని ఆనందంతో ఉబ్బితబ్బిబయింది. ఈ సంతోషకరమైన వార్తను ఆమె తన అభిమానులతో మైక్రోబ్లాగ్ ద్వారా పంచుకున్నారు. దేవుని ఆశీస్సులతో అహానా బాబుకు జన్మనిచ్చింది. అహానా... ఆమె కుమారుడు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని 66 ఏళ్ల హేమమాలిని తెలిపింది. హేమమాలిని, ధర్మేంద్రల చిన్న కుమార్తె అయిన అహానా 2014, ఫిబ్రవరి 2వ తేదీన ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ వోరాతో అహానా పెళ్లయిన సంగతి తెలిసిందే. అహానా ఒడిస్సీ నృత్య కళాకారిణి, ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement