లోక్‌సభ ఎన్నికల్లో మైసూరు మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ ఘన విజయం సాధిచించారు. మైసూరు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన వడయార్ సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిపై 1,39,262 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ మొత్తం 7,95,503 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎం.లక్ష్మణకు 6,56,241 ఓట్లు వచ్చాయి. మైసూరు రాజ్యాన్ని వడయార్ కుటుంబం 1339 నుంచి 1950 వరకు పాలించింది. స్వాతంత్ర్యం అనంతరం మైసూరు రాజు జయచామ రాజేంద్ర వడయార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 1974లో శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ రాజు అయ్యారు.1984-1999 లో కాంగ్రెస్ తరఫున మైసూరు ఎంపీగా గెలుపొందిన ఆయన 2013లో కన్నుమూశారు.
శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ మరణం తర్వాత మైసూరు 27వ రాజుగా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ పట్టాభిషిక్తుడయ్యారు. మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ లిటరేచర్, ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2016లో దుంగార్‌పుర్ యువరాణి త్రిషికను వివాహం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment