తనయుడు దర్జీ.. తండ్రి దర్జా | Varun Dhawan Stitch Shirt Father David Dhawan Birthday Sui Dhaga | Sakshi
Sakshi News home page

తనయుడు దర్జీ.. తండ్రి దర్జా

Published Mon, Aug 20 2018 1:42 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Varun Dhawan Stitch Shirt Father David Dhawan Birthday Sui Dhaga - Sakshi

డేవిడ్‌ ధావన్, వరుణ్‌ ధావన్‌

సినిమాలోని పాత్రల కోసం రకరకాల వృత్తుల్లో ట్రైనింగ్‌ తీసుకుంటారు యాక్టర్స్‌. ఆ సినిమా పూర్తయ్యాక అది ఉపయోగపడొచ్చు, పడకపోవచ్చు. కానీ బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ నేర్చుకున్న కళతో తండ్రి డేవిడ్‌ ధావన్‌కు బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చాడు. ‘సూయి ధాగా’లో వరుణ్‌ దర్జీగా కనిపించనున్నారాయన. దాని కొసం టైలర్‌గా ట్రైనింగ్‌ కూడా తీసుకున్నారు. అప్పుడు తీసుకున్న ట్రైనింగ్‌తోనే తండ్రి కోసం షర్ట్‌ కుట్టిపెట్టారట.

ఆగస్ట్‌ 16న డేవిడ్‌ ధావన్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా స్పెషల్‌గా తనే ఓ చొక్కా కుట్టి గిఫ్ట్‌ చేసి, తండ్రిని సర్‌ప్రైజ్‌ చేశాడట వరుణ్‌. ‘‘నేను ఫుల్‌టైమ్‌ టైలరింగ్‌ నేర్చుకోలేదు. సినిమా కోసం కొని టెక్నిక్స్‌ తెలుసుకున్నాను. మా డాడ్‌ ఇప్పటికీ నన్ను ఏమీ తెలియని యాక్టర్‌ అనుకుంటుంటారు. ఈ సినిమాతో కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్‌ యాక్టర్‌ అని ఒప్పుకుంటారని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు వరుణ్‌. సో.. కుమారుడు దర్జీగా బర్త్‌డే ప్రజెంట్‌ ఇస్తే డేవిడ్‌ ధవన్‌ దర్జాగా చొక్కా వేసుకొనుంటారని ఊహించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement